త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన హారర్ థిల్లర్ ఈషా. ఈ మూవీకి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హెవీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈషా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ హారర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యాలు, ఆత్మల కాన్సెప్ట్‌తోనే ఈషాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్‌లో సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేలా ఉన్నాయి. మీరు ఇప్పటివరకూ చూడని.. ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అనే డైలాగ్ మరింత భయపెడుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రలు పోషించారు.
Four friends, a mysterious house, & lurking spirits ❤️🔥
Experience the breathtaking chills and thrills with the haunting #EeshaTrailer 💀💥
-- https://t.co/BR0aa4y5os
FEAR IS GUARANTEED#Eesha IN CINEMAS ON DEC 12th 💀#EeshaOnDec12th@Thrigun_Aactor @ihebahp… pic.twitter.com/nRswpWgitM— Eluru Sreenu (@IamEluruSreenu) December 8, 2025


