breaking news
eesha
-
‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈషాపై నెగెటివిటీ.. చచ్చిపోదాం అనిపించింది: డైరెక్టర్
చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కథ బాగుండే సినిమాయే ఆడుతుంది. కంటెంట్ బాగుండి, నిజాయితీతో సినిమా తీస్తే హిట్ చేస్తామని ఈషా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు చెప్పారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ఈషా. డిసెంబర్ 25న రిలీజైన ఈషాశ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి, బన్నీ వాస్ డిసెంబర్ 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈషా జర్నీ చాలా పెద్దది. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు అని తెలిపారు. ఈషా ఆడియన్స్‌కు కనెక్ట్ కాకపోతే ఐదురోజుల్లోనే ఆరు కోట్ల గ్రాస్ వచ్చేవి కావు అని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఆడియన్స్ సపోర్ట్ చేయడం వల్లే ఈషా వంటి చిత్రాలు విజయాన్ని సాధిస్తుంటాయి అని వంశీ నందిపాటి చెప్పారు. ఐదు రోజుల్లోనే..సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి.. అంతేకానీ మమ్మల్ని వేధించకండి. మా సినిమాకు వచ్చిన రివ్యూస్, రేటింగ్స్ చూసి సూసైడ్ చేసుకుందాం అనిపించింది. ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామా అని భయంతో వణికిపోయాను. ఆ నెగెటివిటీ చూసి చaనిపోవాలనే అనిపించింది. అదంతా తట్టుకుని ఇప్పుడు స్టేజీపై నిలబడ్డాను అని శ్రీనివాస్ పేర్కొన్నారు. మా మూవీకి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి అని హేమ వెంకటేశ్వరరావు అన్నారు.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ -
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన'ఈషా'
త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం(డిసెంబర్ 25) విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మని నలుగురు స్నేహితులు(త్రిగుణ్, హెబ్పాపటేల్, సిని హనుమంతు, అఖిల్ రాజు)..పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈషా విజయాన్ని అడ్డుకోలేరు: వంశీ నందిపాటి
‘‘ఈషా’ చిత్రానికి హైదరాబాద్‌లో 26 ప్రీమియర్స్ వేస్తే హౌస్‌ఫుల్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బాగుంది. వసూళ్లు బాగున్నాయి. అయితే మా సినిమాని కొందరు టార్గెట్ చేసి, పెయిడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా మీద ఇలా జరగడం దారుణం. ఎవరు ఎన్ని చేసినా మా సినిమా విజయాన్ని అడ్డుకోలేరు’’ అని వంశీ నందిపాటి పేర్కొన్నారు.త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ–‘‘పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న మా సినిమాని కావాలని బ్యాడ్ చేయడం మంచిది కాదు. నా మూవీని డ్యామేజ్ చేసిన ఎవర్నీ వదలను’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి సినిమాను బ్యాడ్ చేస్తున్నారు’’ అన్నారు బన్నీ వాసు. నిర్మాత హేమ వెంకటేశ్వరరావు మాట్లాడారు. -
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
ప్రమోషనల్ కంటెంట్‌తో కొంతలో కొంత ఆకట్టుకున్న హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, బబ్లూ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నిత మనస్కులు ఈ మూవీకి రావొద్దని నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. తాజాగా(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? చెప్పినంతలా భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అంటే చాలామంది అలాంటివేం లేవని అంటారు. మరికొందరు మాత్రం అవును అలాంటివి ఉన్నాయని నమ్ముతుంటారు. అలా వ్యతిరేక భావాలున్న ఇద్దరూ ఎదురెదురు పడి సవాళ్లు విసురుకుంటే ఏమైందనేదే 'ఈషా' సినిమా.హారర్ సినిమాలు అనగానే కొన్ని అంశాలు పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాల్ని నమ్మకపోవడం.. అనుకోని పరిస్థితుల్లో పాడుబడిన బంగ్లాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం.. దెయ్యాల్ని వదిలించే ఓ శక్తివంతైన బాబా.. ఇలాంటివి దాదాపుగా కనిపిస్తాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు భయపడ్డాడా లేదా అనేది కీలకం. ఈ విషయంలో 'ఈషా'కు పాస్ మార్కులే పడతాయి. ఎందుకంటే నాలుగైదు చోట్ల భయపెట్టడం తప్పితే గొప్పగా ఏం లేదు.నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని నిరూపించడం.. ఈ క్రమంలోనే ఆదిదేవ్ బాబాని వెతుక్కుంటూ అతడి దగ్గరకు వెళ్లడం.. మార్గం మధ్యలో ఓ ప్రమాదం.. ఓ సవాలు.. అనుకోని పరిస్థితుల్లో వీళ్లంతా పాడుబడిన బంగ్లాలో ఉండాల్సి రావడం.. ఇలా దాదాపు స్టోరీ అంతా ఫ్లాట్‌గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతూ ఉంటుంది తప్పితే తెరపై సీన్స్ ఆ ఫీల్ కలిగించవు.ఇందులో పుణ్యవతి ఎపిసోడ్ భయపెడుతుంది. కాకపోతే అదంతా చాలా సింపుల్‌గా తేల్చేయడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాత్రని ఇంకాస్త పొడిగించి ఉంటే భయపెట్టే స్కోప్ చాలా ఉండేది. ఆమె ఆత్మకు.. కొడుకు, భర్తతోనూ ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. కానీ దర్శకుడు అలా ఎందుకు ఆలోచించలేకపోయాడా అనిపిస్తుంది. పుణ్యవతి పాత్రని ఎందుకో మధ్యలోనే వదిలేశారో ఏంటో? అలానే అమెరికాలో టాప్ న్యూరో సర్జర్ అయిన ఆదిదేవ్.. మన దేశానికి వచ్చి దెయ్యాల్ని వదిలిస్తూ బాబాగా ఎందుకు మారాడో అర్థం కాదు. అతడి బ్యాక్ స్టోరీ చెప్పలేదు.ఈ సినిమాకు క్లైమాక్సే కీలకం. దర్శకుడు కూడా దాన్నే నమ్ముకుని తీశాడు. క్లైమాక్స్ ఒక్కటే సర్ప్రైజ్ చేస్తే సరిపోదుగా.. మిగతా సీన్స్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడే మూవీ బాగుంటుంది. ఇక్కడా ఆ పొరపాటే జరిగింది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా రొటీన్. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‌ని చివరలో చూపిస్తూ.. సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి ముగించారు.ఎవరెలా చేశారు?ఫ్రెండ్స్ గ్యాంగ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. బాబా ఆదిదేవ్గా బబ్లూ పృథ్వీరాజ్ ఓకే. వేషధారణ కాస్త విచిత్రంగా ఉన్నా ఎందుకో పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయారు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు అదరగొట్టేశాడు. గెటప్ చూస్తేనే భయపడతాం. ఆ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ధ్రువన్ సంగీతం బాగుంది. సీన్లో దమ్ములేకపోయినా సౌండ్‌తో భయపెట్టే ప్రయత్నం బాగా చేశారు. విజువల్స్ కూడా హారర్ ఫీల్ కలిగించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్లో కొత్తదనం లేదు. సినిమాని కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఈషా' ఓకే.- చందు డొంకాన -
ఈషా ప్రేక్షకులను వెంటాడుతుంది
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు నేడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన శ్రీవిష్ణు బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా ‘ఈషా’ టిక్కెట్ ధరలు అందరికీ అందు బాటులో (రూ. 99) ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు అంగీకార పత్రంపై సైన్ చేశాకే ‘ఈషా’ చూడాల్సి ఉంటుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘హారర్ సినిమా లవర్స్ మా ‘ఈషా’ని ఎంజాయ్ చేస్తారు’’ అని బన్నీ వాసు చెప్పారు. ‘‘ఈషా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శ్రీనివాస్ మన్నె, అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, నిర్మాత వెంకట్ పేర్కొన్నారు. -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈషా కథ విని షాక్ అయ్యాను: అఖిల్ రాజ్
‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్‌గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది. ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్‌గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
ఒక్కోటి ఒక్కో జానర్.. ఈ వారం అయినా అద్భుతం జరిగేనా?
ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్‌లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్‌ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్‌లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్‌లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. -
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది: వంశీ నంది పాటి
అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నంది పాటి రిలీజ్ చేస్తు న్నారు. ఈ సందర్భంగా వంశీ నంది పాటి మాట్లాడుతూ–‘‘మేము ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలు సూపర్‌హిట్స్ అయ్యాయి. ‘ఈషా’ విషయంలోనూ అదే జరుగుతుందన్న నమ్మకం ఉంది. ‘ఈషా’ కేవలం హారర్ సినిమానే కాదు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా రియల్‌లైఫ్ ఇన్సిడెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుంది. ‘పోలిమేర 3’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు. ఏషియన్స్ సునీల్‌గారు, బీవీ వర్క్స్‌తో కలిసి ఈ సినిమా ఉంటుంది. ఈటీవీ విన్స్ వారితో మా అసోసియేషన్స్ కొనసాగుతుంది. ‘ఇంకా ఏమీ అనుకోలేదు’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్లాన్స్ చేస్తున్నాం’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈషా’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే సినిమాను తీసుకున్నాం. ఈ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచదు. ఓ స్ట్రాటజీ ప్రకారం నాన్స్ థియేట్రికల్ క్లోజ్ చేసి, ప్రమోషన్స్ చేసి, సినిమాలను విడుదల చేస్తున్నాం. మాదొక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు. ఇక బీవీ (బన్నీ వాసు) వర్క్స్‌పై నేను నిర్మించిన ‘మిత్రమండలి’ సినిమా విఫలమైంది. నా సొంత బ్యానర్లో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అల్లు అరవింద్గారితో నా అసోసియేషన్స్ కొనసాగుతుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ పెద్ద సినిమా ఉంది. ఎమ్ఎస్ సుబ్బలక్ష్మిగారి జీవితంపై ఓ మ్యూజిక్ డ్రామా ఉంది. రాక్లైన్స్ వెంకటేశ్ ప్రధాన నిర్మాత. బీవీ వర్క్స్ అసోసియేషన్స్ ఉంది. నాగచైతన్య కొత్త సినిమా నిర్మాణంలోనూ అసోసియేట్ అయ్యాను’’ అని చెప్పారు.∙బన్నీ వాసు, వంశీ నంది పాటి -
హెబ్బా పటేల్ ‘ఈషా’ సినిమా ట్రైలర్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
కొత్త డేట్ ఫిక్స్
త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ఇది. వంశీ నందిపాటి, ‘బన్నీ’ వాసు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 12న రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. కానీ, వాయిదా వేశారు. ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం తెలిపారు. -
హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. భయపెట్టేలా ట్రైలర్
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన హారర్ థిల్లర్ ఈషా. ఈ మూవీకి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హెవీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈషా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ హారర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యాలు, ఆత్మల కాన్సెప్ట్‌తోనే ఈషాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్లో సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేలా ఉన్నాయి. మీరు ఇప్పటివరకూ చూడని.. ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అనే డైలాగ్ మరింత భయపెడుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రలు పోషించారు. Four friends, a mysterious house, & lurking spirits ❤️🔥Experience the breathtaking chills and thrills with the haunting #EeshaTrailer 💀💥-- https://t.co/BR0aa4y5osFEAR IS GUARANTEED#Eesha IN CINEMAS ON DEC 12th 💀#EeshaOnDec12th@Thrigun_Aactor @ihebahp… pic.twitter.com/nRswpWgitM— Eluru Sreenu (@IamEluruSreenu) December 8, 2025 -
దయచేసి అలాంటివాళ్లు ఈ సినిమా చూడొద్దు: బన్నీవాసు
