గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టా‍ల్సిందే! | Shubman Gill Stunning Catch Shocks Afghan Batter Ghazanfar Viral | Sakshi
Sakshi News home page

గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టా‍ల్సిందే!

Jun 13 2026 9:40 PM | Updated on Jun 13 2026 10:40 PM

Shubman Gill Stunning Catch Shocks Afghan Batter Ghazanfar Viral

అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్‌ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్‌లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌కు గజన్‌ఫర్‌ నోరెళ్లబెట్టాడు.

అయితే గిల్ పట్టిన క్యాచ్‌ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్‌టైమ్‌లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్‌లు చేసిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్‌ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement