అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నంది పాటి రిలీజ్ చేస్తు న్నారు. ఈ సందర్భంగా వంశీ నంది పాటి మాట్లాడుతూ–‘‘మేము ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలు సూపర్‌హిట్స్ అయ్యాయి.
‘ఈషా’ విషయంలోనూ అదే జరుగుతుందన్న నమ్మకం ఉంది. ‘ఈషా’ కేవలం హారర్ సినిమానే కాదు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా రియల్‌లైఫ్ ఇన్సిడెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుంది. ‘పోలిమేర 3’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు. ఏషియన్స్ సునీల్‌గారు, బీవీ వర్క్స్‌తో కలిసి ఈ సినిమా ఉంటుంది. ఈటీవీ విన్స్ వారితో మా అసోసియేషన్స్ కొనసాగుతుంది. ‘ఇంకా ఏమీ అనుకోలేదు’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్లాన్స్ చేస్తున్నాం’’ అన్నారు.
బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈషా’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే సినిమాను తీసుకున్నాం. ఈ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచదు. ఓ స్ట్రాటజీ ప్రకారం నాన్స్ థియేట్రికల్ క్లోజ్ చేసి, ప్రమోషన్స్ చేసి, సినిమాలను విడుదల చేస్తున్నాం. మాదొక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు. ఇక బీవీ (బన్నీ వాసు) వర్క్స్‌పై నేను నిర్మించిన ‘మిత్రమండలి’ సినిమా విఫలమైంది.
నా సొంత బ్యానర్‌లో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అల్లు అరవింద్‌గారితో నా అసోసియేషన్స్ కొనసాగుతుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ పెద్ద సినిమా ఉంది. ఎమ్‌ఎస్ సుబ్బలక్ష్మిగారి జీవితంపై ఓ మ్యూజిక్ డ్రామా ఉంది. రాక్‌లైన్స్ వెంకటేశ్ ప్రధాన నిర్మాత. బీవీ వర్క్స్ అసోసియేషన్స్ ఉంది. నాగచైతన్య కొత్త సినిమా నిర్మాణంలోనూ అసోసియేట్ అయ్యాను’’ అని చెప్పారు.
∙బన్నీ వాసు, వంశీ నంది పాటి


