T20 WC 2026: అదే జరిగితే భారత్‌కు చుక్కెదురే..! | What happens if T20 WC semi final get washed out | Sakshi
Sakshi News home page

T20 WC 2026: అదే జరిగితే భారత్‌కు చుక్కెదురే..!

Mar 2 2026 8:02 PM | Updated on Mar 2 2026 8:40 PM

What happens if T20 WC semi final get washed out

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

ఈ మ్యాచ్‌లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం​ చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్‌ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్‌ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్‌ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం సూపర్‌-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

ఈ లెక్కన తొలి సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. న్యూజిలాండ్‌ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-2 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్‌ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement