breaking news
Rajpal Yadav
-
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్‌పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్‌పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్‌బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్‌పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్‌పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్‌పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్ -
రాజ్‌పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే..
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.రాజ్‌పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి. -
డబ్బు కట్టలేక జైలుకెళ్తున్నా.. రాజ్ పాల్ కు అండగా సోనూ సూద్
-
డబ్బు లేకనే జైలుకెళ్తున్నా.. రాజ్‌పాల్‌కు అండగా సోనూ సూద్
బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కొంత కాలంగా చెక్‌బౌన్స్ కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తను చేసిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. తిరిగి చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదు.. సాయం చేసేందుకు స్నేహితులు కూడా లేరు. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు ప్రకారం లొంగిపోవడం తప్ప మరోక దారి నాకు కనిపించలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.నటుడు రాజ్‌పాల్ కోసం నిర్మాతలు, దర్శకులతో పాటు తన సహచర నటులందరూ కలిసికట్టుగా నిలబడి సాయం చేయాలని సోనూ సూద్ కోరారు. తనకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు. ఇదీ దాతృత్వం కాదు.. ఒక నటుడి గౌరవాన్ని కాపాడేందుకు మనందరం ముందుకు వద్దాం. మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఒంటరి కాదని గుర్త చేసే బాధ్యత మనపై ఉంది. అని సోనూ సూద్ అన్నారు. ఈ క్రమంలోనే నటుడు రాజ్‌పాల్‌కు కొంత మొత్తంలో అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్‌పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. Rajpal Yadav is a gifted actor who has given years of unforgettable work to our industry. Sometimes life turns unfair, not because of talent, but because timing can be brutal. He will be part of my film, and I believe this is the moment for all of us..producers, directors,…— sonu sood (@SonuSood) February 10, 2026 -
చెక్‌బౌన్స్ కేసులో తీహార్ జైలుకు కిక్-2 నటుడు
కిక్-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్‌బౌన్స్ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్‌పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. -
బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలుఈమెయిల్లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.వరుసగా బెదిరింపులుకపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్‌పాల్ యాదవ్‌కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్ -
కోపంతో జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న కమెడియన్.. వీడియో వైరల్
ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్‌లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్‌పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.దీపావళి అలా జరుపుకోవద్దు!దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నటుడి క్షమాపణలుదీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. నెలన్నరకోసారి నన్ను చూస్తారుఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్‌పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్‌పాల్ అసహనం వ్యక్తం చేశాడు.ఫోన్ లాక్కున్న నటుడువెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌పాల్ తన ఫోన్‌ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు. लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024 చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి -
నా చేతులతో మొదటి భార్య శవాన్ని మోశా.. బిడ్డను కనగానే..: కమెడియన్
తెలుగు సినిమాలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్లో బడా కమెడియన్ అనగానే చాలామందికి రాజ్‌పాల్ యాదవ్ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది. నా చేతులతో ఆమె శవాన్ని.. నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది. నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్‌పాల్ యాదవ్. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్ కీ కథ', ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్? -
ట్రాన్స్‌జెండర్ అవతారమెత్తిన బాలీవుడ్ ప్రముఖ నటుడు
నటుడు, కమెడియన్, దర్శకుడు, రచయిత, నిర్మాత.. మల్టీటాలెంటెడ్ పర్సన్ రాజ్‌పాల్ యాదవ్. ఈ బాలీవుడ్ నటుడు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'అర్ధ్'. రుబీనా దిలైక్, హితేన్ తేజ్వానీ, కుల్‌భూషణ్ ఖర్బందా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో రాజ్‌పాల్ యాదవ్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇలాంటి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా హీరో అవుదామని ముంబైకి వచ్చిన ఓ వ్యక్తి కథే అర్ధ్ అని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన మేకర్స్ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. Presenting to you the first look of my next film ARDH! @Palash_Muchhal @RubiDilaik @tentej #ardhmovie pic.twitter.com/thzwnwCYR0— Rajpal Naurang Yadav (@rajpalofficial) February 23, 2022 -
ప్రముఖ హాస్య నటుడికి 6 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ హస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ కార్కారదుమ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి చెల్లించనందుకు గాను, కోర్టు ఈ శిక్ష విధించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ నటుడికి 6 నెలల జైలు శిక్షతో పాటు, 11.2 కోట్ల రూపాయలు జరిమానాను, అతని భార్య రాధ యాదవ్‌కు 70 లక్షల జరిమానాను విధించారు. తరువాత రాజ్‌పాల్‌కు 50వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 2010 లో రాజ్‌పాల్ తొలిసారి తానే నటిస్తూ దర్శకత్వం వహించబోయే సినిమా ‘ఆట పాట లపాట’ కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్ కంపెనీ యజమాని ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి 5కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి 2011, డిసెంబర్ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చి సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్ పాల్ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. రాజ్‌పాల్ హిందీలో ‘భూల్‌భూలయ్యా’, ‘పార్టనర్’, ‘హంగామా’ వంటి హిందీ చిత్రాల్లోనే కాక తెలుగులో ‘కిక్ -2’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు -
ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు. చెక్ బౌన్స్ సహా, ఏడు కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. కాగా 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్‌పాల్ యాదవ్, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్‌లోని రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్‌ను, వారి కంపెనీ అకౌంట్‌ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ సినిమాలు భూల్ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు సీక్వల్ కిక్-2 లో కూడా ఆయన నటించారు. -
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
నటుడు రాజ్‌పాల్‌కు తాత్కాలిక ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు హైకోర్టు జోక్యంతో ఊరట లభించింది. రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య వ్యతిరేకంగా వసూలు కోసం ఓ వ్యాపారి దాఖలు చేసిన కేసులో కోర్టును తప్పుదారి పట్టించాడని హైకోర్టు ఏక వ్యక్తి ధర్మాసనం జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని కోర్టు గుర్తించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజ్‌పాల్ విచారణకు హాజరైనా, భార్య రాధ తరఫున తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టించడం ధిక్కార నేరమని ప్రకటించి పది రోజుల శిక్ష విధించింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన శిక్ష కోర్టు తదుపరి తీర్పు వరకు నిలుపు దలచేయడంతో పాటు కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. కోర్టు ఆదేశం మేరకు రాజ్‌పాల్ తన పాస్‌పోర్టును రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించారని, దీని వలన ఏ ప్రయోజనం కలుగదని వాదించారు. పైగా తన క్లైయింట్ వృత్తి సంబంధ పనులకు విఘాతం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ధర్మాసనం రాజ్‌పాల్ దేశంలో తన వృత్తి సంబంధమైన పనులకు హాజరుకావచ్చని, అయితే దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతివాది మురళి ప్రాజెక్ట్స్‌కు వారం గడువు లోపు రూ. 20 లక్షల చెక్ ఇస్తానన్న రాజ్‌పాల్ అంగీకారాన్ని కోర్టు నమోదు చేసింది. డిసెంబర్ 2వ తేదీన ఏక వ్యక్తి ధర్మాసనం విచారణలో రాజ్‌పాల్ దాఖలు చేసిన అఫిడవిట్లో అతని భార్య సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న నేరానికి యాదవ్‌కు పది రోజుల జైలు శిక్ష విధించడంతో పాటు, అతని భార్య రాధ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోర్టు ముగిసే వరకు నిలబడాలని శిక్ష విధించింది. -
కోర్టు ధిక్కారం కేసులో బాలీవుడ్ నటుడికి జైలు
న్యూఢిల్లీ: ఒక కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధకు మంగళవారం ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఎం.జి.అగర్వాల్ అనే వ్యక్తి నటుడు రాజ్‌పాల్ యాదవ్‌పై రూ.5 కోట్లకు రికవరీ కేసు పెట్టాడు. దీనిపై విచారణకు రాజ్‌పాల్ దంపతులు కోర్టుకు హాజరు కావడంలేదు. దీంతో ఆగ్రహం చెందిన జస్టిస్ ఎస్.మురళీధర్ నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష విధించారు. అతడి భార్యను కోర్టు సయయం ముగిసినంతవరకు కస్టడీ ఉండేలా శిక్ష విధించారు. నిందితులు విచారణకు హాజరు కాకుండా కోర్టు సమయాన్ని వృథాచేస్తున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు సమాచారమిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నించారన్నారు. వారి తరఫు న్యాయవాదులు సైతం తప్పుడు సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతూ కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితులు కోర్టు ధిక్కారానికి మరింత పాల్పడకుండా చేసేందుకు ప్రధాన నిందితుడైన నటుడు యాదవ్‌కు 10 రోజుల జైలు శిక్ష (తక్షణమే అమలయ్యేలా..) విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ భార్య రాధకు సంబంధించి తప్పుడు సమాచారం అందించిన ఆమె న్యాయవాదికి సైతం నోటీసు జారీ చేశారు. అలాగే ముంబైలోని మలాడ్‌లో ఉన్న రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న జాయింట్ ఎకౌంట్‌ను , వారి కంపెనీ అకౌంట్‌ను సైతం వారంలోగా అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే దాన్ని ఇప్పటివరకు తీర్చకపోవడంతో అతడు బాకీ రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. -
బాలీవుడ్ నటుడికి 10 రోజుల పోలీస్ కస్టడీ
బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు పది రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్యపై ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన కేసులో వివరాలను గుప్తంగా ఉంచినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ పాల్ యాదవ్ పై 5 కోట్ల రికవరీ దావా ను నమోదు చేశారు. రాజ్ పాల్ యాదవ్ తరపు న్యాయవాదులిద్దరికి కోర్టు ఉల్లంఘన నోటీసులను కోర్టు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాజ్ పాల్ యాదవ్ భార్యను రిజిస్త్రార్ జనరల్ కార్యాలయంలోనే ఉండాలని జస్టిస్ ఎస్ మురళీధర్ సూచించారు.


