పాతికేళ్ల తర్వాత ‘పడయప్ప’ తిరిగి రానున్నాడు. రజనీకాంత్ హీరోగా, శివాజీ గణేశ్‌న్, రమ్యకృష్ణ, సౌందర్య, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహా’). కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999లో విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఈ నెల 12న రీ– రిలీజ్ కానుంది. డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే.
ఇక నటుడిగా రజనీకాంత్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పడయప్ప’ సినిమాను డిసెంబరు 12న రీ రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేస్తూ, ‘ది రిటర్న్ ఆఫ్ పడయప్ప’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘పడయప్ప’ సినిమాలోని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌ను రజనీకాంత్ రీ క్రియేట్ చేసిన సీన్ ఈ వీడియోలో కనిపిస్తోంది.


