ముందస్తు హెచ్చరికలు లేకుండా వందలాది విమానాలు రద్దు, ప్రయాణీకులు ఆగ్రహాలు, కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్ననేపథ్యంలోఇండిగో ఎట్టకేలకు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని తాజాగా ప్రకటించింది.
ఇండిగో కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల నియామకాలు
సిబ్బంది నియామకాల్లో నెలల తరబడికొనసాగుతున్న స్తంభనను ముగించి ఇండిగో కొత్త FDTL నిబంధనలకు అనుగుణంగా నియంత్రణ సంస్థ డీజీసీఏ ద్వారా తాత్కాలిక మినహాయింపు పొందిన రోజే ఎయిర్‌బస్ A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లను (టైప్ రేటెడ్) నియమాకాలకు రంగంలోకి దిగింది.
ఈ పదవికి భారతీయులు డిసెంబర్ 6న, ఎయిర్‌లైన్ A320 కెప్టెన్లు, ఇతర సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జారీ చేసింది. భారతీయ పౌరులు లేదా 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, విదేశీ పౌరుడు కార్డ్ హోల్డర్లు కాకుండా ఉండాలి. దరఖాస్తుదారులు A320 కుటుంబంలో మొత్తం 3000 గంటలు ,PIC పోస్ట్ లైన్ రిలీజ్‌గా కనీసం 100 గంటలు ప్రయాణించాలి.
ఇదీ చదవండి: రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!
అలాగే 18-27 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా భారతీయ పౌరుల కోసం క్యాబిన్ అటెండెంట్ (గ్రేడ్ ట్రైనీ) నియామకాన్ని కూడా ఎయిర్‌లైన్ ప్రారంభించింది. అభ్యర్థి ఏదైనా ఇండిగో స్థావరంలో మకాం మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఇండిగో నెట్‌వర్క్ అంతటా తన కార్యకలాపాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకు రావడానికి దృఢంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని ఇండిగో ప్రకటించినప్పటికీ పైలట్ల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) నియామకాల నిలిపివేత కొనసాగుతోందని ఆరోపించింది. మరో పైలట్ సంస్థ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) కొత్త FDTL నిబంధనలను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కాగా కొత్త FDTL నియమాలు వన్-టైమ్ మినహాయింపు ఇండిగో కొన్ని కఠినమైన నిబంధనలను, ముఖ్యంగా నైట్ డ్యూటీకి సంబంధించిన నిబంధనలపై మినహాయింపునిచ్చింది.
ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తే


