ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్‌లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో యుద్ధం వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. ఉక్రెయిన్‌లో ఉపయోగించే హమాస్‌తో అనుసంధానించబడిన ఈ ఇరాన్ యుద్ధ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి యూఎస్‌కు కొన్ని మైళ్లు దూరంలో ఉండటంతో మరింత ఆందోళన కల్గిస్తోంది.
దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని ట్రంప్ పేర్కొన్నారు.
దాంతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వెనిజులా దానికి ప్రతిగా సన్నద్ధమవుతుందన్న దానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.


