breaking news
India vs Afghanistan
-
ఐపీఎల్‌కే దిక్కులేదు.. వారికి టీమిండియాలో చోటా?
ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో యువ పేసర్ యష్ ఠాకూర్‌ను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. అతడు ఇండియన్ క్యాప్ ధరించేందుకు అర్హుడు కాదని శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అఫ్గాన్‌తో టీ20లకు తొలుత ఎంపిక చేసిన జట్టులో యశ్ఠాకూర్కు చోటు దక్కలేదు. కానీ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో సెలక్టర్ల నుంచి అతడు పిలుపు అందుకున్నాడు. అయినప్పటికి తొలి రెండు టీ20లకు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు కానీ. ఆఖరి టీ20లో మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో అతడికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. రెండు ఓవర్లలో అతడు 17 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వరల్డ్‌కప్ విన్నర్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు."యష్ ఠాకూర్ లాంటి సాధారణ ఆటగాడికి భారత జట్టులో ఎలా చోటు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎవరికి పడితే వారికి టీమిండియా క్యాప్ ఇస్తే.. జాతీయ జట్టులోకి రావడం చాలా సులభమనే తప్పుడు సంకేతాలు బయటకు వెళ్తాయి. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే అద్భుతమైన ప్రతిభతో పాటు దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసిండాలి. భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లను పక్కన పెట్టి యష్ ఠాకూర్‌ను ఆడించడం అన్యాయం.యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వంటి వారు కనీసం తమ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే రెగ్యులర్ సభ్యులుగా లేరు. అలాంటిది వారిని నేరుగా తీసుకొచ్చి భారత జట్టు తరఫున ఆడిస్తున్నారు.మరోవైపు సడన్‌గా విప్రజ్ నిగమ్ జట్టులోకి ఎలా వచ్చాడు? ఏ ప్రాతిపదికన అతడిని ఎంపిక చేశారు? వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసేంత గొప్ప బౌలరా అతడు? ఇలా ప్రతీ ఒక్కరికీ భారత జట్టు క్యాప్‌ను పంచేయలేరు. ఇదంతా చూస్తుంటే ఏదో షాప్‌లో టీమిండియా క్యాప్‌ను కొనుగోలు చేసినట్లుగా ఉంది" అని శ్రీకాంత్ తీవ్ర స్దాయిలో మండిపడ్డాడు.చదవండి: నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్ -
నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ అసాంతం శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరి టీ20లో అయితే భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో శతక్కొట్టి, అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా నిలవగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా శ్రేయస్ సేన ప్రత్యర్ధి ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగల్గింది. అఫ్గాన్ ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక 94 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో 300 పరుగులు సాధించడమే మా లక్ష్యమని గంభీర్ అన్నాడు."అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో భారత జట్టుకు మెరుపు ఆరంభం దక్కింది. మరీ ముఖ్యంగా పవర్‌ప్లేలో మనవాళ్లు చాలా దూకుడుగా ఆడారు. ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగుల మార్క్ దాటింది. నా కోచింగ్ కాలంలో ఇదే అత్యధికం. దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పుడు అదే జోరు కొనసాగిస్తే భారీ స్కోరు సాధ్యమే. టి20ల్లో ఇప్పటి వరకు మన జట్టు 300 మైలురాయిని అందుకోలేదు.మా తదుపరి లక్ష్యం అదే. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతిభతో అదేం పెద్ద కష్టం కాదు. అభిషేక్ దూకుడు అందరికీ తెలిసిందే. అఫ్గాన్‌తో మూడో టి20లో అతడి సెంచరీ డ్రెస్సింగ్ రూమ్‌పై చాలా ప్రభావం చూపింది" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడంపై గంభీర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, అతడు స్వదేశంలో అరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ సందర్భంగా సంజూ సామ్సన్ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్లోనే అత్యంత కఠిన నిర్ణయమన్న గంభీర్... వన్డే, టెస్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని వివరించాడు.చదవండి: మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ -
'సర్' అభిషేక్.. నాకు ఇది ముందే తెలుసు: యువరాజ్
అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన అభిషేక్ శర్మపై అతడి మెంటార్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ అద్భుత బ్యాటింగ్‌కు ఫిదా అయిన యువీ.. అతడిని 'సర్ అభిషేక్' అని సంబోధిస్తూ 'ఎక్స్' వేదికగా కొనియాడాడు.కాగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పంజాబ్ క్రికెటర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే అతడి గురువు యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించాడు."టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన 'సర్' అభిషేక్‌కు హృదయపూర్వక అభినందనలు. నీకున్న టాలెంట్, నువ్వు పడే కష్టానికి ఏదో ఒక రోజు ఈ రికార్డు సాధిస్తావని నాకు ముందే తెలుసు. రాబోయే రోజుల్లో నువ్వు తిరగరాయబోయే రికార్డులకు ఇది ఆరంభం మాత్రమే.'జనాలు నీపై రాళ్లు విసిరినప్పుడు.. వాటిని మైలురాళ్లుగా మార్చుకుని నీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి' అని ఒక పెద్దాయన చెప్పాడు. నువ్వు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే వినయంగా ఉంటూ మరిన్ని విజయాలు సాధించాలి." అని యువరాజ్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.గురువు బాటలోనే శిష్యుడుఅభిషేక్ గొప్ప క్రికెటర్‌గా ఎదగడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. దీర్ఘకాలంగా అభిషేక్‌కు యువీ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో అద్భుతంగా ఆడితే మెచ్చుకునే యువీ, విఫలమైనప్పుడు అంతే తీవ్రంగా హెచ్చరిస్తుంటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ ఇచ్చిన సలహాలు, మార్గదర్శకత్వమే ఈ విధ్వంసకర శతకానికి కారణమని తెలిపాడు.చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్‌పై భారత్ సంచలన విజయం -
రెండేళ్లకే కోహ్లి రికార్డు సమం.. అభిషేక్ శర్మ అరుదైన ఫీట్!
-
సెంచరీ తర్వాత పిచ్ పైనే ధ్యానం.. అసలు కారణం ఇదే
-
IND vs AFG: వేరే దారి లేదు.. మా ఓటమికి కారణాలు ఇవే!
భారత్‌లో తొలిసారి టీమిండియాకు టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇచ్చిన అఫ్గానిస్తాన్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్.. అఫ్గాన్‌పై ఏకపక్ష విజయాలు సాధించింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు.నిరాశ కలిగింది.. పవర్ ప్లేలో పర్లేదు‘‘కచ్చితంగా నిరాశ కలిగించే సిరీస్ ఇది. అయితే, పవర్‌ప్లేలో మేము కాస్త మెరుగయ్యాము. అందుకు నేను కాస్త సంతోషంగా ఉన్నాను. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయాము.సిరీస్ మొదటి నుంచే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే, రోజురోజుకీ ఆటను మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాము. టీ20 ప్రపంచకప్ తర్వాత మాకిదే తొలి సిరీస్. ఇంకా ఎన్నో పటిష్ట జట్లతో మరిన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’’ అని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్లు అద్భుతంమరోవైపు.. అఫ్గానిస్తాన్ హెడ్‌కోచ్ రిచర్డ్ పైబస్ కూడా స్పందించాడు.. ‘‘మా ఆట చాలా చెత్తగా సాగింది. అయితే టాస్ గెలవడం కాస్త ఊరటనిచ్చినా.. తొలి పది ఓవర్ల ఆట మా నియంత్రణలో లేకుండా పోయింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108), సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అద్భుతంగా, అందంగా బ్యాటింగ్ చేశారు.మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారుఅయితే, తర్వాతి పది ఓవర్లలో మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ఇది మాకు సానుకూల అంశం. నిజంగానే మా వాళ్లు అద్బుతంగా పోరాటం చేశారు. ఫీల్డింగ్‌లోనూ రాణించారు. కానీ 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మా వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.వేరే దారి లేకుండా పోయిందిఓవర్కు పదకొండు పరుగుల చొప్పున రాబట్టడం కష్టమే. పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేదు. మా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాము. ఓపెనర్లు ఇబ్రహీం (25), గుర్బాజ్ (15) దూకుడుగా మొదలుపెట్టినా దానిని కొనసాగించలేకపోయారు. లోపాల్ని సరిచేసుకుని ముందుకు సాగుతాము’’ అని రిచర్డ్ పైబస్ చెప్పుకొచ్చాడు. చదవండి: అభిషేక్ శర్మ అద్భుతం.. అఫ్గాన్ ఆట ప్రశంసనీయం: శ్రేయస్ అయ్యర్! -
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఢిల్లీ వేదికగా అఫ్గాన్ ఆతిథ్యం ఇచ్చిన మూడు టీ20లలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. గత సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.మెరుపు అర్ద శతకాలుఅయినప్పటికీ అఫ్గాన్‌తో సిరీస్‌లో యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి రావడంతో అభిషేక్ శర్మకు జోడీగా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ (10)లో విఫలమైనప్పటికీ మిగిలిన రెండు టీ20లలో సంజూ మెరుపు అర్ధ శతకాల (57, 50)తో దుమ్ములేపాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు వేచి చూడకతప్పని పరిస్థితి నెలకొంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘వైభవ్ దృష్టి కోణం నుంచి చూసినప్పటికీ.. అతడు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది.అతడు ఎంతటి ప్రతిభావంతుడో మాకూ తెలుసు. అద్భుతాలు చేయగల సామర్థ్యం అతడికి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం దక్కడం సహజం. అలాంటి ప్లేయర్లకు దీర్ఘకాలం అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇక సంజూ శాంసన్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆటగాడు అతడు. ప్రతిభ లేకుండా ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేరు కదా!.. తన శక్తి మేర జట్టు కోసం అతడు పనిచేశాడు.సంజూను పక్కనపెట్టాను.. అదే కఠిన నిర్ణయంఏదేమైనా ఇంగ్లండ్ పర్యటనలో సంజూను తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. నా కోచింగ్ కెరీర్లో ఇదే అత్యంత కఠిన నిర్ణయం అనుకుంటాను. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడు విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.అయితే, కొన్నిసార్లు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనసాగిస్తాం. మరికొన్నిసార్లు ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో సత్తా చాటిన కాంబినేషన్‌ను కొనసాగించాలని భావిస్తాం. రెండు, మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన వారిపై చెత్త ఆటగాళ్లుగా ముద్రవేయలేము.మా జట్టు బాగుందిఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో మాకు చేదు అనుభవం ఎదురైన మాట వాస్తవమే. కానీ గత ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఆ తర్వాత వెంటనే మరో వరల్డ్‌కప్ టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు.. ఒకటీ రెండు ఓటముల కారణంగా చెడ్డది అయిపోదు’’ అని గంభీర్ శ్రేయస్ అయ్యర్ సేనను సమర్థించాడు.కాగా అఫ్గాన్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనలో కూడా ఇదే ఫలితం సాధించింది. అయితే, యూకే టూర్లో భాగంగా ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో శ్రేయస్ అయ్యర్ సేన క్లీన్‌స్వీప్ అయింది. చదవండి: అభిషేక్ ఓ అద్భుతం.. వాళ్ల ఆట తీరు ప్రశంసనీయం! -
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి ఇది సులభమైన వికెట్ కాదు. కానీ అభిషేక్ ఆడిన తీరు కంటికి ఇంపుగా ఉంది. అతడొక అద్భుతం. అతడు శతకం సాధించడం చాలా ఆనందం కలిగించింది. అఫ్గానిస్తాన్ సిరీస్ కోల్పోయినప్పటికీ వాళ్లు మా మనసులు గెలిచారు. ఈ సిరీస్‌కు వాళ్లు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఓడినప్పటికీ ఆఫ్గన్ జట్టు ప్రదర్శన కూడా ప్రశంసనీయం. టాస్కు ముందే ఆఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో క్లుప్తంగా మాట్లాడిన తర్వాతే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ విధ్వంసానికి తోడు శాంసన్ రాణించడంతో 200లకు పైగా రన్స్‌ను స్కోరుబోర్డుపై చేర్చగలిగాం. అక్షర్ పటేల్ కీలక సమయంలో రాణిండంలో సిద్ధహస్తుడు. గతంలో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. మొదటి నుండి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడికి నా ప్రత్యేక అభినందనలు.’’ అని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం -
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉండేది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.ఇక మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ విజయం అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై స్పందించాడు. రికార్డులు తనకు ముఖ్యం కాదని, మ్యాచ్‌లో బరిలోకి దిగితే వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా అన్నట్లుగా తన బ్యాటింగ్ స్టైల్ ఉంటుందని అభిషేక్ తెలిపాడు.Photo Credit: BCCI Twitter"ముందుగా ఇవాళ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను సాధించిన సెంచరీ వారికి గిఫ్ట్ అని భావిస్తున్నా. ఇక రెండు సంవత్సరాల క్రితం, మేము ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆడి అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆ ప్రణాళిక ఒక సంవత్సరం పాటు చక్కగానే పనిచేసింది. ఈలోగా రెండు (ఇంగ్లండ్, ఐర్లాండ్) సిరీస్‌లు మాకు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. కానీ ఒకటి రెండు చెడ్డ సిరీస్‌లు మా బ్యాటింగ్‌ను నిర్వచించలేవు. ఆడుతుంది చిన్న జట్టుతోనే, పెద్ద జట్టుతోనా అనేది పక్కనబెట్టి జట్టు విజయం కోసం మేమంతా సమిష్టి ప్రదర్శన చేశాము. ఇక నా విషయానికొస్తే ప్రతీ సిరీస్‌కు ముందు నేను అనుసరించే ప్రక్రియపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నా. ఎవరితో ఆడుతున్నాను, బౌలర్లు ఎవరు అనే విషయాలు నాకు ప్రత్యేకం. కాబట్టి వ్యక్తిగతంగా ఒక బ్యాటర్‌గా నా దృష్టి ఎప్పుడూ బ్యాటింగ్ పవర్ ప్లేపైనే ఉంటుంది. Photo Credit: BCCI Twitterమైదానంలో దూకుడుగా ఆడాలంటే ముందుగా సరైన ప్రిపరేషన్ అవసరం. అదే నా విజయానికి కారణం. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌కు సంబంధించి పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఆది నుంచి వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తే జట్టుకు భారీ స్కోరు ఇవ్వగలననే అంశాన్ని మాత్రమే మైండ్‌లో పెట్టుకొని ఆడుతూ వచ్చాను. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యతాయుతంగా ఆడి పని పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తాను. కెప్టెన్, కోచ్ నుంచి మద్దతు ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైంది." అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి 269 స్ట్రైక్‌రేట్‌తో 229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్థసెంచరీ ఉన్నాయి.ABHISHEK SHARMA SPEAKS: 🗣️“Personally me as a batter, it's always been about the process - How I'm gonna utilize the power play.” pic.twitter.com/IjTqcFZ8lR— Maina Singh (@Maina_Singhx77) September 17, 2026ఇదీ చదవండి: మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్ -
మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా.. సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జయ్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జయ్ చెరొక వికెట్ తీశారు. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.As clinical and commanding as it gets 🇮🇳#TeamIndia with a massive 1️⃣2️⃣7️⃣-run victory to clinch the Friendship Cup 3️⃣-0️⃣ 🏆Scorecard ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/ZDY4ZzdaxY— BCCI (@BCCI) September 17, 2026ఇదీ చదవండి: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ -
అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (221-7) చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (35 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్ స్కోర్ నెమ్మదించింది. తిలక్ వర్మ (2), శివమ్ దూబే (12), ఇషాన్ కిషన్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (1), శ్రేయస్ అయ్యర్ (29) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. అక్షర్ పటేల్ (5), రవి బిష్ణోయ్ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు. ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
