కడియం శ్రీహరికి స్పీకర్‌ నోటీసులు | Defection Row: Speaker Gaddam Prasad Notices to Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

కడియం శ్రీహరికి స్పీకర్‌ నోటీసులు

Feb 3 2026 1:26 PM | Updated on Feb 3 2026 1:30 PM

Defection Row: Speaker Gaddam Prasad Notices to Kadiyam Srihari

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 

కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్‌ విననున్నారు.

మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్‌ పిటిషన్‌ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్‌ విచారణ జరగబోతోంది. మరో  ఎమ్మెల్యే సంజయ్‌ వ్యవహారంపై స్పీకర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement