టాలీవుడ్‌లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం? | Tough times for VFX films in Tollywood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?

Feb 10 2026 11:02 PM | Updated on Feb 10 2026 11:10 PM

Tough times for VFX films in Tollywood

టాలీవుడ్‌లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్‌ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement