‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ సాంగ్స్‌ రిలీజ్‌ | Ankit Jadhav And Rohit Bhog Launch Telugu Versions Of Nuvve Undipo Ila And Nuvvele Songs | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సెలెబ్రిటీల సమక్షంలో ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ సాంగ్‌ రిలీజ్‌

Feb 11 2026 11:33 AM | Updated on Feb 11 2026 12:31 PM

Nuvve Undipo ila, Nuvvele Songs Launched

అంకిత జాదవ్, రోహిత్‌ భోగ జోడీగా సాంగ్స్‌ ఆల్బమ్‌ రూపొందింది. కొరియోగ్రాఫర్‌ సత్య దర్శకత్వంలో అదోనై పిక్చర్స్‌ క్రియేషన్స్‌ సమర్పణలో కేకే రెడ్డి నిర్మించారు. జయంత్‌ ఆర్యన్‌ సంగీతం అందించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ అంటూ సాగే సాంగ్స్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాయిరాజేశ్, శైలేష్‌ కొలను, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్, నటి ఆషు రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే...’ పాటలకి రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, లిప్సిక, అదితీ భావరాజు పాడారు. 

ఈ సందర్భంగా సత్య మాస్టర్‌ మాట్లాడుతూ– ‘‘ఒక ఈవెంట్‌ కోసం నేను అమెరికా వెళ్లినప్పుడు కేకే రెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్‌ హిందీ వెర్షన్‌ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను ఆయన నాతో షేర్‌ చేసుకున్నారు. అలా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ్ర΄ారంభించాం’’ అని తెలి΄ారు. కేకే రెడ్డి మాట్లాడుతూ– ‘‘నువ్వే ఉండి΄ో ఇలా‘, ‘నువ్వేలే’ సాంగ్స్‌ని మంచి లవ్‌ ఫీల్‌తో బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్‌ చేశారు డైరెక్టర్‌ సత్యగారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి’’ అన్నారు. 

‘‘నేను బాలీవుడ్‌లో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేస్తుంటా. నేను చేసిన ఐదో మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఇది. ఈ ΄ాటలను న్యూయార్క్, షికాగోలో షూట్‌ చేశాం’’ అని అంకిత జాదవ్‌ చె΄్పారు. ‘‘ఈ సాంగ్స్‌ను హిందీలో చేశాం. తెలుగులోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఇక్కడ మ్యూజిక్‌ లవర్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని సందేహించాం. కానీ, తప్పకుండా తెలుగు ఆడియన్స్‌ అంతా ఇష్టపడతారనే నమ్మకం ఉంది’’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ జయంత్‌ ఆర్యన్‌ పేర్కొన్నారు. ఇంకా లిరిసిస్ట్‌ రాంబాబు గోసాల, సింగర్‌ లిప్సిక మాట్లాడారు.   

Advertisement
 
Advertisement
Advertisement