'చాయ్‌ వాలా' టైటిల్‌ వద్దని చెప్పారు | Shiva Kandukuri About Nawab Cafe Movie | Sakshi
Sakshi News home page

'చాయ్‌ వాలా' టైటిల్‌ వద్దని చెప్పారు

Feb 11 2026 2:16 AM | Updated on Feb 11 2026 2:42 AM

Shiva Kandukuri About Nawab Cafe Movie

శివ కందుకూరి, తేజు అశ్విని హీరో హీరోయిన్లుగా, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నవాబ్‌ కేఫ్‌’. ప్రమోద్‌ హర్ష దర్శకత్వంలో రాధా వి. పపుడిప్పు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. తొలుత ఈ సినిమాకు ఉన్న ‘చాయ్‌ వాలా’ టైటిల్‌ను ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చామని యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘సెన్సార్‌ రూల్స్, గైడ్‌ లైన్స్‌ని గౌరవిస్తూ, మేం మా టైటిల్‌ను ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చాం. 

ప్రమోద్‌ ఈ సినిమా కథను నాకు చెప్పినప్పుడు, ఈ చిత్రానికి ‘నవాబ్‌ కేఫ్‌’ అనే టైటిల్‌ అనుకున్నాం. విధి చివరకు ఈ టైటిలే ఫైనల్‌ అయ్యేలా చేసింది. ‘నవాబ్‌ కేఫ్‌’ టైటిల్‌ మా సినిమా సోల్‌ని, స్టోరీని తెలియజేస్తుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌ బయటకువచ్చి, వాళ్ల నాన్నకి ఫోన్‌ చేసి మాట్లాడతారు. మంచి ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు. 

‘‘మా సినిమా టైటిల్‌ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబై వెళ్లాను. సెన్సార్‌ టీమ్‌తో మాట్లాడాను. ‘చాయ్‌ వాలా’ టైటిల్‌ వద్దని చెప్పారు. దీంతో మేం మా వర్కింగ్‌ టైటిల్‌ ‘నవాబ్‌ కేఫ్‌’నే ఫైనల్‌ చేశాం’’ అని చెప్పారు నిర్మాత వెంకట్‌. ‘‘నా జీవితంలో నేను చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా ఈ ‘నవాబ్‌ కేఫ్‌’ సినిమా కథనం సాగుతుంది’’ అని తెలిపారు ప్రమోద్‌ హర్ష. ‘‘ఇది నా మొదటి చిత్రం’’ అని పేర్కొన్నారు తేజు అశ్విని. 

Advertisement
 
Advertisement
Advertisement