బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్తున్నప్పటికీ ఆమె చాలా నెగిటివిటీతోనే వెళ్లారు. అయితే, 13 వారాల పాటు తన గేమ్‌ను చూసిన వారందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెపై ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ చాలావరకు తగ్గిందని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్‌శెట్టి ఉండగా ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన రీతూ ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 21న ఫైనల్ జరగనుంది.

రీతూ రెమ్యునరేషన్
రీతూ బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు తనపై ట్రోలింగ్, నెగిటివిటీ వల్ల ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటారని నెటిజన్లు భావించారు. కానీ, తనలోని గేమ్ ఛాలెంజ్ ఏకంగా 13 వారాలపాటు హౌస్‌లో ఉండేలా చేసింది. అయితే, మంచి రెమ్యునరేషన్‌తోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చారు. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ. 32 లక్షల మేరకు రెమ్యునరేషన్‌గా పొందినట్లు సమాచారం. ఒక విన్నర్ అందుకునే ప్రైజ్ మనీకి దగ్గరగా రీతూ రెమ్యునరేషన్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రీతూ కన్నీళ్లు
రీతూ ఎలిమినేషన్ తర్వాత డిమాన్ పవన్‌తో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. పవన్‌ను హగ్ చేసుకుని రీతూ కన్నీళ్లు పెట్టుకుంది బయటకు వచ్చిన రీతూ నాగార్జునతో పాటుగా తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. టాప్-5 ఉండాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఇలా రావడంతో చాలా బాధపడ్డానన్నారు.

నెగిటివిటీని దాటుకుని ఎలిమినేట్
బిగ్‌బాస్ సీజన్-9లో రీతూ ప్రయాణం చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తనపై ఫుల్ నెగిటివిటీ ఉంది. నెటిజన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా తనేంటో ప్రేక్షకులకు చూపించాలని వెళ్లారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్కుల విషయంలో రీతూ దుమ్మురేపింది. ఆమె పడుతున్న కష్టం, అల్లరి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం జనాలకి అర్థమైంది. ఉన్న లేడీ కంటెస్టెంట్‌లో రీతూ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారు. ఫైనల్‌గా తనపై ఉన్న నెగిటివిటీని కాస్త తగ్గించుకునే ఎలిమినేట్ అయ్యారు.


