మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2లో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. డిసెంబర్ 12న ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం మొదలు పెట్టింది. అయితే, రాశీ సింగ్ తన కాలేజ్ రోజుల నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఏకంగా తన లెక్చరర్‌తో ఉన్న రిలిలేషన్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాశీ సింగ్ ఇలా చెప్పారు 'స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీలో చేరాను. ఆ సమయంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మాకు లెక్చరర్ కూడా.. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్ చేసేవాడు. పరీక్షలు ఉన్నప్పుడు ఎగ్జామ్ పేపర్లు కూడా నాకు ముందే ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. సరదాగా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం. ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు.. అతను కూడా చాలా యంగ్.. పెళ్లి కూడా కాలేదు. అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఫాలో అవుతుంది.' అని రాశీ సింగ్ చెప్పారు.
నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించాను. ఆయన నాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేవారు, వైవాలో ఏమి అడిగేవారు కాదు, దాని బదులు మేమిద్దరం టైమ్ పాస్ చేసుకున్నాం.
- Rashi Singh#3Roses Season2 pic.twitter.com/sQYQaSihSi— idlebrain.com (@idlebraindotcom) December 7, 2025


