ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో ఘటన చోటు చేసుకుంది.
తాజాగా మరో హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్‌కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్‌లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల హింసాత్మక ఆందోళనలు మొదలైన తర్వాత హిందువులపై దాడి జరగడం ఇది నాల్గోసారి. డిసెంబర్ 24వ తేదీన కాలీమోహన్ ఏరియాలో అమృత్ మోండ్(29) అనే హిందూ యువకుడిపై దాడి జరగ్గా, డిసెంబర్ 18వ తేదీన దీపూ చంద్రదాస్ అనే 25 ఏళ్ల హిందూ యవకుడిని దారుణంగా హత్యచేశాయి అల్లరిమూకలు. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మెమిన్‌సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్‌గన్‌తో కాలచ్చింపాడు.


