Maoist
-
అణచివేతే పరిష్కారమా?!
చాన్నాళ్లుగా ఘర్షణాత్మక ప్రాంతంగా ముద్రపడిన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులకూ, భద్రతా బలగాలకూ మధ్య గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులూ, ఒక డీఆర్జీ జవాను మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 113మంది నక్సలైట్లు మరణించారు. నిరుడు ఇదేకాలంలో 29 మంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం ప్రభుత్వ దృఢ సంక ల్పాన్ని తెలియజెబుతుంది. మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెడతామని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇంతవరకూ 104 మందిని అరెస్టు చేశామని,164 మంది లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.ముఖ్యంగా 3,900 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అటవీప్రాంతంలోకి మావోయిస్టులు మినహా అన్యులు ప్రవేశించటం అసంభవమన్న అభిప్రాయంవుండేది. అక్కడే మావోయిస్టు శిక్షణ శిబిరాలు, భారీ ఆయుధ డంప్‌లు, ఆహారపదార్థాల గోడౌన్ లుండేవి. పల్లెసీమల్లో వారికి గట్టి పట్టుండేది. ఇప్పుడక్కడ దాదాపు 300 వరకూ కేంద్ర బలగాల స్థావరాలున్నాయి. ఇవిగాక సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల శిబిరాలున్నాయి. బస్తర్ అడవుల్లోఅత్యంత మారుమూల ప్రాంతం కావటంవల్ల, చుట్టూ వున్న ఎత్తయిన కొండలు, వాటిపై దట్టంగా విస్తరించిన వృక్షాలుండటంవల్ల మావోయిస్టులకు అది రక్షణ కవచంగా ఉండేది. దాన్ని ‘విముక్త ప్రాంతం’గా పరిగణించేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంవల్లే వారి అణచివేత వేగం పుంజుకుందన్న అభిప్రాయం పాక్షిక సత్యం మాత్రమే. యూపీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులను ‘జాతీయ భద్రతకు పెనుముప్పు’గా ప్రకటించారు. తదనుగుణంగా అనేక చర్యలు మొదలయ్యాయి. అప్పటి హోంమంత్రి చిదంబరం ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అదిప్పుడు ‘ఆపరేషన్ కగార్’ అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు క్రమేపీ పైచేయి సాధించాయి. కేంద్రంలో ఎవరున్నా నక్సల్స్ అణచివేతలో ఛత్తీస్‌గఢ్‌కు పూర్తి సహకారం అందింది.రాజ్యానికుండే ఆయుధ సంపత్తి, దాని సుశిక్షిత భద్రతా బలగాల ముందు ఎవరూ సరి పోరన్నది వాస్తవం. ఆ అంబులపొదిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత చేరింది. అందువల్లే కావొచ్చు... దట్టమైన అరణ్యాల్లో సైతం మావోయిస్టు దళాల కదలికలను వెంటనే నిఘా వర్గాలు గుర్తించగలుగుతున్నాయి. అబూజ్‌మÉŠ అరణ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయగలిగేలా నిఘా డ్రోన్లు సంచరిస్తున్నాయి. ఇప్పటికేవున్న భద్రతా బలగాలకు అదనంగా గత నెలలో మరో 2,500 మంది జవాన్లను తరలించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పేరిట ఏర్పాటు చేసిన బలగాలు కేంద్ర దళాల చేతుల్లో తిరుగు లేని ఆయుధం. ఎందుకంటే డీఆర్జీలో దాదాపు అందరూ ఆదివాసీ తెగలవారు. మావోయిస్టుల్లో పనిచేసినవారు. వీరికి ఆ ప్రాంతం కొట్టిన పిండి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని దుర్గ మారణ్యాల్లో వీరు సునాయాసంగా చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసి వెలుపలికొచ్చినవారినీ, ఇతరులనూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘సల్వాజుడుం’ పేరిట సమీకరించి ఆయు ధాలిచ్చి, వారిద్వారా మావోయిస్టుల్ని అణచడానికి ప్రయత్నించింది. ఇలా ప్రైవేటు సైన్యాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దురదృష్టమేమంటే భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగే పోరుతో సంబంధంలేని సాధారణ ఆదివాసీ ప్రజానీకం సైతం భయంతో బతకాల్సి వస్తున్నది. ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో, ఏజెన్సీప్రాంతాల్లో నక్సల్స్‌కు సహకరిస్తున్నారన్న అనుమానంతో సాధారణ పౌరులను పోలీసులు వేధించే వారన్న అభిప్రాయం వుండేది. అలాగే నక్సల్స్ సైతం ఇన్ఫార్మర్ల పేరిట అనేకుల్ని హతమార్చిన ఉదంతాలు ఉండేవి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో పదులకొద్దీమంది మరణిస్తున్నారు. కానీ వారంతా మావోయిస్టులేనా? ఆ ఉదంతాలు జరిగాక హక్కుల సంఘాలు చేసే ప్రకటనలు తప్ప అక్కడికి మీడియా వెళ్లి జరిగిందేమిటో చెప్పే పరిస్థితులు లేవు. అటు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్ల పేరిట కొందరిని హతమారుస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి.వచ్చే ఏడాదికల్లా మావోయిస్టుల్ని అంతం చేస్తామన్న అమిత్ షా ప్రకటనలు నెరవేరే అవకాశం ఉండొచ్చని వరస ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లోని 126 జిల్లాలు నక్సల్స్ ప్రభావంలోవుంటే నిరుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. రహదారుల నిర్మాణం కూడా జోరందుకుంది. కానీ ఇవి మాత్రమే తిరుగుబాటునూ, అసంతృప్తినీ అంతర్థానం చేస్తాయని భావించటం పొరపాటు. ఆదివాసీ సంస్కృతినీ, అక్కడి సహజవనరులనూ పరిరక్షించటానికి చర్యలు తీసు కుంటేనే... ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించి, రాజ్యాంగం పూచీపడిన హక్కులు సక్రమంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇందిరాగాంధీ హయాంలో బీడీ శర్మ వంటి అంకిత భావంతో పనిచేసిన ఐఏఎస్ అధికారులు బస్తర్ ప్రాంత అభివృద్ధికీ, ఆదివాసీల సంక్షేమానికీ ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. -
ఒకే రోజు రెండు ఎన్ కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!
-
అవును.. వాళ్లు యువతులను మావోల్లో చేర్పిస్తున్నారు
సాక్షి, అమరావతి: యువతులకు బ్రెయిన్‌వాష్ చేసి వారిని నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్న వ్యవహారంలో నిందితులుగా ఉన్న డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన కేసులో బెయిల్ కోసం వారు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కింది కోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు యువతులకు బ్రెయిన్‌వాష్ చేసి మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.నా కుమార్తెను బలవంతంగా చేర్చారు..డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప మరికొందరు కలిసి మావోయిస్టు పార్టీలోకి యువతులను చేర్పించేందుకు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పేరుతో ఓ సంఘం ఏర్పాటుచేశారు. సామాజిక సేవ నెపంతో యువతులను చేరదీసి, వారు మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి, ఆ తరువాత మావోయిస్టుల్లో చేర్పిస్తున్నారు. ఇదే రీతిలో విశాఖపట్నం, పెద్దబయలుకు చెందిన రాధా అనే యువతిని 2017లో మావోయిస్టుల్లో చేర్పించారు.2021లో రాధా తల్లి తన కుమార్తెను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలంటూ డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ 2024 మే 29న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ వారిరువురూ హైకోర్టులో క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 2017లో రాధాను తీసుకెళ్లారంటూ ఆమె తల్లి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కానీ, అప్పటికే ఆమె నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్నారన్నారు. ఎన్ఐఏ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఎన్ఐఏ సేకరించిన ఆధారాలను, అది దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించింది. పిటిషనర్లకు బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. -
11 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యుల లొంగుబాటు
అల్లూరి సీతారామరాజు జిల్లా: 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ అమిత్ బర్ధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీకే వీధి మండలం గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిపై ఒక్కొకరిపై సుమారు ఆరేడు కేసులు ఉన్నాయని తెలిపారు.2021లో అనేక నేరాల్లో వీరంతా పాల్గొన్నారు. లొంగిపోయిన వారిపై ఏ కేసులు లేకుండా వదిలిపెడుతున్నామని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. మావోయిస్టులు గిరిజనుల కోసం ఏనాడు పని చేయలేదని.. మావోయిస్టుల వలన గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని ఎస్పీ అన్నారు. -
బీజాపూర్: 17 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. గంగుళూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున లొంగిపోయారు. లొంగిపోయిన 17 మంది మావోయిస్టుల్లో 9 మందిపై 24 లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. గంగుళూరు ఏరియా కమిటీ డీవీసీఎం దినేష్ మొడియం దంపతులు లొంగిపోయారు.2025లో ఇప్పటి వరకూ 65 మంది మావోయిస్టులు లొంగిపోయారని..137 మందిని అరెస్టు చేశాం. 56 మంది వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి రూ. 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
టార్గెట్ మావోయిస్టు రాష్ట్ర కమిటీ
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని కూడా తుడిచిపెట్టేందుకు కేంద్ర సాయుధ బలగాలతోపాటు గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బహుముఖ వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం 100 లోపే ఉంటుందని తెలిసింది. ఇందులోనూ ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా స్థానికులు కావడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సైతం ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి పరిమితమైంది. దీంతో భద్రత బలగాలు వారి కోసం మాటువేసి ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు వైపు ఏ చిన్న కదలిక ఉన్నా...భారీదెబ్బ తీసేందుకు సిద్ధమయ్యాయి. అయితే తెలంగాణకమిటీలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్ స్థానికులు కావడంతో అక్కడి అటవీ ప్రాంతాలపై పూర్తి పట్టు ఉండడంతో చాలా సందర్భాల్లో తెలంగాణ కమిటీ చిక్కినట్టే చిక్కి మిస్సవుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. » తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవుల్లో ఈ ఏడాది జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. » ఈనెల 9న ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భారీ ఎన్కౌంటర్ సైతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగానే జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ భారీ ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందగా ఇందులో తెలంగాణ కమిటీకి చెందినవారు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. 60 మందికిపైగా వారే... మావోయిస్టు కీలక నేతల్లో తెలంగాణవారు ఉన్నా, రాష్ట్ర కమిటీలో మాత్రం ఛత్తీస్‌గఢ్ వారే అధికంగా ఉన్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర కమిటీలో మొత్తం 90 నుంచి 100 మంది ఉండగా..ఇందులో 60 మందికిపైగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అని తెలిసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కేవలం 25 మంది లోపే ఉంటారని సమాచారం. ఇందులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, బస్తర్ ప్రాంతాల వారే ఎక్కువమంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు (బీకే–ఏఎస్ఆర్)డివిజన్ కమిటీ బలంగా ఉంది. రాష్ట్ర కమిటీలోని దాదాపు సగం మంది వరకు సభ్యులు ఇందులోనే ఉన్నట్టు తెలిసింది. అయితే, గతానికి భిన్నంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బక్కచిక్కి పోవడానికి ప్రధాన కారణం..కొంతకాలంగా మావోయిస్టు రిక్రూట్మెంట్ దాదాపుగా లేకపోవడమే. తెలంగాణ నుంచి మావోయిస్టుల్లోకి చేరేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సరిహద్దుల్లో రెఢీ మావోయిస్టుల ఏరివేతలో దేశంలో అత్యుత్తమ దళంగా పేరుపొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది, తెలంగాణ పోలీస్ ప్రత్యేక బలగాల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ మావోయిస్టుల ఏరివేతలో గ్రేహౌండ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల అంతానికి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. -
‘కొడుకా శ్రీనివాసు.. కొరివి పెట్టేందుకైనా రాబిడ్డా..’
ఖానాపూర్(నిర్మల్): ‘కొడుకా శ్రీనివాసు.. 14 ఏండ్ల వయసులో బడికి పోతానని వెళ్లి 50 ఏండ్లు గడిసినయ్. నీకు తల్లి గుర్తుకు రావడం లేదా.. చావుకు దగ్గరైన. కొరివి పెట్టేందుకై నా రాబిడ్డా’ అని అజ్ఞాతంలో ఉన్న మవోయిస్తు తూము శ్రీనివాస్ తల్లి లచ్చవ్వ ప్రాధేయపడింది. మండలంలోని బావాపూర్(ఆర్) గ్రామంలోని లచ్చవ్వ కుమారుడు 50 ఏళ్ల క్రితం 14 ఏళ్ల వయస్సులో బోధన్‌లోని ప్రైవేట్ స్కూల్‌కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాకుండా మావోయిస్టుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు అతని తల్లిని ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం కలిసింది. వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ సాక్షిగా లచ్చవ్వ కుమరుడిని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా.. ఊరు మిన్నా.. మన ఊరికి తరలి రండి.. కార్యక్రమంలో భాగంగా జన జీవనంలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లచ్చవ్వకు దుస్తులతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సైదారావు, పెంబి ఎస్సై హనుమాండ్లు పాల్గొన్నారు. -
కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు
బెంగళూరు:కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటన నిజమైంది. రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తున్న తొంబట్టు లక్ష్మీ ఆదివారం(ఫిబ్రవరి2) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండర్ అయ్యారు.తనకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనల్లో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి.చాలా ఏళ్లుగా ఆమె ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం.ఇటీవల లక్ష్మీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.సరెండర్ కమిటీ సభ్యుడు,గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చారు.కాగా, కర్ణాటకను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మావోయిస్టుల సరెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే మావోయిస్టులకు మార్గం సుగమం అయింది. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. -
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్రామ్ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్ఫార్మర్ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్రామ్ మాడవిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్
చత్తీస్‌గఢ్: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. గంగలూర్ పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, గత నెల ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. -
చేజారుతున్న కర్రిగుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జాయింట్ టాస్క్ ఫోర్స్ ..కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్పీఎఫ్ (CRPF) జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్ సాయంతో కాపాడారు.కర్రిగుట్టల్లో భద్రతా దళాలు కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పూజారి కాంకేర్ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.మావోయిస్టుల అడ్డా బస్తర్ దేశంలోనే మావోయిస్టులకు బస్తర్ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్ జోనల్, దక్షిణ బస్తర్ జోన్ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్ తీసుకుంటాయి. ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 15 మంది చనిపోయారు.రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.చదవండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచలన నిర్ణయం గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. -
నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే
జవహర్‌నగర్/దుమ్ముగూడెం/చర్ల/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో చంద్రహాస్ కూడా ఉన్నారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్‌కు చెందిన అలువాల లచ్చువమ్మ–నర్సింహ దంపతుల కుమారుడే చంద్రహాస్ అలియాస్ పాండు. 1967లో యాప్రాల్‌లో జన్మించిన చంద్రహాస్ విద్యాభ్యాసం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. 1981లో టెన్త్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడే నక్సల్బరీ ఉద్యమం జోరందుకుంది. 1984–85లో ఆర్‌వైఎల్ కార్యదర్శి ప్రభు నాయకత్వంలో జరిగిన రాజకీయ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఇలా ఆ సమావేశాలకు వెళ్లి ఆకర్శితుడై అడవిబాట పట్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రహాస్ ఇంటికి కూడా రాలేదు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి ఛత్తీస్‌గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. పార్టీలోనూ కీలకంగా వ్యవహరించాడు. అబూజ్‌మడ్‌లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఆ ప్రాంతంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. ఎన్కౌంటర్లో చంద్రహాస్ చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చంద్రహాస్ కుటుంబ సభ్యులను మావోయిస్టు పార్టీ మాజీ నేతలు, సానుభూతిపరులు, బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, ఉపాధ్యక్షురాలు సత్య, కార్యవర్గ సభ్యురాలు ఉష, జననాట్య మండలి మాజీ సభ్యుడు రాజనర్సింహ తదితరులు పరమార్శించారు. చంద్రహాస్ మృతదేహాన్ని చూసి పాతకాలం మిత్రులు గుర్తు పట్టారని పద్మకుమారి చెప్పారు. మావోల డంప్ స్వాదీనం.. భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధి మెటగూడెం–దులేర్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, ఆయుధ తయారీ సామగ్రి గురువారం బయటపడ్డాయి. మెటగూడెం గ్రామానికి 1.5 కి.మీ. దూరంలో ఒక గుహలో దాచిన ఈ డంప్‌లో 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ఐఈడీలు), మల్టిపుల్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్లు (బీజీఎల్), బాంబులు, ఒక జనరేటర్, ఇతర సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. బలగాలకు తప్పిన పెనుప్రమాదం బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు బాసగూడ–ఆవుపల్లి మార్గంలో తిమ్మాపూర్ సమీపంలోని దుర్గామాత ఆలయం వద్ద వంతెన కింద మందుపాతరను గురువారం గుర్తించారు. అయితే, దీనిని తీయాలని భావించినా చాలా లోతులో, భారీ సైజులో ఉండడంతో అక్కడే నిర్వీర్యం చేశారు. 50 కిలోల బరువైన ఈ మందుపాతరను నిర్వీర్యం చేయడంతో బలగాలకు పెనుప్రమాదం తప్పినట్టయ్యింది. గణతంత్ర వేడుకలకు గట్టి భద్రత సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ వైపు తరలిరాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. -
‘అన్న’లు నిర్మించిన పాఠశాల
సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.గ్రామస్తుల విజ్ఞప్తితో.. 1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్‌వార్ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్‌లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు. కూల్చివేతను అడ్డుకున్న స్థానికులునక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్‌కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.కూల్చవద్దు అంటున్న స్థానికులుపాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయుడు -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన కోబ్రాలు
-
అక్కడ ఎన్కౌంటర్.. ఇక్కడ కలకలం
ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఆరు రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా.. మృతుల్లో కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగానది పేరిట వెలువడిన ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై దామోదర్ కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోగా, మూడు రోజుల ఆందోళన తర్వాత దామోదర్ క్షేమంగానే ఉన్నాడన్న వార్త కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ఊరట కలిగించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు నౌపాడ, గరియాబాద్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 20 మంది వరకు మృతి చెందినట్టు పోలీసులు మంగళవారం ప్రకటించారు. వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన మోడెం బాలకృష్ణ, ఎం.సాంబయ్యలు కూడా మృతుల్లో ఉన్నట్టు మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఆ ఇద్దరి కుటుంబసభ్యులు, బంధువులు ఫోన్ల ద్వారా పలువురిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదించి చివరకు లేరని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు.. అబూజ్మడ్ దండకారణ్యం.. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెల్లో కలకలం రేపుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ దండకారణ్య కమిటీల్లో ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన వారే కీలకంగా వ్యవహరిస్తుండగా, ప్రతీ ఎదురుకాల్పుల సంఘటనలో ఒక్కరిద్దరు ఉంటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఎదురుకాల్పుల సంఘటనలు మావోయిస్టుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబాలను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కౌన్సెలింగ్ చేస్తుండగా, మావోయిస్టులు మాత్రం పోరుబాటలోనే సాగుతున్నారు. మోస్ట్ వాంటెడ్ల్లో వరంగల్ వారే 23 మంది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర 11 రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతల వివరాలపై కేంద్ర హోంశాఖ గతేడాది మార్చిలో ఆరా తీసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాల నుంచి 64 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలలో పనిచేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 23 మంది అజ్ఞాతంలో ఉన్నట్టు ప్రకటించింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల నేతల వివరాలను జిల్లాలు, పోలీస్స్టేషన్ల వారీగా ఇటీవల ఎన్ఐఏ కూడా ఆరా తీసింది. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి అజ్ఞాతంలో ఉన్న నేతల వివరాలను మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చారు. ఇందులో కేంద్ర కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దండకారణ్యం కమిటీల్లో కీలకంగా ఉన్న మోడం బాలకృష్ణ అలియాస్ మహేశ్, బాబన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, గాదె రాజు, సుంకరి రాజ్, గీరెడ్డి పవనానందరెడ్డి అలియాస్ అర్జున్, ఉల్లెంగుల యాకయ్య అలియాస్ అంజన్న, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, అంకేశ్వరపు సారయ్య అలియాస్ ఎల్లన్నలతోపాటు మొత్తం 23 మంది పేర్లను వెల్లడించారు. కేంద్ర కమిటీల్లో కీలకంగా తెలంగాణ నేతలు సీపీఐ (మావోయిస్టు) పారీ్టలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ బాధ్యతల్లో తెలంగాణకు చెందిన పలువురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) విలీనం సమయంలో 32 మందితో ఉన్న కేంద్ర కమిటీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల 24 మందికి చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సెంట్రల్ రీజినల్ బ్యూరోగా ఉన్న కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణం తర్వాత కమిటీ పునరుద్ధరణ జరిగినట్టు చెబుతున్నారు. కాగా, ఈ 24 మందిలో తొమ్మిది మంది జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారు కాగా, 15 మందిలో 12 మంది తెలంగాణ వారే. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు నియామకం తర్వాత, అప్పటివరకు కేంద్రకమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి.. ప్రస్తుతం సీసీ మెంబర్‌గా, అంతర్జాతీయ విప్లవపార్టీల సమాఖ్యకు ఇన్చార్జ్గా ఉన్నట్టు సమాచారం. -
భారీ ఎన్ కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
-
'దండకారణ్యం' నెత్తురోడింది
చర్ల/ మల్కన్‌గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్.. దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్‌గా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్‌గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్‌లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్కౌంటర్లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్! కులారీఘాట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు. -
బడే దామోదర్‌కు ఏమైంది?
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు. దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు. -
పానమంతా నీ మీదనే ఉన్నది.. ఓసారి కనపడు బిడ్డా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలు.. అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మావోయిస్టుల జాడ నేటికీ తెలియలేదు. ఉడుకురక్తం.. విప్లవ భావాలతో 80, 90వ దశకంలో అడవిబాట పట్టిన ఆనాటి పట్టభద్రులు దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి దశ, దిశలా మారారు. కేంద్ర కమిటీ సభ్యులుగా.. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీల్లో నూ కీలకంగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల వేట తీవ్రం కావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా దండకారణ్యాల్లోకి వలస వెళ్లారు. అక్కడ నుంచే ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే కరోనా అనంతరం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు కీలక నేతలు అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం కారణంగా అడవిలోనే తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఎదురుకాల్పుల్లో మరణిస్తున్నారు. దీంతో మిగిలిన వారు ఎలా ఉన్నారో? అనే ఆందోళన ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ మరణించారన్న వార్తల నేపథ్యంలో కీలక నేతలందరి బంధువులు వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నా రు. తాము చనిపోయేలోగా వారిని ఒక్కసారైనా కళ్లారా చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే అధికంఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పోతుల కల్పన అలియాస్ సుజాత (65) అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. ఆమె మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ రాంజీ భార్య. పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్‌రావు, మల్లా రాజిరెడ్డి, పూల్లూరి ప్రసాదరావు, జగిత్యాలకు చెందిన తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణరెడ్డి (సిరిసిల్ల) వంటి నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గాజర్ల రవి (జయశంకర్ భూపాలపల్లి), మోడెం బాలకృష్ణ (హనుమకొండ) సెంట్రల్ కమిటీ మెంబర్, కందగట్ల యాదగిరి (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్, ముప్పిడి సాంబయ్య (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు.భర్త జాడ చెప్పండినా భర్త బెజ్జారపు కిషన్ 38 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన ఆచూకీ దొరకలేదు. దీనిపై ఎన్నోసార్లు మావోయిస్టు వర్గాలకు, పోలీసులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా నా భర్త ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో చెప్పాలి. ఆయన కోసమే ఇంకా బతికున్నా. – బెజ్జారపు పుష్పబడే దామోదర్‌కు ఏమైంది?» సంఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేత గాయపడినట్టుగాసమాచారం» చనిపోయాడని అధికారికంగానిర్ధారించని పోలీస్ యంత్రాంగం» ఫేక్ లేఖ అంటున్న దామోదర్ అనుచర వర్గాలుములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు. దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు. -
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
-
మాజీలు X మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బస్తర్ అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్–కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరి ఫైటర్స్ తదితర సాయుధ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేస్తూ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అయితే భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపే దాడుల్లో ఎక్కువగా స్థానికులతో కూడిన డీఆర్జీ యూనిట్ జవాన్లే హతమవుతున్నారు. తాజా ఘటనలో బస్తర్ ఫైటర్స్ కూడా ఉన్నారు. బలగాలకు భారీ నష్టం దేశంలోని విప్లవ శక్తులన్నీ కలిసి 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు రెడ్ కారిడార్ లక్ష్యంగా ముందుకు కదిలాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం 2005లో స్థానిక యువతతో సల్వాజుడుం (శాంతి దళం) పేరుతో సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. 2007లో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 55 మంది పోలీసులు చనిపోయారు. ఇందులో 31 మంది సల్వాజుడుం వారే ఉన్నారు. 2008లో ఒడిశా బలిమెల వద్ద జరిగిన దాడిలో 37 మంది గ్రేహౌండ్స్ పోలీసులు హతమయ్యారు. 2007 ఏప్రిల్ 25న చింతల్నార్ దగ్గర బాంబుదాడితో పాటు అంబూష్ ఎటాక్ జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సల్వాజుడుం, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ ఇలా ఏ రూపంలో బలగాలు దండకారణ్యంలోకి వెళ్లినా చేదు ఫలితాలే వచ్చాయి. దీంతో జనంలో జనంలా కలిసిపోయి గెరిల్లా యుద్ధతంత్రంతో మావోలు జరిపే దాడులను సమర్థంగా ఎదుర్కోవడం ప్రభుత్వ భద్రతా దళాలకు తప్పనిసరిగా మారింది. మాజీలతో డీఆర్జీ.. గతంలో సల్వాజుడుంలో పనిచేసిన వారికి జంగిల్ వార్ఫేర్లో శిక్షణ ఇచ్చి డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) పేరుతో 2008లో కాంకేర్ తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో మావోయిజం వైపు ఆకర్షితులై జనమిలీషియా నుంచి దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసి లొంగిపోయిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే సంస్థగా డీఆర్జీ రూపాంతరం చెందింది. జిల్లాకు ఒకటి వంతున 2015 నాటికి బస్తర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతెవాడ, కొండెగావ్, బీజాపూర్, సుక్మా మొత్తం ఏడు డీఆర్జీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ప్రతీ యూనిట్లో 500 మంది జవాన్లు పని చేస్తున్నారు. ముందుండేది వీరే.. గతంలో అడవుల్లో నక్సల్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం, స్థానిక అడవులపై అవగాహన, వాగులు దాటడం, గుట్టలు ఎక్కడంలో నేర్పరితనం, అడవుల్లో దొరికే ఆకులు, దుంపలు, కాయల్లో ఆహార పదార్థాలను గుర్తించడం తదితర విషయాల్లో డీఆర్జీ జవాన్లు ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో అడవుల్లో చేపట్టే గాలింపు చర్యల్లో డీఆర్జీ యూనిట్లు కీలకంగా మారాయి. అంతేకాదు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లేక విద్యావకాశాలకు దూరంగా ఉన్న స్థానిక యువతకు వెంటనే లభించే ఉపాధి మార్గంగా డీఆర్జీ యూనిట్లు మారాయి. అయితే జవాన్ల వయోభారం, ఫిజికల్ ఫిట్నెస్ డీఆర్జీ యూనిట్లకు మైనస్‌గా మారింది.బస్తర్ ఫైటర్స్..డీఆర్జీతో వచ్చిన సానుకూల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని లోకల్ యంగ్ టీమ్‌తో బస్తర్ ఫైటర్స్‌ను 2022లో అందుబాటులోకి తెచ్చారు. 300 మందితో కూడిన మొదటి యూనిట్‌కు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు 300 మంది జవాన్లతో కూడిన ఏడు యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇదే ఊపులో కేవలం మహిళలతో దంతేశ్వరీ ఫైటర్స్ అనే యూనిట్ కూడా మొదలైంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో స్థానికేతర దళాలకు సాయమందించే పనిలో ఉన్న ఈ లోకల్ జవాన్లే ఎక్కువగా మావోలు జరిపే దాడుల్లో చనిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు,ఒక జవాను మృతి చెందారు. నారాయణపూర్,దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఏకే 47,ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్‌ను దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్‌గా గుర్తించారు.ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. భద్రతాబలగాలు కూడా తమ జవాన్లను కోల్పోతున్నాయి. ఇదీ చదవండి: లోయలో పడ్డ ఆర్మీ వాహనం..నలుగురు సైనికులు దుర్మరణం -
లొంగుబాటా.. దాడులా...
రాయ్‌పూర్: లొంగిపోవడమా, తీవ్ర పరిణాలు ఎదుర్కోవడమా ఏదో ఒకటి తేల్చుకోవాలని నక్సలైట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వెంటనే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవండి. లేదంటే భద్రతా దళాల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 2026 మార్చి చివరి నాటికి నక్సలిజాన్ని పూర్తి నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. నక్సలిజం నుంచి ఛత్తీస్ విముక్తి పొందినప్పుడే దేశమంతా ఆ ముప్పు నుంచి బయటపడుతుందన్నారు. అమిత్ ఆదివారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. రాయ్‌పూర్‌లో ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ అవార్డు ప్రదానోత్సవంలో మాట్లాడారు. జగదల్పూర్లో బస్తర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో ప్రసంగించారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఛత్తీస్ పోలీసులు ఏడాదిగా గణనీయమైన పురోగతి సాధించారని ప్రశంసించారు. ‘‘లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత విధానం అమలు చేస్తోంది. తీవ్రవాదులు హింసకు స్వస్తి పలికి రాష్ట్ర ప్రగతికి చేయూతనందించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏడాదిలో 287 మంది హతం ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాదిలో 287 మంది నక్సలైట్లు మరణించారని, 1,000 మంది అరెస్టయ్యారని, 837 మంది లొంగిపోయారని అమిత్ వివరించారు. నక్సలిజంపై పోరాటంలో పురోగతికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ‘‘ఏడాదిలో 14 మంది నక్సల్స్ అగ్ర నేతలు హతమయ్యారు. నక్సల్స్ హింసాకాండలో మరణించిన భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుల సంఖ్య 100లోపే. నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ. మావోయిస్టుల దాడుల్లో భద్రతా సిబ్బంది, పౌర మరణాలు 70 శాతం తగ్గాయి. నక్సలిజంపై చివరిదెబ్బ కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ పురస్కారం అందుకోవాలంటే కనీసం పాతికేళ్లు సేవలందించి ఉండాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌లో 2000లో ఏర్పాటైనా రాష్ట్ర పోలీసు దళానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయం. పోలీసుల అంకితభావం, త్యాగం, ధైర్యసాహసాలే ఇందుకు కారణం. జమ్మూకశీ్మర్ కంటే బస్తర్ అందమైన ప్రాంతం. నక్సలిజం అంతమైతే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తారు’’ అని అన్నారు.వేసక్టమీ చేసుకుంటేనే పెళ్లి లొంగిపోయిన మావోయిస్టుల వెల్లడి ‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్. నక్సలైట్లలో తరచూ వినిపించే మాట. దళంలో ఉండగా పెళ్లి చేసుకోవాలంటే ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే పెళ్లికి అనుమతివ్వరు. అగ్రనేతల ఆదేశాలతో బలవంతంగానైనా ఆపరేషన్ చేయిస్తారు. నాకూ అలా ఆపరేషన్ చేయించారు’’ అని తెలంగాణకు చెందిన మాజీ మావోయిస్టు వెల్లడించారు. ‘‘ఆయుధాలు వదిలేసి లొంగిపోయి సాధారణ జీవితం మొదలు పెట్టాక సంతానం కావాలనిపించింది. మళ్లీ ఆపరేషన్ చేయించుకుని ఒక బాబుకు తండ్రినయ్యా’’ అని హోం మంత్రి అమిత్ షాకు తన అనుభవం వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఆయన జగదల్పూర్లో ప్రత్యేకగా సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల మాజీ నక్సల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘దళంలో స్త్రీ, పురుష సభ్యులు పెళ్లాడటం పరిపాటి. పిల్లలు పుడితే వారి సంరక్షణ, అడవుల్లో తిరగడం కష్టమవుతుందని, ఉద్యమానికీ ఇబ్బందని అగ్ర నేతలు చెబుతుంటారు. అందుకే నక్సలైట్లకు వేసక్టమీ తప్పనిసరి చేశారు’’ అని వారన్నారు. -
హిడ్మా ఇంటికి హోంమంత్రి అమిత్ షా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి దక్షిణ బస్తర్ ఏరియాలో, ఆ పార్టీ కీలక నేత హిడ్మా స్వగ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆదివారం (ఈ నెల 15న) ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్లనున్నట్టు సమాచారం.మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతోపాటు... యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్ ఫైటర్స్ తదితర దళాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పువర్తి పర్యటన సందర్భంగా హిడ్మా తల్లితోపాటు ఇతర స్థానికులతో అమిత్ షా మాట్లాడనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికవర్గాలు దీనిని ధ్రువీకరించలేదు. ఎనిమిది నెలలుగా భద్రతా దళాల గుప్పిట్లో... ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా కేంద్రమైన సుక్మా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మడావి హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. మురియా ఆదివాసీ తెగకు చెందిన హిడ్మా.. 2001లో అజ్ఞాతంలోకి వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, బెటాలియన్ వన్ కమాండర్‌గా ఎదిగారు. పూర్తి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న పువర్తిలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు పదేళ్ల ప్రయత్నం తర్వాత 2024 ఫిబ్రవరిలో భద్రతా దళాలు పువర్తికి చేరుకుని క్యాంపు ఏర్పాటు చేయగలిగాయి. దీనితోపాటు దండకారణ్యంలో మావోయిస్టుల కీలక కేంద్రాలైన కొండపల్లి, జీడిపల్లిలోనూ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ప్రతి గా మావోయిస్టులు కూడా ఈ క్యాంపులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఇటీవల జీడిపల్లి క్యాంప్‌పై పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసిన దాడులకు హిడ్మా నేతృత్వం వహించినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి చోట అమిత్ షా పర్యటించనున్నారనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. -
భద్రతా బలగాల బేస్ క్యాంప్‌పై మావోల మెరుపు దాడి
రాయ్‌పూర్ : తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని పామేడు ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. పామేడు వద్ద భద్రత బలగాల బేస్ క్యాంప్‌పై మావోయిస్ట్‌లు మెరుపు దాడి చేశారు. మావోయిస్ట్‌ల దాడుల్ని భద్రతబలగాలు తిప్పుకొడుతున్నాయి. కాగా, మావోయిస్ట్‌ల చేసిన దాడిలో ఐదుగురు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు గాయపడ్డ జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘ఆపరేషన్ కగార్’ పై సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం మావోలకు ఇలాఖాగా మారింది. అప్పట్లో పోలీసు బలగాలకు మావోయిస్టులు కంటికి మీద కునుకు లేకుండా చేశారు. కాలక్రమంగా వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కీలక స్థానాల్లో తెలుగువారునిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి, సెంట్రల్ పొలిట్‌బ్యూరో కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. » మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా సింగరేణి కోల్ కమిటీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు సమాచారం. » ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, రాష్ట్ర కమిటీ మెంబర్, కేబీఎం (కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల) కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. » బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ పార్టీ నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నట్టుగా చెబుతారు. ఇదే మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి, అతని సహచరి పుష్ప దండకారణ్యంలోనే ఉన్నారు. » కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం అగర్‌గూడకు చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క దండకారణ్యంలోనే ఉన్నారు. ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షలకు పైనే రివార్డులు ఉన్నాయి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లుగత కొంతకాలంగా మావోయిస్టులు చనిపోవడమో, లొంగిపోవడమో జరుగుతోంది. ఐదు దశాబ్దాలకుపైగా పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్(69) గతేడు జూన్‌లో మరణించారు. బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ పత్రికలకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. » దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్చార్జ్గా పనిచేసిన కాసర్ల రవి అలియాస్ అశోక్ ఎన్కౌంటర్లో మరణించారు. వీరే కాకుండా కంతి లింగవ్వతోపాటు సీనియర్లను పార్టీ కోల్పోయింది. మూడేళ్ల క్రితం ఉమ్మ డి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూ రు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకా లు చేపట్టింది. 2020లో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో భదత్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు చనిపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ కమిటీ సింగరేణి కారి్మకుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలకే పరిమితమైంది.అడవి వీడి బయటకు రావాలి మా చెల్లి నా కోసం వచ్చి అక్కడే ఉండిపోయింది. నేను లొంగిపోయి సాధారణ జీవితం గడు పుతున్నా. మా చెల్లి 36 ఏళ్లుగా పార్టీలోనే ఉంది. అడవి వీడి తిరిగి వస్తే అందరికీ సంతోషం. - చౌదరి చిన్నన్న, చౌదరి అంకుబాయి అన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగర్గూడఆశయాన్ని చంపలేరు వ్యక్తులను చంపగలరు గానీ ఆశయాన్ని చంపలేరు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకున్నా అంతిమ విజయం ప్రజలదే. నా స్వార్థం కోసం మా నాన్నను అజ్ఞాతం వీడమని చెప్పలేను. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపి పరిష్కారాన్ని వెతకాలి. అంతేకాని ఉద్యమాన్ని అణచడం కాదు. – బండి కిరణ్, మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ కొడుకుజీవించే హక్కును కాపాడాలి ఆదివాసీలు నేరం చేసినట్టు లక్షల కొద్దీ బలగాలతో అడవుల్లో క్యాంపులను ఏర్పా టు చేసి అమాయకులను చంపేస్తున్నా రు. అడవి, సహజ వనరులను నాశనం చేసి సాధించేదేమిటి? 2005 నుంచి అనేక పేర్లతో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, అసమానతల కోణంలో చూస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపు తున్న మరణహోమాన్ని వెంటనే ఆపేయాలి. చర్చలకు పిలవాలి. ప్రతీ ఒక్కరికి జీవించే హక్కును కాపాడాలి. – నక్క నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పౌరహక్కుల సంఘం. -
ఒక్కొక్కరిది ఒక్కో గాథ!
ఏటూరునాగారం: విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులైనవారు కొందరు. వివిధ రకాల పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, వేధింపుల నేపథ్యంలో అడవి బాట పట్టిన వారు మరి కొందరు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూ రంగా ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఎన్ కౌంటర్లో అసువులు బాశారు. ఇన్నా ళ్లూ ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నార్లే అను కున్న తల్లిదండ్రులు, బంధువులు.. విగత జీవులైన తమ పిల్లల్ని చూసి తల్ల డిల్లిపో యారు.ఎన్కౌంటర్లో చనిపో యిన వారందరివీ నిరుపేద కుటుంబాలే కావడం గమ నార్హం. చెల్పాక ఎదురు కాల్పుల్లో నేలకొ రిగిన మావోయిస్టులను తీసుకెళ్లేందుకు ఏటూరునాగారం సామాజి క ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలను ‘సాక్షి’ పలకరించింది. చిన్నతనంలోనే అడవి బాట పట్టిందిఛత్తీస్గఢ్ రాష్ట్రం పూర్వాడ తాలూకా బైరాన్గుట్ట గ్రామా నికి చెందిన ముసాకి జమున తండ్రి రాజు, తల్లి కొసంగి చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పాటు గ్రామాల్లో సల్వాజుడుం, మావోయిస్టులు, పోలీసుల ఇబ్బందులు తాళలేక జమున తొమ్మిదేళ్ల వయస్సులోనే గ్రామానికి చెందిన మరి కొంతమందితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పట్నుంచీ తిరిగి వచ్చింది లేదు. ఇప్పుడు శవమై కన్పించింది. – లక్ష్మణ్, జమున బాబాయి వాళ్ల పాటలు విని అడవిలోకి పోయిండుమాది ఛత్తీస్‌గఢ్. నాకు ఇద్దరు కొడుకు లు. చిన్నోడు ముసాకి కరుణాకర్ అలియాస్ దేవల్ అడవిలో అప్పు డప్పుడు వినిపించే పాటలకు ఆకర్షితుడై ఐదేళ్ల క్రితం అడవి బాట పట్టిండు. వాడి చిన్నతనంలోనే నా భార్య సోడి చనిపో యింది. ఇంటి దగ్గర ఉండమంటే అన్నల్లో చేరిండు. అప్పట్నుంచి కన్పించలేదు. – ముసాకి బుజ్జ, కరుణాకర్ తండ్రి22 ఏళ్ల క్రితం వెళ్లాడుభద్రు (కుర్సం మంగు) పొలం పను లు చేసుకుంటూ ఉండేవాడు. 22 ఏళ్ల క్రితం సల్వాజుడుం కార్యక లాపాలు ముమ్మరంగా ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన గొడవలు, అల్లర్లతో అడవిలోకి వెళ్లి ఇక రాలేదు. అడవిలోకి వెళ్లాక జానకిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. – కుర్సం సోడి (సోమయ్య) భద్రు సోదరుడు. ఛత్తీస్‌గఢ్ గూడెంలోకి వచ్చేవారితో కలిసి వెళ్లాడుమాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఊసూరు తా లూకా మలంపెంట. నా భర్త చనిపోయా డు. నేను నా పెద్ద కొడుకు, చిన్నోడు కామేష్ కూలి పను లు చేసుకుంటూ ఉండేవాళ్లం. కామేష్ 14 ఏళ్ల వయస్సులో మా గూడెంలోకి వచ్చేవారితో కలిసి అడవి లోకి వెళ్లాడు. ఇప్పటికి రెండేళ్లు అవుతోంది. – కారం ఉంగి, కామేష్ తల్లి -
వారి మృతదేహాలు భద్రపర్చండి
సాక్షి, హైదరాబాద్: ఏటూరునాగారం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు వారి కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వాలని స్థానిక పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపర్చాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమని, మత్తు పదార్థం/విషమిచ్చి పట్టుకుని కాల్చి చంపారని, తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంటూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కాలవల ఐలమ్మ (మీనా) సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఆగమేఘాలపై పోస్టుమార్టం: పిటిషనర్ పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌గా సృష్టించడం కోసం కాల్పులు జరిపారు. మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయి. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరుతూ ఐలమ్మ ఆదివారమే జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు ఈ మెయిల్ పంపారు. అయినా ఆమెను, కుటుంబసభ్యులను పోలీసులు అనుమతించలేదు.బూటకపు ఎన్కౌంటర్ కానప్పుడు మృతదేహాన్ని చూపించడానికి అభ్యంతరం ఏంటీ?..’అని ప్రశ్నించారు. అయితే అప్పటికే పోస్టుమార్టం ముగిసిపోయిందని జీపీ చెప్పడంతో.. కుటుంబసభ్యులు చూడకముందే ఆగమేఘాల మీద పోస్టుమార్టం ఎందుకు చేశారో పోలీసులు చెప్పాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. నిపుణుల బృందం పోస్టుమార్టం పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజ్ వాదనలు వినిపిస్తూ.. ‘అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిస్పందించారు. ఎదురుకాల్పుల్లో మరణించిన వారిని భద్రతాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సమీప ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సెక్ నిపుణుల బృందం అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసింది. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు.మృతదేహాలను అక్కడే ఫ్రీజర్‌లో భద్రపరుస్తారు. కుటుంబసభ్యులు చూడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు..’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలని ఏటూరునాగారం ఎస్హెచ్ఓను ఆదేశించారు. పోస్టుమార్టంలో పాల్గొన్న నిపుణులు, వైద్యుల పూర్తి వివరాలు తమ ముందుంచాలని చెబుతూ, తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. -
రెడ్ కారిడార్‌కు చెక్ పడినట్టే?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో మరోసారి పాగా వేయాలనే మావోయిస్టుల ప్రయ త్నాలు ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించ డం లేదు. ఓ వైపు పోలీసు నిఘా పెరిగిపోగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మావోల వ్యూహాలకు అడ్డు క ట్టలు వేస్తున్నాయి.పలుచోట్ల పోలీసు క్యాంపుల ఏ ర్పాటుతో పహారా పెరిగింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో మావోలు మృతి చెందడంతో వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసు కోవాలన్న వ్యూహానికి చెక్ పడినట్టు తెలుస్తోంది.ఆ రెండు జిల్లాల పరిధిలోనే...బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన జనతన సర్కార్ ప్రభావం క్రమంగా సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. మావోయిస్టుల అడ్డాగా బీజాపూర్, సుక్మా జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న ములుగు జిల్లాలోని వెంకటాపురం, భద్రాద్రి జిల్లాలోని చర్ల, దుమ్మగూడెం మండలాలు మావోలకు సరికొత్త అడ్డాగా మారాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దళాల సంచారం, వాల్ పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, బాంబులు పేల్చడం తదితర ఘటనలన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే జరిగాయి. చర్ల మండలం మావోయిస్టుల ప్రభావంతో ఎరుపెక్కింది. చర్లతో సరిహద్దు పంచుకుంటున్న పామేడు–కంచాల–కొండపల్లి ఏరియాల పరిధిలో గడిచిన పదేళ్లలో అనేకసార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా..మావోల కంచుకోటలోకి చొచ్చుకుపోయే లక్ష్యంతో చర్ల కు సమీపంలో ఉన్న పామేడు దగ్గర మావోల అడ్డాకు సరి హద్దుగా ఉన్న చింతవాగు దగ్గర ఏడాది క్రితం కేంద్ర భద్రతా దళాలు క్యాంపు ఏర్పాటు చేశాయి. కానీ ఇక్కడ ఉన్న దట్టమైన అడవు లు, ఉధృతంగా ప్రవహించే వాగుల కారణంగా ప్రభుత్వ భద్రతా దళాలు పామేడును దాటి అడవుల్లోకి చొచ్చుకుపోవడం కష్టమైంది. మరోవైపు ఈ వాగుకు ఆవల ప్రాంతమంతా మావోయిస్టుల్లోనే శక్తివంతంగా భావించే దక్షిణ బస్తర్ జోన్ కమిటీ ఆధీనంలో ఉంది. దీంతో కేంద్ర భద్రతా దళాలకు చెందిన జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే లక్ష్యంతో అదే పనిగా పామేడు సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడులు జరిపారు. జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ దాడులను తిప్పికొట్టగలిగారు. లేదంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది.చుట్టుముట్టేస్తున్నారు..మావోలకు పట్టున్న ప్రాంతంలోకి చొచ్చుకుపోయేందుకు వీలుగా ఇటీవల పామేడు దగ్గరున్న చింతవాగుపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నెల వ్యవధిలోనే పామేడు అవతల ఉన్న ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, తుమ్మలపాడు గ్రామాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. వారం వ్యవధిలోనే మొబైల్ టవర్లు వచ్చేశాయి. ఈ వేసవి నాటికి పామేడు నుంచి కొండపల్లి మీదుగా పూవర్తి వరకు యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పామేడు మీదుగా తెలంగాణలోకి మావోల రాక కష్టం కానుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలే మావోలకు అడ్డాగా మారాయి.ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని తరచు వెంకటాపురం, చర్ల మండలాల్లోకి మావోలు వచ్చిపోయేవారు. అయితే కర్రెగుట్టల సమీపంలో ఉన్న పూసుగుప్పతోపాటు చెలిమెల, వద్దిపేట, చెన్నాపురంలో కూడా క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ మార్గం కూడా మూసుకుపోయినట్టుగానే భావిస్తున్నారు. -
ఐదుగురు మావోల కోసం జల్లెడ
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్లో ఒక మహిళ సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పరారైన మిగతా ఐదుగురి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాజేడు, వెంకటాపురం(కె)తో పాటు ఇటు మహారాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం, మంథని మహాదేవ్‌పూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు గాలిస్తున్నా యి. తప్పించుకున్న మావోయిస్టులకు గాయాలై ఉంటాయని, సమీప అటవీ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారని భావిస్తున్న పోలీసులు సోమవారం చెల్పాక అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక వైపు పొలకమ్మ వాగు, మరోవైపు దట్టమైన అటవీప్రాంతం ఉండటంతో పోలీసులు నలుమూలలా నిఘా వేసినట్లు తెలుస్తోంది. సామాజిక ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తుఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక సామాజిక ఆస్పత్రిలో సోమవారం పోççమార్టం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటు చేసుకోగా, ఎస్పీ శబరీష్ మృతదేహాలను పరిశీలించిన తర్వాత భారీ బందోబస్తు మధ్య ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించాలని భావించారు. కానీ వర్షం, భద్రత కారణాల దృష్ట్యా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్ర పర్చారు. సోమవా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం ప్రత్యేక పర్యవే క్షణ అధికారి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో కాకతీయ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌కు మార్, డీఎస్పీ రవీందర్‌రెడ్డితో చర్చించిన తర్వాత.. కాకతీ య వైద్య కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, ప్రొఫెసర్ ఖాజామొహినొద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ వైద్యులు నవీన్, మాధురి, మౌనిక, జీతేందర్, ప్రియాంక, ఫరేక, లావణ్య, తరుణ్, ప్రశాంత్‌లతో కూడిన బృందం ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. మధ్యాహ్నం 12.47 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 6.33 వరకు కొనసాగింది. అనంతరం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మావోయిస్టుల మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపర్చారు. వైద్యులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోస్టుమార్టం గది వద్ద ఉండేందుకు కూడా వీల్లేకుండా కట్టుదిట్టం చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి ఆస్పత్రి వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనదారులను అడ్డగించి ఆరా తీశారు. విషం పెట్టారు.. హింసించి చంపారుశరీరం మొత్తం తుక్కు తుక్కు చేశారుమావోయిస్టు మల్లయ్య భార్య మీనా ఆరోపణఏటూరునాగారం: ‘ఇది ఎన్కౌంటర్ కాదు.. అన్నంలో విషం పెట్టి బేహోష్ (అపస్మారకస్థితిలో)లో ఉన్నప్పుడు నా భర్తను పట్టుకున్న పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారు..’ అని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా ఆరోపించారు. ములుగు ఎన్కౌంటర్లో మరణించిన తన భర్త మృతదేహాన్ని చూడటానికి మీనా, సోదరుడు రాజయ్య ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మీనా విలేకరులతో మాట్లాడారు. ‘ముఖంపై చర్మం తప్ప శరీరంలో ఎక్కడా బొక్కలు కనబడటం లేదు.. మొత్తం తుక్కుతుక్కు చేసి హింసించి హింసించి చంపారు. తల నుజ్జునుజ్జుగా అయింది. దగ్గరినుంచే కాల్చి చంపినట్లు తెలుస్తోంది. హింసించి విషమిచ్చి చంపారా? లేక మత్తుమందు ఇచ్చి అతిక్రూరంగా చంపారా? అనేది అర్థం కావటం లేదు. మరణించిన మహిళా మావోయిస్టును చూస్తే.. మొత్తం బట్టలు చింపేసి గొంతు కోసినట్లుగా ఉంది.. ఒక భుజం మొత్తానికే వెనక్కి తిరిగి ఉంది. ఎంత క్రూరంగా హింసించి చంపారో దీన్నిబట్టి అర్థమవుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి సీతక్క గతంలో నక్సల్స్ పార్టీలో పని చేశారు కదా.. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లకు ఎలా మద్దతు తెలుపుతున్నారని మీనా ప్రశ్నించారు. కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదంటేనే ఎంత క్రూరంగా హింసించి చంపారో తెలుస్తోందంటూ విలపించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గొప్పోడి అంజమ్మ డిమాండ్ చేశారు. -
ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
గెరిల్లా వార్ నుంచి.. పీపుల్స్ ఆర్మీ దిశగా..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారత సాయుధ దళాలు బస్తర్ జంగిల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి. మరోవైపు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) 24వ వారోత్సవాలకు సిద్ధమవుతోంది. తుపాకుల నీడలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగనున్న వారోత్సవాల నేపథ్యంలో పీఎల్జీఏ ప్రస్థానంపై ప్రత్యేక కథనమిది.చేజారుతున్న దండకారణ్యంమావోయిస్టు పార్టీకి ఉన్న అనేక కమిటీల్లో అత్యంత శక్తివంతమైనది దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ. పదేళ్ల కిందట ఇక్కడ ఐదువేల మంది సాయుధ సభ్యులు ఆ పార్టీకి ఉన్నట్టుగా చెబుతారు. మావోయిస్టుల జనతన సర్కార్ కల ఇక్కడ సాకారమైంది. అయితే ఇప్పుడిక్కడ సాయుధ దళాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరున్న హిడ్మా సొంతూరు పూవర్తిలో.. ప్రభుత్వ దళాలు ఫిబ్రవరిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. అంతేకాదు.. విప్లవ పోరాటాలకు నాంది పలికిన నేతల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య పేరు మీద ఏర్పాటైన కొండపల్లి గ్రామంలోనూ ఇటీవల క్యాంపు వచ్చింది. మరోవైపు మావోయిస్టుల కంచుకోటైన అబూజ్‌మడ్‌లో అక్టోబర్ 4న జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది చనిపోయారు. ఇటీవల చోటుచేసుకుంటున్న ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టుల బలం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భీకర దాడులుపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ప్రధానంగా జన మిలీషియా, గెరిల్లా స్క్వాడ్, ప్లాటూన్/కంపెనీలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో పని చేసే జన మిలీషియాలో గ్రామస్తులే ఎక్కువ మంది ఉంటారు. ఆయుధం పట్టడం కంటే.. పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్‌లో పని చేస్తే, సంచరించే ప్లాటూన్లు అక్కడి పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. మెరుపు దాడుల పని గెరిల్లా దళాలది. పీఎల్జీఏ ఏర్పాటైన తర్వాత తొలి ఐదారేళ్లలో దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో అనేక దాడులు జరిగాయి. 2004 నుంచి 2011 వరకు చేపట్టిన దాడుల్లోనే 2 వేల వరకు ఆయుధాలు, రెండు లక్షల రౌండ్లకు పైగా తూటాలను ప్రభుత్వ బలగాల నుంచి మావోలు లూటీ చేయగలిగారు. ఈ సమయంలో రెడ్ కారిడార్ పరిధిలో పదివేల మందికి పైగా సభ్యులు పీఎల్జీఏకు ఉన్నట్టు అంచనా. ఇలా పెరిగిన సాయుధ సంపత్తితో అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ రక్తపాతం సృష్టించారు. అత్యధికంగా 2010లోనే మావోయిస్టులు జరిపిన దాడుల్లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.‘కొయ్యూరు’తో బీజంపీపుల్స్ వార్ నక్సలైట్ల ప్రభావం 90వ దశకంలో ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో 1999 డిసెంబర్ 2న.. అప్పటి కరీంనగర్ జిల్లా కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్ మృతి చెందారు. వీరి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీపుల్స్ గెరిల్లా ఆర్మీని.. 2000 డిసెంబర్ 2న పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దేశంలో ఉన్న సాయుధ విప్లవ శక్తులన్నీ కలిసి 2004 సెప్టెంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఒక్కతాటిపైకి వచ్చాయి. దీంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేరును పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)గా మార్చారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి పీఎల్జీఏ ప్రయత్నిస్తుందని ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కారమైనప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా పీఎల్జీఏకు మద్దతుగా నిలుస్తారని, ఆ మద్దతు సాయంతో సాయుధ విప్లవం విజయవంతమవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. విప్లవం సిద్ధించిన తర్వాత గెరిల్లా ఆరీ్మనే పీపుల్స్ ఆర్మీ (ప్రజా సైన్యం)గా రూపాంతరం చెందుతుందని నమ్మారు.కౌంటర్ ఎటాక్ పెరిగిన హింసతో మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం 2009లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. అయితే ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం రెడ్ కారిడార్‌లో మావోయిస్టులకు గట్టి పట్టు చిక్కేలా చేస్తే, అక్కడి దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, పొంగిపొర్లే వాగులు ఆ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చాయి. ఫలితంగా ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు ఆరంభంలోనే అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వ బలగాలు ఆపరేషన్ సమాధాన్, ప్రహార్ అంటూ పక్కా ప్రణాళికతో మావోయిస్టులపై పోరాటానికి దిగాయి. దీంతో క్రమంగా రెడ్‌కారిడార్ కుచించుకుపోతూ వచ్చింది. ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)తో ఆఖరికి బస్తర్ అడవుల్లోనూ పీఎల్జీఏకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.నంబాళ్ల.. కిషన్‌జీ.. హిడ్మాపీఎల్జీఏకు అనేక మంది నాయకత్వం వహించినా.. ప్రస్తుత చీఫ్ నంబాళ్ల కేశవరావు ఆలియాస్ బస్వరాజ్, మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్‌జీ, మడావి హిడ్మా చేపట్టిన డేరింగ్ ఆపరేషన్లు సంచలనం సృష్టించాయి. 2010లో జరిగిన చింతల్నార్ ఘటనలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పీఎల్జీఏ దాడిలో చనిపోగా.. ఆ తర్వాత 2013లో జరిపిన దాడిలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మతో పాటు 27 మంది మృతి చెందారు. చదవండి: ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయికిషన్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన పోరాటాలు సుదీర్ఘ కాలం అక్కడ కొనసాగిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. ప్రస్తుతం పీఎల్జీఏ కంపెనీ 6కు నాయకత్వం వహిస్తున్న హిడ్మా, ఇప్పుడు అత్యంత ప్రమాదకర మావోయిస్టుగా గుర్తింపు పొందారు. 2021 ఏప్రిల్ 4న హిడ్మా నాయకత్వంలో తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన దాడిలో 22 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. -
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షి,వరంగల్: ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్1) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏటూరునాగారం చల్పాక సమీపంలో కూంబింగ్ చేస్తుండగా గ్రేహౌండ్స్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు.ఎన్కౌంటర్లో మృతిచెందింది వీళ్లే..1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, టీఎస్సీఎమ్ కార్యదర్శి ఇల్లందు-నర్సంపేట 2. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్పూర్ 3. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్4. ముస్సాకి జమున 5. జైసింగ్, మావోయిస్టు పార్టీ సభ్యుడు6.కిషోర్, మావోయిస్టు పార్టీ సభ్యుడు7.కామేష్, మావోయిస్టు పార్టీ సభ్యుడు -
ములుగు జిల్లాలో మావోల ఘాతుకం
-
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీ లు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెపె్టంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెపె్టంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
పార్టీ వేడుకలతో సర్కార్‌కు మావోయిస్టుల సవాల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జరి గిన వరుస ఎన్కౌంటర్ల కారణంగా మావోయిస్టు ల పని అయిపోయిందనే అభిప్రాయం రోజురో జుకూ బలపడుతున్న సమయంలో ఛత్తీస్ గఢ్లోని బస్తర్ అడవుల్లో పార్టీ ఆవిర్భావ వేడుక లను ఘనంగా నిర్వహించి మావోయిస్టులు మరోసారి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ వేడుకల వీడియోలు గురు, శుక్రవారాల్లో ప్రధాన, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమ య్యాయి. బస్తర్ అడవుల్లో గుర్తుతెలియని ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో వేలాదిగా ఆదివాసీ ప్రజలు, వందల సంఖ్యలో సాయుధులు పాల్గొ న్నట్టుగా స్పష్టమవుతోంది. చనిపోయిన మావో యిస్టులను స్మరిస్తూ.. పాటలు పాడుతూ స్తూపా ల దగ్గర కవాతు చేస్తూ మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ఈ వీడియోల్లో కనిపించారు. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక అబూజ్మడ్ అడవుల్లో తుల్తులీ ఎన్కౌంటర్ తర్వాత మావో యిస్టులకంటూ సురక్షిత ప్రాంతం లేదనే అభిప్రా యం బలంగా ఏర్పడింది. అయితే వేలాది మంది ఒక చోట గుమిగూడి ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ, డోలు వాయిద్యాలు ఉపయోగిస్తూ వేడుకలు చేసుకోవడం, వేడుకల వీడియోలు బయటకు విడుదల చేయడం చూస్తూంటే ఇప్పటికీ అబూజ్మడ్, దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టు ఉందనే అంశం స్పష్టమవుతోంది. అయితే ప్రాంతం, తేదీ తదితర వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా లేకపోవడంతో పాత వీడియోనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. -
సుజాత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గట్టు: మావోయిస్టు అగ్రనేత సుజాత అలియాస్ పద్మ అలియాస్ మైనా అలియాస్ కల్పన ఎక్కడున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆమెను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం మొదలైంది. విప్లవ పోరాటంలో 40 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న సుజాత ఇటీవల అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం తెలంగాణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె లొంగుబాటుకు ప్రయత్నించారా లేక మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఒడు పుగా అదుపులోకి తీసుకుని రహ స్యంగా విచారిస్తున్నారా అన్న అంశంపై భిన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే సుజాత పోలీసుల అదుపులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇటు పోలీసుల నుంచి గానీ, అటు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో మావోయిస్టు పార్టీలో సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యురాలైన సుజాత ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భద్రాద్రి జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జిల్లాలో సుజాతను పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.అందరి చూపూ ఆ ఊరి వైపే..నక్సల్స్ ఉద్యమంలో సాధారణ స్థాయి నుంచి కీలక నేతగా ఎదిగిన సుజాత పోలీసులకు పట్టుబడ్డారనే వార్తల నేపథ్యంలో అందరి దృష్టి ఆమె స్వగ్రామం పెంచికలపాడు వైపు మళ్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, యంకమ్మ దంపతుల రెండో సంతానం సుజాత. సుమారు 40 ఏళ్ల క్రితం గద్వాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అన్న శ్రీనివాసరెడ్డితో కలిసి నక్సల్స్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు.కొన్నేళ్ల తర్వాత తండ్రి తిమ్మారెడ్డి మరణంతో అన్న శ్రీనివాసరెడ్డి స్వగ్రామానికి వచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులు వివాహం జరిపించడంతో ఆయన మళ్లీ ఉద్యమం వైపు వెళ్లకుండా గ్రామంలోనే ఉండిపోయారు. అయితే సుజాత మాత్రం తండ్రి మరణం తర్వాత కూడా స్వగ్రామం వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు తెలిపారు. మావోయిస్టు పార్టీలో ఒకప్పుడు అగ్రనేతగా పేరున్న కిషన్‌జీని సుజాత పెళ్లి చేసుకున్నారు. సుజాతకు కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆమె ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లో రూ.కోటికి పైగా రివార్డు ఉంది. -
తుల్తులీ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.మూడో తేదీనే చేరుకున్న బలగాలు మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్‌కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.పట్టు సాధించిన బలగాలుబస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్‌ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్మడ్ ప్రాంతం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం 31 కాదు 35 మంది మృతి..తుల్తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు. -
సేఫ్ జోన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు సేఫ్ జోన్ వెతుకులాటలో పడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ ఎత్తున ఎరివేతకు దిగడంతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతోపాటు, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పైగా రాష్ట్రాల పోలీసు బలగాలకుతోడు కేంద్ర సాయుధ బలగాలను మరింత ఎక్కువగా కదన రంగంలోకి దింపుతున్న వేళ మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంటున్నారు.ఇందుకు రెండు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం వృద్ధాప్యంతోపాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. అదే సమయంలో తమకు దశాబ్దాలుగా సేఫ్జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని కోల్పోతున్నారు. దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న అబూజ్మడ్ సైతం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళుతుండటం మావోయిస్టు నాయకత్వాన్ని మరింత కలవర పరుస్తోంది. మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో ఉన్నారు.మరోవైపు రిక్రూట్మెంట్లు తగ్గటం, విచ్చినవారు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడా పట్టున్న ప్రాంతాలూ ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్‌గా మార్చుకునే యోచనలో మావోయిస్టులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆరుగురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం, గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలు నిత్యం జల్లెడపడుతుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటిన అగ్రనేతలుమావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది ఆరుపదుల వయస్సు దాటిన వారే ఉన్నారు. ఈ వయస్సులో వారికి మెరుగైన వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కరీంనగర్‌కు చెందిన భూపతి అలియాస్ లచ్చన్న వయస్సు 63 ఏళ్లు, తిప్పరి తిరుపతికి 60 ఏళ్లు, నల్లగొండకు చెందిన పాక హన్మంతుకు 60 ఏళ్లు, హైదరాబాద్‌కు చెందిన మోడెం బాలకృష్ణకు 59 ఏళ్లు, పెద్దపల్లికి చెందిన పుల్లూరి ప్రసాదరావుకు 62 ఏళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు అగ్రనేతల ఆరోగ్య పరిస్థితి ఇలా..⇒ మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అలియాస్ రామన్న అలియాస్ దయానంద్ అలియాస్ గుడ్సా దాదా అలియాస్ చంద్రశేఖర్ 74 ఏళ్లకు చేరారు. ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా. ఆయన లో బీపీ, డయాబెటిస్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్ సమస్యలతో ఇప్పుడు దాదాపు మంచానికే పరిమితమయ్యారు. ⇒ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ అలియాస్ ఆనంద్ అలియాస్ సొమ్రు దాదా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. భూపాలపల్లికి చెందిన రవికి 59 ఏళ్లు, డయాబెటిస్‌కు ఇన్సులిన్ వాడుతున్నారు. కిడ్నీలు చెడిపోయి కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు అలియాస్ గోపన్నకు ఇప్పుడు 66 ఏళ్లు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న కోస ఒబెసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ⇒ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు అలియాస్ చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కర్రల సాయంతో నడుస్తున్నారు. ⇒ హైదరాబాద్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ డయాబెటిస్, గ్యాంగ్రిన్‌తో బాధపడుతున్నారు. -
మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసిన దంతేవాడ ఎన్ కౌంటర్
-
17 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యుల లొంగుబాటు
పాడేరు: పెదబయలు ఏరియా కమిటీకి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది మిలీíÙయా సభ్యులు మంగళవారం పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆ వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. పలు నేరాలకు పాల్పడిన మిలీషియా సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులుండవని స్పష్టం చేశారు. పాడేరు ఏఎస్పీ ధీరజ్, సీఆరీ్పఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కె.ధారియన్ రాజు తదితరులున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.సుక్మా జిల్లా కార్కగున అటవీ ప్రాంతంలో మంగళవారం(సెప్టెంబర్24) కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ కాల్పులకు ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.సోమవారమే ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం(సెప్టెంబర్23) పోలీసులు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళా మావోయిస్టున్నట్లు గుర్తించారు.ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం. -
నేటి నుంచి మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాలు
-
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మృతులంతా బీకే–ఏఎస్ఆర్కే డివిజన్ వారే ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్ఆర్) డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్తోపా టు తూటాలు, కిట్‌బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీఎస్గా పనిచేస్తూ.. కరకగూడెం ఎన్కౌంటర్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్ గెరిల్లా స్క్వాడ్‌గా (ఎల్జీఎస్) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్ తులసి (సీజీ, బీజాపూర్ జిల్లా, గంగ్లూర్ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. వారిద్దరూ సేఫ్ కరకగూడెం ఎన్కౌంటర్లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు ఉదయం 6:45 గంటలకు ఎన్కౌంటర్ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్ విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం » తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు » ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్‌లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ (34) అలియాస్ విజేందర్ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. పెరిగిన నిర్బంధం.. దామెరతోగు ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్‌పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. నలభై రోజులుగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్కౌంటర్..!
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు.ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
విభేదాలే రాధ ప్రాణాలు తీశాయా!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫార్మర్ అన్న ముద్రతో హత్యకు గురైన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో ఉదంతం ఇప్పుడు మాజీలు..ప్రస్తుత మావోయిస్టుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2017 డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చి0దని రాధ తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి చైతన్య మహిళా సంఘం సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అక్కడ నుంచి ఏవోబీ బో ర్డర్ మీదుగా దళంలో చేరింది. అక్కడే ఆమె పేరును నీల్సోగా మార్చారు. సాంకేతిక విద్యావంతురాలు కావడంతో ఆమెను తొలుత సిగ్నల్ ఆపరేటర్‌గా నియమించి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వచ్చి.. నేతలు చెప్పిన వారికి సమాచారం (ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్) చేరవేసి, ఫోన్ స్విచాఫ్ చేసి, సిమ్‌కార్డు తీసేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది. అప్పటికే అడవిలో ఉన్న అగ్రనేతలకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.వారందరూ షుగర్, బీపీ, గుండె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్, పరీక్షలు, మందు లు, చికిత్స మొత్తం రాధ అలియాస్ నీల్సోనే చూసుకునేది. అలా నీల్సో అనతికాలంలో అగ్ర నాయకత్వానికి దగ్గర అ య్యింది. అందుకే ఆమె సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్Œ ఫోర్స్ క మాండర్‌గా ఎదిగింది. ఆమెను లేడీ చేగువేరాగా పిలిచేవారు.కరోనా సమయంలో వైద్యసేవలు కరోనా ఫస్ట్ వేవ్‌లో మావోయిస్టులకు పెద్దగా నష్టం వాటి ల్లలేదు. కానీ..సెకండ్ వేవ్‌లో చాలామంది అగ్రనేతలు వరుసగా మరణించడం మొదలైంది. మందుల కోసం బయటకు వచ్చే కొరియర్లపై పోలీసు నిఘా తీవ్రమైంది. ఆ సమయంలో నీల్సోనే చాలా మంది దళ సభ్యులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడింది.అయితే కరోనా తగ్గుముఖం పట్టాక.. ఓ అగ్రనేతతో నీల్సోకు విభేదాలు మొదలై.. తారస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో నీల్సో దళం వదిలి ఇంటికి వద్దామనుకుంది. కానీ, సదరు నేత తీరు, సిద్ధాంతాలు ఉల్లంఘిస్తున్న వైనాన్ని వివరిస్తూ.. మూడునెలల క్రితం అగ్ర నాయకత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పార్టీలో తీవ్ర అలజడి రేపగా, దీనిపై నిజనిర్ధారణ చేయాలంటూ ఓ కీలకనేతకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో దళానికి వరుస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నీల్సోతో ఘర్షణ పడిన నేత నిజ నిర్ధారణకు వచ్చిన నేతకు రాధ ఇన్ఫార్మర్ అంటూ ఫిర్యాదు చేశాడు. అసలే పోలీసుల నుంచి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో అతని మాటలను అగ్రనేత సైతం విశ్వసించాడు. చివరికి నీల్సోకు మరణశిక్ష విధించారు. లొంగుబాటులో మావోలు రాధ హత్య దళంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము రాధ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భయంతో ప్రస్తుతం దళంలోని కొందరు సభ్యులు తెలంగాణ పోలీ సులను సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సెంట్ర ల్ కమిటీ మెంబర్లు కొద్ది రోజుల్లో సరెండర్ అవుతామంటూ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కరోనాకు ముందు మావోయిస్టులు ఫిట్టర్, ఎల్రక్టీషియన్, మెకానికల్ డిప్లొమా చదువుకున్న గిరిజన యువతను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఐఈడీల తయారీ కోసమేనని అప్పుడే తెలంగాణ పోలీసులు అనుమానించారు. వెళ్లిన వారిలో చాలామంది అక్కడ ఉండలేకపోయారు. మెజారిటీ యువకులు అప్పటి కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. -
రాధే మరణశిక్షను అంగీకరించింది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పార్టీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీ సులు బంటి రాధ అలియాస్ నీల్సోను కోవ ర్టుకుట్రలో భాగం చేయడం ద్వారా ఆమె మరణానికి కారకులయ్యారు.. చివరకు రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణే‹శ్వెల్లడించారు. ఈ మేరకు ఆయన పేరి ట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ లోని వివరాల ప్రకారం.. ‘పోలీసు ఉన్నతాధి కారులు ఆమె కులం, జెండర్‌ను ఉపయోగించుకొని అవాస్తవాలతో కొన్ని సంఘాల పేరి ట పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే పోలీసు లకు రాధ కులం, మహిళ అని మాట్లాడే అర్హ త లేదు. పీడితవర్గ మహిళగా సమస్యల్ని ఎదుర్కొని వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీ లో చేరింది. సభ్యురాలి నుంచి నాయ కత్వ స్థానంలోకి ఎదగడానికి ఆమె పట్టుదల, పార్టీ కృషి ఉంది. ఆపై ఆమె కుటుంబ బలహీనతలను పోలీసులు వాడు కొని విప్లవద్రోహిగా మార్చి పార్టీ నాయక త్వాన్ని నిర్మూలించాలని చూశా రు. ఇంతలోనే పార్టీ అప్రమత్తం కావడం, పోలీసుల పథకం విఫలమైంది’. అని పేర్కొన్నారు. వాళ్లకు మానవత్వం లేదు..బండి రాధను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడవేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువు పూర్తిచేసిన రాధను బలవంతంగా పార్టీలో చేర్చుకొని జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పా రు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రాధను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధిస్తూ కులం పేరుతో దూషించారని ఆమె సోదరుడు కూడా ఆరోపించా డని తెలిపారు. మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించిన దళిత మహిళ రాధపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్రవేయడం ఆ పార్టీ నేత ల నీచమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు. -
1400 మంది భద్రతా బలగాల కూంబింగ్‌లో.. మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో సుమారు 11 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. మంగళవారం మావోయిస్ట్‌ల ఏరివేతే లక్ష్యంతో 1400 మంది భద్రతా బలగాలు జాయింట్ కూంబింగ్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే సమయంలో మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్ట్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పల్లో 11 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ ఐజి సుందర్ రాజ్ మావోయిస్ట్‌ల మృతి, కూంబింగ్‌ను ధృవీకరించారు. -
మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్‌గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్‌గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు. -
తెలంగాణలోకి మావోయిస్టులు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రం చేశాయి. జనవరిలో ఆకురాలే కాలంలో మొదలైన ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలో కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్లు సమాచారం.దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు, కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనే అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో కీలక నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని చాటుకునేందుకు వీలుగా తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇక్కడి నుంచి కొత్త రిక్రూట్మెంట్లపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.గోదావరి తీరం వెంట కదలికలుగోదావరి తీరం వెంబడి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో వివిధ కమిటీల పేర్లతో మావో యిస్టులు తమ ఉనికి చాటేందుకు గత నాలుగైదేళ్లుగా ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలు ఎక్కు వగా లేఖలు, పోస్టర్లు, బ్యానర్ల వంటి అంశానికే పరిమితమయ్యాయి. దీంతో పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక వెనకడు గు వేశారు.ఇప్పుడు మావోయిస్టులు రూటు మార్చారు. దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు ఇద్దరు ముగ్గురు సభ్యులతో టీమ్‌లుగా ఏర్పడి తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. రెండు వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు కని్పంచడం ఇందుకు బలం చేకూరుస్తోంది.మద్దతుపై రెక్కీ టీమ్‌ల ఆరామావోయిస్టు పార్టీలో తలపండిన నాయకులు, ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీమ్‌లుగా విడిపోయారు. ఈ బృందాలు ఇటీవల భద్రాద్రి – ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీమ్‌లుగా వ్యవహరిస్తున్నా యని సమాచారం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకుం జారీ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోకి వచ్చిన రెక్కీ టీమ్ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఎ లా ఉంది? సానుభూతిపరుల నుంచి మద్దతు లభిస్తుందా, లేదా? అనే అంశాలను బేరీజు వేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన నాయకుల కదలికలపైనా దృష్టి సారించారని సమాచారం. చర్ల మండల కేంద్రంలో ఐదుగురిని గురువారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టత రాకపోయినా ఈ అంశం ఇప్పుడు ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురి మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 5 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్-దంతెవాడ-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామంలో మావోయిస్టులుపై అంతర్ జిల్లా ఉమ్మడి ఆపరేషన్‌ను పోలీసులు, జవాన్లు సంయూక్తంగా నిర్వహించారు. ఆపరేషన్‌లో యూనిఫారం ధరించిన ఐదుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా మృతి చెందారు.పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపూర్ డీఆర్జీకి చెందిన ముగ్గురు జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కూంబింగ్‌కు వచ్చిన పోలీస్ పార్టీలను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిర్విర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీస్ పార్టీలు కూంబింగ్‌కు వెళ్లాయి. వారిని హతమార్చాలనే లక్ష్యంతో మావోలు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.ఈ డంప్‌లో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్ మైన్స్, ఖేల్ కంపెనీకు చెందిన ఒక పేలుడు పదార్థం, 150 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, ఐదు కిలోల మేకులు, ఇనుప నట్లు, విప్లవ సాహిత్యం ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలో మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌లన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మావోల కుట్రపూరిత ప్రణాళికలపై గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.మావోలకు పేలుడు పదార్థాలు లభించడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పనసలబంద అటవీ ప్రాంతంలో అధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. డంప్‌ను స్వా«దీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీలేరు ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్ఐ శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. -
ప్రశాంత పోలింగ్‌కు టెక్ పోలీసింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. అందుకోసం మరింత విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమాయత్తమైంది. ప్రధానంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం దాదాపు లేదు. కానీ మన రాష్ట్ర సరిహద్దులకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు ఇంకా పట్టుండటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటోంది.ఇక ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిస్తారని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఉనికి చాటుకునేందుకైనా ఎక్కడో ఒకచోట పోలింగ్‌ను భగ్నం చేసేందుకు యత్నించవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే ఏవోబీలోని మారుమూల గ్రామాలు, గూడేల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా వాడుకోనుంది. ♦ ఏవోబీలో పోలింగ్ నిర్వహణ కోసం డ్రోన టెక్నాలజీని తొలిసారిగా వినియోగించాలని నిర్ణయించింది. జమ్ము–కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తొలిసారిగా ఈ ఎన్నికల కోసం ఏవోబీలో ప్రవేశపెట్టనుంది.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలీసు నిఘా విధుల కోసం డ్రోన్లను ఉపయోగించనున్నారు. మొత్తం ఏవోబీ అంతా నిఘా పెట్టేందుకు అవసరమైన డ్రోన్లను ఇప్పటికే పోలీసు శాఖ తెప్పించింది. ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మావోయిస్టులు, అనుమానితుల కదలికలపై ఈ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ♦ ఏవోబీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శాటిలైట్ మ్యాపింగ్ చేసేందుకు పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ కోసం గతంలో పోలీసు శాఖ ఎంపిక చేసిన ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసింది. ఈసారి మొత్తం ఏవోబీ ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది.ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్న ప్రధాన మార్గాలు, అడ్డదారులు, డొంకదారులతోసహా మొత్తం ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయనున్నారు. తద్వారా మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే వెంటనే గుర్తించి పోలీసు బలగాలను అప్రమత్తం చేయవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది. ♦ ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు ఏవోబీ అంతటిని పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పట్టనున్నాయి. అందుకోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై మావోయిస్టులు దొంగదెబ్బ తీయకుండా ఆధునిక జీపీఎస్ టెక్నాలజీని వారికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ విధుల కోసం ఏవోబీలో మోహరించే భద్రతా బలగాలు కూడా అదే జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకోనున్నాయి. -
పక్కా సమాచారం.. పకడ్బందీ వ్యూహం
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే.. 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్), డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్‌లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్‌ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం. ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు. 1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్కౌంటర్లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు ధ్రువీకరించిన సోదరులు ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. -
Bastar Encounter: 29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్ రేజం్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుషు నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్‌ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. నాలుగు గంటల పాటు హోరా హోరిగా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌటర్లో భారీ ఎన్కౌటర్తో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బస్తర్ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఈయన పై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్ బూత్‌లను నెలకొల్పామన్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది. -
ముగిసిన అన్నె సంతోష్ అంత్యక్రియలు
కాటారం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలు సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు అన్నె సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు విప్లవ గీతాలు, నినాదాలతో అంకుషాపూర్ నుంచి దస్తగిరిపల్లిలోని తన ఇంటి వరకు సంతోష్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకువచ్చారు. 23 ఏళ్ల తర్వాత సంతోష్ విగతజీవిగా రావడం చూసి గ్రామస్తులు బోరున విలపించారు. కాగా, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, సత్యవతి, విరసం నాయకులు బలసాని రాజయ్య, మహేందర్, శంకర్, ప్రగతిశీల నాట్యమండలి కళాకారులు నవత, పౌరహక్కుల సంఘం నాయకుడు వినోద్, ప్రజాఫ్రంట్ నాయకులు కొంరయ్య, రవి, తదితరులు.. సంతోష్‌కు నివాళులర్పించారు. సాయంత్రం స్వగ్రామం చేరుకున్న సంతోష్ మృతదేహం.. కర్రెగుట్ట అడవుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సాయంత్రం అధికారికంగా నిర్ధారించారు. సంతోష్ మృతదేహాన్ని గుర్తించడానికి ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రజాప్రతినిధి ద్వారా తల్లిదండ్రులు అన్నె ఐలయ్య, సమ్మక్కను బీజాపూర్‌కు పంపించారు. వారు ఉదయం అక్కడికి చేరుకునే లోగా సంతోష్‌గా భావించే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఉంచారు. వారు తమ కుమారుడే అని గుర్తించడంతో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో సంతోష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి సాయంత్రమైంది. కొనసాగిన పోలీసుల నిఘా.. సంతోష్ అంత్యక్రియల సమయంలో అడుగడుగునా పోలీసులా నిఘా కొనసాగింది. ఇంటెలిజెన్స్, సివిల్ పోలీసులు మఫ్టీలో సంతోష్ అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నిఘా పెట్టారు. -
ముగిసిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం
హన్మకొండ: విప్లవ గీతాలకు ఆకర్షితుడై, నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందాడు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులతో పాటు కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి.. సంతోష్ మృతిని నిర్ధారించారు. 18 ఏళ్ల వయసులో అడవి బాట.. కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన అన్నె సమ్మక్క, ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. వారిలో మొదటి కుమారుడు సంతోష్ కాగా, ఇద్దరు కవలలు రామ్ లక్ష్మణ్, కుమార్తె హైమావతి. సంతోష్ బాల్యం తన అమ్మమ్మ ఇంటి వద్ద మహాముత్తారం మండలం దుంపిళ్లపల్లిలో కొనసాగగా 7వ తరగతి వరకు అంకుషాపూర్‌లో చదువుకున్నాడు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు. పలు కారణాలతో చదువు మానేసిన సంతోష్.. డ్రైవింగ్ నేర్చుకుని జీప్, కారు డ్రైవింగ్‌కు వెళ్తుండేవాడు. తన 18వ ఏట దుంపిళ్లపల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి పీపుల్స్‌వార్ విప్లవ రచనలు, గీతాలకు ఆకర్షితుడై వివాహం జరిగి ఆరు నెలలు గడవక ముందే 2001లో అడవి బాట పట్టాడు. గ్రామ పరిసరాల్లోకి అన్నలు వచ్చారనే సమాచారం తెలుసుకున్న సంతోష్.. అక్కడికి వెళ్లి వారితో పాటు వెళ్లిపోయాడు. విషయం తెలియని తల్లిదండ్రులు డ్రైవింగ్‌కు వెళ్లాడని అనుకోగా ఆ సమయంలో కాటారం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సదానందం గ్రామంలోకి వచ్చి మావోలతో వెళ్లినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. 23 ఏళ్లుగా పలు బాధ్యతల్లో.. 2001లో మావోయిస్టుల్లో చేరిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ 23 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మొదట దళసభ్యుడిగా, కొన్ని ఏళ్ల తర్వాత అసిస్టెంట్ దళ కమాండర్‌గా, డివిజనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంతోష్ కమిట్మెంట్ను గుర్తించిన మావోయిస్టు అగ్రనాయకత్వం.. ఇటీవల దండకారణ్య తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌తో పాటు సెకెండ్ సీఆర్సీ కమాండర్‌గా బాధ్యతలు అప్పగించింది. 23 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు పోలీసులకు చిక్కని సంతోష్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశాడు. కాగా, ఎన్కౌంటర్లో సంతోష్ మృతి చెందాడనే వార్త ఉదయమే గ్రామంలో విస్తరించింది. బీజాపూర్ పోలీసులు సంతోష్‌గా నిర్ధారించి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. సంతోష్ మృతి విషయం గ్రామంలో చక్కెర్లు కొట్టినా తల్లిదండ్రులు మాత్రం ఇందులో చనిపోయింది తమ కొడుకు కాదని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా వారు ఐనవోలు జాతరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. సంతోష్ ఫైల్ ఫొటో చూపించినా వారు గుర్తుపట్టలేదు. దీంతో సాయంత్రం వరకు పోలీసులు సైతం సంతోష్ మృతిని నిర్ధారించలేకపోయారు. చివరకు మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో సంతోష్ మృతిని అధికారికంగా నిర్ధారించారు. పేదరికంలో తల్లిదండ్రులు.. వృద్ధులైన సంతోష్ తల్లిదండ్రులు సమ్మక్క, ఐలయ్య పేదరికంలో కాలం వెల్లదీస్తున్నారు. సరైన ఇళ్లు కూడా లేకపోవడంతో గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు 18 ఏళ్లలో అడవి బాట పట్టగా.. రెండో కొడుకు కొంత కాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో వారు కూలీ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. పోలీసుల సహకారం.. పేదరికంలో కొనసాగుతున్న సంతోష్ తల్లిదండ్రులకు కాటారం పోలీసులు పలుమార్లు సాకారం అందిస్తూ వస్తున్నారు. నిత్యం వారి బాగోగోలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసమైన సంతోష్ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు అనేకమార్లు సందేశమందించారు. 22 ఏళ్ల క్రితం చూసినం.. మా కొడుకు అన్నల్లోకి పోయి 23 ఏళ్లు అవుతుంది. 18 ఏళ్లు ఉన్నప్పుడు అన్నల్లోకి పోయిండు. ఏడాది అయినాక ఓ రోజు రాత్రి అన్నలతోని గ్రామంలోకి వచ్చాడు. అప్పుడు చీకట్లో చూసినం. ఇది వరకు ఏ రోజు కూడా మా కొడుకు మొఖం తెల్వదు, మాట తెల్వదు. ఏదో కానరాని అడువుల్లో ఉంటాండు అని వాళ్లు, వీళ్లు చెబుతుంటే విన్నం. ఎప్పుడైన ఇటు దిక్కు వస్తే కాళ్లు పట్టుకొని ఇంటికాడనే ఉంచుకుందామని చూసినం. కానీ ఆ దేవుడు ఒక్కసారి కూడా కనికరించలే. ఏడేళ్ల కిందట పక్క రాష్ట్రంల ఎన్కౌంటర్ జరిగితే పోలీసోళ్లు మమల్ని ఠాణాకు తీసుకుపోయి మీ కొడుకేనా అని ఫొటోలు చూపించిండ్రు. మా కొడుకు కాదని వచ్చినం. ఇప్పుడు కూడా ఫొటోలో గుర్తుపట్టలేం. మా కడుపు గట్టిది అయితే మా కొడుకు బతికి ఉంటడు. లేకపోతే ఆ దేవుడి దగ్గరికి పోతడు. – అన్నె ఐలయ్య, సమ్మక్క -
సోమా కాంతిసేన్కు బెయిల్
న్యూఢిల్లీ: 2018 నాటి ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ సంబంధాల కేసులో ఉద్యమకారిణి సోమా కాంతి సేన్(66)కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సుదీర్ఘకాలం నిర్బంధించడంతోపా టు అభియోగాల నమోదులో అవుతున్న జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం తెలిపింది. మావోయిస్ట్ పార్టీకి కొత్త రిక్రూ ట్మెంట్ల కోసం ఆమె సాయం చేసినట్లుగా ఎన్ఐఏ ఎటువంటి ఆధారాలను చూపలేక పోయిందని పేర్కొంది. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజు వెల్లడించారు. మృతులు మావోల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలా ఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్ క్రాంతి(38), రఘు అలియాస్ షేర్ సింగ్(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగ్‌పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది. తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు. కేసు వివరాలు ఇలా.. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
Maoist: 37 సంవత్సరాలకు పోలీసుల చేతికి చిక్కిన వజ్జయ్య
బయ్యారం: మండలంలోని రామచంద్రాపు రం గ్రామానికి చెందిన కుర్సం వజ్జయ్య అలి యాస్ అశోక్ పేద ఆది వాసీ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు బాల్యంలో వజ్జయ్యను ఓ రైతు వద్ద పాలేరుగా పెట్టారు. ఆ సమయంలో బయ్యారం మండల ఏజెన్సీలో అప్ప టి ప్రజాపంధా ఇప్పటి న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో వజ్జయ్య నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పాలేరుగా పనిచేస్తున్న సమయంలోనే దళసభ్యుడిగా ఉద్యమంలో చేరాడు. నిరక్షరాస్యుడిగా పార్టీలో చేరిన వజ్జయ్య తన పేరును అశోక్‌గా మార్చుకోవడంతోపాటు నాయకుల ప్రేరణతో చదువు నేర్చుకున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో బలమైన విప్లవపార్టీకి అజ్ఞాత నాయకుడిగా కొనసాగుతున్న అశోక్‌ను హతమార్చటమే లక్ష్యంగా మావోయిస్టు, ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, చలమన్న పార్టీలు పలుమార్లు దాడులు జరిపాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు మండలంలోని భీరోనిమడువ అటవీప్రాంతంలో అశోక్ దళంపై దాడి జరిపి ఆయుధాలను ఎత్తుకెళ్లగా అశోక్ క్షేమంగా బయటపడ్డాడు. ప్రజాప్రతిఘటనకు చెందిన శంకరన్న సైతం అశోక్ లక్ష్యంగా దాడులు జరపగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈక్రమంలో 37 సంవత్సరాలకు అశోక్ పోలీసులకు చిక్కాడు. నక్సల్స్ దళనేతగా కొనసాగుతున్న సమయంలో ఇర్సులాపురం గ్రామానికి చెందిన ఎనుగుల మల్లేష్, బండారి మల్లయ్య, అడ్వకేట్ రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి, జగత్రావుపేట గ్రామానికి చెందిన పర్శిక బొర్రయ్య, బయ్యారానికి చెందిన గోపి హత్య కేసులు అశోక్‌పై నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర కేసులు సైతం ఉన్నట్లు తెలుస్తుంది. అశోక్, గోపన్నను విడుదల చేయాలి.. పోలీసులు అదుపులోకి తీసుకున్న అశోక్, గోపన్నతోపాటు పుల్లన్నను విడుదల చేయాలని కోరుతూ న్యూడెమోక్రసీలోని ఇరువర్గాల ఆధ్వర్యంలో మండలంలోని బయ్యారం, గంధంపల్లి– కొత్తపేట, వెంకట్రాంపురంలో ఆందోళనలు నిర్వహించారు. నాయకులు ఐలయ్య, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, పద్మ, భిక్షం, వీరభద్రం, మధు, నాగేశ్వరరావు, కుమారి పాల్గొన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా భేజీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
మావోల సరికొత్త ఎత్తుగడ
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో బంకర్ వెలుగుచూసిన నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నట్టు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా బస్తర్ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనతన సర్కార్‌ను నిర్వీర్యం చేసేందుకు భద్రతాదళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి. దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఈ మేరకు 80 పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్‌ను గోండు భాషలో తయారు చేశారు. ఇందులో ఉన్న రణతంత్ర వివరాలపై గతంలోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిని ఆతర్వాత కొందరు హిందీలోకి అనువదించినట్టు తెలిసింది. ఆకాశదాడులు తిప్పికొట్టేలా.. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తుండగా, మావోయిస్టుల ఏరివేతకు వాయు దాడులు చేయడం లేదని భద్రతాదళాలు చెబుతున్నాయి. డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు. ఇలా భిన్నవాదనలు ఉన్నా, ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు. ఈమేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్లో చర్చించారు. తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు. డ్రోన్లు, హెలికాప్టర్ దాడులను తిప్పికొట్టేలా ‘చెట్లపై నుంచి రాకెట్ లాంచర్లు పేల్చడం’పై కేడర్‌కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తయిన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే లాంగ్ పైప్ బాంబులను ప్రయోగించే దానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడడుగుల బంకర్లు డ్రోన్లు, హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డాక్యుమెంట్లో చర్చించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అడవిలో ఆరుబయట ప్రాంతంలో కాకుండా పైనుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే...కనీసం మూడు అడుగుల లోతుతో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కొత్తగా మావోయిస్టు స్నైపర్ టీమ్‌లు మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు, ప్లాటూన్లు, లోకల్ గెరిల్లా స్క్వాడ్, యాక్షన్స్ టీమ్‌లు ఉన్నాయి. అయితే అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ క్యాంపులు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలుదిశలా కూంబింగ్ చేస్తున్నాయి. దీంతో భద్రతాదళాలపై అందుబాటులో ఉన్న కేడర్‌తో అంబూష్ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. కనీసం కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్నైపర్ టీమ్‌లు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అడవుల్లోకి వచ్చే భద్రతాదళాలపై స్నైపర్ టీమ్ దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగినా భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతల సమావేశం? దంతెవాడ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో వెలుగుచూసిన బంకర్లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావును మావోయిస్టు పార్టీ నియమించింది. అంతకుముందు ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన నాయకులు తాజాగా వెలుగు చూసిన బంకర్లోనే సమావేశమైనట్టు తెలుస్తోంది. :::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
-
మావోయిస్ట్ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్..!
సాక్షి, వరంగల్\మహబూబబాద్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం మావోయిస్ట్ పార్టీ పేరుతో ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ముద్రించిన కరపత్రాలు మండలకేంద్రంలోని దుకాణాల ఎదురుగా, పొగుళ్లపల్లి, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో రోడ్డుపై వేసి వాటిమీద రాళ్లు ఉంచారు. మతతత్వ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మృతిచెందడం, ఆయన భార్య సమ్మక్క జన జీవన స్రవంతిలో కలవడంతో కొత్తగూడ, గంగారం మండలాల్లో మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండవని భావించారు. ఏకంగా మండలకేంద్రంలో కరపత్రాలు తమ ఉనికిని చాటుకున్నారని చర్చ సాగుతోంది. కరపత్రాల నేపథ్యంతో అప్రమత్తమైన పోలీసులు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇవి చదవండి: సీఎం కేసీఆర్ మలి విడత ప్రచార షెడ్యూల్.. ఇలా.. -
ఏజెన్సీలో ఎలా?
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి తీరంలో.. ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గంట ముందుగానే సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు. అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. కరపత్రాల కలకలం ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి. -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకంఉది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద మారుతి వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా అయిదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం 1 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమయంలో వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమ్ అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్.. నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసుల కదలికలను గుర్తించిన మావోయిస్టులు ఎదురు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏ రైఫిల్, 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టుల కుట్ర
ములుగు/వాజేడు: రానున్న ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న కుట్రను గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు తిప్పికొట్టారని బుధవారం ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డీ అశోక్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కర్రె గుట్టల్లో 30 నుంచి 40 మంది సాయుధ మావోయిస్టులు పెద్ద నాయకులతో కలసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఎగోలపు మల్లయ్య, భద్రు అలియాస్ పాపన్న, ముచ్చకి ఉంగల్ అలియాస్ రఘు, మడకం మంగ అలియాస్ మాసా ఇతర దళ సభ్యులు కర్రె గుట్ట ప్రాంతంలో ఉన్నారని.. తెలంగాణలో భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం వేస్తున్నారని సమాచారం రాగా బుధవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో మావోయిస్టులు పోలీసు పార్టీలను చూసి తమ వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదని, అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా కిట్ బ్యాగుల్లో ఆలివ్‌రంగు డ్రెస్‌లు, ఇతర వస్తువులు, సుతిలి బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు సాహిత్యం, మందులు, నీటి డబ్బాలు, సీసాలు, గొడుగులు, కూరగాయలు, తాళ్లు దొరికాయని తెలిపారు. కర్రె గుట్ట ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
అజ్ఞాతం వీడండి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన అగ్రనేతలు, కేడర్ అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోవాలని డీజీపీ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజోయ్ దీపక్రావును శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో అరెస్టు చేసినట్టు డీజీపీ తెలిపారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన దీపక్‌రావు ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతంలో ఓ మావోయిస్టు సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, ఆయన కదలికలపై ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఒక రివాల్వర్, ఆరు లైవ్‌రౌండ్లు(బుల్లెట్లు), రూ.47,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియన్ టౌన్షిప్లో ఉండే మహేంద్రటెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రంజిత్శంకరన్, మాదాపూర్‌కు చెందిన ఓ సినీ దర్శకుడు బి.అజిత్‌కుమార్‌లు దీపక్‌రావుకు ఆశ్రయం ఇచ్చినట్టు గుర్తించామన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా శూన్యమని, సంజోయ్ దీపక్‌రావు అరెస్టుతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యిందన్నారు. దీపక్‌రావు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, కోసాలతో నేరుగా సంబంధాలున్నట్టు తెలిపారు. నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ సంజోయ్ దీపక్‌రావు ప్రస్తుతం కేంద్ర కమిటీతోపాటు సౌత్ రీజియన్ బ్యూరో ఇన్చార్జ్గా, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. దీపక్‌రావుపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్ ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివగంధనగర్కు చెందిన సంజయ్ దీపక్‌రావు జమ్మూకశ్మీర్‌లో 1984లో బీటెక్ పూర్తి చేశారు. 1999లో సీపీఐఎంఎల్ రవూఫ్ గ్రూఫ్‌లో తొలుత చేరారు. నక్సల్బరీ గ్రూప్‌నకు మహారాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేశారు. 2000లో ఓసారి అరెస్టు, తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2002లో అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల వ్యాప్తికి కీలకంగా పనిచేశారు. 2014లో నక్సల్బరీ, సీపీఐ మావోయిస్టులో విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2021లో పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి బీజీ కృష్ణమూర్తి అరెస్టు తర్వాత, ఆ జోనల్‌కు ప్రత్యేక జోనల్ కమిటీకి కార్యదర్శిగా నియామకం కాగా, అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
నెత్తురంటిన ఆ చేతులెవరివి బాబూ?
కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శనలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఆయన ఉండిపోయారు. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తోనే ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాలపాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. 2023 ఆగస్ట్ 6న ప్రజాగాయకుడు గద్దర్ అనూహ్య మరణం, కడసారి చూడడానికి తరలి వచ్చిన వేలాది ప్రజల మధ్య బౌద్ధ ఆచారాలతో జరిగిన ఆయన ఖననం... భారతీయ కమ్యూనిస్టులకు కొత్త దారి చూపాయి. గద్దర్ కమ్యూనిస్టు విప్లవ గాయకుడిగా, పాటల రచయితగా, కళాకారుడిగా సుపరిచితుడు. కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శ నలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాల పాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. గద్దర్ దేహాన్ని దహనం చేసివుంటే, అది గుర్తించలేని బూడిదగా మారిపోయేది. సజీవమైన చారిత్రక సాక్ష్యం మిగిలి ఉండేది కాదు. మావోయిస్టుగా జీవించినప్పటికీ, బౌద్ధ అంత్యక్రియల ద్వారా బౌద్ధ అంబేడ్కరిస్టుగా మరణించిన ఆయన, శాంతికి ప్రతినిధిగా, 25 సంవత్సరాల పాటు గాయపడిన దేహ బాధితుడిగా మనకు మిగిలిపోయారు. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తో ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. శరీరంలోని పలు అవయవాల్లో ఆరు బుల్లెట్లు దూరిన స్థితితో ఆయన మనగలిగారు. శరీరంలో ఆరు బుల్లెట్లు దూరినప్పటికీ బతికి, చివరి వరకూ శరీరంలో ఒక బుల్లెట్‌తో జీవించినట్టు యుద్ధంలో పోరాడిన ఏ సైనికుడి గురించీ మనకు తెలీదు. ఆ రకంగా మానవ చరిత్రలోనే గద్దర్ ఒక విశిష్ట వ్యక్తి. అలాంటి జీవితం ఆయన్ని అపార ప్రజాదరణ, ప్రేమాదరణలు కలిగిన మనిషిగా మార్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరగడానికి ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గద్దర్ పాడిన పాటలు, చేసిన ప్రదర్శనలు ఆయనకు ఎంతోమంది అభిమానులను సాధించిపెట్టాయి. ఆకలి, దోపిడీల నుంచి మానవ విముక్తి లక్ష్యం పట్ల ఆయన వహించిన నిబద్ధత... ఆయన్ని బాధామయ జీవితంలో గడిపేలా చేసింది. అనంతరం 1996 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర వల్ల ఆంధ్రా ప్రజలు ఆయన పట్ల అయిష్టత ప్రదర్శించి ఉండవచ్చు. అయితే, ఒక రచయితగా, కళాకారుడిగా గద్దర్ భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఉండిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ ముందు అనేక తీవ్రమైన సైద్ధాంతిక అంశాలను లేవనెత్తి, 2012లో ఆ పార్టీ నుంచి విడి పోయారు. మార్క్స్, లెనిన్, మావోతోపాటు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మహాత్మా పూలే, అంబేడ్కర్లను కూడా గుర్తించడం ద్వారా మావోయిస్టు పార్టీ కులానికీ, వర్గానికీ వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని గద్దర్ ప్రతిపాదించారు. భారతదేశంలో కులం ప్రతికూల పాత్ర గురించి పాటలు రాయడం, వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో మావోయిస్టు పార్టీ గద్దర్ పనిని పార్టీ వ్యతిరేకమైనదిగా పరిగణించడమే కాదు... ఆయన అవగాహనను మార్క్సిజం కాదని ముద్రవేసి, ఆయన ప్రతిపాదనలను తిరస్కరించి, 2010లో షోకాజ్ నోటీసు ఇచ్చింది. విప్లవ పార్టీ తనను బహిష్కరించడం ఖాయమని గ్రహించిన గద్దర్ 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు. అయితే భారతీయ కుల–వర్గ దోపిడీకి అనుగు ణంగా తన పార్టీ పంథాను మార్చడానికి గద్దర్ చేసిన ప్రయత్నం విస్మరణకు గురి కాకూడదు. అంబేడ్కరైట్ నవయాన బౌద్ధమతం పట్ల తన ఆధ్యాత్మిక సామా జిక విధేయతను గద్దర్ బహిరంగంగా ప్రకటించారు. దళితుల, మహిళల అణచివేతపై అనేక పాటలు రాశారు. అతను ఒక యాంత్రిక మార్క్సిస్ట్, బౌద్ధ లేదా అంబేడ్కరైట్ కాదు. అత్యంత సున్నితత్వం కలిగిన మానవుడు. భారతదేశంలోని కమ్యూనిస్టు నాయకులు వర్గపోరాటంతోపాటు సామాజిక సంస్కరణలను అవసరమైన అంశంగా ఎన్నడూ అంగీకరించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సాంఘిక సంస్క రణలో ఆధ్యాత్మిక సంస్కరణతో పాటు శ్రమకు గౌరవం, పురుషులతో స్త్రీల సమానత్వం కూడా భాగమై ఉన్నాయి. దానికి అంతిమ రూపం ఏదంటే కుల అసమానతలను, మహిళల అసమానతలను నిర్మూలించడం. అయితే, భారతీయ కమ్యూనిస్టులు ఆధ్యాత్మిక పరంగా తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. పైగా, ఆర్థిక నియతి వాదులుగా (ఆర్థికమే అన్నింటినీ నిర్దేశిస్తుంది అనే వాదం) వారు వర్గ ప్రశ్నలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టారు. కానీ వాస్తవానికి వారిలో ఎక్కువ మంది హిందువులుగానే మరణిస్తున్నారు. రోజువారీ జీవితంలో వారి నాస్తికత్వం ఎలాంటి సామాజిక సంస్కరణకు సంబంధించినదిగా లేదు. గద్దర్ తన మరణంతో వారికి ఒక పెద్ద సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ కార్యక్రమాన్ని అందించారు. అంబేడ్కర్ ఇలా అన్నారు: ‘‘నేను అంటరాని వ్యక్తిని అనే కళంకంతో జన్మించిన దురదృష్టవంతుడిని. అయితే, ఇది నా తప్పు కాదు. కానీ నేను హిందువుగా మరణించను, ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉంది.’’ ఇలా ప్రకటించిన తర్వాతే ఆయన బౌద్ధుడు అయ్యారు, బౌద్ధుడిగా మరణించారు. గద్దర్ అంటరాని వ్యక్తిగా జన్మించారు. అది ఆయన చేతుల్లో లేనిది. అనేక సాయుధ దళాలను కలిగి ఉన్న కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలో పనిచేశారు. ఆయన వారి ప్రజా యుద్ధ నౌక. అయితే మరణ సమయంలో తన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి శాంతి సందేశంతో బౌద్ధుడిగా మరణించిన అంబేడ్కర్ జీవన సారాంశాన్ని గద్దర్ గ్రహించారు. తాను జీవితాంతం సమర్థించిన తుపాకులు ఆ అంటరానితనం నుండి విముక్తి చేయలేదు. అందువల్లనే గద్దర్ బౌద్ధుడయ్యారు, అంటరానితనం నుండి విముక్తి పొందారు. ముఖ్యంగా, బూటకపు ఎన్కౌంటర్లలో చిత్రహింసలు పెట్టి, వంద లాది మృతదేహాలను తగులబెట్టిన ఆ రాజ్య వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడిన వ్యక్తిగా, తన శరీరాన్ని, బుల్లెట్‌ని దహనం చేసేస్తే ఆ తర్వాత తనను హింసించినట్లు ఎటువంటి ఆధారాలు మిగిలి ఉండ వని గద్దర్ గ్రహించారు. ఆ మృతదేహాలను ఖననం చేసినట్లయితే, దశాబ్దాల తర్వాత కూడా వాటిని వెలికితీసి మళ్లీ పరీక్షించవచ్చు. అందువల్ల గద్దర్ తన శరీరంలోని బుల్లెట్‌తో పాటు ఖననం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 1997లో చంద్రబాబు నాయుడి క్రూర పాలనకు నిదర్శనంగా ఆయన వెన్నులో బుల్లెట్ అలాగే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు కబ్జా చేసిన పార్టీకి ఆయన మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు. అదే సమయంలో గద్దర్ తెలుగు నేల అందించిన అత్యంత శక్తిమంతమైన తెలుగు రచయిత, గాయకుడు, సంభాషణకర్త. గద్దర్ నివసించిన బస్తీలో మహాబోధి విద్యాలయం పేరుతో ఆయన స్థాపించిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుల్లెట్‌తోపాటు ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. చంద్రబాబు ఆ సమాధి వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేసి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్ 6న ఏమి జరిగిందో కనీసం ఇప్పుడైనా నిజం చెప్పినట్లయితే, దేశం మొత్తం చంద్రబాబుని క్షమిస్తుంది. అలా పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత చంద్రబాబు తన జీవితాంతం కచ్చి తంగా మనిషిగా జీవించగలరు. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్!
సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. గోరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, భూషనవేని శ్రీనివాస్, శ్రీరాములు గోపాల్‌కు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో హెచ్చరించారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని మావోయిస్టు నేత వెంకటేష్ పేరిట లేఖ విడుదల అయ్యాయి. ‘30 మందికి పైగా ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మించి నిరుద్యోగులుగా ఉన్న యువత నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి దగ్గర 4 నుంచి 6 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించలేదు. ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించి మోసం చేయడంతో బాధితులు డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగితే నాయకులంతా ప్రభుత్వ అండదండలతో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. పోలీసులతో, రాజకీయ నాయకులతో బెదిరిస్తున్నారు. చదవండి: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు డబ్బులు వాపస్ ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకున్న వాళ్లు దిక్కులేని వాళ్లు అయ్యారు. ఆర్ఎఫ్ఎల్ బాధ్యులు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఈ ముగ్గురు భూ కబ్జాలు చేస్తూ ప్రజల మధ్య తగాదాలు సృష్టించి డబ్బులు తీసుకొని పంచాయితీలు చేయడం, వినని వారిపై కేసులు పెట్టించడం, ఇద్దరి మధ్య ఒప్పందం చేయించి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గ్రామంలో దళితులపై సమస్యలు సృష్టించి వారిని కొట్టించారు. తిరిగి పోలీసులకు చెప్పి గ్రామాన్ని దిగ్భందించి దళితులను తీసుకెళ్లి 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెట్టి ఉల్టా కేసులు పెట్టించారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు. గుండాయిజం, భూతగాదాలు, పంచాయితీలు చేయడం మానుకోవాలి, దళితులపై కేసులు ఉపసంహరించుకోని, వారికి క్షమాపనలు చెప్పాలి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని లేఖలో పేర్కొన్నారు. -
మావోయిస్టు కీలక నేత రాజిరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి (71) అలియాస్ సాయన్న మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాడపడుతున్న ఆయన ఈ నెల 16న చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేశారు. అయితే రాజిరెడ్డి మరణవార్తను మావోయిస్టులు, ఆయ న కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కొండపల్లి పరిచయంతో అడవిబాట... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్పాండేగా దళంలో ప్రసిద్ధుడు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్పూర్లో ఓ కేసులో అరెస్టు అయి వరంగల్ జైలుకు వెళ్లారు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడవిబాట పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు బీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్‌లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవభావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరారు. దళ సభ్యురాలితో వివాహం... రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురి ఆలానాపాలనను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించాడు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాశిం. నెట్టింట వీడియో వైరల్... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతిపైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రామచంద్రారెడ్డి మృతిచెందారంటూ ఓ మృతదేహం చుట్టూ పలువురు మావోయిస్టులు రోదిస్తున్నట్లున్న ఓ వీడియో గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మల్లా రాజిరెడ్డి మృతి వార్తకు సైతం అదే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం గమనార్హం. ఈ వీడియోను ఫ్యాక్ట్ చేయగా గురువారమే అది అప్లోడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం. వికల్ప్, విజయ్, రాజుదాదా, జురు, సునీల్, వాసు పేర్లతో ప్రచారంలో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులు... రాజిరెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 1986లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్సై, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య ఉండగా ఏ2గా రాజిరెడ్డి పేరు నమోదైంది. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లిని రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్‌మలైలో ఎస్ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కుట్ర కేసులో మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి, కరీంనగర్ జైలుకు తరలించారు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్‌పై బయటికి వచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి రూ.కోటి వరకు ఉంటాయని అధికారిక సమాచారం. -
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
Gaddar Demise: 'అగ్గి గళం' ఆగిపోయింది
వాగ్గేయకారుడా.. కన్నీటి వందనం గోసి గొంగడి పాట కాలి గజ్జెల మోత చేత ఎర్రజెండా పిక్కటిల్లే రేల గొంతుక.. గద్దర్ వసంతకాల మేఘ గర్జన కదనుతొక్కే ప్రజావాహిక జన కేతన.. నవ చేతన.. గద్దర్ పల్లవొక తూటా చరణమొక ఫిరంగి వేదిక పై వాగ్గేయకారుడు పెత్తందార్ల వెన్నులో చలి.. గద్దర్ తెలంగాణ సింగడి దండకారణ్య పచ్చనాకు బొగ్గుబావి దీపం రైతుకూలీ కొడవలి.. గద్దర్ పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం శ్రమజీవి పాదంపై చెరగని పుట్టుమచ్చ అతడు చరిత్ర.. జనగళ యుద్ధనౌక.. గద్దర్ ఈ నేల మళ్లీ కనలేని పాట గద్దర్. మన పాల్ రాబ్సన్. మన విక్టర్ జారా. మన బాబ్ మార్లీ. ఒకే ఒక్కడు గద్దర్. నోరులేని పేదలకు గొంతునిచ్చినవాడా మహా కవీ... అమర గాయకుడా.. నీకు వీడ్కోలు... రేల పూల మాల. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: తన పాటలతో ప్రజా బాహుళ్యాన్ని ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత నెల 20న గుండె పోటుతో అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన వైద్యులు ఈ నెల 3న శస్త్రచికిత్స చేసి సరిచేశారు. కానీ ముందు నుంచే మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ‘ఆదివారం ఉదయం అకస్మాత్తుగా రక్తపోటు పెరిగింది. షుగర్ లెవల్స్ పడిపోయాయి. మధ్యాహ్నానికల్లా శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..’’అని ఆస్పత్రి అధికారులు హెల్త్ బులెటెన్‌లో వెల్లడించారు. అభిమానుల కోసం ఎల్బీ స్టేడియానికి.. గద్దర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 5 గంటల సమయంలో ఎల్బీ స్టేడియానికి తరలించారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు నివాళి అర్పించి గద్దర్ సతీమణిని ఓదార్చారు. జోహార్ గద్దర్, అమర్ రహే గద్దరన్న అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఎల్బీస్టేడియం హోరెత్తింది. నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు గద్దర్ భౌతికకాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తొలుత సోమవారం ఉదయం గద్దర్ భౌతికదేహాన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద కొద్దిసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. తర్వాత నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ వెంకటాపూర్ భూదేవీనగర్లోని ఆయన స్వగహానికి తరలించనున్నారు. అక్కడ స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుర్రకథలతో చైతన్య పరుస్తూ.. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లక్ష్మమ్మ, శేషయ్య దళిత దంపతులకు 1949లో గద్దర్ జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. సొంత ఊరిలోనే ఏడోతరగతి వరకు చదివిన ఆయన.. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, వరంగల్‌లో పైచదువులు కొనసాగగా.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గ్రామంలో ఉన్నప్పుడే ఒగ్గుకథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలు, భాగవత రూపంలో రైతులు, కార్మిక లోకాన్ని చైతన్య పరిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి.నర్సింగరావు భగత్‌సింగ్ జయంతి రోజున గద్దర్‌తో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్ తన మొదటి పాట ’ఆపరా రిక్షా’రాశాడు. గదర్ అంటే విప్లవం సిక్కు కూలీలు, పనివాళ్లు పెట్టుకున్న పార్టీ పేరు గదర్.. గదర్ అంటే విప్లవం అని అర్థం. దీని నుంచి స్ఫూర్తి పొంది ఆయన రాసిన పాటల మొదటి ఆల్బంకు గదర్ అని పెట్టారు. ఇది ప్రజల్లోకి వెళ్లి ఆయన గద్దర్‌గా నిలిచిపోయారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన నక్సల్ మార్గం పట్టారు. 1982లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్యమ బాట పట్టారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథలు, బుర్ర కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పాటల రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. గోచీ,గొంగళి..చేతి కర్ర,ఎర్ర జెండా.. గద్దర్ పాటకు ఎంత ప్రాచుర్యం ఉందో, ఆయన ఆహార్యానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా గొంగళి కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ స్టేజీపై ఆడి, పాడుతుంటే లక్షలాది మంది కళ్లు, చెవులు అప్పగించేసేవారు. జీరబోయిన గొంతుతో పాటకట్టే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమానికి దూరమైన తర్వాత గద్దర్ వేషధారణ సైతం మారింది. పలుమార్లు ప్యాంట్, షర్ట్, కోట్లోనూ కనిపించారు. 70 ఏళ్ల వయసులో.. ఓటర్‌గా నమోదై.. నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్.. బూర్జువా పార్టీల, ఎన్నికల వ్యవస్థలో పాలుపంచుకోబోనంటూ ఓటర్‌గా కూడా నమోదు చేసుకోలేదు. మావోయిస్టుల నుంచి దూరమైన తర్వాత 2018లో తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకుని.. ఆ ఏడాది డిసెంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. ‘‘పోరాటం అంటే తుపాకుల పట్టుకోవడం కాదు.. తిరుగుబాటు చేయడం అని గుర్తించి ప్రజా జీవితంలోకి వచ్చా. రాజ్యంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారి ఓటు హక్కును తీసుకున్నా.. 70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు వేశా. ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ, గొంగడి, గజ్జెలు జమ్మిచెట్టు మీద పెట్టిన..’’ అని ఆ సమయంలో గద్దర్ ప్రకటించారు. ► తర్వాత ఆయన ‘గద్దర్ ప్రజాపార్టీ’ పేరిట ఒక రాజకీయ పార్టీని కూడా స్ధాపించారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మావోయిస్టులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాబోధి విద్యాలయ ఏర్పాటు అల్వాల్: స్థిరమైన జీవితం లేదని చాలాచోట్ల వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్చుకునేవారు కాదు. దీంతో గద్దర్ అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో భూదేవినగర్‌లో మహాబోధి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి విమల, కూతురు వెన్నెల ఈ పాఠశాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ‘బండెనక బండి కట్టి’తో వెండితెరపైకి.. గద్దర్‌కు రెండు నంది అవార్డులు ప్రజాగాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. సాయిచంద్ హీరోగా గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మా భూమి’(1979) సినిమాలో తొలిసారి వెండితెరపై పాట పాడటంతోపాటు నటించారాయన. ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాటలో గద్దర్ కనిపిస్తారు. ఆ తర్వాత బి.నర్సింగరావు నటించి, దర్శకత్వం వహించిన ‘రంగుల కల’(1983) చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషించారు. జగపతిబాబు హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’(2011) మూవీలో కీలకపాత్రలో నటించారాయన. ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’(2016), సుడిగాలి సుదీర్ నటించిన ‘సాఫ్ట్వేర్ సుదీర్’(2019), చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్’(2022) సినిమాల్లోనూ నటించారు. ఆర్.నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో గద్దర్ పాటరాయగా, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన ‘మల్లెతీగకు పందిరి వోలే..’ పాట అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పాటల్లో ఒకటిగా నిలిచింది. ‘జై బోలో తెలంగాణ’ మూవీ కోసం గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు పాటలకు నంది అవార్డులు(రచయిత, గాయకుడుగా) గద్దర్‌కు వచ్చాయి. విప్లవ ఉద్యమంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు తీసుకోకూడదనే నిబంధన ఉండటంతో నంది అవార్డులు తీసుకోలేదని గద్దర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ చిత్రంలోనూ ఆయన పాటలు రాశారు. ఇవే కాదు, ఆయన రాసిన మరికొన్ని పాటలు సినిమాల్లో ప్రేక్షకులను అలరించాయి. ‘నేను రాసిన వేల వేల పాటలకు నా భార్య విమలే స్ఫూర్తి అని గద్దర్ గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తన పాటలంటే ఎంతో ఇష్టమని, ఆయనపై వ్యతిరేకంగా పాడినా మెచ్చుకునేవారని 2017 జూన్‌లో ‘మెజార్టీకే రాజ్యాధికారం’అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప వచ్చిన సందర్భంలో గద్దర్ అన్నారు. గద్దర్ నటించిన చివరిచిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీలో గద్దర్ కీలక పాత్ర పోషించడంతో పాటు పాటలు రాశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కుటుంబమంటే ఎంతో మమకారం బ్యాంకులో ఉద్యోగం చేస్తు న్న సమయంలోనే గద్దర్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. వీరికి ముగ్గురు పిల్లలు. సూర్యకిరణ్, చంద్రకిరణ్ (2003లో అనారోగ్యంతో మరణించారు), కూతురు వెన్నెల. గద్దర్‌కు సరస్వతిబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని ముగ్గురు అక్కలు. నర్సింగ్‌రావు అనే అన్న ఉన్నారు. గద్దర్‌కు కుటుంబమంటే ఎంతో ప్రాణం. భార్య విమల సహకారాన్ని తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబానికి, తనకు ఆమె అండగా ఉన్న తీరును చెప్పేవారు. ఆ పాటలు అగ్ని కణాలు.. అమ్మ కష్టం మొదలు సమాజంలో అనేక విషయాలపై పాటలు రాసిన గద్దర్.. రచయితగా తాను రాసిన అనేక పాటలకు అప్పటికప్పుడు పల్లవులు కట్టేవారు. తొలినాళ్లలో కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి సామాజిక విషయాలపై బుర్ర కథల ద్వారా అవగాహన కల్పించేవారు. తర్వాత స్వయంగా పాటలు రాశారు. 1970వ దశకంలో ఉద్యమానికి బాసటగా నిలిచిన జననాట్యమండలితో కలసి గద్దర్ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతుకగా మారారు. ‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి..’ అని గద్దర్ రాసి, పాడిన పాట అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టేలా చేసింది. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. విప్లవానికి ఊపిరినిచ్చి.. ఉద్యమానికి ఊపు తెచ్చి.. గద్దర్ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజలు చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్ మోగించేది. దొరలు, పాలకుల దౌర్జన్యాన్ని ఎదిరించడం నేర్పి వేలాది మంది యువత తుపాకులు చేతపట్టేలా చేసింది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ పాట ప్రాణం పోసింది. ‘అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల రాజ్యామా..’అంటూ ఆయన రాసి, పాడిన పాట.. ధూంధాం కార్యక్రమాలు ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతి పల్లె కళాకారుడు గద్దర్ స్ఫూర్తిగా గోచీ, గొంగళి కట్టి నృత్యం చేశారు. ఉద్యమాల్లో అమరులైన వారి కోసం ఏర్పడ్డ బంధుమిత్రుల కమిటీలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదికాదంటూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాన్ని చేపడతానని ప్రకటించారు. వివిధ పార్టీల నేతలనూ కలిశారు. ఓరుగల్లు నుంచి పొలికేక సాక్షిప్రతినిధి, వరంగల్: పీపుల్స్‌వార్ పార్టీపై 1990లో ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న పీపుల్స్‌వార్ నేతలు, లీగల్ కార్యకర్తలు, జననాట్యమండలి, అనుబంధ సంఘాల నాయకులు జనజీవనంలోకి అడుగుపెట్టారు. ఇదే సమయంలో 1990 మే 5, 6 తేదీల్లో వరంగల్ వేదికగా రాష్ట్ర రైతుకూలీ సంఘం మహాసభలు నిర్వహించారు. జననాట్యమండలి నాయకుడు గద్దర్, ఆయన బృందం ప్రకాష్ రెడ్డిపేట ఏరియాలో ఏర్పాటు చేసిన సభావేదికపైన ప్రత్యక్షమైంది. పదిలక్షలకుపైగా జనం హాజరైన ఈ సభలో గద్దర్ బృందం ఆటాపాటా ఉర్రూతలూగించాయి. ‘ధీరులారా శూరులారా.. రాడికల్ శూరులారా.. మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు..’, ‘జై బోలోరే జై బోలో.. అమర వీరులకు జై బోలో.. వీరులకేమో జై బోలో.. ఆహా శూరులకేమో జై బోలో..’అంటూ పాడిన పాటలు ఇప్పటికీ అందరి నోట్లో వినిపిస్తాయి. గద్దర్ ప్రస్థానంలో ఓరుగల్లు మహాసభ చిరస్థాయిగా నిలిచింది. ఎన్కౌంటర్ నుంచి తప్పించిన కానిస్టేబుల్ నక్సల్స్‌పై తీవ్ర అణచివేత కొనసాగుతున్న 1988–90 మధ్య కాలంలో గద్దర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఓసారి గద్దర్, ఇతర మావోయిస్టులు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలో పోలీసులు దాడి చేసి గాలించారు. ఆ సమయంలో గద్దర్ ఓ ఇంటి అటకపై దాక్కున్నారు. ఒక కానిస్టేబుల్ అటకపై గద్దర్‌ను చూసినా.. ఎవరూ లేరని అబద్ధం చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేకుంటే గద్దర్ ఆరోజే ఎన్కౌంటర్ అయ్యేవారు, ఆనాడు కాపాడిన కానిస్టేబుల్ దళితుడని తర్వాత గద్దర్ వెల్లడించారు. బతికుంటే.. మళ్లీ వస్తా సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చివరిసారిగా ఏప్రిల్ 30న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ పాట పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అచ్చంపేటలో నాలుగు ప్రాణాలు పోయినప్పుడు ఇక్కడికి వచ్చాను. మొదటి తుపాకీ తూట నా గుండెను తాకినప్పుడు.. నెత్తురు కోసం రూ.100 కావాలని నా భార్య పైసలు అడుక్కుంది. మళ్లీ బతికి ఈ ఊరికి వచ్చిన. చివరి ఊపిరి వరకు మీ కోసం పాటుపడతా. పాలమూరుకు పేరు తేవాలి. ఈ నేల కోసం పోరాటం చేయాలి. బతికుంటే మళ్లీ వస్తాను.. మీ పాదాలకు వందనాలు’అంటూ పాట రూపంలో చెప్పారు. ఓయూ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో 1975లో ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. నగరంలోని మొజంజాహీ ఎస్సీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి చెప్పులు లేకుండా వచ్చేవారని ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఓ హోటల్లో 26 పైసలకు పార్ట్టైంపనిచేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నారు. జార్జిరెడ్డి హయాంలో అనేక ఉద్యమాలకు ఓయూ కేంద్రబిందువు అయ్యింది. వామపక్ష ఉద్యమభావజాల వ్యాప్తి కోసం ఇక్కడ జరిగిన అనేక సభలు, సమావేశాలలో జననాట్యమండలి తరపున గద్దర్ పాల్గొన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో జరిగిన ప్రతి సభలో పాల్గొని తన ఆటపాటతో విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. గద్దర్ జీవితంలో కీలక ఘట్టాలివీ... ► 1972లో బ్యాంకు ఉద్యోగం సాధించారు. ∙1975లో సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ► 1975, అక్టోబర్ 9న విమలతో గద్దర్ వివాహం చేసుకున్నారు. ► 1973 నుంచి గద్దర్ పాటలు రాయడం ప్రారంభించారు. ► 1977లో బి. నరసింగరావు ‘మా భూమి’సినిమాలో గద్దర్ ‘బండెనక బండి గట్టి’అనే పాటను పాడారు. 1978లో గద్దర్ మొదటిసారిగా జననాట్యమండలి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1980లలో గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్యమండలి సభ్యునిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. పీపుల్స్‌వార్‌పార్టీ బహిష్కరణ తర్వాత గద్దర్ కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత పార్టీ తిరిగి ఆయనను ఆహ్వానించింది. ► 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ► 1998లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా గద్దర్ ఎన్నుకోబడ్డారు. ► 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. ► 2010, అక్టోబర్ 9న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఛైర్మన్‌గా గద్దర్ నియమితులయ్యారు. ► 2017లో గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. చేతిలో ఎర్రజెండా వదిలి..బుద్దుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నట్టు ఆయన ఆ సందర్భంగా ప్రకటించారు. బతుకుదెరువు నిమిత్తం పాలమూరు నుంచి నగరానికి వలస వచ్చిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భూదేవినగర్ రైల్వే ట్రాక్ పక్కన వారికి ఆశ్రయం కల్పించి గద్దర్ అండగా నిలిచారు. వందలాది కుటుంబాలు ఆయన నీడలో జీవనం సాగిస్తున్నాయి. గద్దర్ మరణంతో మాకు దిక్కెవరంటూ భూదేవినగర్వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. – అల్వాల్ -
ఎట్టకేలకు గొన్సాల్వేజ్, ఫెరీరా విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి విచారణ ఖైదీగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపిన సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరాలు ఎట్టకేలకు జైలు నుంచి బెయిలుపై బయటికొచ్చారు. గత వారం వారికి బెయిల్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం తెల్సిందే. శనివారం ప్రత్యేక కోర్టు సంబంధిత విడుదల పత్రాలను నవీ ముంబైలోని తలోజ కారాగారం అధికారులకు పంపడంతో వారం తర్వాత ఎట్టకేలకు వారు బయటికొచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తూ ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 16 మంది అరెస్టయ్యారు. గొన్సాల్వేజ్, అరుణ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో నిందితుడు ఒక మొబైల్ వాడుకోవచ్చని, వారు ఉండే అడ్రస్ ఎన్ఐఏకు ఇవ్వాలని, సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్‌లకు గతంలో సాధారణ బెయిల్ రాగా, అనారోగ్య కారణాలతో విప్లవ కవి వరవరరావు బెయిల్ సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికొచ్చిన కార్యకర్త గౌతమ్ నవ్లఖా ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు. -
బీరెల్లి కుట్ర కేసుపై ఎన్‘ఐ’ఏ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘బీరెల్లి’కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 152/2022 ప్రకారం 2022, ఆగస్టు 19న 152 మందిపై కేసు నమోదైంది. తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు నేతలతోపాటు కొందరు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు (ప్రాక్షన్ కమిటీ మెంబర్లు) సమావేశం ఆయ్యారనేది ఆ ఎఫ్ఐఆర్లోని సారాంశం. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తోపాటు 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్ హరగోపాల్ సహా 152 మందిపై నేరాభియోగం మోపారు. ఈ కేసు ఇటీవల వివాదాస్పదం కావడంతో డీజీపీ ఆదేశాల మేరకు విచారణ జరిపారు. ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు జస్టిస్ సురేష్ (లేట్), వి.రఘునాథ్, జర్నలిస్ట్ పద్మజా షా, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్‌లపై ‘ఉపా’కేసులు ఎత్తివేశారు. ఈ మేరకు జూన్ 17న ప్రకటన చేసిన ములుగు ఎస్పీ గౌస్ ఆలం.. మిగతా వారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసు పూర్వాపరాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుండటం చర్చనీయాంశమైంది. ‘ఉపా’కేసులో ఎన్ఐఏ ఆరా 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కుట్ర కేసులో 152 మంది పేర్లుండగా.. అందులో చాలా మందిని గతంలో నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థినిని మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసినా.. 2021 మే 31వ తేదీన కేసు మళ్లీ తెరిచి దర్యాప్తు చేయాలని ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2022 సెప్టెంబర్ మొదటి వారంలో కేసును స్వీకరించిన ఎన్ఐఏ రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్ జిల్లాల్లో సోదాలు నిర్వహించి హైకోర్టు న్యాయవాది, చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలు చుక్కా శిల్పను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. డి.దేవేంద్ర, దుబాసి స్వప్నలను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. పర్వతపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేడ్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే క్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో క్రియాశీలకంగా పని చేశారన్న సమాచారంతో హనుమకొండకు చెందిన సముద్రాల అనిత, ఆమె తల్లి ఇంట్లో కూడా 2022 సెపె్టంబర్ 5న దాడులు చేయడం అప్పట్లో కలకలం రేపింది. వీరందరితోపాటు మరో నలభై మంది వరకు వివిధ కేసుల్లో ఎన్ఐఏ నిందితులుగా పేర్కొన్న వారి పేర్లు కూడా ‘బీరెల్లి’కుట్ర కేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆరా తీస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వివరాలు సేకరించిన ఏపీ ఇంటెలిజెన్స్ ములుగు జిల్లా తాడ్వాయి పోలీసుస్టేషన్లో కేసు నమోదైనా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. 13 మంది మావోయిస్టు పా ర్టీల నేతలతోపాటు 20 సంఘాలకు చెందిన 146 మందిపై 10 సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ జరుగుతోంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రజాసంఘాల ప్రతినిధుల పేర్లుండగా.. ఇదే కేసు విషయమై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు రెండు రోజుల క్రితం ములుగు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినట్లు తెలిసింది. తాడ్వాయి, పస్రా ఎస్‌హెచ్‌వోలు, స్పెషల్‌బ్రాంచ్ అధికారులతోనూ మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. -
‘అన్న’లకు అనారోగ్యం!
ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్‌లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. మంచానికే పరిమితమైన గణపతి? మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్ జోన్ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఇవే ఆరోపణలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మేం చూసుకుంటామంటున్న ఖాకీలు పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం..
సారంగాపూర్(జగిత్యాల): జిల్లాలోని బీర్పూర్ మండలం సుమారు 15ఏళ్లక్రితం వరకూ మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్)లకు పెట్టని కోటలా ఉండేది. కానీ, శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల పేరిట లేఖలు రావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి స్వగ్రామం నిన్నటివరకూ ప్రశాంతంగా ఉంది. కానీ, నక్సల్స్ లేఖలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ పేరిట లేఖలు.. ► గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరిట స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు అందినట్లు తెలిసింది. ► సీపీఐ – మావోయిస్టు జగదల్పూర్ జిల్లా ఏరియా కమిటీ పేరిట లెటర్హెడ్లపై ఆ లేఖలు ఉన్నాయి. ► మరికొన్నింటిపై మల్యాల ఏరియా కమిటీ ఉంది. ► వీటిని సానుభూతిపరులు పంపించారా, గతంలో నక్సల్స్‌తో సంబంధాలు నెరిపిన వారు పొస్టు చేశారా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. లేఖల్లో ఏముందంటే.. ► అటవీభూములు కబ్జా చేసి, అక్రమంగా పట్టాలు చేశారని, ఈవిషయంలో రెవెన్యూ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. అడవుల్లో చెట్లు నరికినా, భూములు కబ్జా చేసినా, అందుకు ప్రోత్సహించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ► నర్సింహులపల్లె గ్రామంలో ఓ వ్యక్తి అక్రమంగా దుకాణం నిర్మించారని, తక్షణమే తొలగించాలని లేఖల్లో హెచ్చరించారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పంచాయితీలు చేస్తున్నారని, అక్కడిదాకా వెళ్లకుండా చూడాలని సూచించారు. మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారని ప్రస్తావించారు. పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం.. ► అప్పటి నక్సల్స్ నేత పద్మక్క మార్చి 2003లో ఓ వ్యక్తికి రూ. 15 లక్షలు ఇచ్చారని, ఇందులో రూ.1,000 నోట్లు, రూ.500 నోట్లు ఉన్నాయని లేఖలో తెలిపారు. కొద్దిరోజులకే నేరెళ్ల ఎన్కౌంటర్లో పద్మక్క మృతిచెందారని, ఆమె ఇచ్చిన సొమ్ము కోసం త్వరలో వస్తామని, సిద్ధంగా ఉండాలని లేఖలో ఉంది. ► అయితే, అత్యధిక మంది ప్రజాప్రతినిధులకు అందిన లేఖలో అటవీ భూముల్లో చెట్లు నరికివేతన, భూము కబ్జా, అక్రమ పట్టాల గురించి ప్రస్తావన ఉంది. వీరు తమ పద్ధతులు మార్చుకోకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులతోపాటు నర్సింహులపల్లెలో సాధారణ వ్యక్తులకు కూడా హెచ్చరిక లేఖలు అందినట్లు తెలిసింది. అనేక అనుమానాలు.. ► మావోయిస్టుల పేరిట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు అందిన లేఖలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్చిరోలిలో పోస్టు చేసినట్లు ఉన్నాయని కొందరు చెబుతుండగా, అక్కడి పార్టీ లెటర్హెడ్లపై రాసి పోస్టు చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అన్నిలేఖల్లోనూ ఓ వ్యక్తి దుకాణం కూల్చి వేయాలని హెచ్చరించడం కొందరు కావాలనే చేసిన పనిగా భావిస్తున్నారు. లేఖలు అందుకున్న కొందరు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా, మరికొందరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని అధికారులను కలిసి నట్లు తెలిసింది. పీపుల్స్‌వార్ గత ప్రాబల్యం ఇదీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పటి (సీపీఐ – ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో తూర్పు, పశ్చిమ డివిజన్ కమిటీలు ఉండేవి. తూర్పు డివిజన్లో పెద్దపల్లి, గోదావరిఖని – రామగుండం, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని ప్రాంతాలు ఉండగా, పెద్దపల్లి దళం, మంథని దళం, హుస్నాబాద్ దళాలు వాటి పరిధిలో కార్యకలాపాలు నిర్వహించేవి. పశ్చిమ డివిజన్లో జగిత్యాల, మల్యాల, మానేరువాగు, సిరిసిల్ల, కామారెడ్డి, కమ్మర్పల్లి, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలు ఉండేవి. ఇందులో మల్యాల, జగిత్యాల, మెట్పల్లి దళాలు పనిచేస్తూ ఉండేవి. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో జనశక్తి ప్రాబల్యం ఉండేది. మల్లన్నపేట ఎన్కౌంటర్ తర్వాత పీపుల్స్‌వార్ మల్యాల దళాన్ని ఎత్తివేసింది. మెట్పల్లి, జగిత్యాల దళాలను కలిపి ఒకే దళం లోకల్ గెరిల్లా స్క్వాడ్(ఎల్జీఎస్)గా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పంపిన లేఖల్లో మల్యాల ఏరియా కమిటీ, గోదావరి ఏరియా బెల్ట్ కమిటీ పేరుతో ఉండడం, దానికిందే గోదావరి బెల్ట్ కార్యదర్శి మల్లికార్జున్ పేరు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. -
మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఖాకీబాస్ల సమావేశం? మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రభాకర్ రావు, అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్‌జోన్ ఐజీ చంద్రశేఖర్లతోపా టు సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్జీ (డి్రస్టిక్ట్ రిజర్వ్డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. -
Nalgonda: మళ్లీ ‘అన్నల’ అలికిడి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలికిడి మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దకాలంగా లేని మావోయిస్టుల రిక్రూట్మెంట్ మళ్లీ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు మండలం కొరటికల్‌కు చెందిన చెన్నగోని గణేశ్ అరెస్టు కావడంతో కలకలం రేగింది. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ యువత అర్బన్ నక్సలిజం వైపు అడుగులేస్తున్నారా? అంటే అవుననే వాదన అంతర్గతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా యువత అర్బన్ నక్సలిజం పట్ల ఆకర్షితులు అవుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గణేశ్ అరెస్టే ఇందుకు ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది. పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవు. ఒకప్పుడు జిల్లా నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, వారిలో అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోవడం, అరెస్టు కావడం, లొంగిపోవడంతో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వారి సంఖ్య పది మందిలోపే ఉన్నట్లు పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు వారందరూ బతికే ఉన్నారా? లేరా? అన్నది పోలీసులు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో గణేశ్ అరెస్టు కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం.. మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ (22) నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడి చైన్నె అమృత కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన గణేశ్ హైదరాబాద్ క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం జల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు (26) హైదరాబాద్ అద్దె గదిలో ఉంటూ తను కూడా క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆనందరావు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌లోనూ సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది కిందటే ఆనందరావుతో గణేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్ సాహిత్యం చదివి ఆకర్షితుడైన గణేశ్‌ను కూడా గత నెల 3వ తేదీన పార్టీలో చేర్పించాడు. దళం వద్దే వారం పాటు ఉన్న గణేశ్ తరువాత జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఆగర్‌గూడ వద్ద ఏప్రిల్ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు. 29వ తేదీన పోలీసులు అరెస్టు చూపించారు. ఒకప్పుడు రాచకొండ దళానికి షెల్టర్ జోన్‌గా ఉన్న కొరటికల్ గ్రామానికి చెందిన గణేశ్ మావోయిస్టుల్లో చేరి దొరికిపోవడంతో కలకలం రేపింది. మావోయిస్టుల్లో చేరే వారు లేరనుకుంటున్న తరుణంలో.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చేరే యువత లేరనుకుంటున్న తరుణంలో 22 ఏళ్ల గణేశ్ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. గణేశ్‌ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్న గణేశ్ ఇలా మావోయిస్టులవైపు ఆర్షితుడు కావడం వెనుక బంధువులు, గ్రామంలో ఒకప్పటి మూలాలే కారణం కావచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే అరెస్టుకు మూడు రోజుల ముందు గణేశ్ గ్రామంలోనే ఉన్నాడని, అక్కడి నుంచే పోలీసులు తీసుకెళ్లారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మిగిలింది కొద్ది మందే.. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోయారు. అరెస్టు అయినవారు, లొంగిపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన వారు పార్టీలో ఉన్నది పది మందిలోపే. వారిలో ప్రధానంగా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హనుమంతు అలియాస్ రాజేష్ తివారి 1983 నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఒకసారి ఎన్కౌంటర్ చనిపోయారని అనుకున్నా.. తరువాత ఆయన బతికే ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హనుమంతుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మందుగుల భాస్కరరావు 1991 నుంచి అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. జిల్లాకు చెందిన కొద్దిమంది కూడా చత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనే పని చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
అరన్పూర్ పేలుళ్ల సూత్రధారి జగదీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంతెవాడ జిల్లా అరన్పూర్ బ్లాస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గుర్తించారు. పది మంది డీఆర్జీ కానిస్టేబుళ్లు, ఒక డ్రైవరు మరణించిన ఈ ఘటనకు జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్ ప్రధాన కారకుడిని తేల్చారు. ఈ మేరకు దర్భా కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకారం కోసమే ఏప్రిల్ 12న దంతెవాడ జిల్లాలోని గొండెరాస్ పంచాయతీ పరిధిలో పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇదే సందర్భంలో అక్కడున్న స్థానికులను భద్రతా దళాలు గట్టిగా బెదిరించాయి. గ్రామస్తుల ఎదుటే గాల్లోకి కాల్పులు జరిపారు. 17 మంది వృద్ధులు, పిల్లలను సైతం విచక్షణారహితంగా కొట్టినట్టు మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతికా ప్రకటన సైతం జారీ చేసింది. అయితే ఈ ఘటనపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ గొండెరాస్లో స్థానికులపై భద్రతా దళాలు ప్రవర్తించిన తీరుతో మావోలు రగిలిపోయారు. దీంతో ప్రతీకారం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేమీ అడవుల్లో కూంబింగ్ కోసం డి్రస్టిక్ట్ రిజర్వ్గార్డ్స్తో పాటు సీఆర్పీఎఫ్ దళాలు ఈనెల 25న మంగళవారం అడవుల్లోకి వెళ్లాయి. ఒకరోజంతా అడవిలో కూంబింగ్ జరిపి మరుసటి రోజు ఏప్రిల్ 26న తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు ప్రతీకారం ప్లాన్‌ను అమల్లో పెట్టినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో భద్రతా దళాలకు చెందిన సుమారు రెండు వందల మంది ఎనిమిది వాహనాల్లో సలేమీ అడవీ ప్రాంతం నుంచి దంతెవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మావోయిస్టులు రోడ్డు కింద ముందుగానే ఐఈడీ అమర్చిన చోటులో రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. దీంతో ఆ కర్రల దగ్గరకు రాగానే భద్రతా దళాలకు చెందిన వాహనాలు నెమ్మదించాయి. ఇదే అదనుగా మావోలు సుమారు 40 కేజీల ఐఈడీని పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు తునాతునకలైంది. వెంటనే అడవుల్లో మాటువేసి ఉన్న మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా నుంచి సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలోనే దాడికి పాల్పడిన ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా వీరిని విచారించగా ఈ దాడికి పాల్పడింది జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్‌గా వెల్లడైంది. జగదీశ్ తలపై రూ.5 లక్షలు జగదీష్ చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం గతంలో జగదీశ్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే భారీ దాడులను విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇటీవల పార్టీలో జగదీశ్ కేడర్ పెరిగింది. అలా కీలకమైన దర్బా డివిజన్‌కు వెళ్లాడు. మావోయిస్టుల సైనిక దళంలో ఇప్పుడు జగదీశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జగదీష్‌పై ఐదు లక్షల రివార్డు ఉంది. అరన్పూర్ ఘటనలో జగదీశ్‌తో పాటు మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేశ్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముకేశ్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకే ష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరందరిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు. -
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల ఘాతుకం జరిగిందిలా..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో మావోయిస్టుల దాడి ఘటనపై పోలీసులు అధికారులు ప్రెస్ నోటు విడుదల చేశారు. ఈ ఘాతుకం ఎలా జరిగిందో తెలిపారు. మావోయిస్టులు రహదారి కింద రెండు, మూడు మీటర్ల దిగువన ఐఈడీ (ఫాక్స్‌హోల్ మెకానిజం) ఏర్పాటు చేశారని, 150 మీటర్ల దూరం నుంచి బటన్ క్లిక్ చేసి మందుపాతర పేల్చారని వెల్లడించారు. 'మందుపాతర పేలిన ప్రాంతంలో సంఘటనా స్థలంలో గాలిస్తున్న ఇద్దరు అనుమానిత నక్సల్స్, ఒక మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నాం. అరన్ పూర్ పోలీసు స్టేషన్ లో పలువురు నక్సల్స్‌పై కేసు నమోదు చేశాం. ఈ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో పెడ్కా చౌక్ వద్ద డీఆర్జీ జవాన్లు వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. 10మంది జవాన్లు మృతి చెందారు. నక్సల్స్ ఘాతుకానికి అమరులైన జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఘటనా స్థలం లో సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది.' అని పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్డీ)కు చెందినవారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. అమరులైన జవాన్ల పేర్లు 1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్ 2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి 3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్ 4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ 5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి) 6. రవి పటేల్ - కానిస్టేబుల్ 7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF) సీఎంకు అమిత్‌షా ఫోన్.. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ములుగు పోలీసులు అప్రమత్తం.. ఛత్తీస్‌గఢ్ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్ సిరీస్.. -
మళ్లీ మావోల కలకలం! ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ తూర్పు భాగం గుండా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యతి్నస్తున్నారు. అదే సమయంలో తూర్పు దిక్కున మావోలకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవీ కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించి దాడికి తెగబడ్డారు. అయితే, ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో మావోలు తెలంగాణలోకి వస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో వీరి కదలికలపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో వీరు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు పోలీసులు సరిహద్దుల వద్ద భద్రత పెంచారు. అయితే, ఈసారి ఏప్రిల్ 20న జరగనున్న ఇంద్రవెల్లి అమరుల సంస్మరణను పురస్కరించుకుని ఉద్యమాలను నిర్మించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఉద్యమించిన ఆదివాసీల్లో 13 మంది పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనను ఉద్యమకారులు మరో జలియన్ వాలా భాగ్‌తో పోలుస్తారు. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణే..! ఇంద్రవెల్లి వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తరచుగా కేంద్రంపై విమర్శలు, తమపై సాగే పోలీసు దాడులను నిలిపివేయాలనే సాధారణ డిమాండ్లను మావోయిస్టు పార్టీ ఈసారి వినిపించకపోవడం గమనార్హం. కేవలం ఆదివాసీలు, గిరిజనుల హక్కులు, వారి సంక్షేమానికి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేయడం విశేషం. ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన, 1995 పెసా చట్టం, 2005 అటవీ హక్కుల చట్టం, కవ్వాల్ టైగర్ జోన్, అభయారణ్యాల ఎత్తివేత, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు, ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ, ఆదివాసీబంధు అమలు తదితర డిమాండ్లను మావోయిస్టులు ప్రభుత్వం ముందుంచుతున్నారు. చివరిగా.. ఎస్టీల్లో ఇతర కులాలను చేర్చవద్దని స్పష్టంచేశారు. ఎందుకు వస్తున్నట్లు..? మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు రాజకీయ, భౌగోళిక, వాతావరణ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం వేసవి కారణంగా అడవులు పలుచబడటం, ఆకులు రాలిపోవడంతో వీరు మరింత దట్టమైన అడవుల్లోకి లేదా తెలంగాణలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి. అదేసమయంలో గోదావరిలో నీటిప్రవాహం తగ్గడం వల్ల ఎంపిక చేసిన ప్రాంతాల్లో నదిని దాటడం సులభంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం గతంలో చేసిన చట్టాలు, విడుదల చేసిన జీవోల అమలుకు ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మావోల వ్యూహంగా కనిపిస్తోంది. -
సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు. (చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..) -
ముసుగు ఆగంతకుడెవరు?
వరంగల్: ఈనెల 1న ఏటూరునాగారం మండల కేంద్రంలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లను ఒక అపరచిత వ్యక్తి వేసినట్లు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఇందులో ఓ ముసుగు వేసుకొని కాలు కుంటుతున్న వ్యక్తి ఉండడాన్ని గమనించారు. పోలీసులు ఆ వీడియోలను సమీప ప్రాంతాల ప్రజలకు చూపించి గుర్తుపట్టాలని కోరారు. దీంతో ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం ఈప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సీఐ రాజు, ఎస్సై రమేశ్, మంగపేట ఎస్సై తహేర్బాబా అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి కూపీ లాగుతున్నారు. అయితే ముసుగు వేసుకున్న వ్యక్తితో మరెవరైనా ఈపని చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ ఎన్కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
రాంచీ: జార్ఖండ్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతిచెందారు. ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఏకే47 తుపాకులతోపాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఇద్దరు నక్సల్స్‌పై రూ.25 లక్షల రివార్డు,మరో ఇద్దరు నక్సల్స్‌పై 5 లక్షల రివార్డు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఉదయం చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని సుమన్ సింగ్ అంచల(42), సంజయ్ కుమార్ ఉసెండి(27), పరుశరాం ధనుగల్(57)గా గుర్తంచారు.. ఈ ముగ్గురిపై చాలా కేసులు ఉన్నట్లు అదనపు ఎస్పీ కోమన్ సిన్హా తెలిపారు. -
తెలంగాణలో మావోయిస్టు పోస్టర్లు కలకలం
-
43 ఏళ్లకి వచ్చావా సత్యంరెడ్డి..! చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనం
మిర్యాలగూడ: ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు సొంతింటికి దూరంగా ఉన్న ఓ మావోయిస్టు నేత ఇన్నేళ్లకి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గజ్జల సత్యంరెడ్డి అలియాస్ గోపన్న పీపుల్స్‌వార్ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేశారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1980లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు కీలకంగా పని చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించిన సత్యంరెడ్డి 26 ఏళ్లు అడవిలో ఉండి.. 17 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీసులు మోపిన అన్ని కేసులనూ కోర్టులు కొట్టివేయడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తమ్ముడితో కలిసి సొంత ఊరైన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సత్యంరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అజ్ఞాతంలో ఉండగానే సత్యంరెడ్డి తోటి పార్టీ సభ్యురాలిని వివాహం చేసుకోగా ఆమె ఎన్కౌంటర్లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియరాలేదు. సత్యంరెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరిని సందర్శించి.. చిన్నప్పుడు తాను తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి గుర్తుచేసుకున్నారు. తాను జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన చెందారు. అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబసభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగపూరిత వాతావరణంలో కంటతడిపెట్టారు. ఇక మీదట తన జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లేది లేదని సత్యంరెడ్డి చెప్పారు. -
గర్భిణీ భార్యను చూసేందుకు సెలవు పెట్టి వచ్చిన జవాన్.. నక్సల్స్ చేతిలో..
రాయ్‌పూర్: గర్భిణీ భార్యను చూసేందుకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ జవాన్ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. జవాన్ మృతితో అతని భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ జవాన్ వయసు 29 ఏళ్లు. గర్భిణీ భార్యను చూసేందుకు వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వచ్చాడు. షాపింగ్ చేసేందుకు శనివారం సాయంత్రం గ్రామంలోని మార్కెట్‌కు వెళ్లిన అతడిపై ఇద్దరు మావోయిస్టులు దాడి చేశారు. అతి దగ్గరకు వెళ్లి తుపాకీతో తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. జవాన్ సోదరుడితో పాటు గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సాధారణంగా మవోయిస్టులు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంత అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ లేదా ఇతర సెక్యూరిటీ సంస్థలకు చెందిన జవాన్లపై మాత్రం తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్మీ జవాన్‌ను ఇలా హత్య చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ అనుకునే ఇతడిపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో గత వారంలోనే ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు.. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా కుందేడ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం డీఆర్జీ బృందాలు సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ నుంచి నక్సల్ పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. జాగర్గుండ కుందేడ్ మధ్య ఉదయం 9:00 గంటల సమయంలో మవోయిస్టులు వీరికి ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ రామురామ్ నాగ్ (జాగర్గుండ), అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా(మిటగూడ/జాగర్గుండ), సైనిక్ వంజం భీమా(మర్కగడ/చింతల్నార్) కాల్పుల్లో మరణించారు. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
బీరు బాటిల్ చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో బాంబ్!
రోడ్డుపై, అడవుల్లో ఖాళీ బీరు బాటిళ్లను చూస్తే ఇక అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు కొత్త తరహాలో బీర్ బాటిల్ బాంబును అమర్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉన్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తమ కదలికలు ఉన్నాయని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మావోయిస్టుల దుశ్చర్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ప్రెషర్ బాంబ్‌లు, కెమెరా ఫ్లాష్ బాంబ్‌లు, బ్యాటరీలు ఇలా అనేక రకాల మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు రూటు మార్చారు. కూంబింగ్‌లో పాల్గొనే భద్రతా దళాలు, పోలీసులను ఏమారుస్తూ పేలుడు జరిపి భారీ విధ్వంసం సృష్టించేలా బీరు బాటిల్ బాంబ్ వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ప్రెషర్, బకెట్ బాంబులను భద్రతా దళాలు సులువుగా గుర్తిస్తుండటంతో తమ వ్యూహం మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పేలుడు తీవ్రత పెంచేందుకు మావోయిస్టులు పదునైన ఇనుప ముక్కలను పేలుడు పదార్థాల చుట్టూ ఉంచేవారు. అయితే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించినప్పుడు, ఆ బాంబు జాడను భద్రతా దళాలు సులువుగా పసిగడుతున్నట్టు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. దీంతో బీరు బాటిల్ బాంబు వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఖాళీ బాటిళ్లలో ఐఈడీ మావోయిస్టులు ఖాళీ బీరు బాటిళ్లలో ఐఈడీ తరహా పేలుడు పదార్థాలను కూర్చి విధ్వంసం సృష్టించే వ్యూహంఅమలుకు శ్రీకారం చుట్టారు. తాగి పడేసిన బీరు బాటిల్ అయితే భద్రతా దళాలు అనుమానించకుండా వదిలేస్తాయని, పైగా అందులో అమర్చిన బాంబు పేలినప్పు డు గాజు ముక్కల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందనే అంచనాతో ఈ ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బాంబులను ఒడిశాలో పేల్చి నట్టు సమాచారం. తాజాగా బీరు బాటిల్లో అమర్చిన బాంబును ములుగు జిల్లాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు బయటకు తీసిన బీర్‌బాటిల్ , పేలుడు పదార్థాలు మందుపాతరలు, ప్రెషర్బాంబుల ఘటనలు ►ఈనెల 4న చర్ల మండలం కుర్నపల్లి మార్గంలో ఎర్రబోరు–బోదనెల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అమర్చిన శక్తిమంతమైన 20 కిలోల మందుపాతరను చర్ల పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 28న చర్ల మండలంలోని కొండెవాయి సమీపంలోని ప్రధాన రహదారిపై శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 26న కొండెవాయి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు అమర్చిన ప్రెషర్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెగడపల్లి వద్ద అమర్చిన మందుపాతరను పేల్చడంతో ఏఎస్ఐ మహ్మద్ అస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ►2022 డిసెంబర్లో ఉంజుపల్లి సమీపంలో పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన ప్రెషర్బాంబు పేలి ఆవు మృతిచెందింది. ►2021 జూలైలో చర్ల శివారు లెనిన్‌కాలనీ సమీపంలో చర్ల యువకుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబును తొక్కడంతో అది పేలింది. కొత్త కోణంలో బాంబు... గతంలో ఏటూరునాగారం ఏజెన్సీ అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌కు ప్రయోగశాలగా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలను అనువైనవి గుర్తించి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త తరహా దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన భద్రత బలగాలకు విద్యుత్ వైర్లు కనిపించాయి. వాటిని చూసుకుంటూ ముందుకెళ్లగా ఖాళీ బీరు బాటిల్ కనిపించింది. ఆ వైర్లు ఆ సీసాలోకి పోయినట్లు గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ఐఈడీ నింపిన సీసాలో భద్రత బలగాలకు గుచ్చుకునేలా ఇనుప బోల్ట్‌లు, రాగి రేకు ముక్కలు, ప్లాస్టిక్ లెడ్, కార్బన్ ముక్కలు, గన్ పౌడర్ ఇతర పేలుడు పదార్థాలను అందులో కూర్చి పెట్టారు. అది పేలితే పెద్ద ప్రమాదం ఉండేదని పోలీసులు చెబుతున్నారు. -
ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్‌స్టేషన్ పరిధి టేకల్ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చింది. 2021 ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ కేసులో (ఆర్సీ–02/ 2021/ఎన్ఐఏ/ఆర్పీఆర్) 23మందిపైన చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. సంచలనం కలిగించిన తారెం ఘటన పోలీస్ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్‌స్టేషన్ ఎఫ్ఐఆర్ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్ఐఏ ద్వారా 2022 జూన్ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులపై బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్)లు, ఆటోమేటిక్ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా జవాన్‌ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 21 నెలల విచారణ తర్వాత ఎన్ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్) సీనియర్ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్‌విత్/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, సుజాత అలియాస్ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్రావు భార్య), ఉమ్మడి వరంగల్‌కు చెందిన సాగర్ అలియాస్ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్ వికాస్, నిర్మల అలియాస్ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పొడియం హిద్మా అలియాస్ హిడ్మన్న, మద్నా అలియాస్ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్ఐఏ ప్రధానంగా పేర్కొంది. -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్‌నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్‌శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్‌లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్‌టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్‌శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్‌తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్‌తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్‌లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్‌శాండిల్య, సంజయ్‌జైన్, ఐజీ కమలాసన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
దుమ్ముగూడెం/నిర్మల్: ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్రల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు– మావోయిస్టులకు నడుమ జరిగిన ఎన్కౌంటర్లో మహిళా డివిజనల్ కమిటీ(డీవీసీ) కమాండర్‌సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కణితి లింగవ్వ (40) అలియాస్ అనిత మృతి చెందినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల పోలీసులతోపాటు మహారాష్ట్రకు చెందిన సీ–60 కమాండోలు, బీజాపూర్‌కు చెందిన బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నేషనల్ పార్క్ టకామెటా ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా, ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇరువర్గాల నడుమ కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ అలియాస్ అనిత తలపై తెలంగాణలో రూ.5 లక్షలు, మహారాష్ట్రలో రూ.16 లక్షలు నజరానా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన రాజవ్వ, రాజన్న దంపతులకు ముగ్గురు సంతానం. అందులో లింగవ్వనే పెద్దది. ఆమెకు రమేశ్, రవి ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. గోదావరి పరీవాహక ప్రాంతమైన లక్ష్మీసాగర్‌కు అప్పట్లో నక్సల్స్ దళాలు తరచూ వస్తుండేవి. ఈ క్రమంలో వాళ్ల పాటలు, మాటలకు ఆకర్షితురాలైన లింగవ్వ 1997లో యుక్తవయసులోనే దళంలో చేరింది. లింగవ్వ తమ్ముడు కంతి రవి అలియాస్ సురేశ్ సైతం కొన్నాళ్లు దళంలో పనిచేసి 2016లో పోలీసులకు లొంగిపోయాడు. లింగవ్వ మాత్రం భర్త అడెల్లుతోనే దళంలోనే కొనసాగింది. బిడ్డ తిరిగొస్తదనుకున్నా: లింగవ్వ తల్లి రాజవ్వ ‘పుట్టిన ఒక్కగానొక్క ఆడిబిడ్డ మమ్మల్ని ఇడిసి అడివిలకు పోయింది. ఎప్పటికైనా నా బిడ్డ ఇంటికి తిరిగొస్తదనుకున్న. ముసలితనంలనైనా లింగవ్వను చూస్తానుకున్న. కానీ.. ఇట్లయితదను కోలేదు..’అంటూ కంతి లింగవ్వ తల్లి రాజవ్వ కన్నీరుమున్నీరవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన విషయం శుక్రవారం సాయంత్రం తర్వాత కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి లక్ష్మీసాగర్ గ్రామంలో విషాదం అలుముకుంది’ -
మళ్లీ అలజడి ..అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: అడవుల్లో మళ్లీ అలజడి నెలకొంది. సీపీఐ(మావోయిస్టు) పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల నేపథ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. కొయ్యూరు ఎన్కౌంటర్ స్మృత్యార్థం వారోత్సవాలను ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వారం ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఓవైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల చర్యలు అడవిలో కలకలం రేపుతున్నాయి. వారోత్సవాలను విజయవంతం చేయాలని లేఖలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం చేయగా, ‘అమాయక ఆదివాసీలను అంతం చేసే మావోయిస్టులు’అంటూ వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాగా, మరో రెండు/రోజుల్లో ముగిసే పీఎల్జీఏ వారోత్సవాలను తెలంగాణలో నిర్వహించాలన్న మావోయిస్టుల ప్లాన్‌ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం నుంచి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పూర్వ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పహారా కాస్తోంది. అడవులు జల్లెడ.. అరెస్టులు, ఎన్కౌంటర్లు.. జేఎస్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్, ఆసిఫాబాద్ జిల్లాలను ఆనుకుని ఉన్న గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా వేశారు. ఈ సందర్భంగా నెలరోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో 22 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 31 మంది లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో ఇటీవల బాలాఘాట్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో జీఆర్బీ, కేబీ డివిజన్ కోఆర్డినేషన్ టీం ఇన్చార్జి గణేశ్ మరావి(35), భోరమ్‌దేవ్ కమిటీ పీఎల్–2 కమాండర్ రాజేశ్ మృతి చెందగా, ఓ మహిళామావోయిస్టు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు–మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి(40), మట్వారా ఎల్వోఎస్ సభ్యుడు రమేశ్(32), మహిళా మావోయిస్టునేత సుమిత్ర (28), మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా మావోయిస్టు కొరియర్‌గా తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు నిత్యనిర్బంధంలోనూ మావోయిస్టులు విదేశీ ఆయుధాలను వాడుతుండటం మూడు రాష్ట్రాల పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో 1978లో మొదట తపంచాతో మొదలైన సాయుధీకరణ ఏకే–47, ఎల్‌ఎంజీల వరకు వెళ్లగా, ప్రస్తుతం అమెరికా, రష్యా మేడ్ ఆయుధాలను వాడుతుండటం గమనార్హం. మొదట పూర్వ కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన అగ్రనేత పులి రాములు వద్ద ఏకే–47 తుపాకీ పోలీసులకు లభించింది. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు– మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్ తుపాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పీఎల్జీఏ వారోత్సవాలు మరో రెండు రోజులే ఉన్న సందర్భంగా మావోయిస్టులు అధునాతన ఆయుధసంపత్తిని కూడా ఉపయోగించే అవకాశముందన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్, పారా మిలటరీ బలగాలు మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో మోహరించడం కలకలం రేపుతోంది. -
ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల సందర్భంగా వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. మరోపక్క ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారంటూ ఊరూరా పోస్టర్లు వేయించిన పోలీసులు ఇంకో పక్క కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు మిలీషియా సభ్యులు పట్టుబడగా, వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. చర్ల మండలం ఎర్రంపాడు ఆటవీప్రాంతంల్లో పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ, 81, 141 బెటాలియ¯న్ల సిబ్బంది ఉదయం కూంబింగ్ చేపట్టారని, ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మిలీషియా సభ్యులని తేలిందని చెప్పారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసు కిష్టారాం నిమ్మలగూడెంకు చెందిన బెడమ బీమయ్య, సోడి మూయా, పోడియం అడమయ్య, పూనం నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్ ఉన్నారని తెలిపారు. వీరు రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులను తరిమివేయగా, ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి ఇక్కడ ఇన్ఫార్మర్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహార్, భద్రాచలం ఏఎస్పీ ఆకాం„Š యాదవ్, చర్ల సీఐ అశోక్, బెటాలియన్ల అధికారులు కమల్వీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల ఘాతుకం.. హత్య చేసి టీఆర్ఎస్పై షాకింగ్ వ్యాఖ్యలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు రావడంతో వారిని గమనించిన గోపాల్ బయటికి పరుగెత్తగా వెంబడించి పట్టుకున్నారు. గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని లాల్‌సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చాలా మందిని కాల్చి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 20 రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఇలా హత్య జరగడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది. -
మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్ సాయిబాబాకు భారీ షాక్ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషి(సాయిబాబా) మీద నమోదు అయిన అభియోగాలు.. సమాజం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. శనివారం ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్.. ఆయన జీవితఖైదును కొట్టేస్తూ తక్షణమే విడుదల చేయాలంటూ మహారాష్ట్ర హోం శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై స్టే విధించాలంటూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. దీంతో.. ఈ వ్యవహారంపై మరో అత్యవసర అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో.. శనివారం మహారాష్ట్ర పిటిషన్‌పై ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. బాంబే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దోషి విడుదల ఆదేశాలు ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కొన్ని కీలక విషయాలను విస్మరించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వైద్యపరమైన కారణాల దృష్ట్యా గృహనిర్భంధం కోసం సాయిబాబా చేసుకున్న అభ్యర్థనను సైతం.. నేర తీవ్రత దృష్ట్యా తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. సాయిబాబాతో పాటు సహ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. విడుదలపై స్టే ఇస్తూ.. రికార్డుల్లోని సాక్ష్యాలను సవివరంగా విశ్లేషించిన తర్వాత నిందితులు దోషులుగా నిర్ధారించబడినందున.. బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 390 కింద అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. వీల్ చైర్‌కి పరిమితమైన ఈ మాజీ ప్రొఫెసర్.. మావోయిస్టులతో సంబంధాల కేసులో 2014 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జీవిత ఖైదు పడడంతో.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా సుప్రీం కోర్టు స్టే నేపథ్యంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రొఫెసర్ .సాయిబాబాపై కుట్ర కేసు కొట్టేసిన బాంబే హైకోర్టు
-
మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: మావోయిస్టు లేఖపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఇటువంటి లేఖపై స్పందించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ‘‘నేను భూములు ఆక్రమించుకున్నట్లు లేఖలు వచ్చాయి. ఆ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి అని మంత్రి ప్రశ్నించారు. ‘‘అమరావతిని ఏ ప్యాకేజీ కోసం పవన్ సమర్థిస్తున్నారు. చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు. కచ్చితంగా పాదయాత్రను అడ్డుకుని తీరతాం’’ అని అప్పలరాజు అన్నారు. మా గుండెల మీద తంతాం. నోటి కాడ కూడు లాగేస్తామంటే ఊరుకుంటామా.. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పారు. -
పట్టుబడిన మావోయిస్టులు, సానుభూతిపరులు.. ఎందుకొచ్చినట్లు!?
సాక్షి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌నుంచి మావోయిస్టులు వరంగల్ నగరానికి ఎందుకు వచ్చారు..? వైద్యం కోసం వస్తే గుట్టుచప్పుడు కాకుండా ఒక్కరో ఇద్దరితోనే ఆస్పత్రికి రావాలి.. మరి బొలెరో వాహనంలో ఐదుగురు ఎందుకు వచ్చినట్లు? వెంట పేలుడు పదార్థాలు ఎందుకు ఉన్నాయి? వీటన్నింటిని పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ నక్సల్స్ విస్తరణలో భాగంగా నగరంలో పాగా వేసేందుకు ప్రయత్నించారా? మరేదైనా యాక్షన్‌కు ప్లాన్ చేశారా? అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న మావోయిస్టులు సోమవారం వరంగల్ పోలీసులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కంచుకోటలాంటి వరంగల్‌లో కొన్నేళ్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఈ సమయంలో ఇద్దరు మావోయిస్టులతోపాటు ముగ్గురు సానుభూతిపరుల అరెస్ట్ కలకలం రేపింది. మడకం ఉంగి అనేక కేసుల్లో నిందితురాలు.. పోలీసులకు చిక్కిన మడకం ఉంగి అలియాస్ కమల వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళా మావోయిస్టు. విప్లవ సాహిత్యం, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలై 2007 వరకు బాలల సంఘంలో పనిచేసి, 2011లో ముసాకి చంద్రు నాయకత్వంలో మిలీషియా సభ్యురాలిగా పనిచేసింది. అదే ఏడాది పామెడు ఎల్జీఎస్ కమాండర్ బొద్దె కిషన్ అధ్వర్యంలో ఎన్డీఎస్ సభ్యురాలిగా పనిచేసింది. 9వ ప్లాటూన్‌లో, 2012 సంవత్సరంలో సౌత్ సబ్ జోనల్ బ్యూరో టీం ఇన్చార్జ్గా నియమితులైంది. వివిధ ఘటనల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేది. 2017 ఏప్రిల్‌లో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ బుర్కా పాల్ ఆటవీ ప్రాంతంలో దాడిచేసి 25మంది పోలీసులను హత్య చేసిన çఘటనలో నిందితురాలు. 2018లో మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులను హత్యచేసి మరో ఆరుగురిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన, 2020 మార్చిలో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని మినప అడవి ప్రాంతంలో 17మంది, 2021లో బెటాలియన్ కమాండర్ హిడ్మా, సాగర్ నాయకత్వంలో గుట్టపరివార ప్రాంతంలో ఆడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 24మంది బీజాపూర్ పోలీసులను హత్యచేసిన çఘటనల్లో నిందితురాలు. మరో మావోయిస్టు అసం సోహెన్ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ప్రసంగాలు, పాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 2019లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి, నేషనల్ పార్క్ ఏరియా సెక్రటరీ దిలీప్ వింజ ఆధ్వర్యంలో సభ్యుడిగా నియామకమయ్యాడు. బీడీ ఆకుల కాంట్రా క్టర్లు, ఇతర సంపన్న వ్యక్తులనుంచి పార్టీ ఫండ్ పే రుతో డబ్బు వసూలు చేసి పార్టీకి అవసరమైన ని త్యావసరాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి అందజేసేవాడు. దీంతోపాటు పేలుడు పదార్థాలను వరంగల్, కరీంనగర్ ప్రాంతాలనుంచి రహస్యంగా కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. వీరితోపాటు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘ్ అధ్యక్షురాలు మీచ అనిత (21), (భూపాలపట్నం తాలూకా కండ్లపర్తి గ్రామం), ఆర్పీసీ సభ్యుడు గొడ్డి గోపాల్ (భూపాలపట్నం తాలూకా వరదల్లి గ్రామం), భూపాలపట్నం తాలూకా నల్లంపల్లికి చెందిన కందగుర్ల సత్యం ఉన్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, సెల్ఫోన్లు, నగదు ఛత్తీస్‌గఢ్ టు వరంగల్, వయా ములుగు మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అరెస్టయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నం తాలూకా నుంచి ములుగు జిల్లా మీదుగా వరంగల్ నగరానికి చేరినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం, ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదివారం సాయంత్రం సమయంలో ములుగు రోడ్డు అజర హాస్పిటల్ ప్రాంతంలో వరంగల్ టాస్క్‌ఫోర్స్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో కారులో వస్తూ పట్టుబడ్డారు. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతిపరులుగా గుర్తించారు. వారినుంచి 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, రూ.74వేల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బొలెరో కారు, సెల్ఫోన్లు, ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను స్వా«ధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నక్సలైట్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, హనుమకొండ ఇన్స్పెక్టర్లు సురేశ్ కుమార్, శ్రీనివాస్‌జీ, హనుమకొండ ఎస్ఐలు, ఇతర సిబ్బందిని సెంట్రల్ డీసీపీ అభినందించారు. పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు -
అవసాన దశలో మావోయిస్టు ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమితో బలహీనమై అవసాన దశలో ఉందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క అలియాస్ భాను దీదీగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారని.. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకొని లొంగిపోయారని ప్రకటించారు. ‘‘ఉషారాణి కుటుంబ నేపథ్యమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. తండ్రి ఆలూరి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విరసంలో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉషారాణి గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, 1987లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. 1991లో పీపుల్స్‌వార్‌లో చేరి మునుగోడు దళ కమాండర్‌గా పనిచేశారు. 1998 యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఒకరిని చంపి, ఆయుధాలు తీసుకెళ్తున్న సమయంలో ఆమె భర్త ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఉషారాణి 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో సరెండర్ అవుతానని పార్టీని కోరారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లొంగిపోయారు’’ అని డీజీపీ వివరించారు. మావోయిస్టు పార్టీకి నాయకత్వలోపం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న సీనియర్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జంపన్న, సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకత్వం లేక బలహీనపడిందని ఉషారాణి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ కమిటీలో కీలకమైన 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ముప్పాళ్ల లక్ష్మణరావు నడవలేకపోతున్నారని, కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని.. ఆనంద్ కూడా అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోతే మంచి వైద్యసేవలు అందిస్తామని, సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు విభాగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత ఉషారాణి
-
ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్? కానీ,..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. కానీ,మావోయిస్టులు ఎలాంటి హింసకూ పాల్పడలేదు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడం వెనుక టైమ్‌బాంబు తరహాలో దాడి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక, భౌగోళిక కారణాలతో..! రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయే వీలుంది. అదే రామగుండం ఏరియా మొత్తం మైదానప్రాంతం. ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు. అందుకే తొలుత చెన్నూరు,బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మా వోయిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై వారిలో భిన్నాభిప్రాయా లు వచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే కావడంతో వీరిపై దాడికి దిగితే.. ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో సామాజిక కోణం.. రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక అననుకూల కారణాలతో రెక్కీ నిర్వహించినా.. దాడికి సాహసించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అగ్రనేతల రాకతో కలకలం ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. గోదావరికి ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజిరెడ్డి బసంత్‌నగర్ పరిసరాల్లో సంచరించడం వెనక కారణాలను కూడా గుర్తించారని సమాచారం. రాజిరెడ్డి ఇక్కడ వైద్యం కూడా చేయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. సులువుగా సరిహద్దు దాటేలా.. ఎలాగైనా దాడి చేయాలని వచ్చిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోలు సంచలన హత్యలు, బహిరంగ దాడులకు సాహసం చేయలేరు. అలాగని హింసకు పాల్పడరన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆర్ఎఫ్సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) కొలువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారుల్లో ఒక్కరినైనా టైమ్‌బాంబుతో హతమార్చవచ్చని అనుమానిస్తున్నారు. అది మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పునర్వైభవంతోపాటు నిధులు, కేడర్ రిక్రూట్మెంట్కు దోహదపడుతుందన్నది వ్యూహం. టైమ్‌బాంబు పెట్టిన వ్యక్తి అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మావోయిస్టులు క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటే వరకూ హత్య లేదా హింస విషయాలు బయటకి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇక్కడ అనుమానితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంచారు. -
అట్టుడుకుతున్న అడవి పల్లెలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది. గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. క్షణక్షణం భయం భయం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు స్థావరాలపై కన్ను కొంతకాలం నుంచి కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్జీ పోలీస్ ఫోర్స్ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు. -
మావోయిస్టుల కోసం పోలీసుల ముమ్మర తనిఖీలు
-
పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టులు కలకలం
-
పెద్దపల్లి జిల్లాలో మావోల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు మళ్లీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న మావోయిస్టు వారోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ మావోయిస్టు నేతల్లో కొందరు రాష్ట్రంలోకి వచ్చారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు మంగులు అలియాస్ పాండు ఆగస్టులో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు ధ్రువీకరించగా తాజాగా పెద్దపల్లి జిల్లాలోకి మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ అలియాస్ ధర్మన్న వచ్చి వెళ్లాడన్న వార్త పోలీసు శాఖలో చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి)లోని శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల.. కొందరు అనుచరులతో కలసి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకుగల కారణాలపై ఆరా తీస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పలువురు కాంట్రాక్టర్ల నుంచి రాజిరెడ్డి భారీగా నిధులు రాబట్టాడన్న వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకొనే పనిలో ఉన్నాయి. కొందరు అనుమానితులు, కొరియర్లపై నిఘా పెట్టాయి. కంకణాలతోపాటు ఆయనతోపాటు వచ్చిన యాక్షన్ టీం సభ్యులు కుంజం మనీశ్, చెన్నూరి శ్రీను అలియాస్ హరీశ్, కొవ్వాసి రాము, రోషన్, నందు అలియాస్ వికాస్ ఫొటోలతో కూడిన పోస్టర్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం అందిస్తే రూ. 5 లక్షల నగదు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ‘రామగుండం’స్కాం నిందితుల హత్యకు రెక్కీ? 2020 అక్టోబర్‌లో ములుగు జిల్లాలోని ముసలమ్మ గుట్టలో మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన పలువురు యువకులకు శిక్షణ ఇస్తున్న రాజిరెడ్డి బృందం.. కూంబింగ్ చేస్తున్న టీఎస్ఎస్పీ దళానికి ఎదురైంది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో రాజిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. దాదాపు 24 నెలల విరామం తరువాత రాజిరెడ్డి రాష్ట్రానికి రావడం.. అందులోనూ ఆయనకు నిధులు సమకూరుతున్నాయన్న సమాచారంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం కొలువుల కుంభకోణంలో నిందితులను హతమార్చేందుకు కంకణాల బృందం రెక్కీ చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల కూలీలు నివసించే కాలనీలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా: ప్రభాకర్‌రావు
కోటపల్లి (చెన్నూర్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలంగాణ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సిబ్బంది వివరాలు, పనితీరు, స్టేషన్ పరిసరాలు, సరిహద్దు ప్రాంతాలపై ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోని ఫెర్రి పాయింట్ల వివరాలు, మావోయిస్టు ప్రభావిత గ్రా మాలు, ఇక్కడి అటవీప్రాంతంపై ఆరా తీశారు. సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అల సత్వం ప్రదర్శించవద్దని సూచించారు. సానుభూతిప రులు, మిలిటెంట్లు, మావోయిస్టులకు సహకరించే వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మావోయిస్టుల కట్టడి లో తెలంగాణ పోలీసులు పూర్తిగా సఫలీకృతం అయ్యా రని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరి ధిలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్ర మంలో మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ నరేందర్, సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్, నరేశ్ పాల్గొన్నారు. -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్‌లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
మావోయిస్టు దామోదర్ భార్య అరెస్ట్.. మిగిలిన నలుగురి జాడేది..?
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజిత అరెస్టు సందర్భంగా నెలకొన్న ప్రకంపనలు ఇంకా ఆగిపోలేదు. ఆమెతో పాటు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించిన మిగిలిన దళ సభ్యులు ఎక్కడున్నారు? వారి నెక్ట్స్ టార్గెట్ ఏంటనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటలు గడిచినా.. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అలికిడి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సానుభూతిపరులను ఏర్పాటు చేసుకుంటూ తమ భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ టీమ్‌లకు అండగా యాక్షన్ టీమ్‌లు సైతం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నట్టు సమాచారం. మావోల కదలికలు పెరగడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్టయ్యారు. కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చర్ల మండలం కూర్నపల్లి, బోదనెల్లి అడవుల్లో రజిత, ధనిలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో మిగిలిన దళ సభ్యులు పారిపోయారని పోలీసులు చెబుతుండగా అంతకు ముందే పోలీసుల అదుపులో రజిత, ధనిలతో పాటు మరో నలుగురు దళ సభ్యులు ఉన్నారంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నలుగురికి సంబంధించి పోలీసులు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా మావోయిస్టుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఆ నలుగురు ఏమయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంటాక్ట్ మిస్ అయ్యారా ? రజితతో పాటు సంచరిస్తున్న దళ సభ్యులు పోలీసుల రాకను గమనించి తప్పించుకున్నారని, అయితే వారు ఇంకా తమ కాంటాక్టులను సంప్రదించలేదనే వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఎవరైనా మావోయిస్టులు దళం నుంచి విడిపోతే తిరిగి కాంటాక్టులోకి వచ్చే వరకు వారు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. అయితే రజిత, ధనిలు పోలీసులకు పట్టుబడిన ఘటనలో తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్ ఏరియాలకు చేరుకునే అవకాశం ఎక్కువని తెలుస్తోంది. కూర్నపల్లి, బోదనెల్లి అటవీ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్‌కు అతి సమీపంలో ఉన్నాయి. పైగా అడవి దట్టంగా ఉండటం వానలు కురవడాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా తమ నాయకత్వంతోని కాంటాక్టులోకి వెళ్లి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకసారి వారు కాంటాక్టులోకి వచ్చిన తర్వాత నలుగురు దళ సభ్యుల గురించి మావోయిస్టు నాయకత్వం ప్రకటన చేయవచ్చని అంచనా. అవి గాయాలేనా ? రజిత ఒంటిపై కమిలిన గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం పట్టుడిన మావోయిస్టులను గురువారం వరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా రజితకు ఏమైనా గాయాలు అయ్యాయా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. దీనిపై భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ను వివరణ కోరగా.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రిమాండ్‌కు తరలించే వరకు పక్కాగా నిబంధనలు పాటించామని చెప్పారు. విచారణ సందర్భంగా వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. మావోయిస్టులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రజిత, ధనిలను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. -
ఇద్దరు మహిళా మావోయిస్టుల అరెస్టు
కొత్తగూడెంటౌన్: పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు మహిళా మావోయిస్టులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. అరెస్టు అయినవారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేత దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ మెంబర్ మడకం రజిత, దళసభ్యురాలు మడవి ధని ఉన్నట్లు తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న కుర్నపల్లి–బోదనెపల్లి మధ్య అటవీ ప్రాంతాల్లో చర్ల, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా వీరు పట్టుబడ్డారని తెలిపారు. రజిత స్వగ్రామం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం ములకనాపల్లి కాగా, ధనిది ఛత్తీస్‌గఢ్. మొత్తం 81 ఘటనల్లో తన ప్రమేయం ఉందని రజిత అంగీకరించినట్లు ఎస్పీ తెలి పారు. కాగా, పోలీసులు చర్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. కానీ, ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన నేపథ్యాన మిగతా నలుగురి విషయమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. -
హన్మకొండ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కలకలం..
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్‌రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్సోఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న బుక్ ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడొద్దని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇన్ఫార్మర్ నెపంతో ఉపసర్పంచ్ హత్య.. లేఖలో హెచ్చరిక
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం కుర్నవల్లి గ్రామ ఉపసర్పంచ్, సీపీఎం నాయకుడు ఇర్పా రాము అలియాస్ రాముడు(36)ను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి హతమార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాము, అతడి భార్య ఇంటి వరండాలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 12 గంటలకు సాధారణ దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు రామును నిద్ర లేపారు. మాట్లాడే పనుందంటూ తీసుకెళ్తుండగా, రాము భార్య కనకమ్మ ఇంట్లో నిద్రిస్తున్న అత్త, మామలు, మరిదిని లేపింది. వాళ్లు లేచేలోపే రామును తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రహదారి వెంట రాత్రి 2గంటల వరకు వెదికారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి వెదుకుతుండగా ఛత్తీస్‌గఢ్‌లోని నిమ్మలగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రక్తపు మడు గులో రాము మృతదేహం కనిపించింది. ముఖం, తల భాగంలో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే ఈ శిక్ష విధించామనిమావోయిస్టు చర్ల–శబరి ఏరియా కమిటీ పేరిట ఒక లేఖ వదలివెళ్లారు. ఇన్ఫార్మర్లుగా మారి ప్రజాద్రోహులుగా తయారైతే ఎవరికైనా ఇదే శిక్ష విధిస్తామని లేఖలో హెచ్చరించారు. -
రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన రూట్‌మ్యాప్ ఆకస్మికంగా మారడానికి మావోయిస్టుల కదలికల సమాచారమే కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో ముందుజాగ్రత్త చర్యగా సీఎంను రోడ్డుమార్గాన వద్దని.. హెలికాప్టర్లో రావాలని పోలీసులు సూచించి నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వారం రోజులుగా రాష్ట్రంలో మావోలు సంచరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం తదితర గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వారు సంచరించినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. తెలంగాణలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలన్న మావోయిస్టు సారథి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పాండు అలియాస్ మంగులు తదితరుల దళాలు మహా రాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పర్యటనలో ఆకస్మిక మార్పులు.. వాస్తవానికి సీఎం కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ భవ నాన్ని ప్రారంభించేందుకు రెండు రోజుల ముందే కరీంనగర్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచా రం ఉంది. దాని ప్రకారం ఆయన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన నివాసం నుంచి పెద్దపల్లి సభకు బయల్దేరాలి. కానీ ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి సమాచారం రాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్కంఠ కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలకు మావోయిస్టులు వచ్చి ఉంటారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీఎం ఆదివారం కరీంనగర్‌కు చేరుకోలేదని సమాచారం.ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నా రన్న విషయాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టి వారిని అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం భద్రతకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశా యి. ఒకప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త వారు, అను మానాస్పద వ్యక్తులను గుర్తించడం సులువుగా ఉండేది. కానీ జిల్లాలోని ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, గ్రానైట్, క్రషర్, ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారిలో ఎవరు కార్మికులో, ఎవరు మావోయిస్టు సానుభూతిపరులో గుర్తించడం కష్టం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం భద్రత విషయంలో రాజీపడరాదని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రోడ్డుమార్గం వద్దని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు సూచించినట్లు సమాచారం. భారీ వర్షంలోనూ టేకాఫ్..! సాధారణంగా వాతావరణ మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో వీఐపీ నాయకులు హెలికాప్టర్ వద్దని.. రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటారు. సోమ వారం పెద్దపల్లి జిల్లాలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో అంతా సీఎం రోడ్డు మార్గానే వస్తారనుకున్నారు. మధ్యాహ్నం తరువాత పరిణా మాలు చకచకా మారిపోయాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పలువురు ఐపీఎస్‌ల నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. అక్క డికే సీఎం హెలికాప్టర్ చేరుకుంది. ఆ తరువాత వేదికపై ప్రసంగిస్తుండగానే భారీ వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ సీఎంను పోలీసులు హెలికాప్టర్లోనే పంపి ఊపిరి పీల్చుకున్నారు. రెండేళ్ల తరువాత రాష్ట్రానికి అడెల్లు..! 2020 జూలైలో లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైలారపు అడెల్లు అలి యాస్ భాస్కర్ గిరిజన తండాల్లో రిక్రూట్ మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ కదంబా ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడం, మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు దళం తృటిలో తప్పించుకోవడంతో అతను తిరిగి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లి పోయాడు. రెండేళ్ల తరువాత తిరిగి అడెల్లు రాష్ట్రంలో ప్రవేశించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే కొందరికి మావోలు ఆర్థికంగా, పేలుడు పదార్థాల విషయంలో సహకరించారు. అయితే మావో లతో లింకులున్న వారిని గుర్తించిన పోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలను హతమార్చి నిధులు, ఉనికిని సాధించే ప్రణాళికను అమలు చేసేందుకే అడెల్లు, ఇతర దళాలు తెలంగాణలోకి వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. కాగా,పాండు అలి యాస్ మంగులుపై రూ.5 లక్షలు, భాస్కర్‌పై 20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
గోదావరి తీరంలో నక్సల్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా?.. అంటే నిజమే అంటున్నాయి పోలీసువర్గాలు. ఏటా జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఏటూరునాగారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో బుధవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్‌పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.. మావోయిస్టు పార్టీ ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా, కోవర్టుల కారణంగా ఆ పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు. అగ్రనేతల మరణం.. కోలుకోలేని నష్టం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. 2020–22 సంవత్సరాల్లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా.. మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల ఉన్నతాధికారులు.. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. -
ఎన్ఐఏ విస్తృత తనిఖీలు
సాక్షి, అమరావతి/టంగుటూరు/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పర్యవేక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది విజయవాడ, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల నివాసాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్లకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 10 గంటలకు పైగా సోదాలు నిర్వహించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర (కేఎన్పీఎస్) అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, కొత్త రాజరాజేశ్వరిపేటలో పట్టపు జ్యోతి (డప్పు రమేష్ భార్య) నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేశాయి. ఇక ప్రకాశంజిల్లాలోని ఆలకూరపాడులోని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అలియాస్ రమాదేవి వాసంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె నివాసంలో లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. శిరీష ఇంటి పరిసరాల్లో 200 మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రజలను, మీడియాను రాకుండా నిలువరించారు. తహసీల్దారు, వీఆర్ఏ సమక్షంలో ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థినిని దళాలకు వైద్యం చేసేలా నియమించుకుని, దళం వైపు అకర్షించేలా చేశారని వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు క్రమంలోనే ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది. కాగా, విజయవాడలో దుడ్డు ప్రభాకర్ నివాసంలో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు చేయడానికి వ్యతిరేకంగా విరసం, కేఎన్పీఎస్, ఇఫ్టూ తదితర ప్రజా సంఘాలు నిర్వహించిన ధర్నాలో శిరీష పాల్గొన్నారు. తన భర్త, కుమారుడు చనిపోయాక టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న తమ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్‌ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్‌ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
కాళేశ్వరం/గడ్చిరోలి: తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండల్స్‌ను సరఫరా చేస్తున్న నలుగురు ఆదివారం గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అహేరి తాలూకా దామ్రాంచ–బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పీఎస్సై సచిన్ ఘడ్కే ఆధ్వర్యంలో క్యూఆర్టీ పోలీసుల బలగాలతో మాటువేసి పట్టుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజుగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా, వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వీటిని వివిధ లాంచర్లు, హ్యాండ్‌గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారీలో ఉపయోగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. -
ఛత్తీస్ గఢ్ లో భర్త కోసం అడవి బాట పట్టిన భార్య
-
విశాఖపట్నం: మావోయిస్టు అరెస్టు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావును శనివారం కూంబింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, రెండు మందుపాతరలు పేల్చిన ఘటనలు, రెండు కిడ్నాప్‌లు, ఐదు ఎదురుకాల్పుల ఘటనల్లో సుందరరావు నిందితుడని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కొండసువ్వాపల్లి గ్రామానికి చెందిన కొర్రా సింగ్రు రెండువేల సంవత్సరంలో రైతు కూలి సంఘంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ప్రస్తుతం పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో తిరుగుతూ పలునేరాల్లో పాల్గొన్నాడు. కొర్రాసింగ్రుపై ఏపీలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోను సుమారు 70కు పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు పట్టుబడిందిలా.. కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీలపై మందుపాతరను పేల్చి హతమార్చాలన్న లక్ష్యంతో కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావు, మరికొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులతో కలిసి కోరుకొండ ప్రాంతం నుంచి గాలికొండ ప్రాంతానికి మందుపాతరలు తీసుకువెళ్తూ పట్టుబడ్డాడు. సప్పర్ల జంక్షన్ వద్ద సంచితో ఉన్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతనితో వచ్చిన మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. అతని వద్ద సంచిలో కంట్రీమేడ్ పిస్టల్ ఒకటి, 7.65 ఎంఎం లైవ్‌రౌండ్స్ ఐదు, రెండు కిలోల లైవ్ మైన్‌తో ఉన్న స్టీల్ క్యారేజ్ ఒకటి, డిటోనేటర్లు రెండు, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్, 4 నిప్పో బ్యాటరీలు ఉన్నట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నాలుగు హత్య కేసుల్లో.. ►డిసెంబర్ 23, 2020న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ చింతగరువు గ్రామానికి చెందిన చిక్కుడు సత్యారావు అలియాస్ సతీష్‌ను పోలీసు ఇన్ఫార్మర్గా ముద్రవేసి హత్యకు పాల్పడ్డాడు. ►అక్టోబర్ 20, 2019న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ లండులు గ్రామానికి చెందిన కొర్రా రంగారావును చిట్రకాయల పుట్రువద్ద పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు. ►జూన్ 28, 2019న పెదబయలు మండలం, బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా సత్తిబాబును అర్ధరాత్రి ఇంటికి వెళ్లి చంపాడు. ►డిసెంబర్ 9, 2017న జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ మద్దిగరువు గ్రామానికి చెందిన కొలకాని సూర్యచంద్రబాబు, ముక్కాల కిషోర్‌లను మద్దిగరువు గ్రామ శివారులో హతమార్చాడు. చదవండి: మరణ మృదంగం! ఒక్కరోజులోనే 15 మంది మృతి.. కారణాలేవేర్వేరు! -
ఏడాదంతా ‘కోవిడ్ డ్యూటీ’లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి తెలిపారు. 2020 తరహాలోనే 2021లో సంవత్సరమంతా కోవిడ్ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేశామని... వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సహా ఇతర శాఖల సమన్వ యంతో ప్రజలకు సేవలు అందించామన్నారు. దీంతో ప్రజల నుంచి పోలీసులకు మంచిపేరు లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలసి వార్షిక నేర నివేది క–2021ను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో సఫలీకృతమయ్యా మని, నేరాల నియంత్రణ, నేరస్తులను అరె స్టులో మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టురహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 2020లో లాక్డౌన్ నేపథ్యంలో నేరాలు తక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఏడాదితో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని వివరించారు. 2021లో జరిగిన హత్యలు, కిడ్నాప్‌లు సహా వివిధ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మొత్తం 1,32,906 కేసులు... వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మావోయిస్టుల అరెస్ట్.. ♦2021లో 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మరో 133 మంది లొంగిపోయారు. స్టేట్ కమిటీలో ఇంకా 100 ఉండగా వారిలో కేవలం 30 మందే తెలంగాణకు చెందిన వారు. మిగతా 70 మంది ఛత్తీస్‌గఢ్‌వాసులు. ఆ రాష్ట్రంతో కలసి మావోయిస్టులను కట్టడి చేస్తున్నాం. 38,812 మంది నేర నిర్ధారణ ♦2021లో మొత్తం 38,812 మంది నిందితు లు దోషులుగా నిరూపితం కాగా.. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. శిక్షల శాతం 48.5 నుంచి 50.3 శాతానికి చేరింది. పదేపదే నేరాలు చేస్తున్న 664 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 5 నిమిషాల్లోనే స్పాట్‌కు... ♦డయల్ 100 నంబర్‌కు వచ్చే కాల్స్‌కు పోలీసులు సత్వరం స్పందించాలనే లక్ష్యంతో రెస్పాన్స్ టైమ్‌ను గణిస్తున్నాం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 7 నిమిషాల్లో పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకుంటున్నారు. రూ. 53 కోట్ల విలువైన సొత్తు రికవరీ... ♦2021లో మొత్తం 17,429 దొంగతనాలు నమోదవగా రూ. 113 కోట్ల విలువైన సొ త్తు దొంగలపాలైంది. వాటిలో 7,682 కే సులను (44%) కొలిక్కి తెచ్చి రూ. 53 కో ట్ల (47%) విలువైన సొత్తు రికవరీ చేశాం. 838 జీరో ఎఫ్ఐఆర్లు... ♦నేరం జరిగినప్పుడు పరిధుల సమస్యతో బాధితుడు ఠాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా ఉండటానికి రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేపడుతున్నాం. 2020లో ఇలాంటి కేసులు 517 నమోదవగా 2021లో అవి 838కి పెరిగాయి. వాటిని ఆయా పరిధిల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నాం. 4 నెలల్లో ట్విన్ టవర్స్... ♦హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మి తమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 3–4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు. రిటైరయ్యేలోగా ప్రతి పోలీసుకూ ఇల్లు ♦ప్రతి ఒక్కపోలీసుకు రిటైరయ్యే సమ యానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మా లక్ష్యం. దీనికి ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతిజిల్లాకు ఓ పోలీసు కల్యాణ మం డపం, అనువైన ప్రతిచోటా పెట్రోల్ బం కుల ఏర్పాటుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. సిబ్బందికి నామమాత్రపు వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. -
సరిహద్దులో పేలిన తూటా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఇంకా చీకట్లు తొలగిపోలేదు.. చలితో మన్యం వణుకుతోంది.. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం. అరగంటకు పైగా భీకర పోరు. సోమవారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్ జవాన్లు.. మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం గ్రామాల మీదుగా ట్రాక్టర్లపై ఆంజనేయపురం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు అంబులెన్సుల ద్వారా భద్రాచలం మీదుగా తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అరగంట సేపు హోరాహోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలోని పెసర్లపాడు అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి జిల్లా చర్లతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, సుకుమా జిల్లాకు చెందిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ బలగాలు.. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ నేతృత్వంలో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. అర్ధగంట పాటు సాగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా ప్రాంతంలో రెండు 303 రైఫిళ్లు, మూడు డీబీబీఎల్ తుపాకులతో పాటు నాలుగు రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీఆర్పీఎఫ్ క్యాంపును తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించిన పది రోజులకే భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. కాగా క్రమంగా విస్తరిస్తున్న మావోయిస్టుల ఏరివేతపై జిల్లా పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశానిర్దేశం చేశారనే చర్చ జరుగుతోంది. చర్ల టు సుకుమా..! మృతదేహాలకు పోస్టుమార్టం చేసే విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ముందు ములుగు జిల్లాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత భారీ భద్రత నడుమ అటవీ ప్రాంతం నుంచి చర్ల వరకు మృతదేహాలను తీసుకొచ్చారు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుందని అందరూ భావించారు. కానీ భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమాకు తరలించారు. మృతదేహాలను తరలించే సమయంలో సరిహద్దు గ్రామాలకు చెందిన ఆదివాసీలు వాహనాలను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. కాగా చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలుసుకునే యత్నం చేస్తు న్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. చర్ల–కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై దాడికి వ్యూహరచన చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. చనిపోయిన వారంతా మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి (బీకే–టీజీ) జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ అంగరక్షకులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న రాకెట్ లాంచర్లు, తుపాకులు ఆపరేషన్ ఆజాద్ ఫలించలేదా..? ఈ ఎన్కౌంటర్ నుంచి ఆజాద్ తప్పించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉంటూ తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆజాద్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్, ఆజాద్ ప్రొటెక్షన్ టీం సభ్యుడు మంతు ఉన్నట్లుగా తెలుస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. -
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
-
మాజీ సర్పంచ్ కురసం రమేష్ ఆడియో విడుదల చేసిన మావోలు
-
ములుగులో మావోయిస్టుల ఘాతుకం.. మాజీ సర్పంచ్ హత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ కురుసం రమేష్‌ను చంపేశామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని కే కొండాపురం. 2014లో సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్ కిడ్నాప్‌కు గురయ్యాడు. చదవండి: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు.. కాగా 2019లో రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పాలపొడిలో విషం కలిపి ఇచ్చాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. విషం కలిపిన పాలపొడితో కామ్రేడ్ బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాని పేర్కొన్నారు. అదే విధంగా రమేష్ ఒక ఎన్కౌంటర్ చేయించి రెండు లక్షలు తీసుకున్నాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్‌ను హత్య చేశామని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్ఫార్మర్గా మారితే రమేష్‌కు పట్టిన గతే పడుతుందని మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత హెచ్చరించారు. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను.. -
మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోలు..ఏజెన్సీలో ఉత్కంఠ
ఏటూరునాగారం/వెంకటాపురం (కె): మాజీ సర్పంచ్, ప్రస్తుతం డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న కురుసం రమేశ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్ చేసినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సూరువీడు ప్రాంతానికి చెందిన రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్ భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత 24 గంటలు దాటినా రమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా, కొందరు ముఖానికి ముసుగులు కట్టుకొని రమేశ్‌ను వేరే వాహనంలో తీసుకెళ్లినట్లు అక్కడి స్థానికులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఏజెన్సీలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో ఆయన పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్ చేసి.. రమేశ్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటున్న రమేశ్ భార్య రజిత, పిల్లలు అన్నలూ.. నా భర్తను విడిచి పెట్టండి.. రమేశ్ భార్య రజిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, మా కుటుంబానికి అన్యాయం చేయొద్దని మావోయిస్టులను కోరారు. ‘ఏదైనా తప్పుచేస్తే నాలుగు దెబ్బలు కొట్టి ఇంటికి పంపించండి. మాకు ఇద్దరు పిల్లలు, నేను ఆగమైపోతా. మీ తోడబుట్టిన దానిని అనుకొని నా భర్తను విడిచి పెట్టండి. నా కుటుంబానికి నా భర్తే పెద్ద దిక్కు. అన్నలూ.. దండం పెడుతున్నా.. ఆయనకు ఏదైనా హాని తలపెడితే మేం బతకం’అంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రమేశ్ తల్లి మంగమ్మ కూడా కొడుకును విడుదల చేయాలని కోరారు. -
మహిళా మావోయిస్టుల జీవిత చరిత్రపై పుస్తకం
చర్ల: ప్రజాయుద్ధంలో 2005 నుంచి 2021 వరకు అసువులుబాసిన మహిళా అమరవీరుల జీవిత చరిత్రపై మావోయిస్టులు పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఓ లేఖ ద్వారా వెల్లడించారు. 178 పేజీల పుస్తకం పీడీఎఫ్‌ను కూడా విడుదల చేశారు. దశాబ్దాల పోరు చరిత్రలో ఎందరో మహిళా గెరిల్లాలు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ప్రజాఉద్యమ చరిత్రలో తమ చెరగని ముద్రవేశారని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. త్యాగధనుల జీవిత చరిత్రలు సమాజానికి తరగని గనిలాంటివని భావిస్తూ ఈ పుస్తకాన్ని తెచ్చామని చెప్పారు. గతంలోనూ 2005లో మహిళా మావోయిస్టుల అమరులపై ఎన్టీ ఎస్‌జడ్‌సీ (ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ) ఒక పుస్తకాన్ని ప్రచురించగా, ఇప్పుడు రెండో పుస్తకాన్ని వెలువరించినట్లు జగన్ తెలిపారు. -
ఎల్గార్ కేసులో సుధాకు డిఫాల్ట్ బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబం ధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు బుధవారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుతో సహా మరో 8 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధా భరద్వాజ్ డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులేనని ఉత్తర్వులో స్పష్టం చేసింది.బెయిల్ కండీషన్‌తోపాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. కేసు నమదైన 90 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా దర్యాప్తు సంస్థ 90 రోజులకు మించి నిందితుడిని తమ అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉంటుంది. సుధా భరద్వాజ్‌ను 2018 ఆగస్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని, గృహ నిర్బంధంలో ఉంచారు. -
రెండు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాజీ మావోయిస్టులు, సానుభూతిపరుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు చేసింది. వేర్వేరు బృందాలు, స్థానిక పోలీసులతో.. అన్నిచోట్లా ఉదయం ఆరు గంటల సమయంలో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. 2019 జూలై 28న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో చేసిన ఈ సోదాల్లో.. కీలక డాక్యుమెంట్లు, సాహిత్యం, సెల్ఫోన్లు పెన్‌డ్రైవ్‌లను సీజ్ చేసినట్లు వెల్లడించింది. 2019 బస్తర్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి.. సంజు అలియాస్ పాండు, పునెం అలియాస్ లక్ష్మణ్, మున్నీతోపాటు మరో 40 మందిపై ఈ ఏడాది మార్చిలో ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మావోయిస్టులకు కొందరు సహకరించినట్టుగా లభించిన ఆధారాల మేరకు తాజాగా సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఒక్క గది.. ఏడు గంటలు సోదాలు గురువారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు మహిళా హాస్టల్లోని ఓ గదిలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తనిఖీలు నిర్వహించింది. ఓయూ, సెంట్రల్ వర్సిటీ, ఇతర కాలేజీల్లో చదువుకునే ఆరుగురు విద్యారి్థనులు ఆ గదిలో ఉంటున్నారని తెలిసింది. వీరిలో ఓ విద్యారి్థని వివాహిత అని, ఆమె భర్త మావోయిస్టులతో కలిసి పనిచేశారని సమాచారం. తనిఖీల్లో కొన్నిపత్రాలు, పుస్తకాలను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ►అల్వాల్‌లో అమరవీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకుమారి, సుభానగర్లో సహాయ కార్యదర్శి భవాని నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. ►ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్ కుమారుడు నాగరాజు నివాసంలో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ►హైదరాబాద్‌లోని నాగోల్‌లో మాజీ మావోయిస్టులు నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతుల నివాసంలో సోదా చేసి.. కంప్యూ టర్ హార్డ్‌డిస్క్‌లు, విప్లవ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. ►వనస్థలిపురం ఇంజనీర్స్‌కాలనీలో రిటైర్డ్ లెక్చరర్, టీపీఎఫ్ చైర్మన్ కె.రవిచంద్ర నివాసంలోనూ ఎన్ఐఏ తనిఖీ చేసింది. ►మరోవైపు ఏపీలోని వైజాగ్‌లో న్యాయవాద దంపతులు అందలూరి అన్నపూర్ణ, శ్రీనివాస్‌రావు.. ప్రకాశం జిల్లా అలకురపాడులో విప్లవ సాహిత్య రచయిత జి.కల్యాణ్‌రావు నివాసాల్లోనూ ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఎన్ఐఏ దాడులు సరికాదు సమాజంలో వివిధ వర్గాల సమస్యల పరిష్కారం, న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాడుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఎన్ఐఏ దాడులను ఖండిస్తున్నట్టు అమరుల బంధుమిత్రుల సంఘం ప్రకటించింది. వందల మంది పోలీసుల పహారాతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొంది. హక్కుల కార్యకర్తలు, రచయితలపై ఎన్ఐఏ దాడులను ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతులు -
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. 26 మంది మృతి
-
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, వరంగల్/మంచిర్యాల/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకా గ్యారబట్టి అడవుల్లో తుపాకులు గర్జించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ కమాండోలు నలుగురు గాయపడ్డారు.మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆదివారం ఉదయం వరకు మృతుల పూర్తి వివరాలు తెలుస్తాయని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌కు తరలించారు. సుదీర్ఘ పోరు గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో కోర్చి దళం సంచరిస్తోందని పక్కా సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో సి–60 కమాండోల బృందం కూంబింగ్ ప్రారంభించింది. వంద మందికి పైగా బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ధనోరా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని కోర్చి గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులు కమాండో బృందంపైకి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఘటనలో నలుగురు కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి రాత్రి 7 గంటల వరకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి 18 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులైన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పని చేస్తున్న రవి అలియాస్ జైలాల్ చనిపోయినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జూన్ 25న బాణం బాంబులు పరీక్షిస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతికతలో దిట్ట అయిన రవి మరణవార్తను చాలా ఆలస్యంగా పార్టీ బహిర్గతం చేసింది. మృతుల్లో మిలింద్ తేల్‌తుమ్డే? ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే అలియాస్ దీపక్, అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో పలువురు డివిజన్, ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలపై ఆదివారం వరకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎల్గార్ పరిషత్–భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న మిలింద్ పుణె పోలీసుల మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్నాడు. ‘మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇది పోలీసు బలగాలకు లభించిన ఘన విజయం’అని ఎస్పీ గోయెల్ పేర్కొన్నారు. మిలింద్కు గన్‌మెన్‌గా పని చేసిన రాకేశ్ కొద్ది రోజుల క్రితమే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. దెబ్బ మీద దెబ్బ... నిత్యం డ్రోన్లతో జల్లెడ పడుతూ, దండకారణ్యంలో కూంబింగ్‌లతో సాగుతున్న ఆపరేషన్ ప్రహార్‌తో ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2018లో ఏప్రిల్ 23న గడ్చిరోలి జిల్లా అహెరి, ఏటపల్లి తాలూకాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 40మంది మావోయిస్టులు మృత్యవాత పడ్డారు. ఈ ఏడాదిలో భారీ ఎన్కౌంటర్లు మే 21న పయిడి, కోట్మి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 13మంది మావోయిస్టులు చనిపోయారు. అక్టోబర్ 11న కోస్మి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.