మేఘాలయలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి | Coal Mine Blast At Meghalaya East Jaintia Hills district | Sakshi
Sakshi News home page

మేఘాలయలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

Feb 5 2026 7:46 PM | Updated on Feb 5 2026 7:56 PM

Coal Mine Blast At Meghalaya East Jaintia Hills district

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలో పేలుడు సంభవించడంలో 16 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో సాయంత్రం ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో సమయంలో కూలీలు అందులో చిక్కుకుపోయారు. ప్రమాదం ధాటికి 16 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement