'తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్ | Priyanka Chopra Husband Nick Jonas Comments On SS Rajamouli Varanasi | Sakshi
Sakshi News home page

Nick Jonas: 'తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై నిక్ జోనాస్ కామెంట్స్

Feb 10 2026 2:31 PM | Updated on Feb 10 2026 2:57 PM

Priyanka Chopra Husband Nick Jonas Comments On SS Rajamouli Varanasi

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్‌ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్‌ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement