అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్‌ మంచి మనసు | Bigg Boss Shrihan Wins Heart With His Act | Sakshi
Sakshi News home page

Shrihan: శ్రీహాన్‌ చేసిన మంచి పనికి అభిమానులు ఫిదా

Feb 11 2026 11:29 AM | Updated on Feb 11 2026 11:37 AM

Bigg Boss Shrihan Wins Heart With His Act

కొన్నిసార్లు మన చుట్టూ ఏం జరిగినా చూసీచూడనట్లు పోతాం. కానీ, మానవత్వంతో ఆలోచించి ఒక్క నిమిషం కేటాయిస్తే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నాడు బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు శ్రీహాన్‌. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్‌.. మా ఆవారా జిందగీ, వర్జిన్‌ బాయ్స్‌ సినిమాల్లో నటించాడు.

పూటుగా తాగేసి..
తాజాగా అతడు తన సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశాడు. రాత్రిపూట రోడ్డుపై కారులో వెళ్తున్న శ్రీహాన్‌ మార్గమధ్యలో ఓ వ్యక్తి పూటుగా తాగేసి పడి ఉండటాన్ని గమనించాడు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా కారు ఆపేసి మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు.

రెండు నిమిషాల పని
దీనిగురించి శ్రీహాన్‌ మాట్లాడుతూ.. పెద్దాయన తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆయనకే సమస్యలున్నాయో, ఎందుకు తాగాడో మనకు అనవసరం. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉంది. ట్రాఫిక్‌ ఎక్కువున్నప్పుడు కార్లకు, పెద్ద వాహనాలకు రోడ్డుపై ఉన్న అతడు కనిపించడు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఏదైనా జరిగితే..
రోడ్డు అవతలివైపు జనాలు నిలబడి చూస్తున్నారంతే! ఒకటీరెండు నిమిషాల సమయం కేటాయిస్తే అతడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అది రీల్స్‌లో చూసి అయ్యో, పాపం అనుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. వీడియోలో టైం, డేట్‌ తప్పుగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దని కోరాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మంచి పని చేశావంటూ శ్రీహాన్‌ను మెచ్చుకుంటున్నారు.

 

 చదవండి: అల్లు అర్జున్‌ సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న స్రవంతి

Advertisement
 
Advertisement
Advertisement