రవిబాబు 'రేజర్'.. యాక్షన్.. థ్రిల్ | Ravi Babu Razor Movie Poster Release | Sakshi
Sakshi News home page

రవిబాబు 'రేజర్'.. యాక్షన్.. థ్రిల్

Feb 11 2026 2:23 AM | Updated on Feb 11 2026 2:41 AM

Ravi Babu Razor Movie Poster Release

రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్‌’. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు సమర్పణలో ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్‌ ప్రకటించి, ఒకపోస్టర్‌తో పాటు స్పెషల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

‘‘డార్క్‌ అండ్‌  క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ‘రేజర్‌’. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని సరికొత్త కథాంశంతో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతంపోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ఈ వేసవిలో మా సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌ మాధవనేని, సంగీతం: ఎస్‌ఎస్‌ రాజేశ్‌.  

Advertisement
 
Advertisement
Advertisement