WC 2026: యుద్ధం ఎఫెక్ట్‌.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి అవుట్‌ | Iran To Withdraw From FIFA World Cup 2026 Amid War Tensions, If So Who Will Replace Iran, Read Story Inside | Sakshi
Sakshi News home page

WC 2026: యుద్ధం ఎఫెక్ట్‌.. ఇరాన్‌ సంచలన నిర్ణయం!

Mar 3 2026 5:08 PM | Updated on Mar 3 2026 6:09 PM

FIFA World Cup 2026: Iran To Withdraw If So Who Will Replace Iran

యుద్ధం వేళ ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీ నుంచి ఇరాన్‌ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జూన్‌–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్‌ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్‌ స్పష్టం చేశాడు.

వైమానిక దాడులు
కాగా మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్‌ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్‌ అన్నాడు.

ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్‌–జూలైలలో జరిగే ప్రపంచకప్‌లో ఇరాన్‌ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్‌ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్‌, ఈజిప్ట్‌లతో కలసి ఉంది ఇరాన్‌.

గత ఆరు పర్యాయాల్లోనూ
షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 15న న్యూజిలాండ్‌తో (కాలిఫోర్నియాలో), జూన్‌ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్‌ 26న ఈజిప్ట్‌తో (సియాటెల్‌లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్‌ అభిమానుల ప్రవేశంపై ట్రంప్‌ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. 

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్‌ జట్టు ఏడోసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్‌ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.

ఇరాన్‌ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
ఒకవేళ ఇరాన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్‌లో ఉన్న ఇరాన్‌.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్‌, యూఏఈ ఉన్నాయి. 

భారీ జరిమానా
అయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్‌ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే  వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

చదవండి: FIFA World Cup 2026: అర్హ‌త సాధించిన దేశాలు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement