టీమిండియా జూన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సెమీ ఫైనల్‌లో భారత్
కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
మళ్లీ జూన్‌లోనే
ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.
అఫ్గనిస్తాన్‌తో సిరీస్
ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్
అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బరిలో దిగారు.
రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.
భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్
👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)
👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల
👉జూన్ 17- రెండో వన్డే, లక్నో
👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.
👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం.
చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్!


