భారత్ గ్రాండ్ విక్టరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.
403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.
వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.
అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్
అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
అఫ్గాన్ ఏడో వికెట్
అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్‌ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6
అఫ్గానిస్తాన్ ఐదో వికెట్
అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5
అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్
అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మూడో వికెట్ డౌన్
అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2
సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్
13.1: అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).
పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)
సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.
అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్
52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్
ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0
రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.
టీమిండియా భారీ స్కోరు
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
48.5: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).
ఎనిమిదో వికెట్ డౌన్
47.6: ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.
టీమిండియా ఏడో వికెట్ డౌన్
టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).
ఆరో వికెట్ డౌన్
44.3: ఖరోటి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).
43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5
ఐదో వికెట్ డౌన్
42.3: ఖరోటి బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్
గిల్ అవుట్
42.3: ఖరోటి బౌలింగ్‌లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్‌ఫర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్‌మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.
40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3
శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.
భారత్ మూడో వికెట్ డౌన్
ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.
ఇషాన్ మెరుపు సెంచరీ
లక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను ఇషాన్ అందుకున్నాడు.
శతక్కొట్టిన గిల్
32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో శుబ్‌మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.
30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2
ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.
ఇషాన్ అర్ధ శతకం
27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.
20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2
గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.
గిల్ హాఫ్ సెంచరీ
16.1: ఖరోటి బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.
రోహిత్ శర్మ అవుట్
13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్‌లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)
పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1
గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)
గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.
ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)
గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
1.6: సలీమ్ సఫీ బౌలింగ్‌లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్‌గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).
ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం
ఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.
ఇక ప్లేయింగ్ ఎలెవన్‌లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.
తుదిజట్లు
భారత్
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
అఫ్గనిస్తాన్
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ.


