రాగి గనిలో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి | bridge collapses at Congo mine | Sakshi
Sakshi News home page

రాగి గనిలో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి

Nov 17 2025 7:24 AM | Updated on Nov 17 2025 8:39 AM

bridge collapses at Congo mine

కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాంగోలోని రాగి గనిలో వంతెన కూలిపోయిన ఘటనలో 32 మంది మృతి కార్మికులు మృతి చెందారు. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియోల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. కాంగోలో లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో రాగి గని ఉంది. ఈ మైనింగ్‌లో వందలమంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, ఇందులో కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 32 మంది చనిపోయినట్టు మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇక, కాంగోలో మైనింగ్ గని ముఖ్యమైన జీవనాధారం. దాదాపుగా 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో భద్రతా చర్యలు సరిగ్గా లేవు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement