ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్‌ షో తప్పడం లేదా? | Rashi Khanna Latest Glamorous Photoshoot Goes Viral On Social Media As She Awaits New Film Offers | Sakshi
Sakshi News home page

ఎన్నో హిట్లిచ్చిన బ్యూటీ.. కానీ, స్కిన్‌ షో తప్పడం లేదా?

Feb 10 2026 7:16 AM | Updated on Feb 10 2026 9:51 AM

Star Actress follow this trick for movie chance

చిత్రపరిశ్రమలో కథానాయికలు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్‌ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్‌ హీరోయిన్‌గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్‌ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్‌ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. 

తమిళంలోకి ఇమైకా నొడిగల్‌ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్‌ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్‌కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్‌తో కలిసి తిరుచిట్రంఫలం (తిరు) చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్‌ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్‌.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. 

విశేషం ఏమిటంటే కోలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్‌ అయ్యాయి. తెలుగులోనూ హిట్‌ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్‌ ఇమేజ్‌ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం  అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుని హాట్‌హాట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.  ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement