breaking news
padayappa
-
నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. సీక్వెల్‌కు ప్లానింగ్
రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది.25 ఏళ్ల తర్వాత రిలీజ్ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ చూడలేదు. నరసింహ సీక్వెల్జైలర్, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనేదే నా ఉద్దేశం. ఐశ్వర్యరాయ్ ఫస్ట్ ఛాయిస్ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో మైసూర్ వేలాది మందితో సీన్ షూట్ చేశాం.ఆమె కూడా..జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్ చేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.చదవండి: నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా -
ది రిటర్న్ ఆఫ్ పడయప్ప
పాతికేళ్ల తర్వాత ‘పడయప్ప’ తిరిగి రానున్నాడు. రజనీకాంత్ హీరోగా, శివాజీ గణేశ్న్, రమ్యకృష్ణ, సౌందర్య, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహా’). కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999లో విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఈ నెల 12న రీ– రిలీజ్ కానుంది. డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే.ఇక నటుడిగా రజనీకాంత్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పడయప్ప’ సినిమాను డిసెంబరు 12న రీ రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేస్తూ, ‘ది రిటర్న్ ఆఫ్ పడయప్ప’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘పడయప్ప’ సినిమాలోని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌ను రజనీకాంత్ రీ క్రియేట్ చేసిన సీన్ ఈ వీడియోలో కనిపిస్తోంది. -
'శివగామి' రమ్యకృష్ణకు మరో బంపర్ ఆఫర్
-
సూర్య చిత్రంలో నీలాంబరి
పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను మరవలేం. ఇక చాలా కాలం తరువాత బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో జీవించారు. తాజాగా నటుడు సూర్య చిత్రంలో మరో ప్రధాన పాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానా సేర్న్ద కూటం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత సీనియర్ కమేడియన్ సెంథిల్ నటిస్తున్న ఈ చిత్రంలో నటి రేవతి మాజీ ప్రియుడు సురేశ్‌మీనన్, ఆర్జే.బాలాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ధ్రువీకరించారు. తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌తో ఉన్నానంటున్నారీ నీలాంబరి. ఆమె మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్‌శివ కథ వినిపించగానూ చాలా నచ్చేసిందన్నారు. తన పాత్ర గురించి ఏమిటన్నది చెబితే కథ ప్రధానాంశం తెలిసిపోతుంది. ఇప్పటికీ తానా విషయాన్ని చెప్పలేనన్నారు. అరుుతే ఇందులో సూర్యతో తనకు డెరైక్ట్ కనెక్షన్ మాత్రం ఉండదన్నారు.అలాగే తానాసేర్న్‌ద కూటం చిత్రంలోని ప్రధాన పాత్రల్లో తనది ఒకటన్నారు. ఈ చిత్రం కోసం రమ్యకృష్ణ 35 రోజులు కాల్షీట్స్ కేటారుుంచినట్లు సమాచారం. ప్రస్తుతం రమ్యకృష్ణ విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా శభాష్‌నాయుడు చిత్రంలోనూ, బాహుబలి-2 చిత్రంలోనూ నటిస్తున్నారు. పంచతంత్రం చిత్రం తరువాత కమలహాసన్‌తో నటిస్తున్న శభాష్‌నాయుడులో వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు.


