breaking news
Gurram Paapi Reddy Movie
-
సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఒక్కరోజే ఓటీటీకి 15 సినిమాలు
సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ది రాజాసాబ్తో పాటు మనశంకరవరప్రసాద్గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని మూవీస్ హిట్ కాగా.. మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.అయితే ఈ పొంగల్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు పండగ వచ్చేసింది. థియేటర్లకు ఫ్యామిలీతో వెళ్లలేనివారికి ఓటీటీలు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఒక్క రోజే దాదాపు 15 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్ద రిప్-ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటేడ్- జనవరి 16బ్లాక్ ఫోన్-2(హాలీవుడ్ మూవీ)-జనవరి 16కిల్లర్ వాలే(హాలీవుడ్ మూవీ)-జనవరి 16ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ(హాలీవుడ్ మూవీ)- జనవరి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో..120 బహదూర్(బాలీవుడ్ మూవీ)- జనవరి 16జియో హాట్స్టార్పోనీస్-పర్సన్ ఆఫ్ నో ఇంటరెస్ట్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16సోనీ లివ్..కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16మస్తీ-4(హిందీ మూవీ)- జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16లయన్స్ గేట్ ప్లే..బ్యాండ్బుక్(కన్నడ సినిమా)- జనవరి 16షెల్- జనవరి 16హులు..ట్విన్ లెస్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16 -
ట్రిమ్ చేసిన వెర్షన్‌కూ స్పందన బాగుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్ నుంచే 90 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్‌కూ రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్ షోస్ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్. ‘‘థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్ చేసి, మా సినిమాను హిట్ చేయాలి’’ అని కోరారు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్ జీవన్ కుమార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడారు.


