అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌! | Cricket is team game Shivam 2 fours as important as Sanju 97: Gambhir | Sakshi
Sakshi News home page

అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌: గంభీర్‌

Mar 3 2026 3:01 PM | Updated on Mar 3 2026 3:32 PM

Cricket is team game Shivam 2 fours as important as Sanju 97: Gambhir

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. 

ముంబైకి చేరుకున్న టీమిండియా
ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్‌ ఆరంభంలో నేపాల్‌ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పుంజుకున్న తీరు అమోఘం.

అందరూ మేటి ఆటగాళ్లే
ముఖ్యంగా సూపర్‌-8లో శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ఇంగ్లండ్‌ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్‌ సాల్ట్, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్, విల్‌ జాక్స్‌ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.

వాంఖడే పిచ్‌ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్‌ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.

సంజూ  సత్తా ఏంటో నాకు బాగా తెలుసు
అదే విధంగా.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. అయితే,  క్రికెట్‌ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.

‘‘సంజూ  సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్‌తో కీలకమైన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో శాంసన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు’’ అని గంభీర్‌ కితాబిచ్చాడు.

అదే విధంగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. 

అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!
‘క్రికెట్‌ ఎప్పటికైనా టీమ్‌ గేమ్‌. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్‌ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.

‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. 

ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్‌ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్‌ (97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ మరుగున పడేది’ అని గౌతీ  వివరించాడు.

చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement