ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.
ప్రయాణికులకు ఇండిగో సూచనలు
-రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.
-క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.
-ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.
-అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.
ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.


