నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్‌.. సీక్వెల్‌కు ప్లానింగ్‌ | Rajinikanth Announces PADAYAPPA Movie Sequel | Sakshi
Sakshi News home page

నరసింహ మూవీలో రమ్యకృష్ణపై డౌట్‌.. సీక్వెల్‌ ఉంటుందన్న రజనీ

Dec 9 2025 10:41 AM | Updated on Dec 9 2025 11:08 AM

Rajinikanth Announces PADAYAPPA Movie Sequel

రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్‌ అయింది.

25 ఏళ్ల తర్వాత రిలీజ్‌
ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్‌ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 12న రీరిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్‌ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు. 

నరసింహ సీక్వెల్‌
జైలర్‌, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్‌ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్‌ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్‌ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనేదే నా ఉద్దేశం. 

ఐశ్వర్యరాయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌
ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్‌ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో మైసూర్‌ వేలాది మందితో సీన్‌ షూట్‌ చేశాం.

ఆమె కూడా..
జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్‌ చేసుకున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్‌ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్‌ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.

చదవండి: నన్నే టార్గెట్‌ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement