మైసూర్ శాండల్ సబ్బు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 100 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన ఈ సబ్బు.. కర్ణాటకలో తయారవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ తమన్నాని ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ విషయం కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి.
కర్ణాటకకు చెందిన సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వచ్చే రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సబ్బు, ఇతర ఉత్పత్తులకు ఈమె ప్రచారం చేయనున్నారు. ఈ విషయం గురించి మాట్లాడిన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్.. మైసూర్ శాండల్ సబ్బుని మార్కెట్‌లోకి రీలాంచ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం ద్వారా ఉత్తర భారత మార్కెట్‌లో తమ కంపెనీ ఉత్పత్తులు డిమాండ్ పెంచడమే లక్ష‍్యమని అన్నారు.

కన్నడ భామలైన రష్మిక, రుక్మిణి వసంత్, దీపికా పదుకొణె లాంటి వాళ్లని కాదని తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు, పలు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కె.సుధాకర్.. కాంగ్రెస్, కన్నడ వ్యతిరేక మనస్తత్వం కలిగిన ప్రభుత్వమని విమర్శించారు. కన్నడలో చాలామంది తారలున్నప్పటికీ.. వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది. అంతేకాక ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ.. కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ విషయం కన్నడ నాట హాట్ టాపిక్ అయిపోయింది.
As a Government of Karnataka PSU competing successfully with leading corporate FMCG players, KSDL stands as a strong example of public sector excellence.
In 2024–25, KSDL recorded a turnover of ₹1,787 Cr with a net profit of ₹451 Cr, delivering over 43,000 metric tonnes of… pic.twitter.com/cYuN59CkZm— M B Patil (@MBPatil) February 10, 2026
ನಾಡದ್ರೋಹಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕನ್ನಡದ ಸಿನಿತಾರೆಗಳು ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣುತ್ತಿಲ್ಲವೇ?
ಕರ್ನಾಟಕದ ಸುಪ್ರಸಿದ್ಧ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಬ್ರ್ಯಾಂಡ್ ಮೈಸೂರು ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್ ಗೆ ಬ್ರಾಂಡ್ ಅಂಬಾಸಿಡರ್ ನೇಮಿಸಲು ನಮ್ಮದೇ ಕನ್ನಡ ನಾಡಿನ ಅನೇಕ ತಾರೆಗಳು ಇದ್ದರೂ ಪರರಾಜ್ಯದ, ಅನ್ಯಭಾಷೆಯ ಸಿನಿಮಾ ನಟಿಯೊಬ್ಬರನ್ನು ಕೋಟ್ಯಂತರ ರೂಪಾಯಿ ಪೇಮೆಂಟ್ ಕೊಟ್ಟು… pic.twitter.com/bJqmXaPVo9— Dr Sudhakar K (@DrSudhakar_) February 10, 2026