అరుదైన మైలురాయిని తాకిన సంజూ శాంసన్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఔటైన అతడు.. టీ20 క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 34వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 351 మ్యాచ్‌లు ఆడిన సంజూ 140కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 8 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 9027 పరుగులు చేశాడు. భారత్ తరఫున సంజూకు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే 9000 టీ20 పరుగులు పూర్తి చేశారు.సంజూ విషయాన్ని అటుంచితే.. ఈ మ్యాచ్‌లో మరో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు.34 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసిన తర్వాత అభిషేక్ ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 184-3గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (13) క్రీజ్‌లో ఉన్నారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. ఆతర్వాత 50 పరుగులు పూర్తి చేసేందుకు మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అభిషేక్ ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఆఫ్ఘన్ బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు.సెంచరీ తర్వాత కూడా అభిషేక్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 33 బంతులు ఎదుర్కొన్న అతడు, 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. సంజూ 25 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 34 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 9.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 142-0గా ఉంది.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజాగా ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. టెస్ట్ ప్లేయింగ్ దేశాల్లో మాత్రం అభిషేక్‌దే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ. ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
అభిషేక్ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్ సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. ఆభిషేక్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఆతర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. అభిషేక్‌కు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా తోడవ్వడంతో భారత్ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.తొలి ఓవర్ నుంచి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అభిషేక్.. రెండో, మూడు, ఐదు, ఆరు ఓవర్లలో ఉగ్రరూపం దాల్చాడు. అభిషేక్ ధాటికి భారత్ 6 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. పవర్‌ప్లేలో 100 పరుగుల మార్కును తాకడం భారత్‌కు ఇది తొలిసారి. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 100-0గా ఉంది. అభిషేక్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగులు, సంజూ శాంసన్ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ జట్టు రెండు మార్పులు చేయగా.. భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆఫ్ఘన్ తరఫున గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్ స్థానాల్లో అబ్దుల్లా అహ్మద్జాయ్, నూర్ ఉల్ రహ్మాన్ బరిలోకి దిగనుండగా.. భారత్ తరఫున అర్షదీప్ స్థానంలో యశ్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది.తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇబ్రహీం జద్రాన్ (సి), రహమానుల్లా గుర్బాజ్ (డబ్ల్యు), సెడిఖుల్లా అటల్, అబ్దుల్లా అహ్మద్జాయ్, దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుల్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాఇదీ చదవండి: ఆసీస్ వరల్డ్‌కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం -
IND vs AFG: తుదిజట్టు ఇదే.. అభిషేక్, సంజూతో పాటు వైభవ్!
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ అయ్యర్ సేన... రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా- అఫ్గాన్ మధ్య గురువారం నామమాత్రపు మూడో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది.ఇషాన్‌కు విశ్రాంతిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సిరీస్ గెలిచాం కాబట్టి మూడో టీ20లో వైభవ్‌ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరికి విశ్రాంతినిచ్చినా బాగానే ఉంటుంది.ఇటీవల దులిప్ట్రోఫీలోనూ ఇషాన్ అదరగొట్టాడు. కాబట్టి అతడికి బ్రేక్ ఇవ్వడం మంచిది. అభిషేక్ లేదంటే సంజూతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడు. కావాలనుకుంటే సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గాన్ బోర్డు టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20కి వసీం జాఫర్ సూచించిన భారత తుదిజట్టుసంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2500 పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. భారత్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో నబీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన నబీ, 2500 పరుగులు పూర్తి చేశాడు.నబీకి (2501, 111) ముందు బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు, 149 వికెట్లు), జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా (3244, 114), మలేషియా ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ (3402, 126) ఈ ఘనత సాధించారు.ఈ మ్యాచ్‌తో నబీ మరో ఘనత కూడా సాధించాడు. భారత గడ్డపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసైన (41 సంవత్సరాల 257 రోజులు) క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి హాంకాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ (44 సంవత్సరాల 34 రోజుల వయసులో) అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీకి చెందిన వేన్ మాడ్సెన్ (42 సంవత్సరాల 38 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేయగా.. భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
వైభవ్ తో పోటీనా... రిపోర్టర్ ప్రశ్నకు సంజూ శాంసన్ దిమ్మతిరిగే కౌంటర్
-
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. చాన్నాళ్లుగా గాయం కారణంగా బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన ఈ ఆంధ్ర ఆటగాడు.. ఆదివారం నాటి తొలి టీ20 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.తొలి మ్యాచ్‌లో విఫలంఢిల్లీ వేదికగా అఫ్గాన్‌తో తొలి టీ20లో నితీశ్ రెడ్డి.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా ముప్పై పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. దీంతో ఈ పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ బౌలింగ్‌పై విమర్శలు వచ్చాయి.తిరిగి పుంజుకుని.. అద్భుత ప్రదర్శనఅయితే, మంగళవారం నాటి రెండో టీ20 సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి.. విమర్శకులకు చెక్ పెట్టాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అఫ్గానిస్తాన్ ఓపెనర్, కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37), గుల్బదిన్ నైబ్ (10), రషీద్ ఖాన్ (28)లను అవుట్ చేశాడు.తద్వారా అఫ్గాన్‌ను 159 పరుగులకే చేయడంలో నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే పని పూర్తి చేయగా.. 23 ఏళ్ల నితీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు.PC: BCCI Xఅతడు బంగారంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐదో బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయగలడా? వికెట్లు తీయగలడా? టీమిండియాకు ఉన్న సమస్య ఇదే. రెండో టీ20లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. అతడు బంగారం.Nabi looks to clear the ropes, but Shreyas Iyer makes no mistake in the deep.Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/BEld9G9uat— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026జట్టుకు అవసరమైనపుడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 28 పరుగులే ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయి 32 పరుగులిచ్చి వికెట్ తీశాడు.నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడువీరందరిని పక్కనపెడితే.. నితీశ్ కుమార్ రెడ్డి.. మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అతడిని ఇరవయ్యో ఓవర్లోనూ రంగంలోకి దించవచ్చు. నిజంగా నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడు. హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియాకు ఆ స్థాయి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఎవరన్న ప్రశ్న ఉండేది. హార్దిక్ వారసుడిగా తానే సరైన వాడినంటూ నితీశ్ బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు’’ అని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. సంజూ స్పందన ఇదేStraight off the top edge and straight into Samson’s hands! 🧤💥Nitish Reddy struck again with the first ball of the over, sending Gulbadin Naib back to the pavilion. Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/JO6xMI3jwy— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
వాటర్‌బాయ్‌గా వైభవ్!.. సూర్యవంశీ తండ్రి స్పందన ఇదే
అఫ్గానిస్తాన్‌తో రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్ సంజూ శాంసన్ రాక కారణంగా ఈ పదిహేనేళ్ల పిల్లాడికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దీంతో వైభవ్ జట్టుకు వాటర్ బాయ్‌గా సేవలు అందిస్తున్నాడు.సిరీస్ టీమిండియా కైవసంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా అఫ్గాన్ బోర్డు ఢిల్లీ వేదికగా టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కంటే ముందు భారత టీ20 జట్టు జింబాబ్వేలో పర్యటించింది. జింబాబ్వేలో ధనాధన్ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడగా.. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించి.. జట్టు క్లీన్‌స్వీప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్ అఫ్గాన్‌తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. దీంతో వైభవ్‌పై వేటు పడింది. అయితే ,తొలి టీ20లో సంజూ 10 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో వైభవ్‌ను కాకుండా సంజూను ఆడించి తప్పుచేశారనే విమర్శలు వచ్చాయి.మావాడు సిద్ధంగానే ఉన్నాడు.. కానీఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో టీమిండియా రెండో టీ20కి ముందు స్టేడియానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీని స్పోర్ట్స్‌తక్ పలకరించింది. వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు.. రెండో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.ఇందుకు బదులిస్తూ.. ‘‘మీ అందరి ఆశీర్వాదాలు వైభవ్‌పై ఉండాలి. మాకు అదే పదివేలు. జట్టుకు అవసరమైన వేళ అతడు సిద్ధంగా ఉంటాడు. నా కుమారుడు ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నాడు. ఏదేమైనా జట్టు గెలవడం ముఖ్యం. మాకు అదిచాలు’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.కాగా రెండో టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితం కాగా.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ బరిలోకి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే, నామమాత్రపు మూడో టీ20లో మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వైభవ్‌ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు. చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ -
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతోకాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్.. అఫ్గాన్‌తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.బ్యాట్‌తోనే సమాధానం సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి తన బ్యాటింగ్ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.వైభవ్, అభిషేక్‌తో పోటీపై స్పందనఈ నేపథ్యంలో అఫ్గాన్‌పై విజయానంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్‌సెట్ కూడా ఉండదు.నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్ ఆరంభంలో ట్రోల్స్ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డుSanju Samson putting Mohammed Nabi through the boundary tour. 😮💨 Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/hNKWkuiSbL— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
వైభవ్ ఆడడంపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. తనపై వచ్చిన విమర్శలకు సంజూ శాంసన్ నోటితోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన ఈ విజయాన్ని అందించిందని తెలిపాడు.తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, క్రీడా ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ మూడో టీ20లో ఆడే అవకాశముంది. అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. జట్టు కాంబినేషన్లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. 2026 ఏడాదిలో ఇషాన్ కిషన్ 173.2 స్ట్రైక్‌రేట్‌తో 892 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇక 2025లో అభిషేక్ శర్మ 193.46 స్ట్రైక్‌రేట్‌తో 859 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత విరాట్ కోహ్లి (2022లో 781 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (2023లో 733 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Most runs for India in a calendar year in T20Is :1164 - Suryakumar Yadav in 2022 (SR: 187.43)892 - Ishan Kishan in 2026 (SR: 173.2)*WHAT A COMEBACK FOR ISHAN KISHAN 🔥 pic.twitter.com/8Cds0c4w5a— Vipin Tiwari (@Vipintiwari952) September 15, 2026ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ (57) అర్థసెంచరీ చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (39) రాణించాడు. చివర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (34 నాటౌట్), తిలక్ వర్మ (15 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Series victory sealed 🔒Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC— BCCI (@BCCI) September 15, 2026ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..! -
IND VS AFG 2nd T20: సత్తా చాటిన టీమిండియా బౌలర్లు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ కుమార్ రెడ్డి (3-0-24-3), అర్షదీప్ సింగ్ (4-0-35-2), జస్ప్రీత్ బుమ్రా (4-1-25-1), అక్షర్ పటేల్ (4-0-28-1), రవి బిష్ణోయ్ (4-0-32-1) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో రషీద్ ఖాన్ (28) బ్యాట్ ఝులిపించడంతో ఆఫ్ఘన్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11, మొహమ్మద్ నబీ (15), నూర్ అహ్మద్ (7 నాటౌట్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
చరిత్ర సృష్టించిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో (పూర్తి సభ్య దేశాల బౌలర్లలో) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (13) వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవరే మెయిడిన్ వేసి ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా, జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ చెరో 12 మెయిడిన్ ఓవర్లతో సమంగా ఉండేవారు. తాజాగా బుమ్రా సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 10 మెయిడిన్ ఓవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. 17.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 132-6గా ఉంది. ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. మొహమ్మద్ నబీ (15), రషీద్ ఖాన్ (17) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్‌గా మొదటి 12 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు (11) టాస్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో టాస్ గెలవడంతో ఈ ఘనత సాధించాడు. ఖతార్ కెప్టెన్ మిర్జా బేగ్ (10), ఫిలిప్పీన్స్ కెప్టెన్ హెన్రీ టైలర్ (10)ను అధిగమించి సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐసీసీ పూర్తి సభ్య దేశాల కెప్టెన్లను పరిశీలిస్తే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా తమ తొలి 12 టీ20ల్లో తొమ్మిది సార్లు టాస్ గెలిచారు. శ్రేయస్ వీరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, లిటన్ దాస్, షై హోప్ వంటి ప్రముఖ కెప్టెన్లు తమ తొలి 12 టీ20ల్లో కేవలం రెండేసి టాస్ విజయాలు మాత్రమే సాధించి ఈ జాబితాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రేయస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ శ్రేయస్ అయ్యర్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 9.2 ఓవర్లలో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
ఆఫ్ఘన్‌తో రెండో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీభారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
భారత్ అఫ్గాన్ రెండో T20.. టీమ్ లో సంచలన మార్పులు
-
IND vs AFG: భారత తుదిజట్టు ఇదే.. ఒకే ఒక్క మార్పు!
అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన.. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.సునాయాస విజయంకాగా ఢిల్లీ వేదికగా ఆతిథ్య అఫ్గాన్‌తో తొలి టీ20లో టీమిండియా మంచినీళ్లప్రాయంగా గెలుపొందింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 82) కారణంగా భారత్‌కు ఈ విజయం సాధ్యమైంది.ఇక ఈ మ్యాచ్‌తో తిరిగి టీమిండియాలోకి వచ్చిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గత సిరీస్‌లో జింబాబ్వేలో సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల పిల్లాడిని పక్కనపెట్టి.. సంజూకు అవకాశం ఇస్తే అతడు మాత్రం తేలిపోయాడనే విమర్శలు వస్తున్నాయి.వైభవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం!ఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్‌ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మెజారిటీ మంది విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సంజూకు మరో అవకాశం ఇస్తారని.. ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే అతడిని ఇక పూర్తిగా పక్కనపెట్టేస్తారని అభిప్రాయపడుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. సీనియారిటి, ప్రపంచకప్-2026 ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఇంకో ఛాన్స్ ఇవ్వడమే సరైందని పేర్కొంటున్నారు. ఒక మార్పు అనివార్యం!ఇదిలా ఉంటే.. సంజూ- వైభవ్ విషయం ఎలా ఉన్నా.. భారత తుదిజట్టులో ఒక మార్పు మాత్రం అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గాన్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో టీ20లో రవి బిష్ణోయి వరుణ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని తెలుస్తోంది.అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి. -
‘నా భార్య అరిచేసింది.. ఆమెకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఓపెనింగ్ విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేదని.. ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డాడు. టీమిండియా నాయకత్వ బృందం కేవలం విశ్లేషకులకే కాకుండా.. సగటు అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా జింబాబ్వే పర్యటన తర్వాత భారత టీ20 జట్టు తాజాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ఆడుతోంది. ఢిల్లీలో అఫ్గాన్ మూడు టీ20లకు ఆతిథ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, అఫ్గాన్‌తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.వైభవ్ బెంచ్‌కే పరిమితంజింబాబ్వే పర్యటనలో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు పొందినప్పటికీ.. సీనియర్, వరల్డ్‌కప్-2026 వీరుడు సంజూ శాంసన్ రాక వల్ల వైభవ్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను కాదని సంజూతో ఓపెనింగ్ చేయించగా.. అతడు కేవలం పది పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.నా భార్య అరిచేసింది..ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేము మ్యాచ్‌ను పక్కనపెట్టేసి మూవీతో టైమ్‌పాస్ చేయాల్సి వచ్చింది. అసలు వైభవ్‌ను ఎందుకు ఆడించడం లేదని నా భార్య అరిచేసింది.గత సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్‌ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించింది. నా భార్యకు కూడా ఆట, సెలక్షన్ తీరు గురించి ఇంతలా అర్థమవుతోంది. సగటు అభిమానులకు కూడా మీ వ్యూహాలు మింగుడుపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.తప్పుడు సంకేతాలు ఇస్తున్నారుసూర్యవంశీ సేవల్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక రెండో టీ20లో అతడికి అవకాశం ఇస్తారేమో. ఒకవేళ అతడు ఆ మ్యాచ్‌లో విఫలమైతే మాత్రం మళ్లీ తుదిజట్టు నుంచి తప్పిస్తారు. ఆటగాళ్లకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ప్రదర్శన ఎలా ఉన్నా మరుసటి మ్యాచ్‌లో చోటు దక్కుతుందో లేదోనన్న ఆందోళన పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇటీవల దులిప్ ట్రోఫీ టోర్నీలోనూ అదరగొట్టాడు. అంతకుముందు ఐపీఎల్, భారత్-ఎ జట్టు తరఫున.. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో రాణించాడు. సంజూను చూస్తే జాలేస్తుందిఅయినా సరే అతడి విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరుపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా వైభవ్ ఒక్కడి విషయంలోనే కాకుండా.. సంజూ శాంసన్ విషయంలోనూ మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని చిక్కా విమర్శించాడు. సంజూను చూస్తే జాలేస్తుందని.. వైభవ్ రాకతో అతడి స్థానానికి ఎసరు వచ్చిందన్నాడు. యాజమాన్యానికి నిజంగా సంజూ పట్ల సానుకూల వైఖరి ఉంటే వరుస అవకాశాలు ఇవ్వాలని.. వైభవ్‌తోనే కొనసాగాలని భావిస్తే అతడిని పక్కనపెట్టేయాలని సూచించాడు. అంతేతప్ప దాగుడుమూతలు ఆడటం సరికాదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. కాగా భారత్- అఫ్గాన్ మధ్య మంగళవారం రెండో టీ20 జరుగనుండగా.. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: మా వాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం. వరుణ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్‌లోనూ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.వరుణ్ సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన తొలి టీ20లో వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.న్యూఢిల్లీలో రేపు జరుగబోయే రెండో టీ20లో వరుణ్ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడవచ్చు. ఇటీవలికాలంలో వరుణ్ టీ20 ఫార్మాట్లో భారత్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండో టీ20కి వరుణ్ దూరమైతే అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు రెచ్చిపోగా.. ఆతర్వాత బ్యాటర్లు తమ పని కానిచ్చారు. బౌలింగ్‌లో వరుణ్‌తో పాటు అర్షదీప్ (4-0-19-3), బుమ్రా (4-0-26-1), అక్షర్ పటేల్ (4-0-27-1) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో అభిషేక్ (32 బంతుల్లో 82; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో ఆదివారం నాటి తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు. 13.4 ఓవర్లలోనేకాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గాన్ ఢిల్లీలో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం తొలి టీ20 జరుగగా.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది.తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో అభిషేక్ శర్మదే కీలక పాత్ర. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 32 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 256.25. అయితే, మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 3420 బంతుల్లోనే అభిషేక్ ఈ మార్కును అందుకున్నాడు.ఆసియాలోనే తొలి ప్లేయర్‌గా..ఈ క్రమంలో అత్యంత వేగంగా టీ20లలో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. కాగా దేశీ క్రికెట్లో పంజాబ్ తరఫున.. ఐపీఎల్లో.. టీమిండియా తరఫున కలిపి అభిషేక్ శర్మ ఈ మేరకు భారీగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఫాస్టెస్ట్ 6000 రన్స్ (బంతుల పరంగా)👉ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- 3386 బంతుల్లో👉అభిషేక్ శర్మ (ఇండియా)- 3420 బంతుల్లో👉ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 3550 బంతుల్లో👉టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)- 3681 బంతుల్లో👉విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 3857 బంతుల్లో.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పటి నుంచి విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. ఆ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 43 పరుగులే చేయడం ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో సంజూను కాదని అభిషేక్ శర్మకు జోడీగా వైభవ్ సూర్యవంశీని ఫిక్స్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కాదని.. సంజూను ఆడించడాన్ని తప్పుబట్టాడు.వైభవ్‌ను కాదని ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు సంజూకు తుదిజట్టులో అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఓసారి జట్టు నుంచి తప్పించిన తర్వాత సహజంగానే ఆటగాడు ఫామ్ కోల్పోతాడు. కానీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాడు.అయితే, సంజూ విషయంలో ఇది జరుగలేదు. అయినా సరే అతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచాడు.PC: Xనేనేం తప్పు చేశాను?అయినా సరే జింబాబ్వేలో ఆడిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీలను ఎందుకు విడదీసినట్లు? ఇది మరో ప్రశ్న. ఇప్పటికీ టీ20లలో తమ అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్ ఏదోనన్న అంశంపై టీమిండియా స్పష్టతకు రాలేకపోతోందా? ఇంకెంత కాలం ఈ విషయం గురించి ఆలోచిస్తారు?వైభవ్ కచ్చితంగా.. ‘నేనేం తప్పు చేశాను’ అని అడిగే ఉంటాడు. ఇంతటి గందగోళం ఎందుకు? ఓపెనింగ్‌కు సంబంధించిన సరైన కూర్పు ఏదో తెలుసుకోండి’’ అని మహ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.అందుకే ఆడించారేమో!అయితే, అదే షోలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘సంజూ సీనియర్ ఆటగాడు. ప్రపంచకప్ టోర్నీలో గొప్పగా ఆడాడు. మరో విషయం ఏమిటంటే.. వైభవ్ ఆడితే తుదిజట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరుగుతుంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం కూడా సంజూ వైపు మొగ్గు చూపి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ అఫ్గాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 82)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) కూడా రాణించాడు. మరోవైపు.. సంజూ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో డార్విష్ రసూలీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20తో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ పేస్‌గుర్రం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొంది పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ పరీక్ష పాసైన బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఢిల్లీ వేదికగా టీమిండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రెండో బంతికే వికెట్ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన బుమ్రా వైడ్‌తో ఆరంభించినప్పటికీ.. రెండో బంతికే అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుర్బాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.కాగా టీ20 ఫార్మాట్లో బుమ్రాకు ఇది 350 వికెట్ కావడం విశేషం. తద్వారా పొట్టి క్రికెట్లో 350 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్‌గా ఈ రైటార్మ్ పేసర్ నిలిచాడు. అంతకు ముందు స్పిన్నర్ యజువేంద్ర చహల్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించారు.టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లుయజువేంద్ర చహల్- 396 వికెట్లు (హర్యానా, టీమిండియా, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ )భువనేశ్వర్ కుమార్- 363 వికెట్లు (ఉత్తరప్రదేశ్, టీమిండియా, ఇండియా-ఎ, పూణే వారియర్స్, ఆర్సీబీ, సన్‌రైజర్స్, )జస్ప్రీత్ బుమ్రా - 350 వికెట్లు* (గుజరాత్, టీమిండియా, ముంబై ఇండియన్స్).అఫ్గాన్ స్కోరు ఎంతంటేఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) విఫలమయ్యాడు. మిగతా వారిలో సెదీకుల్లా అటల్ (13) నిరాశపరచగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) తేలిపోయారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి తలా ఒక వికెట్ దక్కింది. చదవండి: షఫాలీ మెరుపు హాఫ్ సెంచరీ𝐓𝐰𝐨 𝐛𝐚𝐥𝐥𝐬 𝐢𝐧𝐭𝐨 𝐡𝐢𝐬 𝐫𝐞𝐭𝐮𝐫𝐧 𝐚𝐧𝐝 𝐁𝐎𝐎𝐌! 💥Jasprit Bumrah gets the extra bounce, Abhishek Sharma completes the catch, and Rahmanullah Gurbaz has to walk!Watch #AFGVIND 1st T20I LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMax… pic.twitter.com/AKLHpuipyB— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
భారత బౌలర్ల విజృంభణ.. అఫ్గాన్ నామమాత్రపు స్కోరు
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అ ప్గాన్ భారత బౌలర్లు విజృంభించడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కాగా భారత్ వేదికగా అఫ్గాన్ బోర్డు.. టీమిండియాకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.UPDATES:ఇరవై ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 156-8ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) నిరాశపరిచాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ 13 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. ఫలితంగా అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.పదిహేను ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 104-5అజ్మతుల్లా 33, నబీ 26 పరుగులతో ఉన్నారు.సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి అఫ్గాన్ స్కోరు: 56-5 (10)అజ్మతుల్లా ఒమర్జాయ్ 10, నబీ 4 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు ఏడో ఓవర్ ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డార్విష్ రసూలీ (2) బౌల్డ్ అయి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.పవర్ ప్లేలో అఫ్గాన్ స్కోరు: 41-4 (6 ఓవర్లు)ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ సెదీకుల్లా అటల్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. గుల్బదిన్ నైబ్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ ఆడటం లేదుఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఢిల్లీ వికెట్ మీద తొలుత బౌలింగ్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. జింబాబ్వే పర్యటనలో మాకెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తాం. అయితే, వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు’’ అని తెలిపాడు.తిరిగి వచ్చిన సంజూకాగా జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో భారత్ 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును వైభవ్ గెలుచుకున్నాడు. అయితే, అఫ్గాన్‌తో సిరీస్‌తో సంజూ తిరిగి రావడంతో వైభవ్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.తుదిజట్లుభారత్సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.అఫ్గానిస్తాన్ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూకీ.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు: సంజీవ్ గోయెంకా -
'వైభవ్ అంటే భయం లేదు.. మా ప్లాన్స్ మాకున్నాయి'
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ షురూ కానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత జింబాబ్వే సిరీస్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సొంత గడ్డపై ఎలా రాణిస్తాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ గురించి అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కట్టడి చేయడానికి తమ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, అతడి వికెట్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని జద్రాన్ స్పష్టం చేశాడు.కాగా సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున వైభవ్ సంచలన ప్రదర్శన చేశాడు. 5 ఇన్నింగ్స్‌లలో అతను మొత్తం 192 పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్లో తన ప్రతిభను చాటిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు తనకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు."వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. ఐపీఎల్‌లోనే కాకుండా వివిధ స్థాయిలలో ఆడుతూ ఇప్పటికే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అతడి బ్యాటింగ్ గురించి మా జట్టులో విస్తృతంగా చర్చించాం. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్నవారు కావడంతో.. వైభవ్ బలాలు, బలహీనతలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.అంతేకాకుండా అతడి బ్యాటింగ్ వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అతడిని త్వరగా అవుట్ చేసేందుకు మా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం" అని జద్రాన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్‌లో? -
ఆఫ్ఘన్‌తో తొలి టీ20.. తీవ్ర ఉత్కంఠ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు న్యూఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది . దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలో గత రెండు వారాలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్ అంచనాల ప్రకారం రేపు వర్షం పడే అవకాశం 64 శాతంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భారీ వర్ష సూచన ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.అక్యూ వెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేకపోయినా, ఓవర్ల కోత తప్పకపోవచ్చని తెలుస్తోంది.శ్రేయస్‌కు తొలి పరీక్షఈ సిరీస్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యేకమైనది. భారత టీ20 కెప్టెన్‌గా భారత్‌లో అతడికి ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన అయ్యర్.. తొలిసారి స్వదేశంలో భారత జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.మిశ్రమ ఫలితాలుఇటీవల టీ20 క్రికెట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన టీమిండియా, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 0-4తో కోల్పోయింది. అయితే జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ అద్భుతంగా పుంజుకొని, 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్
ఆఫ్ఘనిస్తాన్‌తో రేపు జరుగబోయే తొలి టీ20కి ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు.దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు (270, 80) ఆడటం వల్ల ఇషాన్ కొంత అలసటకు గురయ్యాడని, ప్రస్తుతం అతడు సౌకర్యంగానే ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇషాన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా దూరంగా ఉన్నాడు.ఇషాన్ ఆడకపోతే సంజూకు అవకాశం?ఒకవేళ ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోతే తొలి టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.ఇషాన్ స్థానంలో ఒకవేళ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భావిస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి టీ20 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
‘అలా అయితే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’
హర్షిత్ రాణా.. ఐపీఎల్లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టాడు.టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, పద్నాలుగు వన్డేలు, పద్నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా నాలుగు, 26, 16 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు.గాయాలతో సావాసంఅయితే, గత కొంతకాలంగా హర్షిత్ రాణా గాయాల వల్ల ఇబ్బందిపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడిన అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మొత్తానికి ఈ కోల్‌కతా నైట్ నైడర్స్ ఆటగాడు దూరమయ్యాడు.ఇలా వచ్చి.. అలా వెళ్లాడుఈ క్రమంలో జూన్‌లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా భారత టీ20 జట్టులోకి హర్షిత్ రాణా పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వన్డే సందర్భంగా అతడికి తొడ కండరాల గాయమైంది. దీంతో హర్షిత్ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో హర్షిత్ రాణా పునరావాసం పొందుతున్నాడు. అయితే, అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో సెప్టెంబరు 13న మొదలయ్యే టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ తొలుత ప్రకటించింది.సిరీస్ మొత్తానికి దూరంఅయితే, ఫిట్నెస్ పరీక్ష సమయంలో హర్షిత్ రాణా మరోసారి గాయపడటంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత హర్షిత్‌ను టీమిండియాలో ఆడించాలని శరణ్‌దీప్ సింగ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం తొందరపడి అతడిని తీసుకురాకుండా మంచి పని చేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ....డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది‘‘ఒక్కసారి టీమిండియాలోకి తిరిగి వస్తే అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్షిత్ రాణాను మరికొంత కాలం పక్కనపెట్టడం సానుకూల విషయమే. లేదంటే వరుస గాయాల వల్ల హర్షిత్ డిప్రెషన్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.ఒత్తిడి పెరిగి అతడి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అతడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైనపుడు బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది కాలంగా బాగా రాణించాడు. అయితే, గాయాల వల్ల కాస్త వెనుకబడ్డాడు. అతడు త్వరలోనే ఫిట్‌గా మారి తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’’ అని శరణ్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే? -
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
-
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్!
ఏషియన్ గేమ్స్-2026కు ముందు టీమిండియా మరొక కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని భారత జట్టు.. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో భారత్ ఈసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ భారత తుది జట్టు ఎలా ఉండబోతోనేది ఆసక్తిరంగా మారింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి పునరాగమనం చేయడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఒకవేళ సంజూ తొలి టీ20లో విఫలమైతే సూర్యవంశీని తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా యూకే పర్యటనలో శాంసన్ విఫలం కావడంతో వైభవ్‌కు భారత్ తరపున ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అయితే ఇంగ్లండ్ టూర్లో మూడు మ్యాచ్‌లు వైభవ్ నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు.దీంతో ఆ సిరీస్‌లో ఆఖరి టీ20కు అతడిని పక్కన పెట్టి మళ్లీ సంజూకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో సంజూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం జింబాబ్వే టూర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో సిరీస్ మొత్తం సూర్యవంశీనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ టూర్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేపై మాత్రం అదరగొట్టాడు. కానీ ఇప్పుడు వైభవ్ కంటే సీనియర్ అయిన శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్ మేనెజ్మెంట్ భావిస్తుందంట.ఈ క్రమంలో తొలి టీ20లో శాంసన్ ఆడడం దాదాపు ఖాయమైనట్లే. మరోవైపు గాయాల నుంచి కోలుకుని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డిలు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోనున్నారు. అదేవిధంగా జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు కూడా ఢిల్లీ టీ20లో ఆడనున్నారు.అఫ్గాన్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్చదవండి: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్.. ప్రకటన విడుదల -
రేపే మ్యాచ్.. అంతలోనే డబుల్ సెంచరీ వీరుడికి గాయం!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు గాయపడ్డాడు. తొలి టీ20 కోసం శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కిషన్ నడుము నొప్పికి గురయ్యాడు. నెట్ బౌలర్ నవదీప్ సైనీ విసిరిన ఒక వేగవంతమైన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో కిషన్‌కు ఈ సమస్య తలెత్తంది. దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. కీలక మ్యాచ్‌కు ముందు కిషన్ గాయపడటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ జార్ఖండ్ స్టార్ గాయం తీవ్రతపై నెట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు."నేను, ఇషాన్ చాలా కాలంగా కలిసి ఆడుతున్నాం. అతడి బలహీనతలు నాకు బాగా తెలుసు. ఈ క్రమంలోనే షార్ట్ బాల్‌తో అతడిని పరీక్షించాలనుకున్నాను. కానీ అతడు ఆ బంతిని ఆడలేకపోయాడు. నడము నొప్పి రావడంతో వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి వద్దకు వెళ్లి ఎలా ఉందని అడిగాను?. అంతా బాగానే ఉందని చెప్పాడు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని సైనీ పేర్కొన్నాడు. కిషన్ ప్రస్తుతం ఫిజియో కమలేష్ జైన్ పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈ జార్ఖండ్ ఆటగాడు డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి టీ20 ఆదివారం జరగనుంది. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ వంటి స్టార్ ప్లేయర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 131 ఏళ్లలో ఒకే ఒక్కడు -
'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడే బెటర్'
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనుంది. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రావడంతో, భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకముందు భారత రెగ్యులర్ ఓపెనర్లగా శాంసన్, అభిషేక్ శర్మలు వ్యవహరించారు. ఐర్లాండ్ టూర్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌లో సంజూ తొలి మ్యాచ్‌లో విఫలమం కావడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. సంజూ స్ధానంలో వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఈ బిహార్ ఆటగాడు కూడా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టీ20కు వైభవ్‌ను పక్కన పెట్టి శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఈ కేరళ ఆటగాడు 14 బంతుల్లో 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అనంతరం జింబాబ్వే పర్యటనకు శాంసన్‌కు విశ్రాంతిని ఇచ్చి వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించారు. ఈ సిరీస్‌లో మాత్రం వైభవ్ దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌లలో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సంజూ స్క్వాడ్‌లోకి తిరిగి రావడంతో టీమ్ మేనెజ్మెంట్ ఓపెనర్‌గా ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మాజీ కెప్టెన్ అజింక్య రహానే టాప్-3 ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఇందులో వైభవ్‌కు చోటు దక్కలేదు."టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ముగ్గురు బ్యాటర్లనే అఫ్గాన్ సిరీస్‌లో కూడా టాప్-3లో కొనసాగించాలి. వరల్డ్‌కప్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ రెండు, మూడు ఇన్నింగ్స్‌లలో విఫలం కావడంతో అతడిని పక్కన పెట్టారు. ఇది సరైన నిర్ణయం కాదు. అతడికి మరో అవకాశం ఇవ్వాలి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించాలి. అయితే వైభవ్ మంచి ప్లేయర్ ఎలాంటి సందేహం లేదు. అతడికి భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం శాంసన్, అభిషేక్, ఇషాన్‌లు టాప్-3లో ఉండాలి" అని తన యూట్యూబ్ ఛానల్లో రహానే పేర్కొన్నాడు.చదవండి: వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా -
వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఢిల్లీ వేదికగా ఆదివారం నుంచి భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. గత రెండు నెలలుగా గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.తన ధనాధన్ పేస్‌తో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బుమ్రా తిప్పలు పెట్టాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వైభవ్ నెట్స్‌లో గట్టిగానే శ్రమించాడు. నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన ఐదు బంతుల్లో వైభవ్ ఒక్కదాన్ని మాత్రమే సరిగ్గా షాట్ ఆడగలిగాడు. మొదటి గుడ్ లెంగ్త్ బంతికి డిఫెన్స్ ఆడబోయి మిస్ అవ్వగా, రెండో బంతిని వదిలేశాడు. మూడో బంతికి బుమ్రా యార్కర్ విసరగా వైభవ్ అతికష్టం మీద ఎదుర్కొన్నాడు.నాలుగో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని కూడా వదిలేసిన వైభవ్, ఐదో ఓవర్ పిచ్ బంతిని మాత్రం కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ప్రాక్టీస్‌లో బుమ్రా ఆధిక్యం ప్రదర్శించినా ఐపీఎల్-2026లో మాత్రం ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు బుమ్రాను ధాటిగానే ఎదుర్కొన్నాడు. కాగా ఈ నెట్ సెషన్ వైభవ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఫీల్డింగ్ డ్రిల్స్‌లో మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడమే కాకుండా ఇతర పేసర్ల బౌలింగ్‌లోనూ ఆడేందుకు వైభవ్ ఇబ్బంది పడ్డాడు.వైభవ్ తన ఫామ్ కొనసాగిస్తాడా?కాగా వైభవ్‌కు ఇది మూడో అంతర్జాతీయ టీ20 సిరీస్. ఇంగ్లండ్ టూర్లో డెబ్యూ చేసిన వైభవ్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 50 సగటుతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ అతడు సత్తాచాటాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను అఫ్గానిస్తాన్‌పై కొనసాగించాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సంజూ శాంసన్ రూపంలో వైభవ్ స్ధానానికి ముప్పు పొంచి ఉంది. ఓపెనర్‌గా టీమ్ మేనెజ్మెంట్ వైభవ్‌ను కొనసాగిస్తుందా? లేదా మళ్లీ సంజూకు అవకాశమిస్తుందో? ఆదివారం వరకు వేచి చూడాలి.చదవండి: ‘విరామం ఎక్కువైతే లయ కోల్పోతాను’Jasprit Bumrah vs Vaibhav Sooryavanshi. What happened next? pic.twitter.com/Ep6igaQUnf— Tanuj Lakhina (@tanujlakhina) September 11, 2026 -
మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. శ్రీలంక పర్యటన అనంతరం బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్లు ఇండియా టూడే తమ కథనంలో పేర్కొంది.ఈ క్రమంలోనే కమలేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అతడు ప్రస్తుతం 3 నెలల నోటీస్ పీరియడ్‌లో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడలతో పాటు విండీస్ సిరీస్‌లో కూడా అతడే ఫిజియోథెరపిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. కాగా తమిళనాడుకు చెందిన కమలేష్ జైన్ గతంలో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో నితిన్ పటేల్ స్థానంలో భారత సపోర్ట్ స్టాప్‌లోకి వచ్చాడు. అయితే గత కొన్ని నెలలుగా భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో కమలేష్ పనితీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే అతడిపై వేటు పడింది. ఇప్పటికే భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే కూడా తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ పర్యటన నాటికి భారత జట్టుకు కొత్త ఫిజియోథెరపిస్ట్ వచ్చే అవకాశముంది. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ‘పోరాటం కొనసాగిస్తా’ -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..?
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అనుకోని సమస్య ఎదురైంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను, భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు వెనక్కి జరిపే అంశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.తొలి టీ20 షెడ్యూలైన సెప్టెంబర్ 13నే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు (BRICS Summit) జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా బలగాల మోహరింపు, వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 14న నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే, తొలి టీ20తో పాటు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగనుంది. తొలి టీ20 మినహా మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వస్తే.. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
అఫ్గాన్‌కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ శుభవార్త అందింది. పేస్ గుర్రం, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులో చేరేందుకు సిద్దమయ్యాడు. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో అతడి ఉత్తీర్ణత సాధించినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ఇంగ్లండ్ నుంచి వచ్చాక బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు. కానీ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో లంక టూర్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కింది. కానీ బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకుంటానే మైదానంలోకి అడుగుపెడతాడని సెలక్లర్లు స్పష్టత చేశారు. ఇప్పుడు బుమ్రా ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ కావడంతో బీసీసీఐ వైద్య బృందం నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలు సైతం ఫిట్నెస్ క్లియరెన్స్‌లు పొందారు. అయితే ఫిట్నెస్ టెస్టులో విఫలమైన పేసర్ హర్షిత్ రాణా.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియాక్రీడలకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు.అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్‌కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్‌గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్‌రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది."సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్సైజ్లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్‌రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్కు పంపించాము. అయితే సిములేషన్‌లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్‌లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్సైజ్కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్నెస్ క్లియరెన్స్‌కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.బుమ్రా దూరం.. నితీశ్ కూడా!ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి మాత్రం ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్‌కు వచ్చేశాడు. నితీశ్‌రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్‌తో పాటు లంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? -
భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే?
భారత్, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెపె్టంబర్ 13, 15, 17న వరుసగా మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ సిరీస్ భారత్‌లో జరుగుతున్నప్పటికీ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఆతిథ్యమివ్వనుంది. ‘భారత్–అఫ్గానిస్తాన్ టి20 సిరీస్... సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయనుంది. ‘ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్’లో ఇది రసవత్తర సిరీస్‌గా నిలుస్తుంది’ అని సోనీ పిక్చర్స్ అధికారి రాజేశ్ కౌల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు అఫ్గానిస్తాన్ ప్లేయర్లు స్టార్లుగా ఎదగగా... ఇప్పుడు టీమిండియాపై వారు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది కీలకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, తిలక్ వర్మ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా... పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులో ఉండనున్నారు. మరోవైపు ఇబ్రహీం జద్రాన్ నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్, రహా్మనుల్లా గుర్బాజ్, సాదిఖుల్లా అటల్, అజ్మతుల్లా, గుల్బదీన్ నైబ్, నబీ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఆతృతగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన టీమిండియాతో సిరీస్ ద్వారా తమ ప్రతిభ చాటుకునే అవకాశం అఫ్గాన్ ప్లేయర్లకు లభిస్తుందని ఆయన వెల్లడించారు.చదవండి: గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు -
IND vs AFG: టీమిండియాకు శుభవార్త
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అఫ్గాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడని జాతీయ మీడియా వెల్లడించింది.కాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియాతో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోఇక ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు.మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన వాషీ!అయితే, ఫిట్నెస్ ఆధారంగానే ఈ నలుగురు అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడతారా? లేదా? అనేది తేలుతుందని బోర్డు పేర్కొంది. ఇండియా టుడే కథనం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ, బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి మ్యాచ్ ఫిట్నెస్ సాధించారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు యాజమాన్యం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీ20 ఫార్మాట్లో అతడు కీలక ప్లేయర్‌గా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ అతడికి ప్రాధాన్యం దక్కుతోంది. పెరిగిన ప్రాధాన్యందిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆఫ్ స్పిన్ సేవల కోసం యాజమాన్యం వాషీని వాడుకుంటోంది. వన్డేల్లోనూ సీనియర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కంటే ఈ చెన్నై చిన్నోడికే ప్రాధాన్యం ఇస్తోంది.అయితే, ఇటీవల యూకే పర్యటనలో వాషీ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల 26 ఏళ్ల వాషీ శ్రీలంక పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ వీరుడు, 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు సిరీస్‌కు ఎంపికై అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ ఆధారంగా), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ఫిట్నెస్ ఆధారంగా), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్నెస్ ఆధారంగా), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్‌కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్‌డౌన్‌లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్‌కు కీలక బ్యాటర్‌గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్‌లో నైబ్ తన బ్యాట్‌తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్‌కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్‌లు కూడా బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్‌తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్‌పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రహ్మాన్ బౌలింగ్‌లో చెలరేగడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్‌పై విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచడంతో తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బ్యాటర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల సాధారణ స్కోరు చేసింది. కమిల్ పూరన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, రోస్టన్ చేజ్ (34) పర్వాలేదనిపించాడు. బార్బడోస్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3 వికెట్లు తీయగా, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రడెంట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (47 నాటౌట్), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించగా, ఓపెనర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండన్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, జాషువా బిషప్‌లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్లతో మెరిసిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.Two for the price of one! ☝️ Mujeeb ur Rahman gets two in the over!🇧🇧 x 🇱🇨#CPL26 #BTvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/Mv9ufmSPgq— CPL T20 (@CPL) September 7, 2026Read: క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్! -
అసలు అతడిని ఎలా ఎంపిక చేశారు? ఇదేం పద్ధతి?
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది.ఫిట్నెస్ ఆధారంగా..జింబాబ్వే పర్యటనలో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను తప్పించి.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అఫ్గాన్‌తో సిరీస్ ఆడిస్తామని తెలిపింది. ఇక గాయాల నుంచి జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు అఫ్గాన్‌తో సిరీస్ ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయంలో మేనేజ్మెంట్ ఎందుకు ఇంత ఉదారంగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ రెండు, మూడు సిరీస్‌లకు ఓసారి గాయపడే ఆటగాడి కోసం ఇతరులను బలి చేయడం ఏమిటని ప్రశ్నించాడు.రెండువారాల్లో ఏం మారింది?ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడతాడు. కానీ ఇటీవల గాయం వల్ల శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. మరి రెండువారాల్లోనే అతడు ఎలా ఫిట్‌గా మారాడు?ఇప్పటికీ అతడు మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోలేదు. అలాంటపుడు జట్టుకు ఎంపిక చేసి ఏం ఉపయోగం? టీమిండియాకు ఎంపిక చేసే ముందు కనీసం కొన్ని మ్యాచ్‌లలో ఆడి.. ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్నది చూడాలి.డాక్టర్ సర్టిఫికెట్తో ఆడేస్తారా?కానీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే చాలు ఆడిస్తామంటే ఎలా? వాషింగ్టన్ సుందర్ ప్రతీ రెండు, మూడు సిరీస్‌లకు ఓసారి గాయపడుతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో అతడి బౌలింగ్ బాగాలేదు.నిజానికి టీ20 ఫార్మాట్‌తోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రదర్శనలతో టెస్టు క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. కానీ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్లో అతడు ఏమాత్రం సత్తా చాటడం లేదు’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్య విధానాలను విమర్శించాడు. అదే సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి గురించి చిక్కా స్పందించాడు.ఇదేం పద్ధతి?ఒకవేళ నితీశ్ గనుక మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. శివం దూబేకు బదులు నితీశ్‌నే తుదిజట్టులో ఆడించాలని సూచించాడు. ఏదేమైనా మ్యాచ్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని.. అంతే తప్ప డాక్టర్ సర్టిఫికెట్తో ఓ ఆటగాడు సులువుగా టీమిండియాలోకి రాకూడదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పునరుద్ఘాటించాడు. చిన్నపుడు స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి.. చాలా మంది శిక్ష నుంచి తప్పించుకునే వాళ్లని.. టీమిండియాకు అలాంటి దుస్థితి రాకూడదని ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపిన సబలెంకా! -
టీమిండియా నుంచి తీసేశారు.. ఆ కసి అక్కడ చూపించేస్తున్నాడు!
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మెహాలీ వేదికగా లూధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 168 పరుగుల లక్ష్య చేధనలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆర్యన్ యాదవ్(32) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా జలంధర్ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఊదిపడేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లుథియానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లుథియానా ఇన్నింగ్స్‌లో మాధవ్ సింగ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జలంధర్ బౌలర్లలో ఆర్యన్ యాదవ్ మూడు, రణ్‌దీప్ సింగ్, గుర్వీందర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కొనసాగుతున్న ప్రభ్సిమ్రాన్ నిరీక్షణ?కాగా 26 ఏళ్ల ప్రభ్సిమ్రాన్ సింగ్ గత కొన్నాళ్లగా వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే వంటి దేశవాళీ టోర్నీలతో ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లో కూడా అతడు దుమ్ములేపుతున్నాడు. ఇండియా-ఎ జట్టు తరపున కూడా తన మార్క్ చూపించాడు. కానీ సీనియర్ జట్టు తరపున మాత్రం అరంగేట్రం చేసే అవకాశం అతడికి లభించడం లేదు. జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ గైర్హజరీ కారణంగా ప్రబ్సిమ్రాన్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మొత్తం మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు సంజూ తిరిగి రావడంతో ప్రభ్సిమ్రాన్ను పక్కన పెట్టేశారు.అయినప్పటికి అతడు ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటివరకు ఈ పంజాబ్ టీ20 లీగ్‌లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్సిమ్రాన్ 401 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
అఫ్గాన్ సిరీస్‌కు బుమ్రా డౌటే.. రేసులోకి యార్కర్ల స్పెషలిస్ట్!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడా? అంటే 'అవును' అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్లలో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడికి ఇంకా బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని 'బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకునే క్రమంలో ఉన్నాడు. అయితే బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకుండా మైదానంలోకి దించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సెప్టెంబర్ 10 నుంచి ఢిల్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.అంతకంటే ముందే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు జట్టుతో కలిసే అవకాశముంది. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో అతడికి ప్రత్యామ్నాయంగా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టీమిండియా తరఫున ఆరు టీ20లు ఆడిన ప్రిన్స్.. 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో ప్రిన్స్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.ప్రిన్స్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా పిన్ పాయింట్ యార్కర్లు వేయడంలో అతడు దిట్ట. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు:శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
‘ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి’
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. రింకూ సింగ్ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రింకూను ఏ కారణం లేకుండానే తప్పించారని విమర్శించాడు.ఢిల్లీ వేదికగా అఫ్గాన్ టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించింది.వారి రీ ఎంట్రీ.. వీరికి ఉద్వాసనశ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తిరిగి రాగా.. జింబాబ్వే పర్యటనలో ఆడిన రింకూ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్లను సెలక్టర్లు తప్పించారు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది.ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలిఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్పందిస్తూ.. రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్ విషయంలో తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రింకూ ఐపీఎల్లో బాగా ఆడాడు. ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. అక్కడి నుంచి నేరుగా రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.దులిప్ ట్రోఫీలో భాగమయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ టీమిండియాలో మాత్రం మళ్లీ చోటు కోల్పోయాడు. అతడిని సెలక్టర్లు ఏ కారణం లేకుండానే ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. బహుశా జట్టులోకి తిరిగి వచ్చిన వారి కోసం రింకూపై వేటు వేసి ఉంటారు.జట్టులో స్థానం కోల్పోయేంతగా అతడు ఎలాంటి తప్పూ చేయలేదు. తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారీ రింకూ సద్వినియోగం చేసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును విజయాల దిశగా నడిపించాడు. అతడి ప్రదర్శన బాగానే ఉన్నా జట్టు నుంచి తప్పించారు.కుల్దీప్ విషయంలోనూ అదే తీరుఇక కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిసారీ అతడి విషయంలో బాధపడటం తప్ప మనమేమీ చేయలేము. అతడి పట్ల సెలక్టర్లు ఎందుకో సుముఖంగా లేరు’’ అని వసీం జాఫర్ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్.. 295 పరుగులు చేశాడు. యూపీ టీ20 లీగ్‌లో ఆరు ఇన్నింగ్స్ ఆడి 169 పరుగులు సాధించాడు. దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున 80 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున ఇప్పటికి 54 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా పొట్టి ఫార్మాట్లో తన చివరి మ్యాచ్ ఆడాడు.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్! -
'హమ్మయ్య.. గంభీర్ ఫేవరెట్ ప్లేయర్లు వచ్చేశారు'
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టు ఎంపికపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పూర్తి ఫిట్నెస్ సాధించని వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు."హెడ్‌కోచ్‌కి ఇష్టమైన ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది, అతడు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయానికొస్తే.. అతడు గొప్ప ఆల్‌రౌండర్ అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో అతడు కేవలం ఒక బ్యాటర్ మాత్రమే, బౌలర్‌గా పరిగణించలేం" అని బద్రీనాథ్ పేర్కొన్నాడు. కాగా గంభీర్ మద్దతు వల్లే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌లకు అన్ని ఫార్మాట్లలో చోటు దక్కుతోందనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.ఇక బుమ్రా రీఎంట్రీపై కూడా బధ్రీనాథ్ స్పందించాడు. "బుమ్రా తిరిగి రావడం చాలా సానుకూల పరిణామం. బమ్రానే స్వయంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతాడని మేనెజ్మెంట్తో చెప్పి ఉండవచ్చు. దాంతో వారు అతడిని ఎంపిక చేసి ఉంటారని" ఈ తమిళనాడు క్రికెటర్ అన్నాడు. అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాచదవండి: డుప్లెసిస్ విధ్వంసం.. అశ్విన్ టీమ్‌కు నాలుగో ఓటమి -
'రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్'
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత టీమిండియా కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గానే పూర్తిగా ప్లేయర్‌గానే అతడిని జట్టు నుంచి పక్కన పెట్టేశారు. అతడి స్దానంలో అనుహ్యంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టు సారధిగా బీసీసీఐ నియమించింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు సరికాదు చాలా మంది మాజీలు విమర్శించారు. అయితే భారత జట్టు పగ్గాలను చేపట్టిన ఆరంభంలోనే అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడి సారథ్యంలోని టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్‌గా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతడు కెప్టెన్సీలోనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ తలపడనుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో అయ్యర్ ఆసీస్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని, రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడని పాంటింగ్ జోస్యం చెప్పాడు."శ్రేయస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ 2025 వేలంలో శ్రేయస్ కోసం భారీగా ఖర్చు చేసినప్పుడే, అతడిపై నాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడితో మళ్లీ కలిసి పనిచేయాలని అనుకున్నాను. ఒక ప్లేయర్‌గా అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలననే నమ్మకం నాకుంది. ఒక కెప్టెన్‌గా, టీమ్ లీడర్‌గా అయ్యర్‌తో పనిచేయడాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. భారత టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. తను టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వరకు ఆ పదవికి అతడే సరైనోడు" అని ఇండియా టూడే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు? -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జాతీయ టీ20 జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న శాంసన్‌ను.. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో అఫ్గాన్ సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. జింబాబ్వే టూర్లో శాంసన్ లేకపోవడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో సంజూ విఫలం కావడంతో సూర్యవంశీకి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ సంజూ స్ధానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.దీంతో ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20కు వైభవ్‌ను తప్పించి శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో శాంసన్ 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. అయినప్పటికి ఆ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్‌కు అతడిని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్ హీరోని జట్టు నుంచి తప్పిస్తారా? అని సెలక్టర్లపై చాలా మంది మాజీలు మండిపడ్డారు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంజూ టీ20 జట్టులోకి వచ్చాడు.ఈ క్రమంలో సంజూ రాకతో వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. ఎప్పటిలాగే భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే 15 ఏళ్ల సూర్యవంశీ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. ఒకవేళ శాంసన్ విఫలమైతేనే వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ జట్టుకు సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ప్రారంభం కానుండటంతో, తొలి మ్యాచ్ ఎంపికకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది.చదవండి: అతడు జట్టులో ఎందుకు? ముగ్గురిలో.. ఇద్దరు ఫిట్‌గా లేరు.. గ్రేట్! -
IND vs AFG: అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు లేనట్లే!
టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమకు నచ్చిన క్రికెటర్లను ఆడించేందుకు అర్హులైన వారికి బలి చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ ఢిల్లీ వేదికగా టీమిండియాకు ఈ సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తుండగా.. ఇందుకోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.అదే జట్టుసెప్టెంబరులో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పూ లేకుండానే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ఎంచుకున్నారు. కాగా మోకాలి గాయంతో చాలా కాలంగా ఆటకు దూరమైన టీమిండియా ప్రధాన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో కూడా ఆడలేదు.ఆ నలుగురు...ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మరో ముగ్గురు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు కూడా అఫ్గాన్‌తో ఆడే జట్టులో చోటు దక్కింది. అయితే ఈ నలుగురి ఎంపిక కూడా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని, పూర్తిగా ఫిట్‌గా మారితేనే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు ఫిట్‌గా లేరు‘‘ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల (బుమ్రా, హర్షిత్, అర్ష్‌దీప్)ను ఎంపిక చేశారు. కానీ అందులో ఇద్దరు (బుమ్రా, హర్షిత్) ఫిట్నెస్ సాధిస్తేనే ఆడతారట. వాళ్లు ఒక మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడితే పరిస్థితి ఏంటి? హర్షిత్ ఇంగ్లండ్ పర్యటనలో అలాగే గాయపడ్డాడు కదా!..గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడిని మరోసారి ఎంపిక చేశారా?.. హర్షిత్‌కు బదులు ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీని పిలిపించవచ్చు కదా!.. లేదంటే భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాల్సింది.ఇక వాషింగ్టన్ సుందర్.. అతడు ఎప్పుడూ గొప్పగా ఆడిందేమీ లేదు. పూర్తి ఫిట్నెస్ సాధించలేదు అంటున్నారు. అలాంటపుడు జట్టులో ఎందుకు? వాషీకి బదులు కృనాల్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేస్తే మెరుగ్గా ఉండేది. కానీ గంభీర్‌కు అది ఇష్టం లేదేమో!..పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో పరాభవం తర్వాత కూడా ఇంకా తమకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తామంటే.. టీమిండియా మున్ముందు మరిన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్హులైన ఆటగాళ్లను ఎంపిక చేయండి. జట్టుకు అదే మంచిది’’ అని సోషల్ మీడియా వేదికగా టీమిండియా యాజమాన్యానికి నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మరోవైపు.. ఫిట్‌గా మారిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. వాళ్లను పక్కన పెట్టేశారుజింబాబ్వేతో సిరీస్‌లో ఆడని సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ జట్టులోకి రాగా...ఈ పర్యటనలో టీమిండియాలో భాగంగా ఉన్న రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్లను పక్కన పెట్టారు. ఈ నెల 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20లు జరుగుతాయి. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్ చేస్తే సీన్ రివర్స్!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం భారత వెటరన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేయగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో భారత జట్టును ప్రకటించిన అనంతరం కృనాల్ సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు. భారత జెండా ఎమోజీలను జత చేస్తూ.. "ఆశ ఇంకా సజీవంగానే ఉంది" అని అతడు పోస్ట్ చేశాడు. కృనాల్ పాండ్యా చివరిసారిగా భారత్ తరపున 2021లో ఆడాడు. అతడు ఇప్పటివరకు ఐదు వన్డేలు, 19 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 58 కాగా.. టీ20ల్లో 26 పరుగులగా ఉంది. మొత్తంగా అతడు రెండు ఫార్మాట్లలో కలిపి 17 వికెట్లు పడగొట్టాడు. అయితే ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, ఐదేళ్ల తర్వాత కృనాల్‌ను తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ సెలక్టర్లు మాత్రం అతడివైపు మొగ్గు చూపలేదు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించికపోతే అతడి స్ధానంలో కృనాల్ పేరును పరిశీలించే అవకాశముంది.భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*చదవండి: ప్రిటోరియస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం -
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు.ఇక ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*India’s squad for Afghanistan T20I series announced. #TeamIndia will play three T20Is against Afghanistan at New Delhi, beginning September 13.#AFGvIND pic.twitter.com/UqTUeZyHz8— BCCI (@BCCI) September 1, 2026Read: పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా! -
IND vs AFG: మళ్లీ గాయపడ్డాడు.. వాళ్లిద్దరికి లైన్ క్లియర్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు అఫ్గానిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా ఐపీఎల్-2026 తర్వాత ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఆడనేలేదు.వెన్ను నొప్పిఈ ఏడాది టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ సందర్భంగా హార్దిక్ ఆఖరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ సమయంలో వెన్ను నొప్పితో బాధపడ్డ ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ముంబై ఇండియన్స్ తరఫున లీగ్ దశలో పద్నాలుగింట పది మాత్రమే ఆడాడు.తొడ కండరాల గాయంఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో హార్దిక్ పాండ్యా పాల్గొనలేకపోయాడు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం కావడంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందాడు.మళ్లీ ఇలా..అక్కడ క్రమక్రమంగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. జాతీయ జట్టులో పునరాగమనం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే, అంతలోనే మళ్లీ మోకాలికి గాయమైంది. దీంతో అఫ్గానిస్తాన్‌తో సెప్టెంబరులో జరిగే టీ20 సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడనే వార్తలు తెరమీదకు వచ్చాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ‘‘హార్దిక్ పూర్తిగా కోలుకున్నట్లే. అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే, బౌలింగ్ చేసే సమయంలో అతడు మోకాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే కోలుకున్నప్పటికీ.. మ్యాచ్ ఫిట్నెస్ మాత్రం సాధించలేకపోయాడని తెలిసింది.బ్యాటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బృందం మాత్రం హార్దిక్ పూర్తిగా కోలుకున్నాడని భావిస్తేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఏదేమైనా అఫ్గాన్‌తో సిరీస్‌కు హార్దిక్ అందుబాటులో ఉండటం కష్టమే’’ అని తెలుస్తోంది.హార్దిక్ కెరీర్ ఖతమే?హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్త కాదు. గతంలోనూ అతడు తీవ్రగాయాల పాలైనా తిరిగి కోలుకుని మెగా టోర్నీల్లో సత్తా చాటాడు. అరుదైన పేస్ నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్ కావడం వల్ల హార్దిక్ స్థానానికి గతంలో పెద్దగా సవాలు ఎదురుకాలేదు.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి రాకతో పరిస్థితి కాస్త మారింది. హార్దిక్‌కు అతడే సరైన వారసుడు అని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. యాజమాన్యం కూడా హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేలా నితీశ్‌ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఇలాగే తరచూ గాయపడితే నితీశ్ రెడ్డికి మార్గం పూర్తిగా సుగమమవుతుంది. ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా పయనిస్తున్న నితీశ్ రెడ్డి.. వైట్‌బాల్ జట్టులోనూ కీలకంగా మారగలడు.కానీ, నితీశ్ కూడా తరచూ గాయపడుతుండటం గమనార్హం. అయితే, ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్న అతడు అఫ్గాన్‌తో సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 2025 జనవరిలో నితీశ్ చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ కూడా కోలుకుని అఫ్గాన్‌తో సిరీస్ (సెప్టెంబరు 13-17) ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
శ్రీలంక పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి.. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఇందుకు వేదిక.కాగా అఫ్గాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ లేదంటే భారత్‌లో అఫ్గాన్ బోర్డు తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో టీమిండియా- అఫ్గాన్ టీ20 మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది.తెరమీదకు ఊహించని పేరుఈ క్రమంలో భారత జట్టు ఎంపిక గురించి చర్చ జరుగుతుండగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ఒకరు అనూహ్యంగా కృనాల్ పాండ్యా పేరును తెరమీదకు తెచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానాన్ని సెలక్టర్లు కృనాల్‌తో భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. కాగా టీమిండియా ఇటీవల యూకే పర్యటనలో భాగంగా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే.తొలిసారి టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసి పరువు నిలబెట్టుకుంది.అయితే, యూకే టూర్లో అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో కొత్త లెఫ్టార్మ్ స్పిన్నర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్ల చూపు కృనాల్ పాండ్యాపై పడినట్లు సదరు రిపోర్టర్ పేర్కొన్నారు.భువనేశ్వర్ కుమార్‌తో కృనాల్ పాండ్యా (PC: RCB/BCCI)ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ?2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కృనాల్ పాండ్యా 2021లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ పాండ్యా.. 130, 124 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో రెండు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర35 ఏళ్ల కృనాల్ పాండ్యా ఐపీఎల్ 2025,2026 సీజన్లలో అద్భత ప్రదర్శన కనబరిచాడు. గతేడాది 109 పరుగులు చేయడంతో పాటు పదిహేడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడాది తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 226 పరుగులు సాధించిన కృనాల్.. 15 ఇన్నింగ్స్‌లో కలిపి 14 వికెట్లు కూల్చాడు.తద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కృనాల్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓ మోస్తరుగా రాణించాడు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిపి 173 పరుగులు చేసిన అక్షర్.. 13 ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు తీశాడు. అయితే, యూకే పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు వికెట్లు తీసి.. 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్
త్వరలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్ అందాయి. ఈ సిరీస్‌కు భారత జట్టును సెప్టెంబర్ 3న ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం ఖరారైనట్లు సమాచారం. అదే రోజే జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.ఏషియన్ గేమ్స్ జట్టునే కొనసాగిస్తారా..?నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగిస్తారని తెలుస్తుంది. అయితే కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ నివేదికల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. వీరు ముగ్గురు ఇటీవల గాయాల బారిన పడి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు.వీరితో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా సీఓఈలోనే ఉన్నారు. వీరిలో వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.ఒకవేళ బుమ్రా, హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అంచనా)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీచదవండి: Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ -
బుమ్రా, పాండ్యా విషయంలో కీలక అప్డేట్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా స్వదేశానికి చేరుకుంది. సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌తో పాటు సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఆసియా గేమ్స్‌లో టీమిండియా పురుషుల జట్టు మ్యాచ్‌లు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. అయితే ఈ రెండు టోర్నీలకు భారత జట్టులో కీలకమైన స్పీడస్టర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడే విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లోనే రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నారు. బుమ్రా ఎడమ మోకాలి గాయంతో బాధపడుతుండగా, పాండ్యా వెన్నునొప్పి నుంచి కోలుకున్నప్పటికీ, కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో సీవోఈలోనే ఉండిపోయాడు.తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరి గాయాలపై కానీ, ఎప్పుడు కోలుకుంటారనే దానిపై కానీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరోవైపు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు వీరిద్దరు ఆడకపోవచ్చు. ఇక ఆసియా గేమ్స్‌కు కూడా టీమిండియా-బి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ ఇప్పటికే పేర్కొంది. మరి అప్పటివరకు బుమ్రా, పాండ్యా కోలుకుంటే ఆసియా గేమ్స్‌లో ఆడుతారా అంటే అది కూడా అనుమానమే. బి- జట్టును సిద్ధం చేస్తే మాత్రం బుమ్రా, పాండ్యాలు మరికొంత కాలం రీహాబిలిటేషన్ కేంద్రంలోనే గడపాల్సి ఉంటుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రిన్స్ యాదవ్ ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం అందింది. ఇది భారత పేస్ బౌలింగ్ దళానికి గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.Read: చెస్ ఆడాలని చాలెంజ్.. ‘సారీ బ్రో రిటైరయ్యా’ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. జింబాబ్వే పర్యటనలో గాయపడ్డ యువ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ ప్రిన్స్ యాదవ్.. తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఆజ్ తక్ కథనం ప్రకారం.. ప్రిన్స్ యాదవ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్నెస్ పరీక్షలను క్లియర్ చేసినట్లు సమాచారం. తద్వారా అఫ్గాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపికకు ప్రిన్స్ అందుబాటులో ఉండనున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ప్రిన్స్‌కు ఏమైందంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బౌలింగ్ చేస్తుండగా ప్రిన్స్ యాదవ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఢిల్లీ పేసర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో చేరి తన ఫిట్నెస్ను తిరిగి పొందాడు. కాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో భారత సీనియర్ జట్టు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపువచ్చింది. తనకు లభించిన అవకాశాన్ని ప్రిన్స్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇప్పటివరకు భారత తరపున 3 వన్డేలు, 6 టీ20లు ఆడిన ప్రిన్స్ యాదవ్.. మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు.ఇప్పుడు ఈ రైట్ ఆర్మ్ పేసర్ అఫ్గానిస్తాన్‌పై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత -
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్‌లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిరీస్ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అఫ్గాన్ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మీడియా హక్కులను పాక్‌కు చెందిన టీజీ (ట్రాన్స్ గ్రూప్)నకు అప్పగించినట్లు అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.‘‘ఏసీబీ గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్ కోడ్ ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.కాగా ట్రాన్స్ గ్రూపునకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్- పాక్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2026 మేజర్ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.మరోవైపు.. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గాన్ జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. శుబ్‌మన్ గిల్ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
భారత్‌తో టీ20 సిరీస్.. అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన
భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్-హక్కు అఫ్గాన్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు రెండేళ్ల తర్వాత అఫ్గాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నవీన్.. ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లితో గొడవపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు ఈ అఫ్గాన్ పేసర్ మారు మ్రోగిపోయింది.ఆ తర్వాత నవీన్ గాయం కారణంగా నవీన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. తర్వాత ఫిట్నెస్ సాధించినప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఎట్టకేలకు తిరిగి జట్టులో చోటు కల్పించారు. ఇక ఈ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అతల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్ వంటి ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో భారత్-అఫ్గాన్ మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు జరిగిన సంగతి తెలిసిందే. ఏకైక టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే జోరును కనబరిచాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మొత్తం మూడు మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా జరగనున్నప్పటికి.. ఈ సిరీస్ అఫ్గానిస్తాన్ హోమ్ సిరీస్‌గా పరిగణించబడుతుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.భారత్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గాన్ జట్టుఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహమాన్ , సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఎఫ్ ముజీబ్ ఉర్ రహ్మద్, ఎఫ్. నవీన్-ఉల్-హక్.చదవండి: IND vs SL: ధ్రువ్ జురెల్ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌కు FIFA వరల్డ్ కప్ టెక్నాలజీ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్ టీ20 సిరీస్ క్రికెట్ ప్రసారంలో కొత్త అనుభూతిని అందించనుంది. 2026 FIFA వరల్డ్ కప్‌లో ఉపయోగించిన అధునాతన ప్రసార సాంకేతికతలను ఈ సిరీస్‌లో తొలిసారిగా పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నారు.ఆఫ్ఘనిస్తాన్ ఈ సిరీస్‌కు అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లోని ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సిరీస్‌ను FIFA వరల్డ్ కప్ హోస్ట్-బ్రాడ్కాస్ట్ ప్రమాణాలతో రూపొందించనున్నట్లు ప్రసార హక్కులు కలిగిన ITW Universe వెల్లడించింది.FIFA వరల్డ్ కప్ మ్యాచ్‌లను, అలాగే పలు UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌ను డైరెక్ట్ చేసిన జేమీ ఓక్‌ఫోర్డ్ ఈ సిరీస్ ప్రసారానికి దర్శకత్వం వహించనున్నారు. ఆయన 2002 నుంచి ప్రతి FIFA వరల్డ్ కప్‌ను కవర్ చేశారు.ప్రసారంలో AI-స్టెబిలైజ్డ్ POV కెమెరాలు, వాల్యూమెట్రిక్ ఫ్రీ-వ్యూపాయింట్ టెక్నాలజీ, అధునాతన Spidercam, Ultra-Motion కెమెరాలు, సినీ-స్టైల్ విజువల్స్ వంటి సాంకేతికతలు ఉపయోగించనున్నారు.ఇవే కాకుండా Quidich Innovation Labsకు చెందిన Spatio సిస్టమ్ ద్వారా స్టెబిలైజ్డ్ డ్రోన్ ఫీడ్‌పై బ్రాడ్కాస్ట్-గ్రేడ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్రాఫిక్స్‌ను చూపించనున్నారు. మరో ప్రత్యేక Ultra-Slow-Motion కెమెరా సెకనుకు 600 ఫ్రేమ్‌ల వేగంతో బంతి, ఎడ్జ్‌లు, షాట్లు వంటి కీలక క్షణాలను రికార్డ్ చేయనుంది.ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే గణేశ్ చతుర్థి కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.మొత్తంగా, ఈ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూసే అనుభూతిని FIFA వరల్డ్ కప్ స్థాయి విజువల్ ప్రొడక్షన్‌కు తీసుకెళ్లే తొలి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌గా నిలవనుంది. -
భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో మార్పు!
సెప్టెంబర్‌లో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మూడు మ్యాచ్‌లు వచ్చే నెల 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయాలని బీసీసీఐని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండగను పురస్కరించుకుని, ఆ రోజున ఒక టీ20 మ్యాచ్ నిర్వహించాలని ఏసీబీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు పండగ సెలవు దినం కావడంతో మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తోంది. ఈ ప్రతిపాదనకు భారత క్రికెట్ బోర్డు అంగీకరిస్తే.. సెప్టెంబర్ 13 లేదా 15న జరగాల్సిన మ్యాచ్‌లలో ఒకదానిని సెప్టెంబర్ 14కి మార్చనుంది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం ఇది అఫ్గానిస్తాన్‌కు హోమ్ సిరీస్ కావడం విశేషం. గతంలో అఫ్గాన్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడినప్పటికి, టీమిండియాతో హోమ్ సిరీస్ ఆడడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చారిత్రత్మక సిరీస్ ప్రసార హక్కులకు సంబంధించి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ ఛానళ్లతో ఏసీబీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్ -
IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.అఫ్గాన్ క్రికెట్‌కు అండగా ఉంటాముఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్ అఫ్గానిస్తాన్‌కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.చిరస్మరణీయంఅప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్‌లో అఫ్గాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్‌తో టీమిండియా సిరీస్ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.బంగ్లాదేశ్‌కు షాక్నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్‌ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్ పెట్టింది.కాగా టీ20 ప్రపంచకప్-2026 సమయంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇక లేనట్లేనా?అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్‌తో సిరీస్ ఖరారు చేసి.. భారత్‌ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్ ఇచ్చింది.అఫ్గానిస్తాన్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారంరెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారంమూడో టీ20: సెప్టెంబరు 17- గురువారంవేదిక: ఢిల్లీ.చదవండి: టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్ -
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్‌బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్‌కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్‌కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్‌లో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్‌పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్‌మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్‌తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్‌ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్‌ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్‌ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్‌కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్‌గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్‌గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్‌మన్ గిల్ -
రోహిత్ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్ హిస్టరీలోనే
చెపాక్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(110) అజేయ శతకంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను రోహిత్ అధిగమించాడు. రోహిత్‌కు ఇది 95వ హాఫ్ సెంచరీ. ద్రవిడ్ తన వన్డే కెరీర్లో 94 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి(131) రెండో స్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో వయస్సులో అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. అమర్నాథ్ 1989లో పాకిస్తాన్‌పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో ఆర్ధ శతకం నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో అమర్నాథ్ ఆల్‌టైమ్ రికార్డు హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
జైశ్వాల్ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ.. 28.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు.86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్ రోహిత్ 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్) దూకుడగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ ఒక్కడే వికెట్ సాధించాడు.నిప్పులు చెరిగిన ప్రసిద్ద్ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లకు టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఈ కర్ణాటక స్పీడ్ స్టార్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తలా వికెట్ సాధించారు. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102), ఓమర్జాయ్(50) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్‌ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్‌కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్‌కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్‌లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్‌గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్‌తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్‌తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్
భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరిగాడు. తన అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును ప్రసిద్ద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ విరోచిత శతకంఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిది మాత్రం విరోచిత సెంచరీ సాధించాడు. 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 102 పరుగులు చేశాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు. మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్
చెన్నై వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ఓ అద్భుతమైన రికార్డుకు వేదికైంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కలిసి అరుదైన ఫీట్‌ను సాధించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ యూనిక్ హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌కు ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తన సంచలన బౌలింగ్‌తో అఫ్గాన్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.ప్రసిద్ద్ వేసిన తన స్పెల్ మొదటి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని గుర్బాజ్ ఆఫ్‌సైడ్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 6 ఓవర్లో ప్రసిద్ధ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని రహ్మత్ షా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మళ్లీ స్లిప్స్‌లో ఉన్న హిట్‌మ్యాన్ అందుకున్నాడు. అంతేకాకుండా 8వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్‌కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ క్యాచ్‌ల హ్యాట్రిక్ పూర్తి అయింది. ఒక వన్డే మ్యాచ్‌లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు పట్టిన మూడవ భారత ఫీల్డర్‌గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు వి.వి.ఎస్. లక్ష్మణ్ (2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో), శిఖర్ ధావన్ (2018లో బంగ్లాదేశ్‌పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో) ఈ ఫీట్ సాధించారు.చదవండి: MLC 2026: ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనేIdentical setups, identical results 🔄Prasidh Krishna 🤝 Rohit Sharma 😎 Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l— BCCI (@BCCI) June 20, 2026 -
IND vs AFG: కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టారా?
అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ హర్ష్ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు.రాహుల్ లేడుఅయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్‌లో కుల్దీప్ స్థానాన్ని హర్ష్ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బదులు.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.అదే విధంగా.. పేస్ దళంలో కీలకమైన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్‌కు ముందే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ మ్యాచ్‌కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్‌ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.మరోవైపు.. గత మ్యాచ్‌లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్ యాదవ్ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్, కుల్దీప్లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్‌దీప్‌తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.2-0తో సిరీస్ కైవసంఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చదవండి: వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్‌స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్‌కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్‌లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్‌ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హష్మతుల్లా సింగిల్‌కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్‌లో.. హష్మతుల్లా షాహిది సింగిల్‌కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్‌లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్‌కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్‌పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్‌కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
IND vs AFG: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.సిరీస్ కైవసంకాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.రెండో వన్డేకు దూరంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడుఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
అఫ్గానిస్తాన్‌తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.రెండో వన్డేకు మూడు మార్పులుకాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.అయితే, రెండో మ్యాచ్‌కు హర్ష్ దూబే దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఆడాడు. అదే విధంగా నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి..ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. అఫ్గాన్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి.. నితీశ్ రెడ్డిని ఆడించాలని సూచించాడు.ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్ కోసం అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినివ్వాలి.ఏదేమైనా విరాట్ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్‌ను పక్కనపెట్టే వీలులేదు. పేస్ దళంలో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.చదవండి: భారత క్రికెట్‌కు గుడ్‌బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్ -
మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టాపార్డర్‌లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్ చేయించి శుబ్‌మన్ గిల్‌ను వన్‌డౌన్‌కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్‌గా వెళ్లాలా? లేదంటే వన్‌డౌన్‌లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్‌ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్‌తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు
స్వదేశంలో అప్గానిస్తాన్‌తో జరుగున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హర్షిత్ రానా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్‌తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ సింగ్ యాదవ్, ప్రిన్స్ దీప్, కృష్ణ యాదవ్, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే? -
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.అరంగేట్రంలో అదుర్స్పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్‌గా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు.ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్‌కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరీర్లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో నో ఛాన్స్!గుర్నార్ బ్రార్.. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అదే టర్నింగ్ పాయింట్?కాగా గుర్నార్ బ్రార్ దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్‌లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్‌కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నార్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.చదవండి: టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్ -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 154 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్‌లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్‌లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్‌మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్‌ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
శుబ్‌మన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్‌లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్‌తో రెండో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 77 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్‌ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్‌లు) పేరిట సంయుక్తంగా ఉండేది.తాజా నాక్‌తో వారిద్దరిని శుబ్‌మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను గిల్ అధిగమించాడు.సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్‌పై 112 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గిల్ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్ -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్‌లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్‌ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్‌గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్‌లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్‌పై భారత్ భారీ స్కోరు -
శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యశస్వి జైశ్వాల్ తుది జట్టులో చోటు దక్కడంతో గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే జైశ్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్, తన రెగ్యులర్ ఓపెనర్ పార్టనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో భారత స్కోర్ పవర్‌ప్లేలో 80 పరుగుల మార్క్ దాటింది. అనంతరం రోహిత్ ఔటైనప్పటికి శుబ్‌మన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రోహిత్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కిషన్ కూడా కేవలం 71 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్(86 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 121), కిషన్(111) అజేయంగా తమ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్హానించింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ𝘼 𝙘𝙖𝙥𝙩𝙖𝙞𝙣'𝙨 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 𝙩𝙤𝙣!💯👏#ShubmanGill puts on a masterclass, bringing up his FIRST-EVER ODI century as captain for Team India! 🫡#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/KxFphH6k5t— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హిట్ మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు.రోహిత్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 14,000 లిస్ట్-ఎ పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్(348 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. హిట్‌మ్యాన్ 345 ఇన్నింగ్స్‌లలో అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి(290) అగ్రస్ధానంలో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:సచిన్ టెండూల్కర్: 21,999 పరుగులువిరాట్ కోహ్లీ: 16,447 పరుగులుసౌరవ్ గంగూలీ: 15,622 పరుగులురాహుల్ ద్రావిడ్: 15,271 పరుగులురోహిత్ శర్మ: 14,007+ పరుగులుఅత్యంత వేగంగా 14,000 లిస్ట్-ఎ పరుగులు చేసిన భారత ప్లేయర్లువిరాట్ కోహ్లి-290రోహిత్ శర్మ-345సచిన్ టెండూల్కర్- 348చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్ అట్టర్ ఫ్లాప్ -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మరోసారి ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్‌కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్‌లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్‌పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్‌కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్‌లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్‌మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో శుబ్‌మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్‌లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్‌గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్‌లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్‌ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్‌తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్‌లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్‌కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్‌తో ఏకైక టెస్టు ఆడింది శుబ్‌మన్ గిల్ సేన. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్‌కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్‌ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్‌ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్‌లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్‌లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్‌గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్
ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.ఈ ఇన్నింగ్స్‌తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్‌కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. -
అమ్మ నుంచి ఫోన్ కాల్..! లైవ్ ప్రెస్ మీట్లో నితీష్ ఏం చేశాడంటే?
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా తరపున యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?నితీష్ మీడియాతో మాట్లాడుతుండగా.. మైక్‌ల ముందున్న అతడి మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. నితీశ్ ఒక్క నిమిషం ఆగి, ఫోన్ స్క్రీన్ వైపు చూసి చిరు నవ్వు చిందించాడు. ఫోన్ చేస్తోంది తన అమ్మ అని తెలియడంతో ఏమాత్రం సంకోచించకుండా.. “సారీ, నేను ఈ కాల్ మాట్లాడాలి” అని అక్కడున్న జర్నలిస్టులకు చెప్పి ఫోన్ ఎత్తాడు. అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా’’ అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ ప్రెస్‌మీట్‌ను కొనసాగించిన నితీశ్ మరోసారి విలేకర్లకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ కాసేపు ఆగవచ్చు ఏమో కానీ అమ్మ నుంచి వచ్చే ఫోన్ కాల్ మాత్రం అస్సలు ఆగదు అంటూ ఆ వీడియో క్యాప్షన్‌గా బీసీసీఐ రాసుకొచ్చింది.అదరగొట్టిన కుర్రాళ్లుకాగా వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(102) కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో సత్తాచాటారు. వీరితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ కూడా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH— BCCI (@BCCI) June 13, 2026చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్‌మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్‌గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న ఓపెనర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.👉ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.👉అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్లో ఓపెనర్‌గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మోహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్.. అమర్నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
ఆఫ్గన్‌తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్‌లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్‌ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్‌తో సమన్వయం లోపం వల్ల రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్‌లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్‌లు 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్‌లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్‌ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్‌టైమ్‌లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్‌లు చేసిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
ఉతికారేసిన గుర్బాజ్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్‌లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్ బౌలింగ్‌కు వచ్చిన ప్రతీ భారత బౌలర్‌ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్‌పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్‌పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉ఇక వన్డేల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్‌వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో గుర్బాజ్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్, మొహమ్మద్ షెహజాద్‌లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్.. గతంలో 2021లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్‌పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్‌పై 7 సిక్సర్లు కొట్టాడు. -
అఫ్గానిస్తాన్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్‌దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్‌బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్‌కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్‌కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్‌ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌కు నెట్‌బౌలర్‌గా వచ్చిన గుర్నూర్ బ్రార్‌కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్‌కు అండగా నిలబడి నెట్‌బౌలర్‌గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్‌కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్‌కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్‌లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్‌ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్‌రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్‌దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్‌దూబే బెస్ట్ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్‌గా విదర్భను నడిపించిన హర్ష్‌దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్‌దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్‌కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన హర్ష్‌దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్‌దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్‌దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్‌తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌కు కూడా అఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్‌డౌన్‌లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్‌కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్‌డౌన్‌లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్‌మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్‌లో హష్మతుల్లా (27) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. హర్ష్‌కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్‌ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత్ తమ వన్డే ప్రపంచకప్-2027 ప్రిపరేషన్స్‌ను ప్రారంభించనుంది. విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.కాగా ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు? -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు?
టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్-2026కు ముందు గాయపడిన స్టార్ పేసర్ హర్షిత్ రాణా, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హర్షిత్.. అఫ్గాన్‌తో మూడో వన్డేకు ముందు భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం.వాస్తవానికి అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హర్షిత్ లేడు. కానీ ఇప్పుడు అతడు కోలుకోవడంతో గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానంలో జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఐర్లాండ్,ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రం ముందే అతడిని ఎంపిక చేశారు.ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఉన్నాడు. అతడు ప్రతి రోజూ 9-10 ఓవర్లు బౌలింగ్ చేస్తూ, తన బ్యాటింగ్‌పై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. జూన్ 17 నాటికి అతడికి సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.సీఓఈ వైద్య బృందం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతడు నేరుగా మూడో వన్డేకు ముందు చెన్నైలో జట్టుతో కలవనున్నాడు. హర్షిత్ చివరగా భారత్ తరపున వన్డేల్లో ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన రాణా.. 6.22 ఏకానమితో 26 వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాట్‌తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్ అతడిని ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్ -
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ క్యాంప్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు."దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది. ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్‌కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.కాగా దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్‌పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్‌తో 3,022 పరుగులు చేశాడు. అతడు తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.అఫ్ఘనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఘజన్ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీచదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్‌తో తొలి వన్డేకు డౌట్! -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్‌తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్‌తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్‌లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్‌తో చండీగఢ్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్‌కు బదులు ఇషాన్ కిషన్‌నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి. -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. బద్దలు కానున్న 37 ఏళ్ల రికార్డు
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది.ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్.. అమర్నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపడం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్‌ను తృటిలో కోల్పోయింది.ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌ల్లో 11,577 పరుగులు సాధించాడు. -
భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం?
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్‌ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్మెంట్ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.భారత ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. కిషన్ చివరగా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్‌పై భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవలం ఓపెనర్‌గా మాత్రమే ఆడగలడు. కాబట్టి రోహిత్‌కు విశ్రాంతి ఇస్తే తప్ప జైశూకు తుది జట్టులో చోటు దక్కదు. నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్(వికెట్ కీపర్) బ్యాటింగ్‌కు రానున్నారు.ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో, తెలుగు కుర్రాడు ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కనుంది. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?ఇక ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఈ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడంతో ప్రిన్స్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్ -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్‌కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్‌లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్‌ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్చదవండి: MPL 2026: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనేIt's Vaibhav Suryavanshi show against Afghanistan 👏Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026 -
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్‌దే
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.మెన్ ఇన్ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు అఫ్గాన్‌పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ఈ బరోడా ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.టీమిండియాలోకి అర్షద్?ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్‌తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్‌కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భారత్‌తో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్‌లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ముల్లాన్‌పూర్‌లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.నబీ, రషీద్ దూరం!కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సీనియర్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు. 41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు.వన్డే సిరీస్ షెడ్యూల్మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాలరెండో వన్డే-జూన్ 17-లక్నోమూడో వన్డే-జూన్ 20-చెన్నైవన్డే సిరీస్‌కు జట్లు భారత్శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్అఫ్గానిస్తాన్హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీచదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్‌గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్‌పూర్‌లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్‌ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యంభారత్తో మ్యాచ్‌లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్‌కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు! -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్‌కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది.సుతార్‌కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్‌లపై సుతార్ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్‌లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్‌లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరం!
అప్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్‌రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్‌ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్‌తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌కు బదులు యశస్వి జైస్వాల్‌కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్‌తో వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు గుర్నూర్ బ్రార్‌ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా.. 16 మ్యాచ్‌లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్‌తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్‌ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్‌ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్‌కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్‌కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్‌లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్‌లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్‌లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్‌లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
రోహిత్, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్‌లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్‌కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
టీమిండియాకు గుడ్ న్యూస్
త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్‌కు మూడు రోజుల పాటు ఫిట్నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్‌కు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.2018లో రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్‌కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్తాన్పై, ముల్లాన్‌పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులువెస్టిండీస్పై, రాజ్‌కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులుఆఫ్ఘనిస్తాన్పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులుబంగ్లాదేశ్పై, మీర్పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులుశ్రీలంకపై, నాగ్‌పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులుభారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్‌లో పాక్ న్యూజిలాండ్‌పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.కాగా, ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఆఫ్ఘన్ ను చిత్తు చేసిన టీమిండియా
-
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్‌గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్‌లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్‌ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్‌లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్‌కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్‌ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (టెస్ట్‌లు, దేశవాలీ మల్టీ డే మ్యాచ్‌లు) 100 వికెట్లు పూర్తి చేసుకున్న రేర్ లిస్ట్‌లో చేరాడు. ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సుందర్.. 78 ఇన్నింగ్స్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అదనంగా సుందర్ బ్యాటింగ్‌లో 2100 పైచిలుకు పరుగులు కూడా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. మొత్తంగా అతడి ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ కెరీర్లో 3 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతో పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ప్రత్యర్ది భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు. -
ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్గన్‌ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్‌మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: టీమిండియాకు షాక్.. ఆఫ్గన్‌పై గెలిచినా దండగే! -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్‌పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్‌పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్‌పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్‌ను ఇంగ్లండ్ టూర్‌తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్‌స్వీప్‌కు గురైంది.అయితే వెస్టిండీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్‌తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్‌తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్‌తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్‌తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
మానవ్ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం
న్యూ చండీఘడ్‌లోని ముల్లాన్పూన్ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఒకేసారి బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అరంగేట్రం స్పిన్నర్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్) అతి భారీ విజయంగా నిలిచింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ను అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్ కృష్ణ (11-2-37-3), సుందర్ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్ (11-4-36-4), కుల్దీప్ (7.5-1-30-3), సుతార్ (10-2-29-1), సిరాజ్ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది. -
జడేజా వారసుడు దొరికేశాడు.. 38 ఏళ్లలో ఒకే ఒక్కడు
భారత క్రికెట్లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్‌కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.అరంగేట్రంలో అదుర్స్ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్‌తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.తన వేసిన తొలి ఓవర్లోనే మొదటి అంతర్జాతీయ వికెట్‌ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్‌పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్‌ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.సరికొత్త చరిత్రదీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్‌పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్‌ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్‌బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్‌బాల్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.నెట్స్‌లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్‌మన్ గిల్‌కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్‌లో సుతార్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్‌ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
మానవ్ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మానవ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫాల్ ఆన్ ఆడనున్న అఫ్గాన్ఇక స్వల్ప స్కోర్‌కే పరిమితమైన అఫ్గానిస్తాన్‌ను ఫాల్‌ఆన్‌కు భారత్ అహ్హనించింది. 412 పరుగుల లోటుతో అఫ్గాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్(100), శుబ్‌మన్ గిల్(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్(81), పంత్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత కెప్టెన్‌గా
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌ను 564/8 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్‌లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన గిల్.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 126 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్‌గా శుబ్‌మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ నుంచి మాత్రం గిల్ కంటే ముందు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.అదేవిధంగా కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో దంచికొట్టిన రాహుల్... టెస్టు ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.చక్కటి షాట్లతో మంచి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్ బ్యాటర్ సుదర్శన్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బ్యాట్‌ను తాకిన బంతి... కీపర్ చేతిలో పడింది. అయితే అంపైర్ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్ రివ్యూ కోరలేదు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్... టెస్టు ఫార్మాట్లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన రాహుల్రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్లో ఇది మూడోసారి. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్లో రెండేసి సార్లు ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ వారిని అధిగమించాడు. అంతేకాకుండా రాహుల్ తన టెస్ట్ కెరీర్లో చేసిన చివరి మూడు సెంచరీలు కూడా ఇలా వంద పరుగులు వద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. -
టీమిండియాను 'ఆరేసిన' ఈ సలీమ్ సఫీ ఎవరు..?
ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్‌కు నాణ్యమైన స్పిన్నర్లను అందించే దేశంగా మంచి పేరుంది. ఈ దేశానికి చెందిన చాలామంది స్పిన్నర్లు (రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు) విశ్వవ్యాప్తంగా మంచి పేరు గడించారు. స్పిన్నర్ల అడ్డా అయిన ఇలాంటి దేశం నుండి తాజాగా ఓ యువ పేసర్ వెలుగులోకి వచ్చాడు.తన కెరీర్లో రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అది కూడా టీమిండియా లాంటి పటిష్ట జట్టుపై. మరి ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరనుకుంటున్నారా..?అతడి పేరు మొహమ్మద్ సలీమ్ సఫీ. ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేస్ బౌలర్, ప్రస్తుతం ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న వేల, సఫీ ఒక్కడే ఆఫ్ఘన్ల పాలిట ఆశాకిరణంగా నిలిచాడు.బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాటర్లు చెలరేగి ఆడగా, సఫీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా.. ఇందులో 6 వికెట్లు సఫీ ఒక్కడే తీశాడంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో ఇట్టే అర్దమవుతుంది.సఫీ బౌలింగ్‌లో ఔటైన భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు.సఫీ నేపథ్యంస్వింగ్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగిన సఫీ బంతిని రెండు వైపులా కదిలించే సామర్థ్యం కలిగిన పేసర్. లైన్ అండ్ లెంగ్త్‌లో స్థిరత్వం లేకపోయినా, రిథమ్‌లోకి వస్తే మాత్రం బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలడు. ఆఫ్ఘన్ తరఫున రెండో టెస్ట్ ఆడుతున్న సఫీ.. 2 వన్డేలు, ఓ టీ20 కూడా ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేయగా.. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ 28 పరుగుల వద్ద ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16) వికెట్ తీసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం 40 పరుగుల వద్ద ప్రసిద్ద్ కృష్ణ మరో ఓపెనర్ సెదిఖుల్లా అటల్‌ను (17) క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్ఘన్‌ను కష్టాల్లోకి నెట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 524 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (100), శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.


