మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన | Amit Shah key statement on Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన

Mar 6 2026 3:37 PM | Updated on Mar 6 2026 3:57 PM

Amit Shah key statement on Maoists

మావోయిస్టులపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ కగార్‌ పేరుతో నక్సలైట్లపై పెద్దఎత్తున కేంద్ర బలగాలు విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. శరణమా.. రణమా అంటూ వారిపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 31 (మార్చి) వరకూ భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా లేకుండా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన చాలా మంది అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతమంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు. దీంతో దేశంలో ఆ పార్టీ దాదాపు కనుమరుగైనట్లేనని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి అమిత్‌షా ఈ అంశంపై స్పందించారు.

ఒడిశాలోని CISF కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ" మార్చి 31 వరకూ దేశంలో ఎట్టిపరిస్థితుల్లో మావోయిజాన్ని అంతం చేస్తాం" అని అన్నారు. అయితే గతంలోనే ఇవే వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా తాజాగా దానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే ఇప్పటికే  నక్సల్స్‌పై కేంద్ర బలగాలు దాడులు తీవ్రతరం చేశాయి. ఆపరేషన్ కగార్‌ పేరుతో కాల్పులు జరుపుతున్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement