Live Updates
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరణ
సమగ్ర విచారణ జరగాలని డిమాండ్
- ఇండిగో విమానాల అంతరాయంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందించారు.
- లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడిన ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
సీఈఓ క్షమాపణలు.. పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరణ
- విమాన సర్వీసుల్లో అంతరాయాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వీడియో సందేశం ద్వారా క్షమాపణలు తెలిపారు.
- విమానాల రద్దు, జాప్యం కారణంగా కస్టమర్‌లకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
- ఇండిగో తన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించిందని స్పష్టం చేశారు.
- భవిష్యత్తులో ప్రయాణికుల్లో విశ్వసనీయతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
🚨IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo#IndiGoCrisis #IndiGoCEO #PieterElbers #FortuneIndia @IndiGo6E pic.twitter.com/g2zQiNMLHM
— Fortune India (@FortuneIndia) December 9, 2025
ఇండిగో తిరిగి స్థిరమైన కార్యకలాపాలు సాగిస్తోంది: సీఈఓ
- ఇటీవలి సంక్షోభం నేపథ్యంలో ఇండిగో తిరిగి స్థిరమైన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు.
- లక్షలాది మంది కస్టమర్లు తమ టిక్కెట్ ఛార్జీలు ఫుల్ రీఫండ్ పొందినట్లు చెప్పారు.
- ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.
అగర్తలాలో విమాన సర్వీసులు రద్దు
- ఇండిగో ఈ రోజు అగర్తలా నుంచి ఐదు విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.
- అక్కడ నుంచి రాకపోకలు సాగించే మరో ఆరు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని ఎంబీబీ విమానాశ్రయం డైరెక్టర్ కేఎం నెహ్రా తెలిపారు.
- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా ఎయిర్ అన్ని విమానాలను సకాలంలో నడుపుతున్నాయని ఆయన తెలిపారు.
ఇండిగోను అదుపు చేయలేని కేంద్ర మంత్రి
- ఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి.
- ఇంత గందరగోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేక పోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు.
- మరోవైపు మంత్రి అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో 152 విమానాలు రద్దు
- ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ఇప్పటివరకు మొత్తం 152 ఇండిగో విమానాలు క్యాన్సిల్
- వీటిలో ఢిల్లీకి రావాల్సినవి 76, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సినవి 76
రామ్మోహన్ నాయుడు వివరణ.. విపక్షాల నిరసన
- ఇండిగో ఉదంతంపై లోక్ సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ
- సమస్యను పరిష్కరిస్తున్నామన్న రామ్మోహన్ నాయుడు
- రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుండగా విపక్షాల నిరసన
రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే..
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల అవస్థలు
- అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాం.
- నిన్న సాయంత్రం 7 గంటల నుండి ఇక్కడ వేచి ఉన్నాం.
- మేం మొత్తం 28 మంది ఉన్నాం.
- కొందరు హోటల్ కు తిరిగి వెళ్లిపోయారు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం.
- మా విమాన రీషెడ్యూల్ కోసం వేచి ఉన్నాం
Delhi: On IndiGo flight delays and cancellations, One of the passenger says, " We are from Arunachal Pradesh. We have been waiting here since 7 PM yesterday. There were 28 of us in total, but some have returned to the hotel. We are still here, waiting to get our flight… pic.twitter.com/Xf7lr5f4vF
— IANS (@ians_india) December 9, 2025
ముంబై: 31 విమానాలు రద్దు
- ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 31 విమానాలను రద్దు చేసిన ఇండిగో.
- రద్దయిన వాటిలో ముంబై రావాల్సినవి 14, బయలు దేరాల్సిన విమానాలు 17
భారీగా పడిపోయిన ఇండిగో షేర్లు
- మంగళవారం 0.36 శాతం క్షీణించి రూ.4,906కు చేరుకున్న ఇండిగో షేర్లు
- ఇండిగో సంక్షోభం కారణంగా గత 8 రోజుల్లో 18 శాతం పడిపోయిన కంపెనీ స్టాక్
- సంక్షోభానికి ముందు, డిసెంబర్ 1న రూ .5794 గా ఉన్న ఇండిగో షేర్ విలువ

హైదరాబాద్‌లో 58 విమాన సర్వీసులు రద్దు
- హైదరాబాద్ విమానాశ్రయంలో మొత్తం 58 ఇండిగో విమానాలు క్యాన్సిల్
- వీటిలో 14 రావాల్సినవి, 44 బయలుదేరాల్సినవి
ఇండిగో విమాన సర్వీసులు 5 శాతం తగ్గింపు
- కార్యాచరణ వైఫల్యాలకు శిక్షగా ఇండిగో స్లాట్లలో ( విమాన సర్వీసులు ) 5% కోత
- స్లాట్లు ఇతర విమానయాన సంస్థలకు కేటాయింపు
- ఏ విమానాలను స్లాట్ల నుండి తీసివేయాలి అనే దానిపై ఇంకా చర్చ
- జరుగుతోందన్న డీజీసీఏ అధికారులు తెలిపారు.
- రోజుకు 2,200 విమానాలను నడుపుతున్న ఇండిగో
- 5 శాతం అంటే రోజుకు 110 విమానాలపై ప్రభావం
తిరువనంతపురంలో 4 విమానాలు రద్దు
- తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌లో రద్దయిన 4 ఇండిగో దేశీయ విమాన సర్వీసులు
- వీటిలో రావాల్సినవి - 1, బయలుదేరాల్సిన విమానాలు - 3
- నడుస్తున్నవి 5 విమానాలు
- వీటిలో రావాల్సినవి - 3, బయలుదేరాల్సిన విమానాలు - 2
చెన్నై: 41 విమానాలు క్యాన్సిల్
- చెన్నై ఎయిర్ పోర్ట్‌లో రద్దయిన 41 విమానాలలు
- వీటిలో రావాల్సినవి - 23, బయలుదేరాల్సిన విమానాలు - 18
Tamil Nadu | IndiGo Airlines' 18 departures and 23 arrivals have been cancelled at the Chennai Airport.
Source: Chennai Airport pic.twitter.com/Iq7hKwAjEZ— ANI (@ANI) December 9, 2025
బెంగళూరు: 121 విమానాల రద్దు
- బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో రద్దయిన 121 విమానాలలు
- వీటిలో రావాల్సినవి - 58, బయలుదేరాల్సిన విమానాలు - 63
నేడు ప్రయాణికులకు 3,000 బ్యాగులు
- ఇండిగో ఎయిర్ లైన్స్ వద్ద ప్రయాణీకులకు సంబంధించిన మొత్తం 9,000 బ్యాగులు
- అందులో 6,000 బ్యాగులు ఇప్పటికే ప్రయాణీకులకు అప్పగింత
- ఈ రోజు కల్లా ప్రయాణికులకు అందనున్న మిగిలిన 3,000 బ్యాగులు
- డిసెంబర్ 10 తర్వాత విమాన ప్రయాణం సాధారణ స్థితికి వస్తుందన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
ఇది 'అంతర్గత సంక్షోభం': రామ్మోహన్ నాయుడు
- ఇది 'అంతర్గత సంక్షోభం' అని పౌర విమానయాన మంత్రి పిలుపునిచ్చారు.
- ఈ మొత్తం ఇండిగో ఎపిసోడ్‌ను చూస్తే ఇది ఇండిగో అంతర్గత సంక్షోభం అని తెలుస్తుంది
- సిబ్బంది నిర్వహణ, పైలట్ వినియోగానికి సంబంధించిన సమస్
- ఈ నేపథ్యంలో డీజీసీఏ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. ఇది 15 రోజుల్లో అన్ని వివరాలను వెల్లడిస్తుదంది
- కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
7 లక్షల మందికి రూ.745.7 కోట్ల రిఫండ్
- డిసెంబర్ 2 నుంచి సోమవారం వరకు 7,30,655 మంది ప్రయాణికులకు రిఫండ్
- రూ.745.7 కోట్లు వాపసు చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
- డిసెంబర్ 15 వరకు ఇండిగో ఎయిర్ లైన్స్ లో టికెట్లను రీబుక్ చేసుకునే వారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇండిగోలో మెరుగైన పరిస్థితి
- స్టేటస్ అప్ డేట్ ను విడుదల చేసిన ఇండిగో
- సోమవారం 1800 పైగా నడిచిన విమానాలు
- తమ విమాన నెట్ వర్క్ ను పూర్తిగా పునరుద్ధరించినట్లు తెలిపిన ఇండిగో
- అయితే, దాదాపు 500 దేశీయ విమానాలు రద్దు
— IndiGo (@IndiGo6E) December 8, 2025


