ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌ | Namrata Shirodkar Emotional Marriage Day Quotes For Mahesh Babu | Sakshi
Sakshi News home page

ఇప్పటికే ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌

Feb 10 2026 2:44 PM | Updated on Feb 10 2026 3:14 PM

Namrata Shirodkar Emotional Marriage Day Quotes For Mahesh Babu

మహేశ్‌- నమ్రత వివాహ బంధానికి 21 ఏళ్లు పూర్తి

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌లో మహేశ్‌ బాబు, నమ్రత జోడి ఒకటి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. విమానంలో మహేశ్‌బాబుతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘21 వసంతాలు దాటినా ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

 ఈ ఫోస్ట్‌ని మహేశ్‌ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో రీ షేర్‌ చేశాడు. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా కామెంట్‌ చేసింది. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో  మ్యారేజ్‌ డే విషెస్‌ తెలియజేసింది. 

కాగా, వంశీ(2000) మూవీ షూటింగ్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2006లో గౌతమ్‌, 2012లో సితార జన్మించింది. మహేశ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement