గతేడాది, ఈసారి వరసగా 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రసాద్' సినిమాలతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. త్వరలో కొత్త మూవీ ప్రకటనతో వస్తానని కొన్నిరోజుల క్రితమే చెప్పాడు. కానీ అనిల్.. నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు? స్టోరీ ఏంటి? ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు? అని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్ పెడుతూ స్వయంగా ఈ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు.
'నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాం' అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.
అయితే అనిల్.. తన తర్వాత సినిమా వెంకటేశ్ హీరోగా తీయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టులోనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని.. వెంకీ, ఫహాద్ బావబావమరిదిగా నటిస్తారని.. ఇందులో వెంకీ సరసన కీర్తి సురేశ్, పూజా హెగ్డే హీరోయిన్లు అని.. ఫహాద్ సరసన ఆషికా రంగనాథ్ కనిపిస్తుందని మాట్లాడుకున్నారు. అలానే మూవీకి 'శ్రీమతి లలితా రెడ్డి' అనే టైటిల్ కూడా నిర్ణయించారని, ప్రస్తుతం ఓటీటీ చర్చలు జరుగుతున్నాయని.. ఇది పూర్తవగానే అనౌన్స్‌మెంట్ ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇవే నిజమవుతాయా? లేదంటే అనిల్ రావిపూడి.. వేరే ప్రాజెక్ట్ చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
నటినటులు
కధ
టైటిల్ కూడా
పెట్టేసారు
ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄
మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను....
అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో...నిజమైన
పూర్తి వివరాలు... మీకు… pic.twitter.com/bfhQ4NrOfu— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026


