రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్‌కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్ ఉన్నారు.
ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరోనంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్‌రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పీ సుందర్‌రాజ్ వెల్లడించారు.



