ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు రైతులు మృతి | Tragedy Road Incident In Jagtial | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు రైతులు మృతి

Feb 3 2026 7:11 PM | Updated on Feb 3 2026 8:00 PM

Tragedy Road Incident In Jagtial

సాక్షి,మల్లాపూర్‌: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తా పడి నలుగురు రైతులు మృతి చెందారు. 

స్థానికులు వివరాల మేరకు.. మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement