సోషల్ మీడియా ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రూపకంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే న్యూస్ చూస్తుంటాం. కొన్ని సార్లు మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తుంటాం. అయితే మనం ఫార్వడ్ చేసే సమాచారం వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రచారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజనిర్ధారణతో సంబంధం లేకపోవడం,ఎటువంచి ఖర్చు లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఇష్ఠారీతిన సోషల్ మీడియా ప్రచారం చేపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలలో జరిగే అసత్య ప్రచారాల వల్ల మహిళలు, పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే వాటిపై సరైన అవగాహాన లేకపోవడంతో కొంతమంది అటువంటి మెసేజ్‌లను గమనించకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి మెసేజ్‌లపై జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు.
మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి.
వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చేసే మేసేజ్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.
తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకూడదు.
తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు.
సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ తప్పుడు వార్తలు సష్టించవద్దు.
ఏదైనా మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే ముందు అది సరైందా కాదా దానివల్ల ఏవరి మనోభావాలైనా దెబ్బతింటాయా అనే విషయం గుర్తుంచుకోవాలని పోలిీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.


