డబ్బు లేకనే జైలుకెళ్తున్నా.. రాజ్‌పాల్‌కు అండగా సోనూ సూద్‌ | Sonu Sood Big Help To Actor Rajpal Yadav | Sakshi
Sakshi News home page

డబ్బు లేకనే జైలుకెళ్తున్నా.. రాజ్‌పాల్‌కు అండగా సోనూ సూద్‌

Feb 11 2026 10:33 AM | Updated on Feb 11 2026 10:40 AM

Sonu Sood Big Help To Actor Rajpal Yadav

బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.  కొంత కాలంగా చెక్‌బౌన్స్‌ కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తను చేసిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. తిరిగి చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదు.. సాయం చేసేందుకు స్నేహితులు కూడా లేరు. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు ప్రకారం లొంగిపోవడం తప్ప మరోక దారి నాకు కనిపించలేదని ఆయన అ‍న్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.

నటుడు రాజ్‌పాల్ కోసం నిర్మాతలు, దర్శకులతో పాటు తన సహచర నటులందరూ కలిసికట్టుగా నిలబడి సాయం చేయాలని సోనూ సూద్‌ కోరారు. తనకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు. ఇదీ దాతృత్వం కాదు.. ఒక నటుడి గౌరవాన్ని కాపాడేందుకు మనందరం ముందుకు వద్దాం. మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఒంటరి కాదని గుర్త చేసే బాధ్యత మనపై ఉంది. అని సోనూ సూద్‌ అన్నారు. ఈ క్రమంలోనే నటుడు రాజ్‌పాల్‌కు కొంత మొత్తంలో అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్‌  లిమిటెడ్‌ సంస్థ 2017లో చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టింది.   రాజ్‌పాల్ యాదవ్‌ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్  రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్‌ చెక్‌లు కూడా బౌన్స్‌ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే  దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి  ఫిర్యాదుదారుడికి  తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్‌ అయింది. తీహార్‌ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement