4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు | Warangal Taste of 2025: 4 Lakh Biryanis and Idlis for Breakfast | Sakshi
Sakshi News home page

4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు

Feb 3 2026 4:47 PM | Updated on Feb 3 2026 5:26 PM

Warangal Taste of 2025: 4 Lakh Biryanis and Idlis for Breakfast

భారతదేశం ఎలా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసింది తెలుసుకోవడానికి వరంగల్ ఎడిషన్ చూడండి, నగరం యొక్క అభివృద్ధి చెందుతున్న ఆహారపు అలవాట్లు మరియు గడిచిన సంవత్సరం యొక్క రుచికరమైన జ్ఞాపకాలు గుర్తించి ఇది క్లుప్తంగా వివరిస్తుంది.

నగరానికి ఇష్టమైనవి
చికెన్ బిర్యానీ నగరంలో అత్యంతగా ఆర్డర్ చేయబడిన వంటకంగా చికెన్ బిర్యానీ నిలిచింది. 2025లో 4.46 లక్షలకు పైగా ఆర్డర్లు చేయబడ్డాయి, ప్రతి రోజూ సగటున 1222 ప్లేట్స్ కంటే ఎక్కువగా ఆర్డర్ చేయబడ్డాయి! వెజ్ దోస, ఇడ్లీ మరియు వెజ్ బిర్యానీలు నగరంలో ఆర్డర్ చేయబడిన అగ్ర 5 వంటకాల్లో భాగంగా ఉన్నాయి.

ఒక కస్టమర్ రూ. 13,778 విలువ గల సింగిల్ ఆర్డర్ చేసాడు. దీనిలో స్థానికంగా ఉత్తమమైన  ఆహారాలు అనగా జఫ్రాని మటన్ బిర్యానీ, జఫ్రాని చికెన్ బిర్యాని, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65, చికెన్ టిక్కా మసాల, ఇంకా ఎన్నో  మొత్తం 37 ప్లేట్స్ ఉన్నాయి -నగరంలో ఇది అత్యధికం.! అర్థరాత్రి ఎక్కువగా తినే అలవాటు కూడా ప్రసిద్ధి చెందుతోంది, దీని ఆర్డర్లు ప్రతి ఏడాది 118% పెరుగుతున్నాయి.

బిర్యానీలు, బర్గర్ల కోసం కోరికలు  అర్థరాత్రి వరకు కొనసాగాయి ( ఉదయం 12 గంటలు నుండి  – ఉదయం 2 గంటలు వరకు). దీనిలో చికెన్ బిర్యాని ముందు స్థానంలో  ఉండగా తదుపరి  స్థానంలో చికెన్ షావర్మ ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బర్గర్, చికెన్ పిజ్జాలు అనేవి ఇష్టపడిన ఇతర ఆహారాల్లో భాగంగా ఉన్నాయి.

అత్యంతగా ఆర్డర్ చేయబడిన డిజార్ట్‌లో డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ నిలిచింది. తదుపరి చాకొలెట్ కేక్, చాకొలెట్ వేఫల్ నిలిచాయి. నగరంలో ఉదయపు వేళలు క్లాసిక్‌గా ఉన్నాయి. ప్రతి ఉదయం 200 ప్లేట్లు కంటే ఎక్కువగా ఆర్డర్ ఇడ్లీ ఆర్డర్ చేయబడింది. ఇది అత్యంతగా ఆర్డర్ చేయబడిన బ్రేక్ ఫాస్ట్ వంటకంగా నిలిచింది. వెజ్ దోస, వడ, ఉల్లి దోస, బోండాలు  తదుపరి స్థానంలో ఉన్నాయి.

స్నాక్-టైమ్ ( మధ్యాహ్నం 3 నుండి- రాత్రి 7 వరకు) కోరికల్లో చికెన్ బిర్యానీ కార్ట్స్ లో అగ్ర స్థానంలో నిలిచింది, తదుపరి చికెన్ బర్గర్, చికెన్ షావర్మ, చికెన్ పిజ్జాలు ఉన్నాయి. వెజ్ మంచూరియన్, వెజ్ బిర్యానీలు కూడా నగరంలో ఇష్టపడిన అగ్ర 10 స్నాక్స్ లో ఉన్నాయి. ఆహారం ఆర్డర్ చేయడానికి డిన్నర్ అత్యంత ప్రసిద్ధి చెందిన సమయం.

సరసమైన ఎంపికలకు ఆదరణ. 99 స్టోర్ ఆర్డర్స్‌పై, చికెన్ బిర్యానీకి ఇష్టమైన ఆహారాల్లో అగ్ర స్థానం వచ్చింది.  సుమారు 159 ప్లేట్స్ ప్రతి రోజూ ఆర్డర్ చేయబడ్డాయి. చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రైడ్ రైస్,మటన్ బిర్యానీలు ఇష్టమైన 5 ఆహారాల్లో అగ్ర స్థానంలో నిలిచాయి.

ధోరణులను గురించి వివరిస్తూ సిద్ధార్థ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ ఇలా అన్నారు, “ 2025లో భారతదేశం ఇష్టమైన వంటకాల్లో లీనమైన కారణంగా  ఆహారం మన దైనందిన జీవితంలో, సంబరాల్లో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగింది. వరంగల్‌లో క్లాసిక్‌ఫై   ప్రేమకు  జాతీయంగా ఇష్టపడే వాటి సౌకర్యానికి మధ్య  ఉత్తమమైన సమతుల్యతను మేము చూసాము. ఆహారం అనేది ఒక భావోద్వేగం. నగరంలో ప్రతి మూలలో సాటిలేని ఆహార అనుభవాలను అందచేయడానికి మేము కట్టుబడ్డాము, ఒకేసారి ఒక భోజనం, ఒక సంబరం’ అని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement