సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ది రాజాసాబ్‌తో పాటు మనశంకరవరప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని మూవీస్ హిట్ కాగా.. మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.
అయితే ఈ పొంగల్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు పండగ వచ్చేసింది. థియేటర్లకు ఫ్యామిలీతో వెళ్లలేనివారికి ఓటీటీలు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఒక్క రోజే దాదాపు 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
నెట్‌ఫ్లిక్స్
ద రిప్-ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16
క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటేడ్- జనవరి 16
బ్లాక్ ఫోన్-2(హాలీవుడ్ మూవీ)-జనవరి 16
కిల్లర్ వాలే(హాలీవుడ్ మూవీ)-జనవరి 16
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ(హాలీవుడ్ మూవీ)- జనవరి 17
అమెజాన్ ప్రైమ్ వీడియో..
120 బహదూర్(బాలీవుడ్ మూవీ)- జనవరి 16
జియో హాట్‌స్టార్
పోనీస్-పర్సన్ ఆఫ్ నో ఇంటరెస్ట్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16
సోనీ లివ్..
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16
జీ5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16
భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16
మస్తీ-4(హిందీ మూవీ)- జనవరి 16
ఆపిల్ టీవీ ప్లస్
హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16
లయన్స్ గేట్ ప్లే..
బ్యాండ్‌బుక్(కన్నడ సినిమా)- జనవరి 16
షెల్- జనవరి 16
హులు..
ట్విన్ లెస్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16


