బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురి అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్ | Bigg Boss Adi Reddy Daughter Anna Prasana Programme Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bigg Boss Adi Reddy: బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురి అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్

Feb 10 2026 4:19 PM | Updated on Feb 10 2026 4:23 PM

Bigg Boss Adi Reddy Daughter Anna Prasana Programme Video Goes Viral

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్‌-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా  బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.

గతేడాది మరోసారి తండ్రైన ఆది రెడ్డి దంపతులకు కూతురు పుట్టింది. తాజాగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు. మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ అన్నప్రాసన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మొదటి వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement