లీకైన భారత టెస్ట్‌ జట్టు.. గుజరాత్‌ స్టార్‌ ప్లేయర్‌పై వేటు | India Test Squad Vs Afghanistan Leaked; BCCI To Drop Gujarat Titans Opener | Sakshi
Sakshi News home page

లీకైన భారత టెస్ట్‌ జట్టు.. గుజరాత్‌ స్టార్‌ ప్లేయర్‌పై వేటు

May 11 2026 1:11 PM | Updated on May 11 2026 1:20 PM

India Test Squad Vs Afghanistan Leaked; BCCI To Drop Gujarat Titans Opener

ఐపీఎల్‌ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్‌మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.

ఈ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్‌ రాహుల్‌, పంత్‌, జడేజా, సిరాజ్‌, జైస్వాల్‌ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్‌ కంబోజ్‌కు అవకాశం​ దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్‌ నబీ, హర్ష్‌ దూబేకు చోటు కల్పించారు.

ఆసక్తికరంగా గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌పై వేటు పడింది. సాయి ఐపీఎల్‌ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్‌ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.

వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం​ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. 

జట్టుపై త్వరలో అధికారిక​ ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్‌ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్‌ 6 నుంచి ముల్లాన్‌పూర్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు జూన్‌ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. 

సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్‌ షమీ, అన్షుల్‌ కంబోజ్‌

Advertisement
 
Advertisement
Advertisement