World Cancer Day: ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి | World Cancer Day: Kamineni Hospital Launches Missed Call Campaign | Sakshi
Sakshi News home page

World Cancer Day: ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి

Feb 3 2026 8:27 PM | Updated on Feb 3 2026 8:27 PM

World Cancer Day: Kamineni Hospital Launches Missed Call Campaign

హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు ప్రజలు 040-6905 9100 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కుటుంబంలో ఒకరు, అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వారసత్వ కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది.

సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశమున్నప్పటికీ, సుమారు 10 శాతం క్యాన్సర్లు వారసత్వ జన్యు మార్పుల కారణంగా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు, తక్కువ వయస్సులో క్యాన్సర్ రావడం, తరతరాలుగా కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ కనిపించడం వంటి అంశాలు జన్యుపరీక్షలకు కీలక సూచికలని వివరించారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా లక్ష్యిత స్క్రీనింగ్, నివారణ చర్యలు మరియు వ్యక్తిగత వైద్య సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

కామినేని ఆసుపత్రి జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.

కామినేని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ, “చాలామంది కుటుంబ చరిత్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. లక్షణాలు కనిపించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వచ్చి, తమ ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం, బోర్డు సర్టిఫైడ్ జన్యు కౌన్సెలర్లతో పాటు ఆంకాలజీ తదితర విభాగాల వైద్యులతో కలిసి సమగ్ర ప్రమాద అంచనా మరియు వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement