‘సిక్కిం సుందరి’పై ఆనంద్‌ మహీంద్ర ప్రేమ, వైరల్‌ వీడియో | rare Himalayan flower Sikkim Sundari Blooms in 30 years attracts Anand Mahindra | Sakshi
Sakshi News home page

‘సిక్కిం సుందరి’పై ఆనంద్‌ మహీంద్ర ప్రేమ, వైరల్‌ వీడియో

Dec 22 2025 4:09 PM | Updated on Dec 22 2025 4:46 PM

 rare Himalayan flower Sikkim Sundari Blooms in 30 years attracts  Anand Mahindra

ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్‌ మహీంద్ర  ‘సిక్కిం సుందరి’ పై మనసు పారేసుకున్నారు.  ప్రకృతి అసాధారణ సృష్టి, అద్భుతం అంటూ దీని గురించి ట్వీట్‌ చేశారు. ఇంతకీ  ఏవరీ సిక్కిం సుందరి తెలుసుకుందాం.

అరుదైన హిమాలయ పుష్పం అసాధారణ జీవిత చక్రాన్ని హైలైట్ చేస్తూ,  ఆశ్చర్యాన్ని ప్రకటించారు. సహజ అద్భుతం అంటూ ప్రశంసించారు. దానిపేరే సిక్కిం సుందరి. ఇది  హిమాలయ పర్వతశ్రేణుల్లో కనిపించే అరుదైన మొక్క. దీన్ని రూమ్ నొబైల్‌ (Rheum nobile) అని పిలుస్తారు. దీని ప్రత్యేక రూపం కారణంగా "గ్లాస్‌హౌస్ ప్లాంట్" అని. ఇది చాలా ఎత్తులో పెరుగుతుంది  ఒకేసారి పెద్దగా పూసి చనిపోతుంది. 30 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ఈ మొక్కను సిక్కిం సుందరి అంటారు. 

ఆనంద్ మహీంద్రా ఆదివారం అరుదైన మొక్కపై తన అభిమానాన్ని  ఎక్స్‌ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి లోని అపూర్వ అసాధారణ సృష్టిలలో ఒకటిగా ఉన్న దీని గరించి  తన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన లేదన్నారు.  కఠినమైన పరిస్థితులలో ఓర్పుతో వికసించే ఈ మొక్క  సహనానికి ఒక మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు. 

ఇది దాదాపు 3 నుండి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎత్తైన, కోన్‌ ఆకారంల  వికసిస్తుంది ఇది ఒకేసారి పుష్పిస్తుంది, దాని విత్తనాలను వెదజల్లడంతో దాని జీవిత చక్రాన్ని పూర్తి అవుతుందని మహీంద్రా చెప్పారు. ఇలాంటి వాటికి  ఎందుకు గుర్తింపు లభించడం లేదని ప్రశ్నించారు. సిక్కిం వంటి ప్రాంతాలను అన్వేషించడానికి  స్థానిక జీవవైవిధ్యంతో తిరిగి కనెక్ట్ అవాలని  మహీంద్రా కోరారు.

 

చదవండి: కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత?

 సిక్కిం, తూర్పు నేపాల్ ,ఆగ్నేయ టిబెట్‌లో సముద్ర మట్టానికి 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో  ఈ మొక్క   కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా  సమాచారం  ప్రకారం అపారదర్శక, గడ్డి-రంగు బ్రాక్ట్‌లలతో కోన్-ఆకారపు టవర్‌లా ఎదుగుతాయి. ఈ బ్రాక్ట్‌లు సహజ గ్రీన్‌హౌస్ లాగా పనిచేస్తాయి. సూర్యరశ్మి గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ, ఎండ, చల్లగాలులనుంచి సున్నితమైన పువ్వులను  కాపాడుతుంది. ఇది లోపల వెచ్చని మైక్రోక్లైమేట్‌ను సృష్టిస్తుంది. అధిక ఎత్తులో మొక్క మనుగడకు సహాయపడుతుంది. అలాగే దాని ఎత్తు, లేత రంగు కారణంగా, మొక్క పర్వత లోయల మీదుగా  అందంగా స్పష్టంగా కనిపిస్తుంది.

సాంస్కృతిక, ఔషధ  ప్రాముఖ్యత
అయితే దీని రూపం, ఆకర్షణతో పాటు సిక్కిం సుందరికి సాంస్కృతిక, ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్థానికంగా చుకా అని పిలుచుకునే దీని కాండాన్ని సాంప్రదాయ వంటలలో వండుకుని  తింటారు.  దీని ప్రకాశవంతమైన పసుపు వేర్లు సాంప్రదాయ టిబెటన్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా జూన్ , జూలై మధ్య పుష్పిస్తుంది, ఇది ఎత్తైన హిమాలయాలలో సీజనల్‌ హైలైట్‌గా  నిలుస్తుంది.సింగిల్ బ్లూమ్ మొక్క  చనిపోయి, దశాబ్దాల వరకు ఆ విత్తనం అలాగే పదిలంగా ఉంటూ, మళ్లీ  మొలకెత్తడమే దీని ప్రత్యేకత. 

ఇదీ చదవండి: కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement