లక్నో నుంచి లాహోర్‌ వెళ్తే? | Sunny Deol Lahore 1947 Movie To Release In Theatres On August 13 | Sakshi
Sakshi News home page

లక్నో నుంచి లాహోర్‌ వెళ్తే?

Feb 11 2026 2:12 AM | Updated on Feb 11 2026 2:43 AM

Sunny Deol Lahore 1947 Movie To Release In Theatres On August 13

సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘లాహోర్‌ 1947’. షబానా అజ్మీ, ప్రీతి జింతా, కరణ్‌ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్‌ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

భారత్‌ – పాకిస్తాన్‌ దేశాల విభజన కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉండదట. లక్నోకు చెందిన ఓ ముస్లిం కుటుంబం కొన్ని పరిస్థితుల కారణంగా లాహోర్‌ వెళ్లాల్సి వస్తుందట. ఆ తర్వాత అక్కడ ఆ కుటుంబం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే కోణంలో ‘లాహోర్‌ 1947’ సినిమా కథనం సాగుతుందని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement