Live Updates
ఇండిగో గందరగోళం.. అసలేం జరుగుతోంది?
ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
ఇండిగో సంక్షోభంపై వివరణ కోరిన డీజీసీఏ
ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడతో చెప్పాలన్న డీజీసీఏ
24 గంటల్లో సమాధానం ఇవ్వాలన్న డీజీసీఏ
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ
రద్దయిన బుకింగ్లకు రీఫండ్ చేస్తామని ప్రకటన
ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతుందని ప్రకటన
డిసెంబర్ 5 నుంచి 15 మధ్య ప్రయాణాలపై రద్దు, రీషెడ్యూల్‌కు పూర్తి డబ్బు చెల్లింపు
రాంచీ విమానాశ్రయంలో 14 విమానాలు రద్దు
రాంచీ విమానాశ్రయంలో 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఐదు విమానాలు ఆలస్యం అయ్యాయని విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
రాంచీ విమానాశ్రయంలో ఇండిగో మొత్తం 36 షెడ్యూల్ చేసిన విమానాల్లో 14 విమానాలు రద్దు అయ్యాయి.
సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఇండిగో విమానాల స్టేటస్‌ను ప్రయాణికులకు షేర్ చేస్తున్నట్లు వినోద్ చెప్పారు.
ఇండిగో, డీజీసీఏపై సీబీఐ విచారణకు డిమాండ్
కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అధ్యక్షుడు నితిన్ జాదవ్ ఇండిగో సర్వీసుల రద్దు అంశంపై దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంక్షోభానికి ఇండిగో యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు.
డీజీసీఏ ఇండిగోకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
డీజీసీఏ, ఇండిగోపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నెట్‌వర్క్ పునరుద్ధరణ: ఇండిగో
నిన్న 700 కంటే ఎక్కువ విమాన సర్వీసులను నడిపినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇది 113 గమ్యస్థానాలను కవర్ చేసినట్లు చెప్పారు.
ఈ రోజు అర్ధరాత్రి వరకు 1500కి పైగా విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
95% పైగా నెట్వర్క్ కనెక్టివిటీ ఇప్పటికే పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న 138 గమ్యస్థానాల్లో 135 గమ్యస్థానాలకు విమానాలను నడపగలుగుతున్నట్లు తెలిపారు.
ప్రయాణికులకు అంతరాయం కలిగినందుకు మరోసారి క్షమాపణలు తెలియజేశారు.
విమానాల రద్దు నేపథ్యంలో 84 ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సాయం చేయడానికి రైల్వే 104 ట్రిప్పులతో 84 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నా, హౌరా వంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ను అంచనా వేసింది.
రైల్వే ట్రాఫిక్‌ను అనుసరించి ప్రత్యేక రైళ్ల సంఖ్య, వాటి ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, సెంట్రల్ రైల్వే, ఉత్తర రైల్వే వరుసగా 14, 10 సర్వీసులను ప్లాన్ చేశాయి.
ప్రయాణికులకు పూర్తి రీఫండ్..
ఇండిగో విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికుల టిక్కెట్ల పూర్తి రుసుములను తిరిగి చెల్లిస్తామని ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో ప్రకటించింది.
డిసెంబర్ 3 నుంచి 8 వరకు ఇండిగో విమానాలను రద్దు చేసిన కస్టమర్లందరికీ ఈ వాపసు వర్తిస్తుందని తెలిపింది.
STORY | ixigo to refund entire convenience, assured fees for cancelled IndiGo flights from Dec 3-8
Travel aggregator ixigo on Saturday said it will refund the entire convenience and assured fees on tickets purchased on its platform to passengers affected by the ongoing IndiGo… pic.twitter.com/ZBYNf9X8sF— Press Trust of India (@PTI_News) December 6, 2025
శ్రమ దోపిడికి అలవాటు పడిన ఇండిగో: కేటీఆర్
ఇండిగోలో నెలకొన్న పరిస్థితులపై కేటీఆర్ స్పందించారు.
సివిల్ ఏవియేషన్‌లో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం నడుస్తుందన్నారు.
విమానయానం మెుత్తం ఇండిగో, ఎయిరిండియా సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు.
ఐదు రోజులుగా దేశంలోని ఎయిర్ పోర్టులు బస్టాండ్లను తలపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రమ దోపిడికి అలవాటు పడ్డ సంస్థ రూల్స్ అమలు చేయడానికి ఇష్టపడట్లేదన్నారు.
ఉద్యోగుల నియామకాలు షురూ..
కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని ఇండిగో ప్రకటించింది.
స్తబ్దుగా ఉన్న సిబ్బంది నియామకాలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పింది.
ఎయిర్‌బస్ A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల (టైప్ రేటెడ్) నియమాకాలకు రంగంలోకి దిగింది.
ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 6న రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జారీ చేసింది.
దరఖాస్తుదారులు A320 సరీస్‌లో మొత్తం 3000 గంటలు , PIC పోస్ట్ లైన్ రిలీజ్‌గా కనీసం 100 గంటలు ప్రయాణించాలి.
కోల్‌కతా విమానాశ్రయంలో 41 విమానాల రద్దు
కోల్‌కతాలోని ఎన్ఎస్‌సీ బోస్ విమానాశ్రయంలో ఇండిగో 41 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు.
వీటిలో 21 వివిధ గమ్యస్థానాల నుంచి ఇన్బౌండ్ సర్వీసులు, 20 షెడ్యూల్ డిపార్చర్ సర్వీసులున్నాయి.
ఎయిర్‌పోర్ట్‌లో గిటార్‌తో పాటలు
ముంబై నుంచి పట్నాకు వెళ్లాల్సిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జైన్ రజా అనే ప్రయాణికుడు విమానం ఆలస్యం కావడంతో తన గిటార్‌తో తోటివారిని అలరించారు.
ప్రముఖ పాట ‘వోహ్ లామ్హే’ను ఆకస్మికంగా ఎయిర్‌పోర్ట్‌లో ప్రదర్శించాడు.
దాంతో చుట్టూ ప్రయాణికుల గుమికూడి తమ ఫోన్లలో ఈ వీడియోను రికార్డ్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.
ధరల పెంపుపై ఎయిరిండియా చర్యలు
ఆటోమేటెడ్ రెవెన్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ద్వారా నమోదైన ఆకస్మిక ధరల పెరుగుదల నుంచి ప్రయాణికులను రక్షించేలా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.
డిసెంబర్ 4 నుంచి అన్ని నాన్-స్టాప్ దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ ఛార్జీలను ముందస్తుగా పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది.
థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల్లో కనిపించే కొన్ని ఖరీదైన మల్టీ-స్టాప్ లేదా మిక్స్‌డ్-క్లాస్ ఛార్జీలను పూర్తిగా నియంత్రించలేమని తెలిపింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్లాట్‌పామ్‌లతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది.
సీఈవోపై వేటుకు కేంద్రం ఆదేశాలు?
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌పై వేటుకు కేంద్రం ఆదేశాలు?
ఇండిగోకు భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం
పౌర విమానయాన శాఖతో ఇండిగో అధికారుల అత్యవసర సమావేశం
సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం
ఇండిగోకు భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం
కొత్త ఎఫ్‌డీటీఎల్ నిలిపివేత తాత్కాలికమే..
కొత్త ఎఫ్‌డీటీఎల్ పూర్తిగా నిలిపివేయలేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఇటీవల సర్వీసుల్లో అంతరాయం కారణంగా షెడ్యూల్‌ను పునరుద్ధరించేందుకు ఇండిగో ఏ320 విమానాలకు మాత్రమే సడలింపులు ఇచ్చినట్లు చెప్పారు.
మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పూర్తిగా ఎఫ్‌డీటీఎల్ రూల్స్‌ను విరమించుకుంటుందనే ఆరోపణలొస్తున్నాయి.
దాంతో గందరగోళం నెలకొనడంతో ఈమేరకు అధికారి వివరణ ఇచ్చారు.
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 35 విమానాలు రద్దు
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 35 ఇండిగో విమానాలను రద్దు చేశారు.
వడోదర విమానాశ్రయంలో మూడు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
రాజ్‌కోట్ విమానాశ్రయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ముంబైకి వెళ్లే ఒక ఇండిగో విమానం మాత్రమే రద్దు అయింది.
ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ఏడు సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్లు తెలుస్తుంది.
నిన్నటితో పోలిస్తే సర్వీసుల్లో అంతరాయం తక్కువే: ఇండిగో
నిన్నటితో పోలిస్తే విమానాల రద్దు లేదా ఆలస్యం తగ్గిందని ఇండిగో తెలిపింది.
ఈమేరకు ప్రెస్‌నోట్ విడుదల చూస్తూ 850 కంటే తక్కువ విమాన సర్వీసుల్లో అంతరాయం ఉందని చెప్పింది.
ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ లింక్‌కు అందించింది.
దాంతోపాటు టిక్కెట్ ధరల రీఫండ్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలుగా లింక్ వివరాలు ఇచ్చింది.

విమాన ఛార్జీలపై పరిమితులు విధించిన కేంద్రం
విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఛార్జీల పరిమితులను విధించింది.
పన్నులు మినహాయించి దూరాన్ని బట్టి కొత్త గరిష్ట ఛార్జీలు ఎంత ఉండాలో తెలిపింది.
రూ .7,500 నుంచి గరిష్టంగా రూ .18,000 వరకు ఛార్జీలు ఉండాలని చెప్పింది.
ఈ తాత్కాలిక ఆంక్షలు పరిస్థితి సద్దుమణిగే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
విమానాల ఆలస్యం.. పెరిగిన ట్యాక్సీ ధరలు
విమానాల ఆలస్యం వల్ల డిమాండ్ పెరగడంతో ట్యాక్సీ ధరలు మూడు రెట్లు పెరిగాయి.
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ట్యాక్సీ ధరలు పెంచారు.
విమానాల రద్దు వల్ల టాక్సీ బుకింగ్‌లు పెరిగాయి.
ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల కోసం రోజుకు దాదాపు ఒక్కో డ్రైవర్‌కు 50 బుకింగ్‌లు వస్తున్నాయని టాక్సీ యూనియన్లు తెలిపాయి.
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల ఇక్కట్లు
ఇండిగో విమానాలు రద్దు కావడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఇండిగో యాజమాన్యం
ఇండిగో సంస్థ సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం
కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు విఫలం
రేపు రాత్రి 8 గంటలలోపు టిక్కెట్ ఛార్జీలు రీఫండ్
పెండింగ్‌లో ఉన్న ప్రయాణీకుల టిక్కెట్ ఛార్జీలను రేపు రాత్రి 8 గంటలలోపు తిరిగి చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఇండిగోకు ఆదేశాలు.
ప్రయాణీకుల లగేజీని కూడా 48 గంటల్లోపు తిరిగి ఇవ్వాలి.
నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఇతర సంస్థలకు ప్రభుత్వం సూచన.
ఈ సూచనలను పాటించకపోతే తక్షణ చర్యలు తీసుకుంటారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
శంషాబాద్‌లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్ బస్సులు.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరనున్నాయి.
రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
విమానాల రద్దుతో భారత రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
సికింద్రాబాద్-చెన్నై,చర్లపల్లి- కోల్‌కత్తా, హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
37 రైళ్లకు 116 కోచ్‌లు జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇప్పటికే అదనపు బోగీలతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి.
ఇండిగో సంక్షోభం.. రంగంలోకి మోదీ
ఇండిగో సంక్షోభం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మోదీ తీవ్ర అసంతృప్తి
స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ
విమానాయన శాఖ అధికారులతో నేరుగా ప్రధాని సమీక్ష
ఇండిగో సంక్షోభంపై ప్రధానికి అధికారుల బ్రీఫింగ్
సమీక్షకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని పిలవని పీఎంవో?