సినిమా చూసేందుకు థియేటర్స్‌కి రండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్న ఈ రోజుల్లో.. నిర్మాత బన్నీ వాసు మాత్రం మా సినిమా చూసి ఇబ్బంది పడొద్దని కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే మా బాధ్యత కూడా కాదని ముందే చెబుతున్నాడు. అయితే ఈ హెచ్చరిక హార్ట్ వీక్ ఉన్నవాళ్లకి మాత్రమే అంటున్నాడు బన్నీవాసు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ వాసు(Bunny Vasu)..త్వరలోనే ‘ఈషా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని.. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా భయపడడం ఖాయమన్నారు.(చదవండి: భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’)‘దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైన హంటింగ్ ప్లేస్ ఉందంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈషా సినిమా గురించి చెప్పినప్పుడు రొటీన్‌గానే ఉంటుందని కూర్చున్నాను. హారర్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారనేది మాకు తెలుసు కాబట్టి.. సినిమా చూసినప్పుడు భయం కలగలదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను. దెయ్యం మేకప్ ఎలా వేస్తారో, షూటింగ్ ఎలా చేస్తారో..ఇలా అన్ని తెలిసిన నేను కూడా భయపడ్డాను. తెలిసి కూడా భయపడే సినిమా ఇది. ఎడిటింగ్ మీద, సౌండింగ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఇలాంటి సినిమా వస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ చాలా అద్బుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. చివరి 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 12న థియేటర్స్‌కి రండి భయపడి ఎంజాయ్ చేయండి. కొంచెం హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మాత్ర దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైన అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెబుతున్నా..హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే ఇబ్బంది పడతారు’ అని బన్నీ వాసు చెప్పారు. -
భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’
తెలుగులో ప్రాపర్ హారర్ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కామెడీ హారర్ చిత్రాలు తరచు వస్తున్నాయి కానీ.. పూర్తిగా భయపెట్టే చిత్రాలేవి రావట్లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు ‘ఈషా’ వచ్చేస్తుంది. త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్‌కి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం రెండు సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఆత్మలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
భారత్‌లో లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ భారత్‌లో ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా తొలి స్టోర్‌ను ప్రారంభించారు. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్).. ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ సంస్థతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం తర్వాత జియో వరల్డ్ ప్లాజాలో స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. ఈ మాల్ లో డియోర్, గూచీ, లూయిస్ విట్టన్, రోలెక్స్ తో పాటు దాదాపూ 20కి పైగా హై-ఎండ్ బ్రాండ్ల విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జియో వరల్డ్ ప్లాజాలోనే బాలెన్సియాగా బ్రాండ్స్ అమ్మకాలు సైతం ప్రారంభించినట్లు రిలయన్స్ రీటైల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమియం బ్రాండ్స్ ఆర్బీఎల్ ప్రీమియం ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విభాగాలలో గ్లోబల్ బ్రాండ్లను లాంచ్ చేసేందుకు సుమఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అర్మానీ ఎక్స్ఛేంజ్, బర్బెర్రీ, క్లార్క్స్, కోచ్, డీజిల్, డూన్, ఈఎస్7, ఎంపోరియో అర్మానీ, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, హంకెమోలర్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూయార్క్, మనీష్ మల్హోత్రాలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేసింది. -
అందుకే నిర్మాతగా మారా!
‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.. ► ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్‌ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ని ఇచ్చా. ► హీరోగా కూల్‌గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్‌కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్ అవసరం. ► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్‌మెంట్. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి. ► ‘అ’ కమర్షియల్ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ► మా 18 మంది కజిన్స్లో యూజ్లెస్ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను. ► ‘అ’ సినిమా కమర్షియల్‌గా హిట్ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు. ► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్ కదా అని రెమ్యునరేషన్ తగ్గించలేదు. డేట్స్‌ని బట్టి తీసుకున్నారు. ► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నా. యాక్టర్‌గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్ డిపార్ట్మెంట్లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ). ► శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్ తిరుమల, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తా. -
నవ్వులే నవ్వులు
వైవిధ్యమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దిట్ట. ‘క్షణం’తో సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు అడివి శేష్. ‘అష్టా చమ్మా’ ద్వారా నటుడిగా పరిచయమై, ‘ఊహలు గుసగుసలాడే’తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని కూడా నిరూపించుకున్నారు. సక్సెస్‌లో ఉన్న ఇంద్రగంటి–శేష్–అవసరాల కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈష, అదితీ మ్యానికల్ ముఖ్య పాత్రల్లో ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ’ పతాకంపై ఇంద్రగంటి దర్శకత్వంలో కె.సి. నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తు్తన్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్. -
అల్లరి నరేష్ ‘బందిపోటు’ స్టిల్స్
-
అల్లరి నరేష్ బంధిపోటు మూవీ ప్రారంభం
-
తెలుగమ్మాయిలకు ఏం తక్కువ?
తారాస్వరం నటించడం అంత తేలిక కాదు. నటనను నిజమని నమ్మించడం అంత సులభమూ కాదు. అందుకే నటించడం మొదలుపెట్టిన చాలా కాలానికి కానీ సహజమైన నటనను పండించడం సాధ్యం కాదు కొందరికి. కానీ ఈషా తొలి సినిమా ‘అంతకు ముందు ఆ తర్వాత’లోనే అత్యంత సహజంగా నటించింది. అందరి ప్రశంసలనూ అందుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా తన ఎంట్రీ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెబుతోన్న విశేషాలు... తొలిసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు....? నా సినిమా నేను తొలిసారి ప్రసాద్స్‌లో చూశాను. నా పక్కన ఓ అమ్మాయి కూచుంది. నా మనసంతా ఆమె మీదే. సినిమా చూసి తను ఎలా ఫీలవుతోంది, అందరూ ఎలా రియాక్టవుతారు, మెచ్చుకుంటారా తిట్టుకుంటారా అంటూ టెన్షన్‌గా చూశాను. నా అదృష్టం... అందరికీ నేను నచ్చాను. సినిమా వైపు అడుగులు ఎలా పడ్డాయి? నేను ఎంబీయే (హెచ్.ఆర్.) ఫైనలియర్లో ప్రాజెక్టు కోసం మీడియాను ఎంచుకున్నాను. అప్పుడే చాలామంది నాతో అనేవారు... చక్కగా ఉన్నావు, మోడల్‌గా ట్రై చేయొచ్చుగా అని. నాక్కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనిపించింది. అంబికా దర్బార్ బత్తి, అపర్ణా కన్స్ట్రక్షన్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. కానీ పరీక్షలు దగ్గర్లో ఉండటంతో చదువు మీదే శ్రద్ధపెట్టాను. చదువు పూర్తయ్యాక సినిమా అంగీకరించాను. హీరోయిన్గా పిలుపు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు? ఇంద్రగంటి మోహనకృష్ణగారి నుంచి పిలుపు రావడం పెద్ద సర్ప్రయిజ్. ఫేస్బుక్లో నా ఫొటోలు చూసి కాల్ చేశారాయన. ఆయన డెరైక్ట్ చేసిన అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ తదితర చిత్రాలు చూశాను. అంత మంచి దర్శకుడితో పనిచేసే చాన్స్ రావడం సంతోషమే కదా! నటనలో అనుభవం లేదు కదా... కష్టమనిపించలేదా? మొదట్లో అనిపించేది. సీన్లు డిస్కస్ చేయడానికి కూడా భయమేసేది. సినిమా ప్రారంభించక ముందు ఆరు నెలల పాటు రిహార్సల్స్ జరిగాయి. షూటింగ్ మొదలయ్యాక కూడా స్క్రిప్టు ముందే ఇచ్చేసేవారు. దాంతో ఇంటి దగ్గర బాగా చదివి, హోమ్‌వర్క్ చేసేదాన్ని. ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకునేదాన్ని. దాంతో తర్వాత ఈజీ అయిపోయింది. మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? సినిమా చూడగానే నాన్న నాకు ఫోన్ చేసి... ‘ఇంత బాగా చేస్తావనుకోలేదురా’ అన్నారు. చాలా సంతోషమేసింది. మొదట్లో మోడలింగ్ అంటేనే ఇష్టపడలేదాయన. అన్నీ వివరించాక ‘నీ ఇష్టం, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకో, ఏం చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యి’ అన్నారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యింది. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? సినిమా చూశాక కొందరు... ఇంకాస్త గ్లామరస్‌గా కనిపించి ఉంటే బాగుండేది అన్నారు. నాకు అర్థం కాలేదు. గ్లామరస్‌గా నటించడమంటే నేను అందంగా లేననా లేక స్కిన్‌షో చేయలేదనా? నాకిప్పటికీ అర్థం కాలేదు. తెలుగమ్మాయిలకు తెలుగులో ప్రోత్సాహం లేదు అని ప్రతిసారీ నిరూపితమవుతోంది. దానికి మీరేమంటారు? అది నిజమే. మన అమ్మాయిలంతా తమిళ సీమలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడెందుకు అవకాశాలు రావడం లేదు! ఎందుకంటే... తెలుగమ్మాయిలంటే సంప్రదాయబద్దంగానే ఉంటారని, అన్ని పాత్రలకూ సూట్ కారని దర్శకులు ముందే ఫిక్సయిపోతున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చి చూస్తే కదా... వాళ్లు సూటవుతారో లేదో తెలిసేది! దర్శకులను శాటిస్ఫై చేయడానికి మన అమ్మాయిలు కూడా ఏమైనా మారాలంటారా? అవసరం లేదు. మనవాళ్లకి ఏం తక్కువ! నేను చాలా ఆడిషన్స్‌కి వెళ్లాను. నేను తెలుగమ్మాయినని తెలిసి చాలామంది షాక్ తిన్నారు. ఎందుకంటే అంత మోడ్రన్‌గా ఉంటాను నేను. ‘మా పాత్రకు ఇలా కావాలి’ అంటే అలా ఒదిగిపోయే టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలు బోలెడంతమంది ఉన్నారు. అవకాశం ఇవ్వడమే కావాలి. మీ రెండో సినిమా ఎప్పుడు వస్తుంది? మొదటి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఆ పాత్రలకు నేను సూటవనేమో అనిపించి నో అన్నాను. పూర్తిస్థాయి పాత్ర కావాలని కాదు. నిడివి తక్కువైనా మంచిది, పేరు తెచ్చేది అయితే ఓకే చేయడానికి నేను సిద్ధం. అలాంటి చాన్స్ కోసమే ఎదురు చూశాను. ఇప్పుడు రమేష్‌వర్మ డెరైక్షన్‌లో చేస్తున్నాను. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. సెమీ వెస్టర్న్ క్యారెక్టర్. మంచి పేరు వస్తుందని అనుకుంటున్నా! - సమీర నేలపూడి -
దాములాంటి నిర్మాతలు ఇంకా రావాలి - నందినీరెడ్డి
‘‘స్టార్స్‌ను కాకుండా కథను నమ్మి సినిమాలు తీసే అతి తక్కువ మంది నిర్మాతల్లో దాము ఒకరు. ఇలాంటి నిర్మాతలు మరికొందరు వస్తే ఇంకా కొత్త కథలు, కొత్త దర్శకులు పరిశ్రమకు వస్తారు’’ అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. సుమంత్ అశ్విన్, ఈషా జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు... ఆ తరువాత’ యాభై రోజుల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఒక మిత్రునిలాగా ఈ సినిమా విషయంలో సహకరించారని దర్శకుడు పేర్కొన్నారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో పెద్ద హిట్టు కొట్టినందుకు సునీల్ సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా రమేష్‌ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, మారుతి, స్వాతి, బి.గోపాల్, వీఎన్ ఆదిత్య, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.


