breaking news
Indigo Crisis
-
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ : ఉన్నత స్థాయి విచారణ
ఇండిగో సంక్షోభం కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదనకమిటీ విచారణఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. -
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్‌కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా.. -
ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టీ20 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్పు చేసింది. లాజిస్టికల్ సమస్యల కారణంగా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి డిసెంబర్ 12 నుండి 18 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్లు ఫైనల్‌తో సహా 13 సూపర్ లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ లాజిస్టికల్ సమస్యల కారణంగా మ్యాచ్‌లను నిర్వహించలేమని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) బీసీసీఐకి తెలియజేసింది. డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో గ్లోబల్ డాక్టర్ల కాన్ఫరెన్స్ జరగడం వల్ల స్టార్ హోటల్స్ ఖాళీగా లేవు. దీంతో నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పుడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియం, డివై పాటిల్ అకాడమీ వేదికగా జరగనున్నాయి.బీసీసీఐకు సవాల్..మరోవైపు ఇండిగో సంక్షోభం బీసీసీఐని సైతం కలవరపెడుతోంది. డీజీసీఏ కొత్తగా అమలు చేసిన ఫైలట్ రోస్టరింగ్ నియమాల కారణంగా సుమారు 1,000 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో బీసీసీఐ కూడా తీవ్రమైన లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది.ప్రస్తుతం దక్షిణాఫ్రికా-భారత్ టీ20 సిరీస్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా జరుగుతోంది. నాలుగు గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ నుండి ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పూణేకు బీసీసీఐ విమానాల్లో తరలించాలి. వీటితో ఇతర దేశీయ టోర్నమెంట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి."ఇదే సంక్షోభం కొనసాగితే ఎనిమిది జట్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్‌ను నాకౌట్ మ్యాచ్‌ల కోసం పూణేకు విమానంలో తరలించడం సవాలుగా మారవచ్చు. అలాగే అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 T20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ టోర్నీల కోసం జట్లు, అంపైర్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాల్సి ఉందిష అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. -
ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.సిబ్బంది కొరతకొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్‌పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికుల కొరకు కంట్రోల్ రూమ్ నంబర్ 011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలురద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.ఏమి జరిగింది?గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది. -
విమానాల రద్దు.. ఇండిగో కీలక ప్రకటన
ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలు-రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.-క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.-ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.-అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.-వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది. -
ఇండిగోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గగనతల ప్రయాణాలపై గందరగోళం కొనసాగుతున్న వేళ.. ఇండిగోకు భారీ ఊరట దక్కింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి ఇచ్చే ఏవియేషన్ న్యూ రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడి ప్రయాణాలు సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(FDTL) పేరిట.. పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసింది డీజీసీఏ. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే పైలట్ల కొరతలో ఉన్న ఇండిగోకు ఇది మరింత చిక్కుల్ని తెచ్చి పెట్టింది. పైలట్ల కొరత కారణంగా గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో..డీజీసీఏ ఇండిగో నుంచి వివరణ కోరింది. అయితే పరిస్థితుల ప్రభావం, ఇండిగో నుంచి వివరణ.. రూల్స్ విషయంలో మినహాయింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.నాలుగు రోజుల్లో..నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనల్లో.. పైలట్లు రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని డీజీసీఏ ఆదేశించింది. రోజులో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. రాత్రి పూట ఫ్లైయింగ్, ల్యాండింగ్ విషయంలోనూ కఠిన నిబంధనలు తెచ్చింది. వీటితో పాటు ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కానీ, రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో ఎయిర్‌లైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకుంది.డీజీసీఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం విమాన పైలెట్లకు వారంలో కనీసం 48 గంటల విశ్రాంతినివ్వాలి. దీన్ని సెలవులకు ప్రత్యామ్నాయంగా వాడటం కుదరదు. అయితే ఇండిగో విమానాల మూకుమ్మడి కేన్సిలేషన్ నేపథ్యంలో డీజీసీఏ ఈ నిబంధనను సడలించింది. కాకపోతే నెల రోజుల్లో ఒక పైలెట్ గరిష్టంగా విమానం నడపగల గంటలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విమాన సిబ్బందిపై పని ఒత్తిడిని అంచనా వేసేందుకు విమానయాన సంస్థలు తగిన పద్ధతులను అభివృద్ధి చేయాలని కూడా డీజీసీఏ తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది.వరుస నైట్డ్యూటీలను తప్పించేలా రోస్టర్లను తయారు చేయాలని సూచించింది. పైలెట్ల విషయానికి వస్తే వీరి ఒత్తిడిని గుర్తించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు ఇండియో విమానాలు రద్దయ్యాయి. లేదంటే వాయిదా పడ్డాయి. చౌక విమానయాన సంస్థ కావడంతో సిబ్బందిని అతి తక్కువగా ఉంచుకుందీ సంస్థ. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్గుఆ తాము కొత్త నిబంధనలను రూపొందించినట్లు డీజీసీఏ చెబుతూండగా.. అకస్మాత్తుగా వీటిని అమలు చేయాల్సి రావడం సమస్యలకు దారితీసిందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.


